సంకలనాలు
Telugu

ఇక నుంచి షార్ట్ న్యూస్ కూడా అందిస్తామంటున్న way2

30th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హైదరాబాద్ కంపెనీ way2sms ఇప్పుడు పేరు మార్చుకొని way2గా మారింది. అంతే కాదు షార్ట్ న్యూస్ అందిస్తామని చెబుతోంది.

“ఓ ఐదారేళ్ల క్రితం way2sms వాడకం ఎక్కువగా ఉండేది. మిలియన్ల సంఖ్యలో ఇప్పటీ యూజర్లున్నారు,” రాజు వనపాల

ఇప్పుడా యూజర్ బేస్ తో సరికొత్త ప్రాడక్టును లాంఛ్ చేస్తున్నామని ఫౌండర్ రాజు అంటున్నారు. ఎస్సెమ్మెస్ సర్వీసు కూడా అందుబాటులో ఉంటుంది. కానీ వే టు ఎస్సెమ్మెస్ అని ఉండకుండా వేటూ మాత్రమే ఉంటుంది.

image


పూర్తిగా యాప్ మోడ్ లోకి మార్పు

వే టు ఎస్సెమ్మెస్ అందరికీ తెలిసిందే. లక్షల మంది యూజర్లున్న ఆ వెబ్ సైట్ భవిష్యత్ లో పూర్తిగా యాప్ లోకి మారిపోనుంది. ఇప్పటికైతే వేటూ అని రూపాంతరం చెందింది. యాప్ లో యూజర్లకు చిన్నచిన్న న్యూస్ ని అందిస్తాం. దీంతో పాటు జనం ఎక్కువగా వైరల్ కంటెంట్ ఇష్టపడుతున్నారు. దాన్ని కూడా యాప్ లోనే అందిస్తారు. రోజుకి 100 వార్తలను అందించడం టార్గెట్ గా పెట్టుకున్నామని అంటన్నారు రాజు.

“వే టు ఎస్ఎమ్ఎస్ ప్రారంభమైన రోజు దేశంలో ఇన్ని స్టార్టప్ లు లేవు. పూర్తిగా బూట్ స్ట్రాపుడ్ కంపెనీ మాది,” రాజు

దేశంలో మొదటి తరం స్టార్టప్ లలో వేటు ఎస్సెమ్మెస్ ఒకటని రాజు చెప్పుకొచ్చారు. గడిచిన మూడేళ్లలో ఎలాంటి మార్పు లేకుండా ఉందని, ఇప్పుడు వేటూగా రూపాంతరం చెందిందని అన్నారాయన.

image


ప్రాంతీయ భాషల్లో వార్తలు

వేటూ యాప్ లో ప్రాంతీయ భాషల్లో వార్తలను అందిస్తామంటున్నారు. తెలుగు,హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడ ఇలా మొత్తం 9 ప్రాంతీయ భాషల్లో షార్ట్ న్యూస్ అందిస్తున్నామన్నారు. సాధారణంగా న్యూస్ పేపర్లో కనపడని వార్తలను ఇస్తామని రాజు క్లెయిమ్ చేసుకుంటన్నారు. 24x7 వార్తలను అందిస్తామంటున్నారు. ప్రస్తుతానికి దేశీయ భాషల్లో మాత్రమే అందిస్తున్నామని, తమ యూజర్ బేస్ ఇక్కడే ఉందంటున్నారు రాజు.

“ఏడేళ్లలో 4కోట్ల ఎస్ఎమ్ఎస్ లతో మనీ సేవ్ చేశాం. ఇప్పుడు టైం సేవ్ చేస్తాం,” రాజు

షార్ట్ న్యూస్ ద్వారా మొబైల్ లో వార్తల అప్ డేట్స్ ఇచ్చి టైం సేవ్ చేయాలని అనుకుంటున్నామని రాజు చెప్పుకొచ్చారు.

image


వే టూ టీం

వే టూకి రాజు వనపాల ఫౌండర్ సీఈవోగా ఉన్నారు. విజయవాడ వాసి అయిన రాజు వనపాల వే టు ఎస్సెమ్మెస్ స్టార్టప్ ను ప్రారంభించారు. సెల్ఫ్ ఫండ్ తో లాభాలతో నడిచింది. ఇప్పుడీ కంపెనీ వే టూ గా రీ బ్రాండింగ్ చేసుకుంటోంది. మరో 18నెలల దాకా ఎలాంటి ఫండింగ్ ఆలోచన లేదని ఆయన ప్రకటించారు. తొమ్మిది భాషల్లో వార్తలు రాయడానికి ఇన్ హౌస్ టీం కూడా ఉంది. వే టూ లో మొత్తం 85 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సవాళ్లు

వేటూ ఎస్సెమ్మెస్ రిజిస్ట్రార్ అయిన డేటా బేస్ ఆధారంగా వే టూ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ యూజర్ పల్స్ తెలుసుకోవడం పెద్ద సవాల్. న్యూస్ తో ఇరిటేట్ కాకుండా రీసెర్చి చేయాల్సిన అవసరం ఉందని రాజు అభిప్రాయపడుతున్నారు. ఇదే తమకు పెద్ద చాలెంజ్ అని దీన్ని అధిగమించే పనిలో బ్యాక్ ఎండ్ టీం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకూ యాప్ 5 మిలియన్ డౌన్ లోడ్స్ అయింది. వీరికి రోజులో 50 స్టోరీలను అందిస్తున్నామన్నారు. ఈ సంఖ్యని పెంచాల్సి ఉందని తెలిపారు.

image


ఇతర ప్లేయర్లు

ఢిల్లీ కేంద్రంగా ఈ తరహా లో మరో స్టార్టప్ పని చేస్తోంది. యాప్ లో షార్ట్ న్యూస్, వైరల్ కంటెంట్, వీడియోలను అందిస్తోంది. దీంతోపాటు బెంగళూరులో కూడా మరో రెండు స్టార్టప్ లు ఈ తరహా కంటెంట్ అందిస్తున్నాయి. అయితే వే టూ ప్రాంతీయ భాషల్లో షార్ట్ న్యూస్ అందిస్తోంది. ఇలా ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందించే స్టార్టప్ తమదొక్కటే అని రాజు అంటున్నారు.

రెవెన్యూ మోడ్, భవిష్యత్ ప్రణాలికలు

వే టు ఎస్సెమ్మెస్ డేటా డ్రివెన్ మార్కెటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదే సంస్థను ముందుకు నడుపుతోంది. దాదాపు 5 కోట్ల డేటా తమ దగ్గర ఉందని చెబుతోన్న వెటూ -దానితోనే డిజిటల్ మార్కెటింగ్ ను చేస్తామంటున్నారు. బిటుబి సెగ్మెంట్ లో వే టు ఎస్సెమ్మెస్ బాటలోనే పయనిస్తోంది. ఇది తప్పితే ప్రస్తుతానికి వే టూకి ప్రధాన ఆదాయ వనరంటూ లేదు. ఇక భవిష్యత్ ప్రణాళికల విషయానికొస్తే, వైరల్ కంటెంట్ అందించడం లో నంబర్ వన్ ప్లాట్ ఫాంగా మారాలని అనుకుంటున్నారు. మరిన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రావాలనుకుంటున్నారు. ఏడాదిన్నర తర్వాత ఫండింగ్ కు వెళ్లాలనుకుంటున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags