సంకలనాలు
Telugu

ఆటోవాలాను ఆన్‌లైన్ బాటపట్టించిన 'ఆటో ఎన్ క్యాబ్'

యాప్ ద్వారా సేవలందిస్తున్న ఆటో ఎన్ క్యాబ్గుర్గావ్‌లో రోజుకు వెయ్యిమందిని గమ్యస్థానానికి చేరుస్తున్న సంస్థప్రయాణికులను, డ్రైవర్లను యాప్ ద్వారా అనుసంధానంఈ యాప్ ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్న డ్రైవర్లు

r k
3rd Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

దేశంలో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యాలు కూడా పెరుగుతున్నాయి. ప్రజలను ఒక చోటు నుంచి మరో చోటుకు చేర్చేందుకు ఎన్నో రవాణా మార్గాలున్నాయి. రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు.. ఇలా ఎన్నో ఉన్నప్పటికీ, పేదవాడి వాహనం మాత్రం ఆటోనే. చాలామంది మధ్య తరగతి ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఆటోలనే ఉపయోగిస్తారు. ఐతే మార్నింగ్ రష్ అవర్స్‌లో ఆటో దొరకడం అంత సులభం కాదు. ఒకవేళ ఆటో దొరికినా మీటర్‌పై ఎంతో కొంత అదనంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది.

వినతి దోషి తన కూతురిని ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద దించేందుకు వెళుతూ ఓ విషయాన్ని గుర్తించారు. మహిళ భద్రత, రక్షణ విషయాల్లో ప్రజా రవాణా వ్యవస్థ గుర్గావ్‌లో అంత సురక్షితం కాదని ఆమె గ్రహించారు. దీంతో ఆటోలను స్మార్ట్‌ఫోన్ల ద్వారా క్రమబద్ధీకరిస్తే ఎలా ఉంటుందన్న అంశం ఆమె మదిలో మెదిలింది.

దేశంలో చాలామంది సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా అసంఘటిత రంగానికి చెందిన ఆటోలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఎంతో మందికి ఈ ఆటోల ద్వారా జీవనోపాధి కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లను, సాధారణ ప్రయాణికులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే యాప్‌ను ఆటో ఎన్ క్యాబ్ రూపొందించింది.

ఆటో ఎన్ క్యాబ్ ఆటో ఇదే

ఆటో ఎన్ క్యాబ్ ఆటో ఇదే


ఆటో డ్రైవర్లు, ప్రయాణికుల డిమాండ్లు, అవసరాలు తీర్చేందుకు ఆటో ఎన్ క్యాబ్ సహకరిస్తుందని వినితి తెలిపారు. ‘ఆటో అంటే కేవలం ప్రయాణించేందుకు వీలున్న మరో వాహనం మాత్రమే కాదు. ఇదో రకమైన జీవనోపాధి. ఆటో డ్రయివర్లకు ఇది పెద్ద వ్యాపారం కూడా’’ అంటారు వినితి. ప్రయాణికులను వారు కోరుకున్నచోటికి సురక్షితంగా చేర్చడమే కాకుండా, ఆటో డ్రైవర్లు తమ సమయాన్ని, లభ్యతను మరింత పెంచేలా ఆటో ఎన్ క్యాబ్ టీమ్ చూసుకుంటుంది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం ద్వారా లభిస్తున్న ఆదాయానికి తోడు సరుకుల రవాణా ద్వారా ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేలా చూస్తుంది. ఈ టీమ్ వివిధ భాషల్లో యాప్‌ను రూపొందించే ప్రయత్నాల్లో ఉంది.

రవాణా రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆలోక్ సవానీతో కలిసి జీపీఎస్ ఆధారిత ఆటో రిక్షా ప్లాట్‌ఫామ్‌ను వినితి రూపొందించారు. ఈ సంస్థలో అమెరికాకు చెందిన సూరెన్ కూడా త్వరలోనే చేరనున్నారు.

మంచి నమ్మకం

ఆటో ఎన్ క్యాబ్ సెప్టెంబర్ 2014 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తమ యాప్‌ను 15 వేలకు మందికిపైగా కస్టమర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని సంస్థ అంటోంది. రోజు వెయ్యికిపైగా రికార్డు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో 90 శాతం మంది పాత కస్టమర్లే కావడం విశేషం. ఇక 700మంది డ్రైవర్లు ఈ యాప్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. సంస్థ మాత్రం 500 డ్రైవర్లతో సర్వీసులను అందిస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, సూపర్ మార్కెట్ చైన్స్, ఇతర ఔట్‌లెట్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రోజుకు 100కు పైగా డెలివరీలను కూడా చేస్తోందీ ఆటో ఎన్ క్యాబ్. గతంలో ఈ సంస్థలో ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, తాజాగా మరో సంస్థ నాలుగు లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రతి ట్రిప్‌కు డ్రైవర్ నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది ఆటో ఎన్ క్యాబ్.

ఆటో ఎన్ క్యాబ్‌తో ఆటో డ్రైవర్

ఆటో ఎన్ క్యాబ్‌తో ఆటో డ్రైవర్


మార్కెట్

దేశంలో రవాణా రంగంలో ఆటో మార్కెట్ చాలా పెద్దది. 20 లక్షలకు పైగా ఆటోలు దేశవ్యాప్తంగా తిరుగుతున్నయి. ఆటో ఎన్ క్యాబ్ మాదిరిగానే ఓలా, ఆటోవాలే కూడా యాప్ ద్వారా ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.

‘‘దేశవ్యాప్తంగా మొత్తం మార్కెట్ సైజ్ 12 బిలియన్ డాలర్లు. ఇందులో పది శాతాన్ని సొంతం చేసుకున్నా మంచి ఆదాయమే వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సంస్థ కూడా పూర్తిగా మార్కెట్‌ను సొంతం చేసుకోలేదు. అందరికీ అవకాశాలు సమానంగానే ఉన్నాయి. ఈ రంగంలో ఎంతోమందికి ఇంకా స్పేస్ ఉంది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న ఈ రంగంలో మొదటగా ప్రవేశించిన కారణంగా మాకు అదనపు ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటున్నాం. మా స్టేక్ హోల్డర్లతో మంచి సంబంధాలు నెలకొల్పడమే మా బిజినెస్ మోడల్’’ అని వినితి తెలిపారు.

మరిన్ని నగరాలకు విస్తరణ

ప్రస్తుతం గుర్గావ్‌కే పరిమితమైన ఆటో ఎన్ క్యాబ్ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించాలని భావిస్తున్నారు. అలాగే సరుకుల డెలివరీ రంగంపైనా ఈ సంస్థ ద్రుష్టిసారించింది. మరిన్ని సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నది. క్యాబ్‌ల మాదిరిగానే ఆటో రంగంలో కూడా యాప్ ద్వారా ప్రయాణికులకు సేవలందించాలనుకుంటున్న ఆటో ఎన్ క్యాబ్ మరింతగా సక్సెస్ కావాలని కోరుకుందాం..

Website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags