సంకలనాలు
Telugu

అతి చిన్న పారిశ్రామికవేత్తకు ఇంటెల్ నుంచి భారీ ఫండింగ్

దృష్టిలోపం గల జీవితాల్లో వెలుగులు12 ఏళ్లకే ప్రత్యేక బ్రైగో పేరుతో ప్రింటర్ ఆవిష్కరణప్రింటర్ ధరను నేలకు దించిన బాలమేధావిఇంటెల్ నుంచి భారీ ఫండింగ్ స్కూలుకు వెళ్తూనే సిఈఓగా బాధ్యతలుఎందరికో స్ఫూర్తి శుభం బెనర్జీ

team ys telugu
5th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
శుభం బెనర్జీ,బ్రైగో ఆవిష్కర్త

శుభం బెనర్జీ,బ్రైగో ఆవిష్కర్త


అతడు బాలమేధావి. అయితే స్కూల్లో ఫస్టు రావడమో.. వందకు వంద మార్కులు రావడమో అతని గొప్పదనం కాదు. ప్రపంచంలో దాదాపు 300 కోట్ల మంది ఎదుర్కొంటున్న సమస్యకు అతి చవకమైన పరిష్కార మార్గాన్ని కనుగొన్నాడు. దృష్టిలోపం గల వాళ్ల కోసం ప్రస్తుతం మార్కెట్లో లభించే ప్రింటర్ ఖర్చును భూమార్గం పట్టించాడు. ఇప్పటికీ స్కూలుకు వెళ్తూనే సిఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇతడి అత్యద్భుత ఆవిష్కారం చూసి ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టింది. వందల కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చేందుకు ఇంటెల్ సంస్థ పరుగుపరుగున ముందుకు వచ్చింది. బ్రైగో ప్రింటర్ తయారుపై దృష్టిసారిస్తూనే మరో రెండు ఉత్పత్తులనూ సిద్ధం చేస్తున్నాడు ఈ యంగెస్ట్ ఆంట్రపెన్యూర్ అండ్ సైంటిస్ట్ శుభం బెనర్జీ.

ఇప్పుడు అతని వయసు 13. ఇంటెల్ గ్లోబల్ సదస్సు ద్వారా అతనికి ఇంటెల్ నుంచే వందల వేల కోట్ల డాలర్ల వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ నిధులు సమకూరాయి. బ్రైగో కోసం తనువూ మనసులను ఏకం చేసిన బెనర్జీ, ఇప్పుడు ఆనందంతో చిందులేస్తున్నాడు. నిధులు సమకూరడంతో పెద్ద ఎత్తున బ్రైగో ఉత్పత్తిని ప్రారంభిస్తానని అంటున్నాడు. అంతే కాకుండా బ్రైగో నో మరింతగా ఆధునీకరించి తిరుగులేని సాధనంగా మారుస్తానని విశ్వాసం అతడిలో కనిపిస్తోంది. అయిత బెనెర్జీ ఇంత చేస్తూ కూడా చదువును అశ్రద్ధ చేయడంలేదు. బడికి వెళుతూనే ఉన్నాడు. హోం వర్క్ చేస్తున్నాడు.


శుభం ఆవిష్కరణ బ్రైగో -1

శుభం ఆవిష్కరణ బ్రైగో -1


ప్రపంచ వ్యాప్తంగా 285 బిలియన్ల మంది దృష్టిలోపం ఉన్నవాళ్లు ఉన్నారు. అందులో 90 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. ఇప్పుడు బెనెర్జీ ఆవిష్కరణతో వారు ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్యకు పరిష్కారం దొరికినట్టైంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో బెనెర్జీ ప్రపంచ వాప్తంగా ఉన్న అంధులకు ఉపయోగ పడే 'బొమ్మ' బ్రైగో ' ను ముందుంచుకుని ఎలా? ఏమిటి? అన్న ఆలోచనల్లో మునిగి ఉన్నాడు. ఇప్పుడు అదే బెనర్జీ సిలికాన్ వాలీ లో వెలిసిన బ్రైగో లాబ్స్ సీఈఓ. ఇది కొత్త కంపెనీ. మనిషికి ఎదురయ్యే జీవన సమస్యలకు వినూత్నసాంకేతిక పరిజ్ఞానంతో సమాధానం చూపడం .. అలా మానవతా భరితంగా రూపొందించిన సాధనాలను అందరికీ అందుబాటులో ధరలలో అందించడమే లక్ష్యం గా నిర్దేశించుకున్న కంపెనీ బ్రైగో లాబ్స్. నిజానికి ఇదొక అద్భుత విజయం.. అయితే బెనెర్జీ ఇప్పుడే అడుగులు వేస్తున్నాడు. అతని వద్ద మరో రెండు పేటెంట్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని బెనెర్జీ తండ్రి గర్వంగా చెప్తారు. ఆ రెండు కూడా చూపు లేని వారి కోసమే కావడం, బ్రైగో కు సంబంధించినవే కావడం మరో విశేషం. అంతే కాదు అతని ముందు ఇంకా చాలా ఆలోచనలు కూడా ఉన్నాయి.

బ్రైగో ఎలా? ఎందుకు? ఏ ఉద్దేశం లక్ష్యంతో రూపొందించాడు, 13 ఏళ్ల పిన్న వయసులో వెంచర్ క్యాపిటలిస్టుల నిధులతో కంపెనీ ప్రారంభించడం ఎలా అనిపిస్తోంది? ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటి? భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి? ఇంతగా ప్రాచుర్యం పొందినా అతని జీవిత విధానాల్లో ఎలాంటి మార్పు కనిపించక పోవడం వెనక ఏమైనా మాయా మర్మం ఉన్నాయా? ఇవీ ఇలాంటి ఇంకొన్ని ప్రశ్నలకు బెనెర్జీ 'యువర్ స్టొరీ' కి వివరిచారు. ఆ వివరాల్లలోకి వెళితే…

ప్ర: రెండేళ్ల వయసు నుంచే 'లెగో' తో ఆడుకుంటున్నావు కదా, వాటిని అంతగా ఇష్టపడటానికి కారణం ఏమిటి ?

జ: లెగో తో ఆడుకోవడం క్రియేటివ్ గా ఉంటుంది. అది నాకిష్టం. నువ్వు నీకు ఏది కావాలో అది నిర్మించుకోవచ్చును. అది ఎలా చెబితే అలాగే నిర్మించాలని లేదు. చిన్నతనంలో దానితో ఆడుకోవడం అంటే చాలా సరదాగా ఉండేది. అయితే వయసు పెరిగేకొద్ది, లెగో మరింత ఉపయోగకరమైన రోబో ప్రాజెక్టులకు ఉపయోగిచుకోవచ్చును అనిపించింది.

ప్ర: బ్రైగో కు ముందు లెగోను ఉపయోగించి నువ్వు తయారు చేసిన సంక్లిష్ట ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా?

జ: నిజానికి బ్రైగో కు ముందు కార్లు, విమానాలు లాంటి బొమ్మలు తప్ప పెద్దగా చెప్పుకో వలసిన ప్రాజెక్ట్ అంటూ ఏదీ లేదు.

ప్ర: ఇంతగా ప్రసిద్ధి చెందక ముందు నీ జీవితం ఎలా ఉండేది?

జ: అప్పుడు.. ఇప్పుడు జీవితం ఒకేలా ఉంది. అప్పుడప్పుడు ఎవరో వచ్చి ఇలా మీలా ఇంటర్వ్యూ చేయడం మినహా మిగతాదంతా సేమ్ - టూ - సేమ్, ఏ మార్పు లేదు. నాకో చెల్లుంది. అందంగా ఉంటుంది. మాకు మా తల్లి తండ్రులు చిన్నతనం నుంచి ఇతరులకు సహాయ చేయాలని, చేసే పని అర్ధవంతంగా చేయాలని నేర్పించారు, అదిగో అక్కడి నుంచి బ్రైగో ఆలోచన వచ్చింది.

ఇక నా అలవాట్లు, హాబీల విషయానికి కొస్తే గిటార్ వాయించడం ఇష్టం. ఫుట్ బాల్ (అమెరికన్ ఫుట్ బాల్) అడడం ఇష్టం. నాకు బడికి పోవడం ఇష్టం, ఇదీ అదీ అని ఏమీ లేదు, అన్ని సబ్జెక్టులూ ఇష్టమే. డిబేట్ లో పాల్గొనడం కూడా ఇష్టం. త్వరలో ఒక డిబేట్ టోర్నమెంట్ లో పాల్గొనవలసి ఉంది.

ప్ర: బ్రైగో, తయారు ప్రక్రియ ఏమిటి? ఎప్పుడైనా నిరాశ పరిచే పరిమాణం చోటు చేసుకుందా ?

జ: గత డిసెంబర్ లో అంధులకు విరాళాల కోసం ఎవరో పంపిన అభ్యర్ధన నాకు చేరింది. అప్పుడు నేను నా తల్లి తండ్రులను అంధులు ఎలా చదువుతారని అడిగాను. అమ్మ గూగుల్ చూడమంది. అలా చూస్తున్నప్పుడు బ్రైలీ ప్రింటర్ ఖరీదు 2000 డాలర్ల నుంచి ఉంటుందని తెలిసి బాధేసింది. ఇంత ఖరీదు పెట్టి ఎంత మంది కొనగలరని అనిపించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ఇంత ఖరీదు భరించగలరా, అనే ప్రశ్నకు 'లేరు' అన్న సమాధానం ఒకేసారి వచ్చింది. అప్పుడే, అ క్షణంలోనే అందరి అందుబాటులో ఉంటే బ్రైలీ ప్రింటర్ తయరు చేయాలని నిర్ణయానికొచ్చాను. రెండు ప్రాజెక్టుల ద్వారా అది పూర్తి చేశాను. అందులో మొదటిది లెగో బ్రైలీ ప్రింటర్. అదొక సరదా ప్రాజెక్టు. అది కేవలం ఎస్ , నేను చేయగలను అన్న విశ్వాసాన్ని మాత్రమే ఇచ్చింది. రెండవది 'ఎడిసన్' అనే ఇంటెల్ న్యూ చిప్ తో తయారు చేశాను. అదే చివరికి వినియోగదారులకు చేరే ప్రింటర్. ఇది మార్కెట్ లోకి వెళుతుంది, అని ఆనందంగా చెప్పారు బెనెర్జీ.


కుటుంబ సభ్యులో శుభం బెనర్జీ

కుటుంబ సభ్యులో శుభం బెనర్జీ


ప్ర. అది ఏదో చిన్న ప్రాజెక్టుగా ప్రారంభ మైంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా చేరింది?

జ: కాల పట్టిక (క్రోనాలజీ) నాకు చాలా చిందరవందరగా, చికాకుగా అనిపిస్తుంది. బ్రైగోను నేను మా స్కూల్ సైన్స్ ఫెయిర్ లో ప్రెజెంట్ చేశాను. ఆ తర్వాత సైనోప్సిస్ అనే పెద్ద సైన్స్ ఫెయిర్ కు వెళ్ళాను. అక్కడ నాకు ప్రధమ బహుమతి వచ్చింది. ఆ తర్వాత బ్రైగో ప్రస్థానం వేగం పుంజుకుంది అనుకుంటాను.

ప్ర: బ్రైగో వార్తలకు ఎక్కిన తర్వాత మీ వయసు పై చాలా మంది దృష్టి పడింది. మీరు 'బ్రైగో' కనుగొనే సమయానికి మీ వయసు ఎంత?

జ:చాలా సంతోషంగా ఉంది. వీసీ ఫండింగ్ పొందినవారిలో నేనే అందరికంటే చిన్నవాడిని కావడం, అది కూడా ఇంటెల్ లాంటి పెద్ద కంపెనీ నుంచి వీసీ ఫండింగ్ పొందడం చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే, సిలికాన్ వాలీ లో నా అంతటి చిన్నవారు కూడా పెద్ద పెద్ద ఘనకార్యాలు సాధించడం కొందరిని అంతగా ఆశ్చర్య పరచదు. ఇక్కడ నాకు ఎందరో ఎన్నో విధాలుగా సహాయం చేసారు , ఏదైనా కొత్తగా చేయాలనుకునే వారికి సిలికాన్ వాలీలో అవకాశాలకు కొదవ లేదు. ఇక్కడ ఉండడం, ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది.

ప్ర: ‘బ్రైగో' లైవ్ లోకి వెళ్ళిన తర్వాత ఎంతో ఆనందాన్ని ఇచ్చిన క్షణాలు, సంఘటనలు చాలానే ఉండవచ్చును, వ్యక్తిగతంగా మీ దృష్టిలో అత్యంత ప్రాధాన్యతగల క్షణాలు .. సంఘటనలు ?

జ: శ్వేత సౌధానికి వెళ్లి బరాక్ ఒబామాను చూశాను, ఆయన స్పీచ్ విన్నాను, అదొక మధుర క్షణం. అలాగే, మేకర్ ఫెయిర్ ఫౌండర్ డాలే దౌఘేర్తి లాంటి ఎందరో గొప్ప వ్యక్తులను కలిశాను.'ది సైన్స్ గై' బిల్ నయే. లెగో ప్రెసిడెంట్ సోరెన్ టొర్ప్ లుర్సేన్ ను కలిశాను .. అదొక మధురాతి మధుర క్షణం.

ప్ర: ఆయన మీతో ఏమన్నారు?

జ: నిజానికి నేను ఆయన దగ్గరకు వెళ్లలేదు. ఆయనే వచ్చి నన్ను కలిశారు. ఆయన నన్ను అభినందించారు.నేను చేస్తున్న పనిని మెచ్చుకున్నారు. ఆయన అంతటి మంచి మనిషి.

ప్ర: మీరు బ్రైలీ చదువుతారా ?

జ: లేదు చదవలేను.ఏదన్నా ప్రత్యేకంగా చూడవలసి ఉంటే గూగుల్ లో చూస్తాను.అయితే ఇక్కడా, అక్కడ ఒకటి రెండు లైన్లు చదవగలను.

ప్ర: ఎంతో అనుభవం గల పారిశ్రామిక వేత్తలను కూడా సాంకేతిక ఆవిష్కరణలు భయపెడతాయి. కేవలం 12 సవత్సరాల వయసులో, అదికూడా బ్రైలీ లో ఎలాంటి పూర్వ పరిచయం లేకుండా మీ ఆట వస్తువుతో జీవితాన్నే మార్చివేసే ఆవిష్కరణను కనుగొన్నారు. పరిశోధన , ఇదంతా చూస్తుంటే కొత్త దాన్ని కనుగొనడం, ఇన్నోవేషన్ ఎంతో సులభం అనిపించేలా ఉంది? ఇందుకు సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి?

జ: ఐన్ స్టీన్," ప్రతిదీ సాధ్యమైనంత సులభంగా ఉండాలి , కానీ, మరీ తేలిగ్గా ఉండరాదు" అన్నారు. బ్రైగో ప్రాజెక్ట్ మొత్తంలో ప్రోటో టైపింగ్ చాలా కష్టమైంది. ఒక్కోసారి నాకు కావాల్సింది దొరికేది కాదు. కొన్ని సందర్బాలలో ముక్కలు చేసి మార్చుకోవాల్సి వచ్చేది. మళ్లీమళ్లీ ముక్కలు చేయడం అతుకులు వేయవలసిన అవసరం ఏర్పడేది. ఈ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది, కానీ, అయితే ఒక్క ఐడియా జీవితాన్నే మార్చి వేసింది అనే వాణిజ్య ప్రకటనలోలాగా అన్నిటిని మించినది ఆలోచన. నేను ఎప్పుడు దీని నుంచిఆర్ధిక ప్రయోజనాలు ఆశించ లేదు. చూపు లేని వారికీ చేయూత ఇవ్వడమే నా లక్ష్యమ."నువ్వు నలుగురికి మంచి చేస్తే నీకూ మంచే జరుగుతుంది" నా తల్లి తండ్రులు నాకు నేర్పింది ఇదే.

ప్ర: కంపెనీ ఏర్పాటులో అత్యంత కఠిన మైన పరీక్ష ఏది? దీన్నుంచి ఏమి నేర్చుకున్నారు?

జ: ఈ కంపెనీ నేను ఒక్కడినే స్థాపించ లేదు. మా నాన్న చేసేది మా నాన్న చేస్తున్నారు. అయితే కంపెనీ ఏర్పాటులో అత్యంత క్లిష్టమిన పని, పేపర్ వర్క్. న్యాయవాదులు వివాదాలు, ఇలాంటి పనులన్నీ కష్ట మైనవి, క్లిష్టమైనవి.

ప్ర; మీ విజయాన్ని అందరూ అభినందిస్తున్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు, అయితే మీకు ఈ ప్రయాణంలో ఎక్కడైనా వైఫల్యాలు ఎదురయ్యయా?

జ: వైఫల్యాలా ? ఎందుకు లేవు.. చాలానే ఉన్నాయి. ప్రొటోటైప్ రూపొందించడంలో ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి. అలాగే ఆన్ లైన్ ట్రొల్ల్స్ అయితే నన్ను పూర్తిగా కుంగదీశాయి. నేను నేను కాదు, నా ఆవిష్కరణలు నావి కాదు అన్న విమర్శలు వచ్చాయి. అయితే నేనువాటిని పట్టించు కోలేదు.

ప్ర: ఒక కంపెనీ సీఈఓ గా ఉంటూ స్కూల్ కు వెళ్ళడం , ఇతర వ్యాపకాలు ఎలా నిర్వహిస్తున్నారు ?

జ: దేనికదే. అన్నిటికి నిర్దిష్ట సమయం కేటాయించుకుని పనిచేస్తున్నాను. నాకు ఇంటర్వ్యూ లకు ప్రత్యేక సమయం ఉంది. అలాగే హోం వర్క్, ల్యాబ్ వర్క్ కు ప్రత్యేకంగా సమయం ఉంది. అవును. కాలం తో పరుగులు తీయడమే అవుతుంది, కానీపని జరిగి పోతుంది. మరోవైపు మా అమ్మా నాన్న నాకు సహాయం చేస్తుంటారు.


బ్రైగో -2 తో శుభం బెనర్జీ

బ్రైగో -2 తో శుభం బెనర్జీ


ప్ర: చిన్నతనం కావడం వల్ల ప్రపంచాన్ని అంతగా చూడలేదని అన్నారు.అయితే అది మీకు మేలే చేసిందనిపిస్తుంది, ఎందుకంటే మీకు భయం అంటే తెలియదు, నూతన ఆవిష్కరణలు చేసే వారికి, మీ సలహా ఏమిటి?

"డబ్బే పరమావధిగా పనిచేస్తే ప్రయోజనం ఉండదు. ఇతరులకు సహాయం చేసేందుకు ఏదైనా చేయండి. ఇతర పిల్లకు నేనుచేప్పేదేమంటే ఏది చేసినా సొంతంగా చేయండి. ఇంతకుముందే ఎవరో చేసిన వాటినే చేయకండి. ఈ మొక్క ఉప్పు నేలల్లో బతుకుతుందా లాంటి ప్రయోగాలు, ఇంతవరకు లేని దానిని కనుగొనే ప్రయత్నం చేయండి".

ప్ర: మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?

జ: నేను హై స్కూల్ లో చేరుతున్నాను. కాలేజీ చదువు పూర్తి చేయాలని అనుకుంటున్నాను. వైద్యం లేదా ఇంజనీరింగ్ రంగాల్లో పని చేయాలని అనుకుంటున్నాను.
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags