కాఫీ షాపులో రిపేర్ల నుంచి కోట్ల వ్యాపారానికి 'ఐ-రిపేర్'

ఈరోజుల్లో కాలేజీ విద్యార్థులే కాదు.. ప్రాథమిక తరగతులు చదువుకునే విద్యార్థులూ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే.. వారి వాడకం తీరు వల్ల కావచ్చు... లేదా, పరికరాల లోపం వల్ల కావచ్చు.. తరచూ పాడైపోతుంటాయి. వాటిని మరమ్మతు చేసే నమ్మకమైన వ్యక్తులు లేకపోవడంతో.. ఫోన్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇలాంటి వినియోగదారుల సమస్యలే వేదికగా.. సరికొత్త సంస్థ ఆవిష్కృతమైంది. ఆ వివరాలు ఇవిగో..!

1st Apr 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

2006వ సంవత్సరం మధ్యకాలంలో ఐపాడ్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. అప్పట్లో ఐఫోన్లు ఇంకా ఆవిష్కృతం కాలేదు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి హర్ష పి.జె. కూడా అప్పట్లో దుబాయ్ నుంచి ఒక ఐపాడ్ కొనుగోలు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ అతడు కొన్న ఐపాడ్ ఓ నాలుగైదు నెలలకే మొరాయించడం మొదలు పెట్టింది. దాన్ని మరమ్మతు చేయిద్దామని తీసుకువెళితే.. యాపిల్ స్టోర్స్ వాళ్ళు.. చాలా పెద్ద మొత్తాన్నే అడిగారు. “ ఆ దశలో.. ఐపాడ్ ను నేనే మరమ్మతు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఆ రకంగా నేను చేస్తున్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీకి కొంతైనా న్యాయం చేసినట్లు అవుతుందని అనిపించింది. అలా చేసిన తొలి ప్రయత్నం ఫలించింది” అంటారు హర్ష. అతను తన ఐపాడ్ మరమ్మతు చేసుకున్న విషయం ఆనోటా ఈనోటా.. సన్నిహితులకు చేరింది. అంతే.. వాళ్ళు కూడా సమస్యగా మారిన తమ ఐపాడ్ లను మరమ్మతు చేసిపెట్టమని హర్షను కోరేవారు. ఈ అనుభవంతో.. హర్ష, అప్పట్లో ఎంబిబిఎస్ చదువుతున్న తన మిత్రుడు అజయ్ హెగ్డేతో కలిసి ఓ బ్లాగ్ ను ప్రారంభించాడు.

image


ఇద్దరు మిత్రులూ చదువులను కొనసాగిస్తూనే.. వెబ్ సైట్ ద్వారా వచ్చే విజ్ఞప్తుల ఆధారంగా.. ఐపాడ్ లను మరమ్మతు చేయడం కొనసాగించారు. “ ఫోన్ ల మరమ్మతుల కోసం ఒక కాఫీ షాపు నుంచి మరొక షాపుకు వెళ్తూ ఉండేవాళ్ళం” అని అప్పట్లో తమ ఊపిరి సలపని పనితీరు గురించి వివరించారు హర్ష. వీరిద్దరూ ఐపాడ్ ను ఉన్న చోటనే.. కొద్ది క్షణాల్లోనే మరమ్మతు చేసే స్థాయిలో నైపుణ్యాన్ని సాధించారు. 2013లో తమకంటూ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేదాకా.. ఈ ఇద్దరు మిత్రులు ఇదే తరహాలో కస్టమర్ల వద్దకే వెళ్ళి.. ఐపాడ్ లను మరమ్మతులు చేసేవారు. “ కోరమంగళలో కార్యాలయాన్ని ప్రారంభించి మా సేవలను అందించడం మొదలు పెట్టాం. వినియోగదారులు కోరుకునే నాణ్యతా ప్రమాణాలతో మరమ్మతులను చేయడంతో మంచి పేరు వచ్చింది” అని తెలిపారు హర్ష.

ఐ-రిపేర్ అన్న పేరుతో వీరు ప్రారంభించిన కార్యాలయం మంచి పేరు సంపాదించింది. ఇద్దరితో ప్రారంభమైన కార్యాలయం.. అతి తక్కువ కాలంలోనే పది మంది ఉద్యోగుల స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం వీరి సేవలు బెంగళూరుతో పాటు, హైదరాబాద్, చెన్నై, మణిపాల్‌లలోని వినియోగదారులకూ అందుతున్నాయి. వీటితో పాటు ఆన్ లైన్ సేవలనూ మొదలుపెట్టారు. ఏదైనా ఒక ఉత్పత్తిని కొనుగోలు చేశాక, సమస్య వస్తే.. దాన్ని తీర్చేందుకు ఆయా సంస్థలు సరైన పద్ధతులను అనుసరించడం లేదు. దీన్ని మేము గుర్తించాము. అందుకే.. వినియోగదారులకు కొనుగోలు తర్వాతి సేవలు ఎంత అవసరమో చూపగలిగాము. యాపిల్ సంస్థ ఉత్పత్తుల వినియోగదారులకు మా సేవలు ఎంతగానో నచ్చాయి” అంటారు హర్ష. ఐ-రిపేర్ సంస్థ దాదాపు పదిహేను వేల మంది వినియోగదారులకు సేవలు అందించడం ద్వారా.. 2015లోనే సుమారు కోటి 20 లక్షల రూపాయల వార్షిక టర్నోవర్ ను సాధించింది. ఇప్పుడీ సంస్థ నాలుగైదు కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

image


మరమ్మతుల కోసం కచ్చితంగా విడి భాగాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, కొన్ని నెలల క్రితం సొంతంగా ఆన్ లైన్ స్టోర్ ని ప్రారంభించారు. బాబాజాబ్ లాంటి సేవాసంస్థల ద్వారా అవకాశాలు రావడం, హర్ష అజయ్ ల కృషికి తగిన ఫలితాలనిచ్చింది. హర్ష స్నేహితుడు, ఎంబీఏకి చెందిన సునీల్ గుప్తా కూడా వీరితో జతకలిశాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ స్టోర్ ను పర్యవేక్షిస్తున్నాడు. యాపిల్ ఉత్పత్తుల వాడకంలో తలెత్తే సమస్యలను మరమ్మతు చేయడం ద్వారా ఐ-రిపేర్ సంస్థ ప్రస్తుతం లాభాలబాటలో సాగుతోంది. స్టోర్ లలో సేవలతో పాటు.. వస్తువులను తీసుకు వచ్చి, మళ్ళీ వినియోగదారులకు చేర్చడం లాంటి సేవలనూ అందించాలని ఐ-రిపేర్ యోచిస్తోంది. తద్వారా పటిష్టమైన నెట్ వర్క్ ను రూపొందించాలని భావిస్తోంది. “ వచ్చే కొద్ది నెలల్లో మా సేవలను భారతదేశంతో పాటు.. విదేశాల్లోనూ వీలైనన్ని నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నాము” అని హర్ష తెలిపారు. అన్ని రకాల ఫోన్ ఉత్పత్తుల మరమ్మతుల కోసం ఆన్ సైట్ అనే మరో సంస్థనూ ప్రారంభించారు. పురోభివృద్ధి దిశగా సాగుతున్న మార్కెట్ లో.. అన్ని వస్తువులకు ఏదో సమయంలో కచ్చితంగా సర్వీసింగ్ అవసరం ఉంటుంది. ఇందులో తమ విశేష అనుభవం.. తమను సుదీర్ఘ కాలం పాటు నిలదొక్కుకునేలా చేస్తుందని ఐ-రిపేర్ సంస్థ భావిస్తోంది.

website

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India