సంకలనాలు
Telugu

చంటి పిల్లాడికి పాలు కావాలని నావాట్సాప్ కి మెసేజి వచ్చింది!

ashok patnaik
9th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ప్రతిరోజు లాగానే ఆరోజు సాయంత్రం కూడా ఇంటికొస్తున్నా. జలమయమైన రహదార్లు మా వీధిలో నాకుస్వాగతం పలికాయి. వాతావరణ పరిస్థితుల వల్ల ఇంటర్నెట్ ఆన్ ఆఫ్ అవుతోంది. నా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ తోనే నేను సర్వైవ్ అయ్యాను. అన్ని నెట్ వర్కులు అంతంత మాత్రంగా సిగ్నల్స్ ఉన్నప్పటికీ ఇది మాత్ర ఫుల్ సిగ్నల్స్ తో ఉంది. ఈ ఫోన్ తోనే .మా బంధువులు, స్నేహితులతో టచ్ లో ఉండగలిగాను.అసలేం జరిగిందంటే.. నా ఒక్క దానికే కాదు మొత్తం చెన్నై నగరానికే జరిగింది.

“డిసెంబర్ ఒకటో తారీఖంటే ఇప్పుడు చెన్నై వాసులకు హడల్.” ఇందూజా

ఆరోజు పడిన వర్షానికి ఇప్పటికి కొన్ని రోడ్లు మరమత్తుల స్టేజిలోనే ఉన్నాయి. బుధవారం వచ్చే దాకా నేనైతే వర్షాల ప్రభావానికి గురికాలేదనే చెప్పాలి. చెన్నైలో ప్రైమ్ లొకేషన్ లో ఉండటం వల్ల నా తోపాటు మా ప్రాంతంలోని జనాలకు వర్ష ప్రభావం అంతగా లేదనే చెప్పాలి. తమిళ్ యువర్ స్టోరి ఎడిటింగ్ పని చేసుకుంటూ ఉన్నా. నా మొబైల్ హాట్ స్పాట్ తో ఇంటర్నెట్ వాడుతూ సాగిపోయేది నా దిన చర్యడిసెంబర్ రెండో తారీఖున నా రోజువారి పనులు ముగించుకొని టీవీ ఆన్ చేశా. నగరశివారు ప్రాంతాల్లో చెరువులు, ఇతర నీటి వనరులున్న ప్రాంతాలను ఆక్రమించిన ఇళ్లుకట్టుకున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదనేది ఆరోజు న్యూస్ లో ప్రధానగం చర్చించిన విషయం. కొద్ది సేపు చూశాక నేను కూడా కొన్ని కామెంట్స్ అనుకుని నమ్మనంగా నిద్రలోకి జారుకున్నా.

image


ఉదయం 6గంటలకు మా నాన్నగారి మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని పోలీసు వాహనాలు మా ఇంటి ముందు నుంచి వెళుతున్న శబ్దం. మా పక్కింటావిడ వరద నీళ్లంటూ అరుస్తోంది. రాత్రి వర్షానికి రోడ్లపైకి నీరొచ్చుంటుందని అనుకున్నా. మా నాన్నగారు మనింట్లోకి నీళ్లొచ్చాయి ఓసారి చూడు అంటూ నన్ను నిద్రలేపే ప్రయత్నం చేశారు. అప్పుడర్థం అయింది. పరిగెత్తుకుంటూ గేటు దగ్గరకి వెళ్లి చూసే సరికి రోడ్డంతా నీరే. వేగంగానే వరద నీరు మా ఇంటి కాంపౌండ్ లోకి ప్రవేశిస్తోంది. మా ఇంటిల్లి పాది నీటిని తోడి బయట వేసే ప్రయత్నం చేశాం. కరెంట్ కట్ అయింది. ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం మనేసాయి. అయితే నెమ్మదిగా వరద తగ్గుముఖం పట్టింది. మా ప్రాంతంలో కొన్ని ఇళ్లకి కరెంట్ అందింది. లక్కీగా అందులో మా ఇళ్లు కూడా ఉంది. అసలు వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయని టీవీ ఆన్ చేశా. ఆ దగ్గర్లో ఉన్న నదినుంచి ఓవర్ ఫ్లో అయిన నీళ్లవి. నీరెక్కువ కావడంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తేసారు. మేమున్న ప్రాంతంలో కూడా శివారు ప్రాంతాల్లాగ వరద నీరొచ్చే ప్రమాదం ఉందని మేం కలలో కూడా ఊహించలేదు. చెన్నైలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ఏరియాల్లో గ్రౌండ్ ఫ్లోర్లలో నీరు చేరింది. పది అడుగుల నీరు చేరింది. కార్లు వాషవుట్ అయిపోయాయి. చెన్నై ప్రమాదంలో పడింది. అంతా బాధపడుతూ ఉంటే నేను సేఫ్ గా ఉన్నా కదా అని ఇంట్లో కూర్చొని మాత్రం ఉండలేకపోయాను.

image


గురువారం నా మొబైల్ డేటా పనిచేయడం ప్రారంభించింది. నా ఫేస్బుక్, ట్విట్టర్ పేజి ఓపెన్ చేశా. వందల సంఖ్యలో కాల్స్, మెసేజీలు. విదేశాల్లో ఉన్న ఎంతో మంది వాళ్ల తల్లిదండ్రులెలా ఉన్నారంటూ నాకు మెసేజీలు చేశారు. అందరిదీ ఒకటే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. నా రిపోర్టింగ్ రోజులు గుర్తొచ్చేశాయి. నా పాత కలీగ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందిరీ వాట్సాప్ , ఫోన్ లో కాంటాక్ట్ లోకి వెళ్లా. కొందమంది స్పందించారు. కొందరి ఫోన్లు స్విచ్చాఫ్ వచ్చాయి. కొంతమంది క్షేమ సమాచారం అయితే తీసుకోగలిగాను.

“డెలివరీ విమన్ కి డాక్టర్ సాయం కావాలి. చంటి పిల్లాడికి పాలు కావాలి. లాంటి చాలా మెసేజీలు నావాట్సా కి వచ్చాయి” ఇందూజా

ఫేస్బుక్, ట్విట్టర్ లతో వాలంటరీ టీం లను ఏర్పాటు చేశాం. మెసేజీలు పాస్ చేయడం, అత్యవసర పరిస్థితులను చక్కదిద్దడం ఈ వాలంటీర్ల పని. అందులో నేను కూడా భాగస్వామినయ్యా. ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేయడం ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపించింది. బయటకి వెళ్లి జనం ఉన్న పరిస్థితిని చూస్తే మరింత అవగాహణ వస్తుంది. మరింతగా తోచిన సాయం చేయొచ్చనిపించింది. నా స్నేహితురాలితో కార్లో ప్రయాణం మొదలైంది. ఓ పెద్దాయన అతని భార్య ఓ ఇంటిలోపల కుర్చొని ఉండం గమనించాం. కరెంటు లేదు కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవు వారి దగ్గర. మోకాళ్లు మునిగే నీటిలో బయటకు రాలేని పరిస్థితి వారిది. నీళ్లబాటిళ్లు, మరికొన్ని కావల్సిన వస్తువులతోపాటు కొన్ని మెడిసిన్స్ వారికందించాం. దాదాపు ఐదు రోజులైందట. బయటి వ్యక్తులను చూసి. వాళ్ల కళ్లలో కన్నీరొక్కటే తక్కువ. మా చేతులు పట్టుకొని కొద్దిసేపు వదల్లేదంటే నమ్ముతారా? మాతో ఫోటో పోజిచ్చారు. వారి పిల్లలకు వాట్సాప్ మెసేజి పంపుతామంటే సంతోషంగా ఫోటో దిగారు. వారి పక్కన మరింత దయనీయ పరిస్థితిలో ఉన్న వారిని కలవమని చెప్పారు. వాళ్లని సురక్షిత ప్రాంతాలకు తరలించి ముందకు సాగిపోయాం.

image


మరికొన్ని రోజులు నా ప్రయాణం కొనసాగించాలనుకున్నా. జనాన్ని కలుస్తూ, కుటుంబ సభ్యులకు వారి క్షేమ సమాచారం అందిస్తూ శుక్ర, శనివారాలు గడిచిపోయాయి. నేను అడగ్గానే కాదనకుండా మా స్నేహితులు చాలా మంది వాటర్ బాటిళ్లు, బిస్కట్లు, మిల్క్ ప్యాకెట్స్ మా ఇంటికి పంపారు. వాటిని అందికీ పంచిపెట్టాను. మా టీం లో మొత్తం నలుగురు సభ్యలయ్యారు. రెండు కార్లమీద ఓల్డేజి హోంలు, ఆసుపత్రులకు వెళ్లి అక్కడున్న వారిని పలకరించాం. వారి బాగోగులు అడిగే ప్రయత్నం చేశాం. మా సాయం మర్చిపోలేమని చెప్పి ఒక్కొక్కరు కన్నీరు కార్చారు. మాటల్లో చెప్పలేని అనుభూతికి గురయ్యా. అక్కడి నుంచి వస్తున్న దారిలో ఫుడ్ కోసం పడిగాపులుకాస్తున్న కొంతమంది కనిపించారు. అప్పటికి మాదగ్గరున్న 200 ఫుడ్ ప్యాకెట్లను వారికిచ్చాం.

image


ఇప్పుడు చెన్నై అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుకుంటోంది. అన్ని ప్రాంతాల్లో అన్ని రకాల సేవలు అందించడానికి వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక విషయమైతే నేను చెప్పగలను. మానవత్వానికి కున్న గొప్పదనం జనం గుర్తించారు. గ్రౌండ్ ప్లోర్ నివాసులకు ఇతర ప్లోర్స్ లో ఉన్న వారు షెల్టర్ ఇచ్చారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలన్నీ అన్ని మతాల వారికోసం తెరిచారు. తెలియని వారికోసం వంట చేశారు. ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే ఎలాంటి ఇబ్బంది పడకూండా సాయం అందించారు. ఇదిలాగే కొనసాగాలని కోరుకుంటున్నా

“చివరగా నేను చెప్పేది ఒక్కటే. నా పరిస్థితిని చక్కగా అర్థం చేసుకున్న వాళ్లు నా చుట్టూ ఉన్నారు. నా చెన్నై కోసం నేను కొద్దిగ సేవ చేసే అవకాశం ఇచ్చిన్న ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతూ ముగిస్తున్నా.” ఇందూజా

యవర్ స్టోరి తమిళ్ కు అసిస్టెంట్ ఎడిటర్ గా ఉన్న ఇందూజా స్వ అనుభవం నుంచి రాసినది

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags