సంకలనాలు
Telugu

మొక్కల వ్యాపారానికి స్టాలిన్ ఫార్ములా

చిన్న ఆలోచనతో పెద్ద వ్యాపారంమూడు మొక్కలు పెంచండి, ముగ్గురికిచ్చి వారిన పెంచమనండితామిచ్చే మొక్క ప్రత్యేకంగా ఉండడం ఎలా అనే ఆలోచనపూలకుండీలకి రంగులు పాత ఐడియా, బొమ్మలేయడం కొత్త ఆలోచనమొక్కలు పెంచాలంటే చెట్లు వైఫై సిగ్నల్స్ ఇవ్వాలా అంటూ ప్రశ్న

team ys telugu
22nd Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మనకి చెట్ల నుంచి వైఫై సిగ్నల్స్ అందే టెక్నాలజీ అందుబాటులో ఉంటే... ఖచ్చితంగా చాలా మంది మొక్కలు పెంచేవాళ్ల. కానీ అవి మనకి ఆక్సిజన్ మాత్రమే ఇస్తాయి. అందుకే పట్టించుకోం... ! సరిగ్గా ఈ పాయింట్‌నే ఆధారంగా చేసుకుని పుట్టిందే 'పాట్ పాయ్'. మొక్కే కదా అని చిన్న చూపు చూడకుండా వాటికి ప్రాణంపోసి నవ్వులు జత చేసిన రిషభ్ జైన్ స్టోరీ ఇది.

చిన్న ఆలోచనతో ఈ భూమిని కాపాడొచ్చు అనడానికి ఉదాహరణే పాట్‌ పాయ్. ప్రతీ మొక్కకీ జీవితం ఉంటుంది. కానీ మనం దాన్ని ఒక వస్తువులానే చూస్తాం. అందమైన రేపటి రోజున ఆరోగ్యకరమైన గాలి అందించడానికి మొక్కే ఆధారం. మొక్కలు బహుమతిగా ఇవ్వడం చాలా మంచి ఆలోచన. మొక్కలు పెంచాలంటూ వాటిని పాతిపెట్టే ఆలోచనను నాటుతున్నట్లే. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పాట్‌ పాయ్ మొక్కల పెంపకం ప్రాముఖ్యతను తెలియచేస్తూనే... పెంచాలన్న ఆలోచన కలిగించేందుకు అహర్నిశలూ కృషిచేస్తోంది.

ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న పాట్‌పాయ్ ప్లాంట్స్

ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న పాట్‌పాయ్ ప్లాంట్స్


“నాకు తెలిసిన నేకు కాకుండా... నాలోని మరో వ్యక్తిని నాకు పరిచయం చేసింది పాట్‌ పాయ్ " -అంటారు రిషభ్ జైన్...

ఫిబ్రవరి 2013లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో రిషభ్ ఓ మొక్కను అమ్మాల్సి వచ్చింది. ఓ వృద్ధ జంటకు తమ కొడుకు గుర్తుగా మొక్కను పెంచుకోవాల్సిందిగా ఒప్పించగలిగారు అతను. అలాగే రోజూ ఒకరితో ఒకరు గడపడమే కాకుండా... ఆ మొక్కతోనూ కొంత సమయం వెచ్చించాలని వాళ్లకు చెప్పారు రిషభ్.

మెడిటేషన్‌లో మెదిలిన ఆలోచన

2013 సెప్టెంబర్ నాటికి రిషభ్ మెడిటేషన్ చేస్తున్న సమయంలో మదిలో ఒక ఆలోచన తట్టింది. అతను ముగ్గురు స్నేహితులకు మొక్కలిచ్చి.. వారిని మరో ముగ్గురితో వాటిని పాతిపెట్టించడమని కోరాడు. దీన్నో చైన్ లింక్‌లా తయారు చేయాలని భావించాడు. ఆ సమయంలో వృద్ధ జంట తన మదిలో మెదిలారు. వాకబు చేస్తే వారు పాతిన మొక్క ఇప్పుడు చెట్టులా పెరిగింది. కాయలు కాచే స్థాయికి చేరింది. మెడిటేషన్ పూర్తయ్యాక తన ఆలోచన మర్చిపోకుండా దాన్నో వాయిస్ నోట్‌గా రికార్డ్ చేసుకున్నాడు కూడా.

"నా స్నేహితులందరిలోనూ ఇలాంటి వినూత్న ఆలోచనలు నాకే ఎక్కువగా వస్తాయి. అయితే చాలావాటిని నేను వెంటనే మర్చిపోతాను"- రిషభ్. 

మరుసటి రోజు తన స్నేహితుడికి ఆలోచన చెప్పగానే.. అతను ఆశ్చర్యపోయి ఆచరణలో పెట్టేందుకు వెంటనే అంగీకరించాడు. పొరుగున ఉన్న వారికి, స్నేహితులకు, బంధువులందరికీ మొక్కలు పంచడం ప్రారంభించారు. అయితే వారిలో చాలా మంది దగ్గర మొక్కలు ఉండడంతో... వీరిచ్చిన మొక్కకు, ఆలోచనకు అంతగా విలువ ఇవ్వకపోవడాన్ని గుర్తించారు. రిషభ్, అతని స్నేహితుడు కలిసి ఒక కాన్సెప్ట్ డిజైన్ చేశారు. తమ మొక్కలకు ప్రత్యేకత ఉండేలా చర్యలు తీసుకోవాలనుకున్నారు. “ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ మంచి విమర్శకుడు. అంతా సరిగానే ఉందనుకునే విషయాల్లోనూ అతను సమస్యలను గుర్తించగలడు. అందుకే, మా ఐడియాలను మరింతగా పదును పెట్టగలం." - రిషభ్

పాట్ పాయ్‌లో ప్రాణం పోసుకున్న మొక్కలు

పాట్ పాయ్‌లో ప్రాణం పోసుకున్న మొక్కలు


మనుషులు, జంతుల్లాగా మొక్కలు మాట్లాడలేవు. మమ్మల్ని పట్టించుకోండి మొర్రో అని అరిచి గీపెట్టలేవు. అందుకే వాటికి ప్రత్యేకతనిచ్చేందుకు ఓ చిన్న ఐడియా వేశారు రిషభ్. ఆ మొక్కను పెంచే కుండీకి పెయింట్ వేస్తే.. మిగతా కుండీలతో పోల్చితే ఇది భిన్నంగా ఉంటుందని భావించారు వాళ్లు.

“ ఒక ఇంట్లో 20 కుండీలున్నాయనుకోండి. అన్నీ బ్రౌన్, బ్లాక్ కలర్స్‌లో కనిపిస్తుండగా.. ఒకటి మాత్రం స్మైలీ బొమ్మతో ఉంటే! అది ఖచ్చితంగా చూపరులను ఆకట్టుకుంటుంది. ఎన్ని కుండీలున్నా మేమిచ్చే కుండీ ప్రత్యేకంగా కనిపించేందుకు రకరకాల బొమ్మలు వాటిపై ఉండేలా జాగ్రత్తపడ్డాం.”- రిషభ్

ఆలోచనకు జీవం ఇలా

పాట్‌పాయ్. కాం ఇక్కడే ప్రాణం పోసుకుంది. మొదట ఆ టీంలో రిషభ్‌తో పాటు ప్రతీక్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు వారితో రిషభ్ తల్లి ఆర్తీజైన్ కూడా జతయ్యారు. ఆమె రవాణా, పార్సెళ్లు, అకౌంట్లను చూసుకుంటున్నారు. దిలీప్ జైన్ సలహదారు బాధ్యత నిర్వహిస్తుండడం విశేషం. వస్తువులను భద్రపరచడంలో ఆర్తీజైన్‌కు అపార నైపుణ్యముంది. ఒక ఆలోచనను కేంపెయిన్‌గా, కేంపెయిన్‌ను కంపెనీగా మార్చడంలో స్టాక్, అకౌంట్లను చూసేందుకు ఆర్తీ జైన్ బెస్ట్ ఆప్షన్ అంటారు రిషభ్. “ వినూత్న ఆలోచనలు చేసేవారు అకౌంట్లు చూడ్డంలో దారుణంగా విఫలమవుతారు. అయితే, కంపెనీ నడపడంలో అకౌంట్లది కీలక పాత్ర. అందుకే ఆ రోల్ అమ్మ చేతికిచ్చాం. ఆమె టైం ప్రకారం డెలివరీలు కూడా చూసుకుంటారు."- రిషభ్ జైన్

వ్యవస్థాపక టీం నలుగురే ఉన్నా.. ఇప్పుడా కంపెనీ 15మంది ఉద్యోగుల స్థాయికి చేరింది. “ఆలోచన అమలు చేసేందుకు నేను చాలా మందిని తొందరపెట్టాను. అయినా సరే వారు నా కోసం ఎంతో సమయం వెచ్చించి ఓపిగ్గా విన్నారు. అలాగే మరింతగా వృద్ధి చెందేందుకు, ప్రమోషన్, సేల్స్‌లో వారెంతో కష్టపడ్డారు. ప్రస్తుతం పాట్‌పై టీంలో కరిష్మా రజని, ప్రక్షాల్ పర్మార్, నికితా దేశాయ్, గుంజన్ ఉట్రేజా, అనీషీ ఖతార్, నిషా లుల్లా, సరోజ్ జవేరీ, హితేష్ అమర్సేదా, ప్రియాంక ధభాలియా, భూమి షా, నేహాల్, శ్రేయ్, నికున్ ఉన్నారు.

మొక్కలకి బొమ్మలతో సొగసులు

మొక్కలని జాగ్రత్తగా చూడాలని ప్రపంచానికంతటికీ చాటి చెప్పడమే పాట్‌ పాయ్ లక్ష్యం. ఇది ప్రతీ ఒక్కరూ పాటించాలంటారు వీళ్లు. మనం పీల్చే గాలిని శుభ్రపరిచి, మనకి ఫ్రెష్ ఎయిర్ అందించి, మన జీవనానికి ఎంతో సాయపడే మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తోంది పాట్‌ పాయ్ . చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు తిరిగి శబ్దాలు చేస్తూనో, మరో విధంగానో ప్రతిస్పందిస్తాయి. అయితే మొక్కలకు ఆ శక్తి లేదు. 

"తిరిగి ఏమీ ఆశించకుండా ప్రేమించడమంటే మొక్కలను చూసి నేర్చుకోవాల్సిందే. కృతజ్ఞతగా వాళ్లు చేసేది మనకి కనిపించకపోయినా, చాలా ఉంటుంది. ఇది మొక్కల విషయంలో మనకు అర్ధమవుతుంది." - పాట్‌పై. 

మొక్కలను పెంచడమంటే అది ప్రకృతిని ప్రేమించడమే. ఇది ఎంతో ఆహ్లాదాన్నిచ్చే వ్యాపకం కూడా. అయితే నగరాల్లో చాలామంది మొక్కలను పెంచే టైం లేదనో, స్పేస్ లేదనో చెబ్తుంటారు.

"ఒక మొక్కకి ఫుట్ బాల్ పట్టేంత ప్లేస్ చాలు. మనం పళ్లు తోముకోడానికి 90 సెకన్లు వెచ్చిస్తాం. వాట్సాప్ మెసేజింగ్‌లో పడి 4 గంటలైనా పట్టించుకోం. మరి ఒక మొక్కకి నీరు పోసేందుకు 30 సెకన్లు మించి పట్టదు. మరి టైం, స్పేస్ అనే మాట ఎందుకొస్తుంది. ఒక మొక్క ముంబై మహా నగరాన్ని మార్చేస్తుందని నేను చెప్పట్లేదు. అయితే ప్రతీ ముంబై వాసీ ఒక్కో మొక్క పెంచితే ? 2.5 కోట్ల కొత్త మొక్కలొస్తాయి. అప్పుడు ముంబై నగర వికాసానికి ఇది తోడయినట్లేగా" అంటారు రిషభ్.

“వీలైనంత ఎక్కువ మందికి మొక్కలు సరఫరా చేయడమే మా లక్ష్యం. అందుకే మేము రేట్లను చాలా తక్కువగా నిర్ణయించాం. మొక్కలను పెంచుకునేవారే కాదు.. పట్టించుకోని వాళ్లు కూడా ఆకర్షితులవ్వాలన్నదే మా లక్ష్యం. మేము విక్రయించే డిజైనర్ పాట్స్ అందరి దగ్గరా ఉండాలి. మేము విక్రయించే ఈ పూలకుండీల ధర రూ. 150 నుంచి మొదలవుతుంది. అన్నీ చేతితో పెయింటింగ్ వేసినవే. తక్కువ మార్జిన్లు, ఎక్కువ విక్రయాలతో మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా"మంటారు రిషభ్

image


బిజినెస్ మోడల్స్

బీ2బీ - కార్పొరేట్ కంపెనీల్లో మొక్కల పెంపకానికి చాలా అవకాశముంటుంది. విశాలమైన ఆఫీసులు, స్టాఫ్, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడంతో వీరికి ఇలాంటి చర్యలు చేపట్టడం సులువే. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యతగా చేపట్టే కార్యకలాపాల్లో ఒక శాతం మొక్కల పెంపకానికి వెచ్చించినా... పర్యావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. అద్దాలు, ఐరన్‌తో నిండిపోయిన భవంతుల్లో పచ్చని మొక్కలు పెంచాల్సి ఉంది. అలాగే ఉద్యోగులకు బహుమతిగా మొక్కలని ఇస్తే... వాళ్లు డెస్క్ దగ్గరో, ఇంటి దగ్గరో జాగ్రత్తగా పెంచుకుంటారు కూడా అంటోంటి పాట్‌ పాయ్.

కారులో అలా ఒదిగిపోయిన స్మైలీ

కారులో అలా ఒదిగిపోయిన స్మైలీ


బీ2ఎస్ -

B2S – సొసైటీలు, ట్రస్ట్‌లు, సహకార సంఘాలను కూడా ఆక్టటుకోవాలన్నది పాట్‌పై ప్రయత్నం. ఆయా భవంతులను పచ్చదనంతో నింపడం ద్వారా దీనికి మరింతగా ప్రచారం వస్తుందని నమ్ముతున్నారు వీళ్లు. అలాగే బీ2బీ, బీ2ఎస్‌లు సమాజంపై ప్రభావం చూపగల మోడళ్లని కూడా చెబ్తున్నారు.

బీ2సీ- ఇంట్లోనో, ఆఫీసులోనో కూర్చుని ఆర్డర్ చేసే సాధారణ ప్రజలు కూడా పాట్‌పై టార్గెట్ కస్టమర్లే. ప్రతీ ఇంటిలో పాట్‌పై పూలకుండీ ఉండాలంటే ఈ బిజినెస్ మోడల్‌ని కూడా తప్పనిసరిగా ఎంచుకోవాల్సిందే.

పాట్‌ పాయ్ ఫేస్ చేసిన కష్టాలను యువర్ స్టోరీతో పంచుకున్నారు రిషభ్. ఈ కామర్స్ మోడల్‌ని ఎంచుకుని వ్యాపారం చేస్తున్న పాట్‌పై.. ముంబైలోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. "ప్రస్తుతం మాది ఆరంభంలో ఉన్న కంపెనీయే. ప్రభుత్వ నిబంధనల కారణంగా కొరియర్ కంపెనీలు మొక్కలను డెలివరీ చేసేందుకు అంగీకరించడం లేదు. దీంతో ఇంటింటికీ మొక్కలు చేర్చడం కష్టమవుతోంది. మా డిస్ట్రిబ్యూషన్ పెంచుకునేందుకు ప్రస్తుతం కష్టపడుతున్నాం. కానీ ఇందుకోసం మరికొంత సమయం పడుతుంది. ఇప్పటికైతే ఈ-కామర్స్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తా"మంటారు రిషభ్.

మొక్కకి కళ జతయ్యింది

రజుల్ మెహతా ఆర్ట్ విభాగానికి హెడ్. ఆలోచనలు ఇవ్వడం తేలికే. వాటిని ఆయా పూలకుండీలపై అందంగా ఉండేలా ఆచరణలో పెట్టడం మాత్రం కష్టమంటారామె. బిల్లాబాంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న రజుల్ మెహతా... ఇప్పటికి వెయ్యికిపై కుండీ డిజైన్లు వేశారు.

“ఆర్టిస్టులను మేం బహిరంగంగానే ఆహ్వానించాం. పూజా గులాఛా షాజమాన్, అలేథా ఫెర్నాండెజ్‌లు మాకు తోడయ్యారు. ఇద్దరు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ బిజీ లైఫ్ గడిపేవారే. అయినా సరే కుండీలకు కొత్త డిజైన్లు అందించేందుకు వారు తీరిక సమయంలోనే చాలా కష్టపడ్డారు. అలాగే కుండీలు, వాటి రంగులు, మోడల్, బొమ్మలు, మొక్కల విషయంలో.. ప్రతీదీ వారికిష్టమైనది ఎంచుకునే స్వేచ్ఛ ఉండడం చాలా నచ్చిందని కస్టమర్లు చెప్పారంటోంది పాట్‌పై. ఇప్పటివరకూ మా ప్రొడక్టులు నచ్చలేదని చెప్పిన వారు ఒక్కరు కూడా లేరంటున్నారు ఈ టీం. ఆయా ప్రదర్శనల్లో వీక్షకుల మొహాల్లో ఆశ్చర్యం చూస్తే చాలు... మా కష్టం మరిచిపోతున్నామంటారు వీళ్లు. ఒక యువతి తన తొలి కాబోయే భర్తతో పరిచయమయ్యి ఏడాది అయిన సందర్భంగా.. తనకు కావాల్సిన విధంగా కుండీ ఉండాలని కోరడమే.. ఇలా నచ్చినది ఎంచుకునే స్వేచ్ఛ ఉండేలా తమ మోడల్ మారడానికి కారణమం”టారు రిషభ్.

పాట్‌ పాయ్‌కి ముందు

పాట్‌పై.కాం ఏర్పాటుకు ముందుకు ఈ టీంలో ఎవరికీ స్కూల్లో నేర్చుకున్నవి తప్ప మొక్కల గురించి పెద్దగా తెలీదు. ఇప్పుడైతే వీళ్లందరూ లెక్చర్లు కూడా ఇచ్చేయగలరు. ఇండోర్-అవుట్ డోర్ ప్లాంట్స్, పూలు పూచేవి-పూయనివి మొక్కలు, వాటి అనుబంధ మొక్కలు, ఉపయోగాలు వంటి వాటిపై సుదీర్ఘంగా వివరించగలరు కూడా. వీరు ఎంచుకునే మొక్కలన్నీ కూడా నిర్వహణ విషయంలో సులభమైనవే. పెంచడం కష్టమైనవాటిని తీసుకుంటే.... ఒకవేళ అది చనిపోతే నిరుత్సాహానికి గురయ్యే అవకాశముంది. అందుకే తగినంత ఎండ, తక్కువ నీరుతో అందంగా కనిపించే వాటిని ఎంచుకున్నారు పాట్‌పై టీం. మొదటిది చక్కగా పెరిగితే తర్వాత వాటిని మరిన్ని పెంచుకునేందుకు ప్రోత్సాహం అందుతుందని వారి ఉద్దేశ్యం. అలాగే ప్రజలు ఔషధ మొక్కలు, దోమల్ని తరిమేసే ప్లాంట్లు, గాలిని శుభ్రపరచేవి, వాస్తుపరంగా మేలు చేసే మోడళ్లను అడుగుతున్నట్లు చెప్తోందీ పాట్‌పై.

పాఠకులకు ఏం చెబ్తారని యువర్ స్టోరీ టీం రిషభ్‌ని అడిగితే ఆయనిచ్చిన సమధానం ఇది - "చెట్ల నుంచి వైఫై అందుతుందని ఊహించండి, అప్పుడు మనం మొక్కలు పెంచేందుకు చాలా ఉత్సాహం చూపుతాం. కానీ అవి మనం పీల్చే ఆక్సిజన్ మాత్రమే అందిస్తాయి. ఈ ఆర్టికల్ చదివేవారిని నేను కోరేదొకటే.. కనీసం ఒక మొక్కనైనా పాతండి. జాగ్రత్తగా పెంచితే 40 రోజుల తర్వాత దాని పెరుగదలని చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారు"

పాట్‌పై వెబ్ సైట్‌ను ఇక్కడ విజిట్ చేయండి - www.patpai.com

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags