సంకలనాలు
Telugu

ఎఫ్ గల్లీ అంటే అందమైన షూస్..అదిరిపోయే కలర్స్!

సూపర్ హీరో బూట్లను హ్యాండ్ పెయింటింగ్‌తో తయారీ..స్టార్టప్ కోసం హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసిన సుజీత్..ఆఫ్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లకు ప్రణాళిక సిద్ధం చేస్తోన్న స్టార్టప్..ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మారాలన్నదే లక్ష్యంగా ఎఫ్ గల్లీ అడుగులు..

ashok patnaik
20th Sep 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

కలర్ ఫుల్ షూస్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి. అదే సూపర్ మ్యాన్ షూస్ కావాలంటే సాధారణ దుకాణాల్లో దొరకవు. ఎక్కడో కొన్ని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ లలో దొరుకుతాయి. కానీ అవి సాధారణ జనానికి అందనంత ఎక్కువ ధరలో ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారిదాకా సూపర్ హీరోస్‌తోపాటు కార్టూన్ ఇతర బొమ్మలతో కూడిన వస్తువులంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. కొందరైతేవాటి కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనకాడరు. కానీ చాలా తక్కువ ఖర్చుతో అందమైన షూస్ అందిస్తామంటోంది ఎఫ్ గల్లీ(fgali.com)


image


“ ఒకసారి మా ఫ్రెండ్ తన సూపర్ మ్యాన్ షూస్ చూపించి తెగ సంబరపడిపోయాడు. షూ కోసం తాను దాదాపు నాలుగువేలు ఖర్చు చేశాడు. వాస్తవానికి వాటి ధర 1500 మించదు. జనంలో ఇలాంటి వస్తువులపై ఉన్న క్రేజీనెస్ నాకు అర్థమైంది ” అంటారు సంస్థ సహ వ్యవస్థాపకులు సుజీత్

ప్రత్యేక హ్యాండ్ పెయింటింగ్

షర్ట్ కంటే టీ షర్ట్‌కి ఎందుకంత క్రేజ్ అంటే చెప్పలేం. కానీ షూస్ కంటే పెయింట్ వేసిన షూస్‌కి ఎందుకంత డిమాండ్ అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫంకీగా కనపడే వస్తువులపై మనకుండే ఇంట్రస్ట్ అంతా ఇంతా కాదు. దానికి తోడు ప్రత్యేక పెయింటింగ్‌తో షూ కనిపిస్తే ఆ లుక్కే వేరులే అంటారు సుజీత్. అలా మొదలైందే ఈ ఆలోచన. సాధారణ జనాలు ఖర్చు పెట్టే రేంజిలో ఈ ఫంకీ షూస్‌ని తయారు చేయాలని ఓ ప్రత్యేక పెయింటింగ్ షూ ప్రాడక్ట్ లాంచ్ చేశారు ఎఫ్ గల్లీ ఫౌండర్లు. షూ మేకర్స్ దగ్గర నుంచి వైట్ కలర్ షూలని తెప్పించి వాటిపై ప్రత్యేక ఆయిల్ లేదా వాటర్ కలర్స్‌తో అందమైన బొమ్మలను వేస్తారు. ఇందులో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటివి మరింత క్రేజీ అని చెప్పొచ్చు. సీనరీలు, రంగరంగుల బొమ్మలు అలా చాల రకాలుగా ఆ బూట్లను మేకప్ చేస్తారు. ఈ పెయింటింగ్ చేసే కళాకారులు చేతితో వాటిని చిత్రీకరిస్తారు. అలా ఈ షూస్ కి ఓ స్పెషాలిటీ వస్తుందని అంటున్నారు సుజీత్.

image


కస్టమైజ్డ్ డిజైన్లు

సందర్భానికి తగిన బూట్లను తయారు చేయాడంలో ఎఫ్ గల్లీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. మనకు కావాల్సిన రీతిలో షూపై పెయింటింగ్ చేసిన వాటిని అందిస్తారన్న మాట. ఎఫ్ గల్లీ వెబ్ సైట్లో వందల సంఖ్యలో వెరైటీలు ఉంటాయి. వాటితో పాటు మనకు ఇంకా ఏ రకమైన డిజైన్ కావాలన్నా వాటిని అందించడానికి సిద్ధంగా ఉంటారు. క్లబ్‌లకు కావాల్సిన బల్క్ ఆర్డలను తీసుకుంటారు. ప్రత్యేక సందర్భాల్లో , మరింత ప్రత్యేకంగా బూట్లను డిజైన్ చేయించుకోవాలంటే ఎఫ్ గల్లీకి లాగిన్ కావొచ్చని సుజీత్ ప్రకటిస్తున్నారు. మగువలకు ప్రత్యేకమైన రీతిలో ఉండే బూట్లను అందిస్తున్నామని , ప్రధానంగా యువతతోపాటు చిన్నారులు తమ ఎఫ్ గల్లీకి పెద్ద ఫ్యాన్స్ అంటున్నారు. అయితే కొన్ని సార్లు ఫంకీగా కనపడాలనుకునే మిడిల్ ఏజ్ పీపుల్ కూడా తమ బూట్లను ఆర్డర్ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

image


డిజైన్ క్యాటగిరీ

స్పోర్ట్స్ , సూపర్ హీరోస్, కార్టూన్స్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ , ఫంక్షనల్, అదర్స్ పేరుతో 6 క్యాటగిరీలున్నాయి. క్రికెట్‌తోపాటు ఫుడ్ బాల్ టీం లోగోలతో పాటు స్టార్ల ఫోటోలతో కూడిన బూట్లు స్పోర్ట్ క్యాటగిరీ కిందకు వస్తాయి. కార్టూన్స్ క్యాటగిరీలో ప్రధానంగా చిన్నారులకు సంబంధించిన టామ్ అండ్ జెర్రీ బొమ్మలు వస్తాయి. డ్యాన్స్ అండ్ మ్యూజిక్‌లో మ్యూజిక్ స్టార్లు, ఇన్‌స్ట్రూమెంట్స్ లాంటివి వస్తాయి. ఫంక్షనల్, అదర్స్ మరికొన్ని ఆసక్తికరమైన బొమ్మలతో కూడిన మరో క్యాటగిరీ. ప్రత్యేక మైన డిజైన్ కలిగిన ఈ షూస్‌కి ఆన్ లైన్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ తాము తక్కువ ధరకు అందించడం ఓ అడ్వాంటేజీగా సుజీత్ వివరించారు.

కో ఫౌండర్ సుజీత్

కో ఫౌండర్ సుజీత్


ఎఫ్ గల్లీ టీం

ఎఫ్ గల్లీ టీం విషయానికొస్తే సుజీత్ మధ్యోగారియా, జయ్ షాలు కో ఫౌండర్లుగా ఉన్నారు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన సుజీత్ ఎఫ్ గల్లీ ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రొడక్షన్ సపోర్ట్‌‌లో పనిచేశారు. వ్యాపార కుటుంబ నేపధ్యం ఉన్న జయ్ షా , సుజీత్ తో కలసి దీన్ని ముంబై కేంద్రంగా ప్రారంభించారు. ఆన్ లైన్‌లో ప్రారంభించిన ఎఫ్ గల్లీకి ఎక్కువ ఆర్డర్లు హైదరాబాద్ నుంచే రావడంతో ఇక్కడే ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చారు. వీరితో పాటు ఆర్టిస్టులు, మార్కెటింగ్ టీంతో కలసి మొత్తం 15మంది ఈ స్టార్టప్‌లో పనిచేస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ స్టోర్... యాప్ రూపంలోకి కూడా రానుంది. షూస్‌తో పాటు టీషర్ట్ , జీన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నారు. హ్యాండ్ పెయింటింగ్ చేసిన బొమ్మలను సిద్ధం చేస్తున్నారు. భారతీయ మైథాలజీకి సంబంధించిన సూపర్ హీరోస్‌ను క్లాత్స్ పై డిజైన్ చేసిన షర్టులను భవిష్యత్‌లో జనం ముందుకు తీసుకురానున్నారు. హైదరాబాద్‌లో మెట్రో షూస్ లాంటి స్టోర్లకు పరిమితం అయిన ఎఫ్ గల్లీ ప్రాడక్టులను ఇతర స్టోర్లకు వ్యాపించాలని చూస్తున్నారు. ముంబైలో కూడా ఆఫ్‌లైన్ సేల్స్ పెంచుకోవాలని చూస్తున్నారు. సౌత్ మార్కెట్లో ఎఫ్ గల్లీకి ఆర్డర్లు బాగానే ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, పూణేల్లో కూడా ఆఫ్ లైన్‌ కస్టమర్ల కోసం ఎక్స్ క్లూజివ్ స్టోర్ లను ప్లాన్ చేస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags