సంకలనాలు
Telugu

ఈ ఇంజనీరుకు పేపరే ప్రపంచం ! అదే వ్యాపారం

స్కేల్ పేపర్ మోడలింగ్ తో ప్రసిద్ధుడువివిధ కంపెనీలకు కాగితపు నమూనాలుకాగితం, జిగురు,వైవిధ్యమైన ఇంజనీరింగే అతని పెట్టుబడిఐటి నిపుణుడైనా విభిన్న రంగంలో రాణిస్తున్న ఆత్మజీత్ సింగ్

team ys telugu
6th Apr 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మనిషి కల్పనా శక్తి ముందు ఏ శక్తి అయినా తలొగ్గాల్సిందే. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నారు.. అతంజీత్ సింగ్ బావా. ఢిల్లీకి చెందిన ఈ ఐటి దిగ్గజం.. సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ గా.. ఆఫీసులో, తన పని వేళలు ముగియగానే.. నేరుగా ఇంటికి చేరుకుంటాడు. తన గదిలోకి వెళ్ళి తలుపులకు తాళాలు వేస్తాడు.. అదే సమయంలో.. బంధించి ఉంచిన తన సృజనాత్మక శక్తికి స్వేచ్ఛను ప్రసాదిస్తాడు. వార్ హెడ్స్, స్పేస్ షటిల్స్ తయారీకి ఉద్యుక్తుడవుతాడు. ఆయన ఆయుధాగారంలో ఎయిర్ క్రాఫ్ట్స్, కాప్టర్స్, బైక్స్, నావలూ ఉన్నాయి. ఆగండాగండి.. అతణ్ణి గురించి తప్పుగానో.. మరో రకంగానో ఊహించుకోకండి. అసలు మనమెవరూ ఊహించలేని పరికరాలతో ఆయన ఈ నమూనాలను తయారు చేస్తారు. గోడౌన్ లా మారిపోయిన ఆయన పడకగదిలోకి తొంగి చూస్తే... అంతటా పేపర్లు, జిగురు డబ్బాలూ దర్శనమిస్తాయి. ఇప్పుడు అర్థమైందా..? ఆత్మజీత్ సింగ్ దేనితో వార్ హెడ్స్ రూపొందిస్తున్నారో..?


ఇది నిజంగా పేపర్ గ్రనేడ్ లాంచర్

ఇది నిజంగా పేపర్ గ్రనేడ్ లాంచర్


అవును నిజం. ఈ ఇంజనీర్ అచ్చంగా పేపర్లు, జిగురు ఉపయోగించి వార్ హెడ్ నమూనాలను తయారు చేస్తున్నారు. డిజైన్ల తయారీపై తనకున్న అమితాసక్తికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అతంజీత్ సింగ్ తయారు చేసిన వస్తువులు చూపరులను కళ్ళు తిప్పుకోనీయవు. ఒక్కసారి వాటిని చూస్తే చాలు.. వాటితో ప్రేమలో పడాల్సిందే. అలా ఉంటాయి ఆత్మజీత్ సింగ్ ఊహాజనితాలు.

ఓసారి 2004లోకి వెళితే.. అతంజీత్ టెక్స్ టైల్ కెమిస్ట్రీ సబ్జెక్టుతో బిటెక్ చదివేవాడు. అప్పుడే.. తన సృజనకు పదును పెట్టడం మొదలు పెట్టాడు. నిజానికి చిన్ననాటి నుంచే.. జామెట్రీ మెళకువలను విభిన్నంగా ప్రయోగించాలని తపించేవాడు. అయితే.. ఇంజనీరింగ్ లో అతడికి ఆ అవకాశం లభించింది. తను చేస్తున్న కోర్సులో డ్రాయింగ్ నైపుణ్యం కలిసి వచ్చింది. అప్పుడే పేపర్ ను ఉపయోగించి విమానాన్ని రూపొందించాడు.“నెల్లాళ్ల పాటు విపరీతంగా శ్రమించాక, నా తొలి పేపర్ నమూనా సిద్ధమైంది. ఆరోజు నుంచి నేను వెనుదిరిగి చూడలేదు. దాదాపు 27 విభిన్న వస్తువుల నమూనాలను తయారు చేస్తున్నాను. ఈ కృషి ఇప్పటికీ కొనసాగుతోంది” అని తన కృషిని గురించి వివరించాడు ఆత్మజీత్ సింగ్.


ఇది కూడా పేపర్ తో తయారైందంటే నమ్మాల్సిందే !

ఇది కూడా పేపర్ తో తయారైందంటే నమ్మాల్సిందే !


స్కేల్ పేపర్ మాడలింగ్ అంటే..?

ఇది పూర్తిగా కాగితపు అలంకరణ పద్ధతి కాదు. అలాగని ఇందులో కాగితపు గుజ్జూ ఉండదు. ఇది పూర్తిగా కాగితాన్ని కత్తిరించి, జిగురు ద్వారా అతికించే విధానం. అని వివరించారు అతంజీత్ జింగ్. వీటిని తయారు చేసేందుకు అతంజీత్ కు దాదాపు 70 నుంచి 400 గంటలు పట్టింది.“బైక్ తయారు చేసేందుకు నాకు నాలుగు నుంచి ఐదు నెలల కాలం పట్టింది. దీనిపై ప్రతిరోజూ రెండు లేదా మూడు గంటల పాటు శ్రమించేవాణ్ణి. మరోవైపు, ఆర్పీజీ నమూనా రూపకల్పనకు కేవలం రెండు వారాలే పట్టింది. దీనికోసం, రోజుకి ఐదు గంటల పాటు పనిచేశాను” అని వివరించారు ఆత్మజీత్ సింగ్. ఈ నమూనాలను చూస్తే.. అతడు పడ్డ శ్రమ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

హాబీ తొలిరోజుల్లో...

తాను చేసిన నమూనాలను స్నేహితులు, బంధువులకు పంపినప్పుడు, వారినుంచి లెక్కకు మిక్కిలిగా ప్రశంసలు.. మరెన్నో సూచనలూ అందేవి. అదే సమయంలో అమెరికాకు చెందిన వారికి ఇతడి కృషి గురించి తెలిసింది. వారిలో కొందరి సూచనలు ఆత్మజీత్ సింగ్ కు ఎంతగానో ఉపకరించాయి. అయితే.. అదే సమయంలో, ఇతడి తల్లిదండ్రుల్లో కుమారుడి భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళన వ్యక్తమయ్యేది. “తొలి రోజుల్లో నేను గదిలో అన్నేసి గంటలు.. అలసట లేకుండా... ఈ నమూనాలను తయారు చేస్తూ ఎందుకు గడుపుతున్నానో వారికి పెద్దగా అవగాహన ఉండేది కాదు. అయితే.. ఎప్పుడైతే నాకు గుర్తింపు రావడం మొదలు పెట్టిందో.. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. 2005వ సంవత్సరానికి నాకు.. అత్యంత ప్రముఖ కళాకారుల జాబితాలో తొమ్మిదో స్థానం నాకు దక్కింది. ఆపోటీలో సుమారు నలభై వేల మంది పాల్గొన్నారు. ఈ పురస్కారం రావడంతో.. నేను సమయాన్ని వృథా చేయడం లేదని, నేనేం చేస్తున్నానో సరైన అవగాహనతోనే చేస్తున్నానని నా తల్లిదండ్రులు నమ్మడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నా కృషికి మద్దతునివ్వడం మొదలు పెట్టారు” అని గుర్తు చేసుకుంటారు అతంజీత్. ఇప్పుడు అతంజీత్ కు స్నేహితులు, కుటుంబ సభ్యులే అతి పెద్ద మద్దతుదారులు. చాలా సందర్భాల్లో వారు ఆత్మజీత్ సింగ్ గురించి గర్వంవ్యక్తం చేస్తుంటారు.


అవునండీ ఇది కూడా కాగితపు రైలే !

అవునండీ ఇది కూడా కాగితపు రైలే !


వ్యాపార రంగంలోకి అడుగు :

తన ఉత్పత్తులను ఆటో ఎక్స్పో లో గానీ, ఎగ్జిబిషన్ లో గానీ ఎక్కడ ప్రదర్శించినా అతంజీత్ సింగ్ పై ప్రశంసల జల్లు కురిసేది. దీంతో.. తన సృజనాత్మక శక్తిని వ్యాపారం వైపు మళ్ళించాలని నిర్ణయించుకున్నాడు. తనలోని నిరంతర శ్రమ, విభిన్నమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకుని, తన ఉత్పత్తుల ఆధారంగా ధనాన్ని సంపాదించాలనుకున్నాడు. ఆ విధంగా, తన విలువైన కస్టమర్లకు వినూత్న రీతిలో చేసి ఇచ్చే ఎన్నో రకాల ఉత్పత్తులు.. వారి షోకేసుల్లో అందంగా అమిరేవి. “ ఎవరైనా కాగితాన్ని ఉపయోగించి తమ బైక్ ను తయారు చేసి ఇమ్మని అన్నారనుకోండి.. దానికి నేను చేసేదేంటి..? కేవలం కాగితం, జిగురు ఉపయోగించి, వినూత్న నమూనాను తయారు చేయడమే” అంటాడు అతంజీత్ సింగ్. అతడికి ఇంకా కొన్ని ఆలోచనలున్నాయి. ”టొయోటా సంస్థ కొత్త కారును ఆవిష్కరించాలని అనుకుంటుందనుకోండి. నేను ఆ కారు నమూనాను తయారు చేసి ఇస్తాను. దాన్ని ఆవిష్కార కార్యక్రమంలో.. షోకేసులో అందంగా అమర్చడం ద్వారా.. తన కస్టమర్లకు మంచి సందేశాన్ని అందించవచ్చు” అంటారాయన. తన ఉత్పత్తుల బలాలేంటి అన్న ప్రశ్నకు, చేతితో చేసినవి, తేలికైనవి, అత్యంత విభిన్నమైనవి కావడమే తన ఉత్పత్తుల అమ్మకాలకు దోహదం చేస్తాయని చెబుతారు.

సవాళ్ళు :

చాలామంది మాదిరిగానే.. అతంజీత్ సింగ్ కూడా కొన్ని అవరోధాలను ఎదుర్కొన్నాడు. “నాకు పూర్తినిడివి ఉద్యోగం ఉంది. నాకు మంచి మంచి నమూనాలు తయారు చేయడానికి అస్సలు సమయమే కుదిరేది కాదు. నా దగ్గరనుంచి ప్రజలు కచ్చితంగా కొంటారన్న భరోసా ఉంటే తప్ప నేను ఉద్యోగాన్ని వదలలేను”అంటారు అతంజీత్. ఇతడికి ఎదురైన మరో సమస్య ఏంటంటే... తన ఉత్పత్తుల రవాణా. చాలా సున్నితంగా ఉండడంతో.. వాటిని ప్రత్యేకంగా గాజు పలకల మధ్య భద్రంగా ఉంచి కస్టమర్లకు చేర్చాల్సి ఉంటుంది. “ నా ఉత్పత్తులను చూడగానే ప్రజలు వాటినిఇష్టపడతారు. అయితే, ఎప్పుడైతే వాటిని తాకి, దాని తేలిక బరువును గుర్తిస్తారో.. వారి మనోభావాలు మారిపోతున్నాయి. అందుకే.. వాటిని చూడ్డంతో పాటు.. కొనేందుకు ఇష్టపడే కస్టమర్ల కోసం చూస్తున్నాను. అని వివరిస్తారు.

అతంజీత్ సింగ్, జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు. ఆటలో ఎప్పుడూ విజేతగానే నిలిచేవాడు. గిటార్ నేర్చుకుంటున్నాడు. ఇవి ఎన్ని ఉన్నా.. పైలెట్ కావాలన్నది ఆయన కోరిక. “నేను పుట్టుకతోనే విమానమంటే అమితాసక్తి కల వాడిని. ఇప్పటికీ విమానం వెళుతుంటే.. దాన్ని చూడకుండా ఉండలేను. ఎప్పుడు అవకాశం దొరికినా, 8వ నంబరు జాతీయ రహదారి నుంచి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రన్ వే వైపు చూస్తుంటాను. విమానాల్లో వచ్చేవారికి దూరం నుంచే స్వాగతాన్ని.. వెళ్ళేవారికి వీడ్కోలునూ పలుకుతుంటాను” అని విమానాలపై తన మక్కువను వివరించారు ఆత్మజీత్ సింగ్.


తన నమూనాతో ఆత్మజీత్ సింగ్ బావా

తన నమూనాతో ఆత్మజీత్ సింగ్ బావా


అతంజీత్ రూపొందించిన ఆర్పీజీ నమూనా, త్వరలోనే రానున్న ది వైరల్ ఫీవర్ విడియోలో కనిపించనుంది. “నేనిప్పటికీ పైలెట్ అయినట్లే కలలు కంటుంటాను. నా రన్ వేపై జాన్ ట్రావోల్టా తరహాలో నేను విమానాన్ని నడుపుతున్నట్లు ఊహల్లో తేలిపోతుంటాను...'' అంటూ వివరించాడు. అతంజీత్. ఏదో ఒకరోజు కచ్చితంగా ఆత్మజీత్ సింగ్ ది అవుతుంది. ఏమంటారు..?

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags