సంకలనాలు
Telugu

మీరు బిజినెస్ మొదలుపెట్టండి.. దాన్ని ఎలా నడపాలో మేం చెప్తాం..

Pavani Reddy
19th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది .. దాన్నెవరూ కాదనరు… అయితే ఐడియా ఉండగాపూ సరిపోదు. దాన్ని సరిగా అమలు చేసే నేర్పరితనం ఉండాలి. వ్యాపార రంగంలో అయితే.. అసలు ఆ ఐడియా అమ్ముడుపోతుందో లేదో ముందు చూసుకోవాలి. లోతైన పరిజ్ఞానం ఉండాలి. మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మన ఐడియాస్ కి మార్కెట్ ఏమేరకు ఉందో తెలుసుకోవాలి. ఎంత పెట్టుబడిపెడితే లాభం వస్తుందో అవగాహన ఉండాలి. కస్టమర్ల అభిరుచులు ఎలా మారుతున్నాయో కనుక్కెోవాలి. మనం ఉన్న రంగంలో ఉన్న ఇతర కంపెనీల వ్యూహాలేమిటటో అంచనా వేయాలి. ఈ ప్రాసెస్ అర్రిబుర్రిగా తేలేది కాదు. ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఒక్కోసారి ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా మార్కెట్ అంతుపట్టదు. అయితే ఈ టెన్షన్లన్నీ మాకు వదిలేయండి… మీరు చక్కగా వ్యాపారం చేసుకోండి అంటోంది గుర్గావ్ కు చెంది కెన్ రీసెర్చ్.

మీరు స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా… ఇప్పటికే ఈ రంగంలో ఉన్నారా? అయితే ఒకమాట.. మీరొక్కరే కాదు.. చాలా మందికి స్టార్టప్స్ ఉన్నాయి. అయితే మీ ప్రోడక్ట్ మార్కెట్ ను ఎలా చేజిక్కించుకుంటుంది? మీ సేవలనే వినియోగదారులు ఎందుకు ఇష్టపడాలి? స్టార్టప్ పెట్టిన ప్రతివ్యక్తి ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మార్కెట్ పై మంచి పట్టుండాలి. అయితే స్టార్టప్స్ మార్కెట్ పై పట్టు సాధించాలంటే చాలా సమయమే పడుతుంది. అట్లీస్ట్ సమాచారం కూడా దొరకదు. అందుకే మార్కెట్లో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ను పూరించాలనుకున్నారు ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యార్థులు అంకూర్ గుప్తా, మీటూ బాసిన్. మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ కన్సెల్టింగ్ రంగంలో స్టార్టప్ పెట్టాలనుకున్నారు. వీరికి మరో స్నేహితుడు నమిత్ గోయల్ తోడయ్యారు. కెన్ రీసెర్చ్ పేరుతో సంస్థను స్థాపించారు. 

image


కెన్ రీసెర్చ్ అసలు ఏం చేస్తుంది?

మార్కెట్ ఇంటెలిజెన్స్, ఇక్విటీ రీసెర్చ్ సమాచారం అమ్మకం ద్వారా ఆదాయం పొందుతోంది కెన్ రీసెర్చ్. స్టార్టప్స్, కంపెనీలకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఒకేసారి డబ్బిచ్చినా ఓకే … లేదా నెల నెలా చందాలిచ్చినా ఫరవాలేదు. అవసరమైన సమాచారం చేరవేస్తుంది కెన్ టీం. ఏడాది చందా చెల్లించే కంపెనీలకు డిస్కౌంట్లు కూడా ఇస్తోంది.

వివిధ రంగాలను ఔపోసనపట్టి సమగ్ర సమాచారం సంపాదిస్తాం. ఇది మిగతావారికి లభించదు. అసలు సమాచారమేలేని రంగాల్లోకూడా మేం ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం. మేమిచ్చిన రీసెర్చ్ రిపోర్టులు కేస్ స్టడీస్ గా ఉపయోగపడతాయి- నమిత్

ఆదాయం ఎలా వస్తోంది ?

కెన్ కంపెనీకి వచ్చే సమాచారంలో 70 శాతం విదేశాల నుంచే వస్తోంది. అమెరికా, యూరప్, ఆసియాలోని వివిధ దేశాల నుంచి ఇన్ కమ్ వస్తోంది. రోచె, ఆమ్వే, ఇమామి, ఫ్రీఛార్జ్, యురేకా ఫోర్బ్స్, హురాన్, పానొసానిక్, ప్రాక్టా, టాటా కమ్యూనికేషన్స్, హెచ్ఎస్ఐఎల్, ఇండియా మార్ట్, పేయు అండ్ వెస్ట్రన్ యూనియన్ … ఇవన్నీ కెన్ రీసెర్చ్ కస్టమర్లే. ఈ దిగ్గజ కంపెనీలకు ఎప్పటికప్పుడు మార్కెట్ లో మారుతున్న పరిస్థితుల గురించి సమాచారం అందిస్తోంది.

సమాచారాన్ని ఇచ్చేందుకు కూడా ఒక ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసింది కెన్ రీసెర్చ్ టీం. పత్రికలు, ఛానల్స్ పబ్లిష్ చేయడానికి అవసరమయ్యే హాట్ హాట్ న్యూస్ కూడా అందిస్తోంది. టిమేట్రిక్, కెనడియన్, బుడ్డేకాం, వెల్త్ ఇన్ సైట్, వరల్డ్ మార్కెట్ ఇంటెలిజెన్స్, వెర్డిక్ట్ ఫైనాన్సియల్, పిరమిడ్ రీసెర్చ్, కాన్లూమినో, కాబ్లే సహా ఇతర సంస్థలకు సమాచారం అమ్ముతోంది. కన్జూమర్ ప్రోడక్ట్స్ అండ్ రిటైల్, అగ్రికల్చర్, యానిమల్ కేర్, హెల్త్ కేర్, మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్, మెటల్, మైనింగ్ అండ్ కెమికల్స్ రంగాల్లో రీసెర్చ్ చేసి… సంబంధిత కంపెనీలకు మార్కెట్ సమాచారం అందిస్తోంది.

“ఇప్పటికే మా దగ్గర 6వేల రిపోర్టులున్నాయి. ఇండస్ట్రీని లోతుగా పరిశీలించాక… మేం రిపోర్టులు తయారు చేస్తాం. ఏదో ఆషామాషీగా కాకుండా … కంపెనీ కంపెనీకి ప్రత్యేకంగా రిపోర్ట్ ఇస్తాం. అదే మా విజయ రహస్యం."నమిత్

కెన్ రీసెర్చ్ కు ముందు

కెన్ రీసెర్చ్ టీంలో చేరక ముందు అంకూర్, నమిత్ స్విచ్ బ్యాంక్ (యూబీఎస్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్)లో పనిచేసేవారు. తర్వాత బెంగళూరులో ఒక ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ లో ఉన్నతోద్యోగాలకు కుదిరారు. బ్యాంక్ తరపున మార్కెట్ లావాదేవీలకు పూర్తి బాధ్యత వహించే ఉద్యోగాలు చేయడంతో … మార్కెట్ పై పూర్తి స్థాయిలో అవగాహన కుదిరింది.

మీటు బాసిన్ కాన్సెప్ట్ అనలిటిక్స్ టీంలో పనిచేశారు. కంపెనీ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం, విదేశాలకు విస్తరించడంలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ అండ్ టెలికం, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాల్లోనూ పనిచేసిన అనుభవముంది. ఇదే ఇప్పుడు కెన్ రీసెర్చ్ కు ఉపయోగపడుతుంది.

గత పదేళ్లలో మార్కెట్ రీసెర్చ్ విలువ రూ.350 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్లకు పెరిగింది. ఈ-కామర్స్, లాజిస్టిక్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో మార్కెట్ రీసెర్చ్ కు మంచి స్కోప్ ఉంది. దీనిపై స్టార్టప్స్ తో పాటు బడా కంపెనీలు కూడా పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల అభిరుచులే దీనికి ప్రధాన కారణం. మార్కెట్స్ అండ్ మార్కెట్స్, RNCOS, IMRB ఇంటర్నేషనల్ లాంటి కంపెనీల నుంచి పోటీ ఉంది. అయితే ఇప్పటివరకు ఏ రీసెర్చ్ కంపెనీ వెళ్లని రంగాలను కూడా కెన్ టచ్ చేస్తోంది. అసంఘటిత రంగాలపై కూడా సమాచారం సేకరించడంలో సత్తా చాటుకుంటోంది. కెన్ రీసెర్చ్ ఏటా 50 శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. థామ్సన్ రాయిటర్స్, ఎస్ అండ్ పీ క్యాపిటల్, ఐఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్ లాంటివాటికి కూడా సమాచారం పంపిస్తోంది కెన్ రీసెర్చ్.

image


మంచి సంస్థను స్థాపించాలంటే ప్రతి వ్యాపారవేత్త మార్కెట్ రీసెర్చ్ తప్పనిసరిగా చేయాలి. లేకపపోతే చేతులు కాల్చుకోవడం ఖాయం. అందుకే కెన్ రీసెర్చ్ లాంటి సంస్థలను ఆశ్రయిస్తే… ఆ టెన్షన్ ఉండదు. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags