సంకలనాలు
Telugu

యూజ్డ్ బైక్‌ కొనే వాళ్ల కష్టాలు తీరుస్తున్న 'బైకర్స్ హైవే'

వాడేసిన బైకులకు వారంటీఇంటి దగ్గరే టెస్ట్ రైడ్డోర్ స్టెప్ ఫ్రీ సర్వీసులు వాహనాలు ముందే కొనేసి, సర్వీసు చేసి విక్రయిస్తున్న బైకర్స్‌హైవే.ఇన్

team ys telugu
22nd Apr 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

సెకండ్ హ్యాండ్ బైక్ కోసం వెతుకులాటే గృహిణిగా ఉన్న చిత్రా బెనర్జీని ఓ సంస్థ వ్యవస్థాపకురాలిని మార్చింది. తన భార్య సాధించిన విజయాలను వికాస్ కుమార్ బెనర్జీ యువర్ స్టోరీతో పంచుకున్నారు. నార్త్ ఒరిస్సా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన చిత్రా బెనర్జీ.. పెళ్లి తర్వాత కుటుంబాన్ని చూసుకుంటూ ఉండిపోయారు. ఇప్పుడామె సొంతగా వెంచర్ ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు.

చిత్రా బెనర్జీ ప్రారంభించిన వెంచర్.. 2013లో ఓ ఉదయం కాఫీ తాగుతున్నపుడు పిచ్చాపాటీగా మాట్లాడుకున్న మాటల నుంచి పుట్టింది. ఓ అమ్మాయి ఎవరైనా సెకండ్ హ్యాండ్ టూవీలర్ కొనుగోలు చేయడం ఎంత కష్టమో అప్పుడు వాళ్లు చర్చించుకున్నారు. ఇప్పుడు బైకర్స్‌హైవే.ఇన్ పేరుతో... మల్టీ బ్రాండ్ సర్టిఫైట్ యూజ్డ్‌ టూవీలర్ షోరూంను.. ఆన్‌లైన్‌లో నడుపుతున్నారామె.

" కూరగాయలని కూడా జనాలు ఆన్‌లైన్‌లో కొంటున్న రోజులివి. మన దేశంలో సెకండ్ హ్యాండ్ టూవీలర్ మార్కెట్ ఇంకా అసంఘటిత రంగంగానే ఉంది. దీంతో యూజ్‌డ్ వెహికల్స్‌ని కొనడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారంటీ, ఇంటి దగ్గరే ఫ్రీ సర్వీసులు వంటి సేవలతో సర్టిఫైడ్ టూవీలర్స్‌ని ఆన్‌లైన్‌లో విక్రయించాలని భావించాం. అదే బైకర్స్‌హైవే"అంటారు చిత్ర. 
చిత్ర,వికాస్ కుమార్ బెనర్జీ,  బైకర్స్ హైవే ఫౌండర్స్

చిత్ర,వికాస్ కుమార్ బెనర్జీ, బైకర్స్ హైవే ఫౌండర్స్


సమస్యలపై కూలంకషంగా చర్చించి, వీలైనంతగా ఆ రంగాన్ని పరిశీలించాక.. పూనేలో సర్వీసులు ప్రారంభించారు. " యూజ్‌డ్ కార్స్ విభాగంలో మంచి క్వాలిటీ, ఉచిత వారంటీ, సర్వీసు అందించే సంస్థ పూనేలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నవంబర్ 2013-నవంబర్ 2014మధ్య మేం 426 ద్విచక్ర వాహనాలు విక్రయించగలగడానికి ఇదే ప్రధాన కారణమం"టారు చిత్ర.

  • 1. చాలా మంది ప్రజలు సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఓఎల్ఎక్స్, క్వికర్, బైక్‌వాలే వంటి సైట్లనే విజిట్ చేస్తారు.
  • 2. ఆ తర్వాత వ్యక్తులనో, డీలర్లనో సంప్రదించి ఆ వాహనం డీటైల్స్ అడుగుతారు.
  • 3. అంటే ప్రతీ వెహికల్ చూడ్డానికి వాళ్లు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
  • 4. వ్యక్తులు, లోకల్ డీలర్లు యూజ్డ్‌ టూవీలర్లు అమ్మినా... తర్వాత ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో ఎవరికీ తెలీదు. కారణం వాటికి వారంటీ కానీ, సర్వీస్‌లు కానీ ఉండవు.

ఈ సమస్యలకు పరిష్కారం కనుగొన్న చిత్ర, వికాస్‌లు.. మొత్తం 10మంది టీంతో సొంత వెంచర్ నడుపుతున్నారు.

"బైకర్స్ హైవే నుంచి వాహనాలు కొనుగోలు చేసినందుకు ప్రజలు గర్వంగా ఫీలవ్వాలి. ముందు కస్టమర్‌కి ధైర్యం కలిగించాలి. అన్ని చెకప్‌లు ముందుగానే చేసిన, మంచి క్వాలిటీతో, వారంటీ-ఉచిత సర్వీసులు గల సెకండ్ హ్యాండ్ బైక్స్ లభించడమంటే మాటలా" అంటారు చిత్ర. కస్టమర్ల ఇంటి దగ్గరే టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని బైకర్స్ హైవే కల్పించడం విశేషం. ఒక వాహనం ఎలా ఉందో చెక్ చేసుకునేందుకు కొనుగోలుదారులు ఎక్కువ దూరం ప్రయాణించకుండా చూడ్డమే మా ఉద్దేశ్యమంటోంది బైకర్స్ హైవే.

ప్రారంభంలో ఇతరుల వాహనాలను వారంటీతో విక్రయించే ఏజెంట్‌గానే కార్యకలాపాలను ప్రారంభించిందీ సంస్థ. కానీ ఇది అంత లాభసాటిగా కనిపించలేదు. అందుకే ముందు వాహనదారుల నుంచి వారే బైక్స్ కొనుగోలు చేసి.. వాటిని సర్వీస్ చేసి అమ్మడం ప్రారంభించారు. ఈ సర్వీసులను బయట చేయించడంతో ఖర్చు ఎక్కువగా అయ్యేది. అందుకే వీరిద్దరూ డిసెంబర్ 2014లో సొంత సర్వీస్ సెంటర్ ప్రారంభించారు.

"మేం దాచుకున్న డబ్బులతో సొంతగానే ఈ వెంచర్ ప్రారంభించాం. రూ.3 లక్షలతోనే మా సంస్థ ప్రారంభమైనా.. ఆ తర్వాత మరింతగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చి, మొత్తం రూ. 20 లక్షలకు చేరింది"- వికాస్ బెనర్జీ. ఈ సంస్థపై నమ్మకం కలిగిన ఓ హెచ్ఎన్ఐ(హై నెట్వర్త్ ఇండివిడ్యువల్) రూ. 50 లక్షలను పెట్టుబడిగా అందించేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత విస్తరణ కోసం మరిన్ని నిధులు సేకరించే యోచన కూడా ఉందంటోంది బైకర్స్‌హైవే.

వాహన రంగ ప్రకటనల రూపంలో జిగ్‌వీల్స్, కార్‌వాలే, క్సార్‌ట్రేడ్ వంటి సంస్థలనుంచి పోటీ ఎక్కువగానే ఉంటోంది. అయితే వీరందరూ కేవలం కార్లపైనే దృష్టిపెట్టారు. అయితే ఓఎల్ఎక్స్, క్వికర్ వంటి సంస్థలూ ఉచిత క్లాసిఫైడ్‌ల పేరుతో గట్టిపోటీనే ఇస్తున్నాయి. అయినా సరే మొక్కవోని పట్టుదలతో చిత్రా, వికాస్ బెనర్జీ దంపతులు విజయవంతంగా వ్యాపారం నడుపుతున్నారు. ఇప్పుడు వాళ్ల దగ్గర వాహనాలు కొనుగోలు చేసే ఏజంట్లు, కాల్ సెంటర్ వ్యక్యులు, టెక్నీషియన్లు పని చేస్తున్నారు. బైకర్స్‌హైవే ప్రస్తుతానికి పూనేలోనే సేవలందిస్తున్నా.. బ్రేక్ ఈవెన్‌కి చేరాక ముంబై, బెంగుళూరులకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండడం విశేషం.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags