సంకలనాలు
Telugu

క్షమించండి.. నేనొక ఆంట్రప్రెన్యూర్‌ని..!!

HIMA JWALA
26th Feb 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

నేను ఆంట్రప్రెన్యూర్‌ని..! చాలా బిజీగా వుంటాను..! మా ఫ్రెండ్స్, చుట్టాల ఇళ్లలో ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి.. కానీ, నేను ఒక్క మ్యారేజీకి అటెండ్ కాలేకపోయాను! ఏమనుకోకండి..!

అవును.. నేను ఆంట్రప్రెన్యూర్‌ని! పార్టీలకు అప్రకటిత నిషేధం విధించుకున్నాను! నా కాలేజీ ఫ్రెండ్స్ బర్త్ డేలు, వాళ్ల పిల్లల పుట్టిన రోజు వేడుకలు ఎన్నో మిస్సయ్యాను!

ఎస్‌.. నేను ఆంట్రప్రెన్యూర్‌ని! తెలియకుండానే సోషల్ లైఫ్ బ్యాన్ అయింది! సినిమాకు వెళ్లాలని, ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వేయాలని.. ఎన్నిసార్లు ప్లాన్ వేసుకున్నానో!! బట్, అవన్నీ నిర్ధాక్షిణ్యంగా క్యాన్సిల్ చేసుకున్నాను!!

అవును. నేను ఆంట్రప్రెన్యూర్‌ని! నాకు టైం లేదు! చాలామంది చిన్నప్పటి స్నేహితులను/స్నేహితురాళ్లను మిస్సవుతున్నాను. మిస్సయ్యాను కూడా..!

అవును. నేను ఆంట్రప్రెన్యూర్‌ని! నాకు డ్రస్ పట్ల అంత పట్టింపు లేదు! అన్ని మీటింగులకూ ఎప్పుడూ అదే ఫార్మల్ జాకెట్ వేసుకునే వస్తాను.

అవును. నేను ఆంట్రప్రెన్యూర్‌ని! మార్కెట్లో వచ్చే కొత్త మొబైల్స్ గురించి, వాటి ఫీచర్ల గురించి లంచ్ అవర్లో, టీ టైంలో పిచ్చాపాటి మాట్లాడే తీరికలేదు నాకు!

అవును. నేను ఆంట్రప్రెన్యూర్‌ని! చాలా బిజీ! అనేక సందర్భాల్లో రిలెటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి దూరమయ్యాను!

ఇన్నాళ్లూ నేను చేసింది తప్పే! నాకు ఇప్పుడర్ధమవుతోంది! అందుకే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నా! నేను చేసిన తప్పులను మన్నించమని సవినయంగా వేడుకుంటున్నా..!

కానీ, అయితే.. సంజాయిషీ ఇచ్చేముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా..!!

ఒక ఆంట్రప్రెన్యూర్‌గా నాది బిజీ లైఫ్!! మీటప్, స్టార్టప్, ఈవెంట్, క్లయింట్, ప్రాడక్ట్.. నిత్యం ఇవే పదాల మధ్య బతుకుతుంటాను. అయినా సరే, దగ్గరి బంధువులో.. దూరపు చుట్టాలో.. ఎవరయినా చనిపోతే వాళ్ల అంత్యక్రియలకు నేను రాలేదా చెప్పండి?

ఒప్పుకుంటాను.. నేను బిజీ పర్సన్. అయినాగానీ, మొన్న నా ఫ్రెండ్ ఫోన్ చేసి.. ఒరేయ్‌ ఆమెతో బ్రేకప్‌రా అనగానే.. పనులు మానేసి అర్జెంటుగా వెళ్లి ఇద్దరితో మాట్లాడి రాలేదా..?

నేను ఆంట్రప్రెన్యూర్‌ను.. కదిలిస్తే టైం లేదు అంటాను.. ఓకే! అయినప్పటికీ, నేను ఎప్పుడైనా మీ మాటలు పెడచెవిన పెట్టానా? మీ డ్రీమ్స్ గురించి చెప్తే వినలేదా? సలహాలు ఇవ్వలేదా?

నేను బిజీగా ఉంటాను..! అంత హెక్టిక్‌లో కూడా మీ ఫ్యామిలీ సాధకబాధకాలను నేను పట్టించుకోలేదా..? పంచుకోలేదా?

నేను ఆంట్రప్రెన్యూర్‌ను.. మనిషిగా అస్సలు దొరకను. ఆ విషయం కాదనను. అయినా సరే, మీ ఫోన్ కాల్ నేను ఏనాడైనా అటెండ్ చేయకుండా వదిలేశానా? మీ ఎస్సెమ్మెస్‌కు ఎప్పుడైనా రిప్లయ్ ఇవ్వకుండా ఉన్నానా? మీ ఒంటరితనాన్ని షేర్ చేసుకోలేదా?

ఇంకా మీకు తెలియని విషయాలు ఏంటంటే..

జేబులో పది రూపాయలు కూడా లేని పరిస్థితి వచ్చినా, బెదిరిపోలేదు. ఆ కష్టం నేనెవరితో షేర్ చేసుకోలేదు! నేను వ్యాపారం కోసం ఎన్ని నిద్రలేని రాత్రిళ్లు గడిపానో మీకు తెలుసా? నా కన్నీళ్లు మిమ్మల్ని ఎక్కడ డిస్ట్రబ్ చేస్తాయో అని ఒంటరి పర్వతంలా నిలబడ్డాను. లేనిగాంభీర్యాన్ని మొహంపై పులుముకున్నాను. ఒంటరిగా ఫీలవుతున్న ప్రతీ సందర్భంలలోనూ, ఎవరికైనా చెప్పుకుని గుండెబాధ దిగిపోయేలా ఏడవాలనించేది. అయినా సరే, కన్నీరు నిషిద్ధం అనుకుని దుఖాన్ని దిగమింగానే తప్ప, ఎవరితోనైనా నా బాధ పంచుకున్నానా?

మీలో కొందరు నన్ను వర్క్‌ హాలిక్ అన్నారు. పనిరాక్షసుడు అని బిరుదు ఇచ్చారు. గానుగెద్దు, బండోడు, స్పందించడు అని నానా మాటలన్నారు. అనండి. అఫ్కోర్స్ నాకేం బాధలేదు.. 

కానీ మై డియర్ ఫ్రెండ్స్, రిలెటివ్స్..

ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను నిత్యం నా స్టార్టప్ గురించే ఆలోచిస్తుంటాను. బిజినెస్ ఎలా పైకి తీసుకురావాలనేదే నా తపన. ఎందుకంటే, దాంట్లోనే నా భవిష్యత్ ఉంది. నా ఫ్యామిలీ భవిష్యత్ ఉంది. నన్ను నమ్ముకున్నవాళ్ల ఫ్యూచర్ ఉంది. కాబట్టి గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం.

అయినా కూడా.. సారీ చెప్తున్నా..  

image


Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags