సంకలనాలు
Telugu

తెలుగు వంటకాలతో నోరూరిస్తున్న మీల్ బాయ్స్

ashok patnaik
21st May 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


హైదరాబాద్ కేంద్రంగా గతేడాది ప్రారంభమైన ఫుడ్ స్టార్టప్ మీల్ బాయ్స్. సాంప్రదాయ వంటకాలతో పాటు హైదరాబాదీ బిర్యానీ రుచులను అందిస్తూ భోజన ప్రియులకు నోరూరిస్తోంది. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ ఆర్డర్లతో సేవలందిస్తోన్న ఈ స్టార్టప్ మరిన్ని ఔట్ లెట్లను విస్తరించాలని ప్రణాళిక చేస్తోంది.

ఇది మొదలు

కుకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మీల్ బాయ్స్ అంటూ కొంతమంది కుర్రాళ్లు బైక్స్ పై కనిపిస్తుంటారు. అయితే వీరు కాలనీలోకి రాక ముందు ఇక్కడ స్టోర్ మొదలైంది. దీనికంటే ముందు ఒక ఫుడ్ స్టార్టప్ షట్ డౌన్ అయింది. సస్టేయినబుల్ మోడల్ లేకపోవడం వల్ల దాన్ని మూసేయాల్సి వచ్చిందని దీని కో ఫౌండర్ అంజన్ రెడ్డి చెప్పారు.

“ఒక ఫెయిల్యూర్ తర్వాత, మరింత క్షుణ్నంగా మార్కెట్ తెలుసుకున్నాం-” అంజన్

ప్రస్తుతం హైదరాబాద్ లో రెండు బ్రాంచీలున్నాయి. సాంప్రదాయ మీల్స్ తో పాటు బిర్యానీలకు ఫేమస్ అని అంటారాయన. తెలుగువారి ముద్దపప్పు, పప్పుచారు, గోంగూర చికెన్, ఇతర రుచికరమైన వంటలకోసం తమని సంప్రదించాలని చెప్పుకొచ్చారు. వారానికి 500 నుంచి 600 మీల్స్ ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. వారాంతంలో ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. జనవరిలో ప్రారంభమైన వీరి స్టారప్ ఊహించిన దానికంటే బాగానే గ్రోత్ అయిందని అన్నారు.

స్పెషల్ మీల్ ప్యాకింగ్

సాధారణంగా మీల్స్ ప్యాకెట్ అంటే ఓ ఫాలిథిన్ కవర్లో, మరికొన్ని కవర్లు అనే ఇమేజినేషన్ వస్తుంది. పిజ్జా అంటే బాక్స్ ప్యాక్ గుర్తొస్తుంది. పిజ్జా అంత స్టైలిష్ బాక్స్ లోనే ప్యాక్ చేసి మీల్స్ అందించడం తమ ప్రత్యేకత అంటున్నారు అంజన్.

image


“జర్నీలో కూడా మా ప్యాక్ విప్పి తినేసేంత సౌకర్యవంతంగా ఉంటుంది,” అంజన్

మీల్స్ తెస్తే వాటిని విప్పి వేరే ప్లేట్లో తినే అవసరం లేకుండా బాక్స్ లోనే తిసేసే సౌకర్యం అందిస్తున్నారు. ఒకసారి మీల్స్ ఆర్డర్ ఇస్తే తిరిగి మరోసారి చేయడానికి ఇదే కారణమని అంటున్నారాయన.

మీల్ బాయ్స్ టీం

మీల్ బాయ్స్ కి ఇద్దరు కో ఫౌండర్లున్నారు. ఎన్నారై అయినా భార్గవ్ దీని కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ లో స్టార్టప్ కల్చర్ బాగా వ్యాపిస్తుండటంతో అంజన్ తో కలసి దీన్ని ఈ ఏడాదే ప్రారంభించారు. సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న భార్గవ్ దీనికి పూర్తి ఫైనాన్సియల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీని మేనేజింగ్ బాధ్యతలు చూస్తుంది మాత్రం అంజన్. హారిక వర్మ, సాయి రాజేష్ లు స్టార్టప్ కి డైరెక్టర్లుగా ఉన్నారు. హోం మేకర్ అయిన హారిక కిచెన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. సాయి దీనికి పూర్తిగా టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నారు. డెలివరీ బాయ్స్, మేనేజర్లు కలిపి మొత్తం 24మంది ఈ స్టార్టప్ లో పనిచేస్తున్నారు.

image


ప్రధాన సవాళ్లు

1.లాజిస్టిక్స్ ప్రధాన సవాలని అంటున్నారు అంజన్. స్విగ్గీ లాంటి డెలివరీ స్టార్టప్ లతో టై అప్ అవుతున్నాం. ఈ రకంగా దీన్ని అధిగమిస్తున్నామని చెప్పుకొచ్చారు.

2.ఇన్ టైంలో డెలివరీ అనేది మరో సవాలని అంటున్నారు. దీన్ని అధిగమించాల్సి ఉందని అన్నారాయన.

3. 40శాతం ఆన్ లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. వీటిని మరింత పెంచాల్సి ఉంది. ఆఫ్ లైన్ టేకవేలు బాగానే ఉన్నాయి. ఆన్ లైన్ కస్టమర్లను ఎంగేజ్ చేయడం మరో టాస్క్ అని అంటున్నారు.

ఫండింగ్, భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం ట్రావెల్ ఏజెన్సీలతో టై అప్ అవుతున్నాం. జర్నీచేసే ప్యాసెంజర్లకు ఫుడ్ సప్లై చేయడం లాంటి సర్వీసు ఇంప్లుమెంట్ చేస్తున్నామని అంజన్ చెప్పుకొచ్చారు. దీంతోపాటు మరో 3నెలల్లో మరో రెండు చోట్ల సేవలను ప్రారంభించనున్నామని అన్నారు. వచ్చే ఏడాది కల్లా బెంగళూరు, పుణెల్లో ఆపరేషన్స్ ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకున్నామన్నారు.

ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి 30 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఈ స్టార్టప్ కి భార్గవ్ ఫైనాన్సియల్ సపోర్ట్ అందించారు. బ్రేకీవెన్ దాటి లాభాల్లో నడుస్తోన్న ఈ స్టార్టప్ మరో మూడు నెల్లో సిరీస్ ఏ ఫండింగ్ కు సిద్ధంగా ఉన్నట్లు అంజన్ చెప్పారు.

image


website

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags