పిల్లల పెంపకం మీద అవగాహన పెంచే జెన్ పేరెంట్

చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం మొదలైన స్టార్టప్జెన్ పేరెంట్ లో లాగిన్ అవ్వడం చాలా ఈజీబుడి బుడి నడకల నుంచే నడత నేర్పడంపై అవగాహనసమస్యలన్నింటికీ టెక్నాలజీతో పరిష్కార మార్గంపేరెంట్స్ నుంచి విశేష స్పందన

పిల్లల పెంపకం మీద అవగాహన పెంచే జెన్ పేరెంట్

Wednesday May 20, 2015,

3 min Read

ఈ నాటి ప్రపంచంలో పిల్లల్నిపెంచటం గొప్ప సవాలే. పిల్లల పెంపకం మీద కుప్పలు తెప్పలుగా సమాచారం, సలహాలూ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. పిల్లలకూ సోషల్ మీడియా పుణ్యమా అని చాలా విషయాల్లో అవగాహన ఎక్కువైంది. కొత్తతరం తల్లిదండ్రులలో అధికశాతం ఉద్యోగులే కావడంతో ఉద్యోగాన్నీ, కుటుంబం మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా మారుతోంది. 

అన్ని సమస్యలకూ టెక్నాలజీ పరిష్కారమార్గం కాదు. కానీ ఈ విషయంలో మాత్రం ఇది తల్లిదండ్రులకు చాలా విలువైన తోడుగా రుజువైంది. పేరెంట్స్‌కి వచ్చే అన్ని రకాల అనుమానాలకూ, సమస్యలకూ ఏకైక పరిష్కార వేదికగా ఏ ప్రశ్నకైనా జవాబు నిచ్చేలా ఉండటమే జెన్ పేరెంట్ లక్ష్యం. ఆ విధంగా పిల్లల జీవితానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వం, ఆసక్తులు, జీవిత నైపుణ్యాలు సహా అన్ని కోణాలనూ ఇది స్పృశిస్తుంది. శిశు అభివృద్ధి, పెంపకం, పిల్లల సంరక్షణ లాంటి అంశాల మీద సమాచారాన్ని వ్యాసాలు, చిట్కాల రూపంలో కూడా అందిస్తుంది.

జెన్ పేరెంట్ యాప్

జెన్ పేరెంట్ యాప్


ఈ వెంచర్‌కి సుప్రియా హీరెమగళూర్ సారధ్యం వహించగా వెంచర్ ఫ్యాక్టరీ (బై ఐ2ఇండియా) నిధులు సమకూర్చింది. ఆమె ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ గ్రాడ్యుయేట్, నాలుగేళ్ళ తెలివైన పాపకు తల్లి కూడా. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఐదేళ్ళపాటు పనిచేసిన తరువాత ఆమెకు సొంత వ్యాపారం మీద గుబులు మళ్ళింది. బాగా ఆదాయమొచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని తన ఆసక్తిని వ్యాపారంగా తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఐ2ఇండియాలో భాగస్వామి, కొత్త ప్రాజెక్టులు చేపట్టటంలో అనుభవం ఉన్న వినయ్ రావు ఆమెకు సంస్థ ఏర్పాటులో మెలకువలు చెబుతూ మార్గదర్శనం చేశారు. వ్యాపారాన్ని వేగంగా పెంచుకోవటానికి వీలైన సాంకేతిక, నిర్వహణ, మార్కెటింగ్ సహకారం కూడా వెంచర్ ఫ్యాక్టరీ అందిస్తుంది.

జెన్ పేరెంట్   టీం

జెన్ పేరెంట్ టీం


సుప్రియ, వినయ్ ఎనిమిది నెలల కిందట ఈ జెన్ పేరెంట్ ఆలోచనతో ముందుకొచ్చారు. పిల్లలకు, తల్లిదండ్రులకు స్థానికంగా సహకారం అవసరమని గ్రహించటమే ఈ ఆలోచనకు మూలం. పిల్లల భద్రత అవసరాలు పెరుగుతూ ఉండటమే ఈ వ్యవస్థాపకులను తగిన పరిష్కారం ఆలోచింపజేసింది. మొదట్లో చిన్నస్థాయిలో ఒక స్మార్ట్ వాచ్ లాంటి ఉత్పత్తి తయారు చేసి పిల్లలు ఎక్కడున్నదీ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలిసేలా చేయటం మీద వీళ్ళు దృష్టి సారించారు. కస్టమర్లతో ముఖాముఖి సంభాషించటం ద్వారా తేలిందేమంటే, ఈ టెక్నాలజీ, ఇంటర్నెట్ యుగంలో పిల్లల పెంపకానికి తగినంతగా తల్లిదండ్రులు సిద్ధమై లేరని. అందుకే ఈ బృందం ట్రాకింగ్, మానిటరింగ్ టెక్నాలజీల నిర్మాణం మీద కంటే ప్రాథమిక సమస్య మీద దృష్టి సారించాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా 3 నుంచి 14 ఏళ్ళ మధ్యనున్న పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడే అంశాలను రూపొందించి పిల్లలు- తల్లిదండ్రులకోసం అతి పెద్ద వేదికగా జెన్ పేరెంట్ తయారైంది. తల్లిదండ్రులందరికీ సులభమైన రిఫరెన్స్ గైడ్‌లా ఉండటమే జెన్ పేరెంట్ లక్ష్యం.

సుప్రియా హీరేమగళూర్

సుప్రియా హీరేమగళూర్


ది ఎక్స్ ఫాక్టర్

తల్లిదండ్రులు తమ స్మార్ట్ ఫోన్ల సాయంతో ఎక్కడైనా ఎప్పుడైనా తమకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. అది వాళ్ళుండే ప్రదేశం, వాళ్ళ ప్రాధాన్యాల ఆధారంగా పనికొచ్చేలా దాన్ని సిద్ధం చేశారు. ఈ మెయిల్ చందా, వెబ్ సైట్ లాంటి కమ్యూనికేషన్ మార్గాలేవీ మొబైల్ యాప్‌తో సరిపోలవని దీని వ్యవస్థాపకులు నిర్థారించుకున్నారు. పిల్లల పెంపకం మీద తల్లిదండ్రులకోసం నిర్దేశించిన అంశాలు, ముఖ్యంగా భారత దేశపు తల్లిదండ్రుల కోసం పనికొచ్చేలా రూపొందించిన అంశాలకు మార్కెట్లో చాలా లోటు ఉన్నట్టు ఈ బృందానికి అర్థమైంది. గర్భ ధారణ మీద, పుట్టిన పిల్లల సంరక్షణమీద విస్తృతమైన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో తెలిసిందే. కానీ 3 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకోసం సమాచారం వెతకటమంటే ఒక పెనుసవాలు లాంటిదే.

వినయ్ రావు

వినయ్ రావు


వివిధ వయోవర్గాలకు చెందిన నిపుణులైన తల్లులు జెన్ పేరెంట్‌లో ఉన్నారు. ఈ సంస్థ స్వయంగా దాదాపు 80 శాతం అంశాలను రూపొందించుకుంటుంది. మిగిలినవాటిని సేకరిస్తుంది. జెన్ పేరెంట్ త్వరలోద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని నిర్ణయించుకుంది.

ఈ స్టార్టప్ సంస్థ అందించే అంశాల వివిధ విభాగాల కింద వర్గీకరించారు. తల్లిదండ్రులకూ, పిల్లలకూ మధ్య ఉండే బంధాన్ని నిర్వచించే అంశాలు, సమస్యలకు పరిష్కారాలూ, పిల్లలకు సంబంధించిన అంశాలూ ఉంటాయి. చివరికి వాళ్ళు సేవలందించే లక్షిత ప్రేక్షకులు సైతం చాలా భిన్నవర్గాలకు చెందినవాళ్ళుంటారు. రకరకాల అవసరాలకు అనుగుణంగా 80 కి పైగా కాంబినేషన్స్ తో ఈ అంశాలు తయారై ఉంటాయి. , ఉదాహరణకు తల్లి ఇంట్లో ఉండి తండ్రి ఆఫీసుకెళ్ళటం, లేదా తండ్రి ఇంట్లో ఉండి తల్లి ఆఫీసుకెళ్ళటం ..ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. అందువలన కస్టమర్ వివరాలను సమగ్రంగా సేకరించటం ద్వారా అందరి అవసరాలనూ విడివిడిగా, పూర్తిగా గుర్తించి తగిన సమాచారం అందించే అవకాశముంది.

2014 ఆగస్టు నుంచి జెన్ పేరెంట్ బృందం అనేకమంది తల్లిదండ్రులతో మాట్లాడింది. అందువల్లనే వాళ్ళ సాఫ్ట్ వేర్ కూడా అనేక మార్పులకు గురవుతూ వచ్చింది. మూడు నెలలకిందట మొదలైన ఈ పోర్టల్ కు తగినంత డిమాడ్ ఉంది. ప్రస్తుతానికి యాప్ తో సహా జెన్ పేరెంట్ ఫీచర్లన్నీ ఉచితమే. కానీ అది తన కస్టమర్లకూ, చైల్డ్ కేర్ సంస్థలకూ వాల్యూ యాడెడ్ సేవలందించటం ద్వారా నగదు సంపాదించే విషయాన్ని పరిశీలిస్తున్నది. వచ్చే ఏప్రిల్ నాటికి జెన్ పేరెంట్ పదిలక్షలకు పైగా వాడకం దారులను అందుకోవాలనే లక్ష్యం దిశగా ప్రయత్నిస్తోంది.