లక్షల పేర్ల నుంచి మనకేం కావాలో చెప్పేసే 'నేమ్ మై వరల్డ్'

By ABDUL SAMAD|17th Jun 2015
దూసుకుపోతున్న కొత్త యాప్ ‘నేమ్ మై వరల్డ్’ఈ యాప్‌తో క్షణాల్లో మీ పిల్లలకు పేర్లు పెట్టెయ్యచ్చుపేర్లు కోసం తడుముకోవాల్సిన పనేలేదుజస్ట్ క్లిక్ చేయండి... నచ్చిన పేరు సెలెక్ట్ చేసుకోండి
Clap Icon0 claps
  • +0
    Clap Icon
Share on
close
Clap Icon0 claps
  • +0
    Clap Icon
Share on
close
Share on
close
image


ఆర్మీలో పనిచేసేవారి సైనికులు అప్పడప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఒంటరితనంతో, మనస్ఫూర్తిగా పనిచేయలేకపోతుంటారు. ఎందుకంటే వారికి పేర్లుండవు. ట్రైనింగ్‌లో ఉండగా వారికి నెంబర్లు మాత్రమే ఇస్తారు. ఎవరు ఎవరిని పిలవాలన్నా ఆ నెంబర్లే గతి. క్రమశిక్షణ తప్పకుండా ట్రైనింగ్ ఉంటుంది.

మనం పుట్టాక మనకంటూ ఓ ఐడెంటిటీ ఇవ్వడం అంటే మనకు పేరు పెట్టడమే. జన్మనిచ్చాక తల్లిదండ్రులు మొట్టమొదటిసారిగా మనకిచ్చే మరపురాని బహుమతి అది. మన వ్యక్తిత్వానికి అది మొట్టమొదటి సంకేతం. అన్నప్రాసన చేయించి మనచేత పెన్ను, పుస్తకం పట్టిస్తారు. పేరును రాయిస్తారు. దీంతో ఆ నామకరణం తంతు ముగుస్తుంది. అంతా ఆనందంతో పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడతారు. అమ్మాయైనా, అబ్బాయి అయినా జరిగే తంతు ఇదే. పిల్ల/పిల్లాడు పుట్టాక జరిగే పెద్ద తంతు ఇదే.

పిల్లలకు పేర్లు పెట్టడంలో ఇబ్బందులను దూరం చేస్తోంది ‘NameMyWorld’ యాప్. మైండ్ స్పార్క్స్ ఫౌండర్ విజయ్ ఖుబ్ చందానీ ఈ యాప్‌ని అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని బటన్ క్లిక్ చేస్తే ఆల్ఫా బెటికల్ ఆర్డర్‌లో మన పిల్లలకు కావల్సిన పేర్లు అందుబాటులోకి వస్తాయి. అందులోంచి మనకు నచ్చిన పేరును సెలెక్ట్ చేసుకోవచ్చు.

నేమ్‌ మై వరల్డ్ యాప్

ఈ యాప్‌తో పిల్లలకు పేర్లు వెతకడం చాలా ఈజీ. ఎందుకంటే న్యూమరాలజీ, అక్షరాలను బట్టి అన్ని విధాలుగా సరిపడే పేరును సెలక్ట్ చేసుకోవచ్చు. పుట్టిన తేదీకి అనుగుణంగా ఎలాంటి అక్షరాలు సరిపోతాయో అవి సూచిస్తారు. అందుబాటులో ఉన్న పేర్లు, వాటికి వినియోగదారులు ఇచ్చే రేటింగ్స్‌ను కూడా వివరిస్తారు. రేటింగ్‌ను బట్టి తల్లిదండ్రులు పిల్లల పేర్లను అంచనా వేసుకోవచ్చు. ఎక్కువగా ఎలాంటి పేర్లు పెడుతున్నారో ఓ అంచనాకి రావచ్చు.

కొత్తగా పిల్లలు పుట్టిన వారు నేమ్‌మై వరల్డ్ యాప్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రోఫైల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. పిల్ల/పిల్లాడి వివరాలు అందులో పూర్తిచేసి పిల్లల పేర్ల లిస్టుపై క్లిక్ చేస్తే పేర్లు మనముందుకి వస్తాయి. పర్సంటేజిని బట్టి మంచి పంచ్ ఉన్న పేర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. టాప్ నేమ్స్ ఏమున్నాయో తెలుసుకుని దాని ప్రకారం ముందుకి వెళ్ళవచ్చు. యాప్‌లో పర్సంటేజీ కూడా అందుబాటులో ఉంటుంది. బెస్ట్, గుడ్, యావరేజ్, క్రిటికల్ రేంజ్‌లు ఉంటాయి. తల్లిదండ్రులు ఎవరికి వారు తమ అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు.


విజయ్ ఖుబ్‌చందానీ

విజయ్ ఖుబ్‌చందానీ


ముంబైకి చెందిన విజయ్ ఖుబ్‌చందానీ ఔత్సాహిక పారిశ్రామికవేత్త. సమయం, సందర్భాలను బట్టి ఆయన తన బిజినెస్‌లను ప్రారంభిస్తుంటారు. మార్ట్‌గేజ్‌ లోన్ కన్సల్టెన్సీని 2005 లో ప్రారంభించారు ఖుబ్‌చందానీ. ప్రారంభించిన 3 ఏళ్ళలోనే మంచి వృద్ధిలోకి వచ్చింది కంపెనీ. సిటీ బ్యాంకు ఏజెన్సీగా 3 ఏళ్ళలోనే 100 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇంతకుముందున్న రికార్డుల్ని బద్దలు కొట్టారాయన. ఆరేళ్ళపాటు ఇదే కన్సల్టెన్సీ నడిపారు. జీవితం బోర్‌గా అనిపించింది. ఏదో కొత్తదనం కోసం ఆయన పరితపించారు. ఆన్‌లైన్‌లో లోన్‌లు అందించేందుకు మనీలియో డాట్‌కామ్ ప్రారంభించారు. దీని ద్వారా రుణాలు కావాలనుకునేవారికి ఏ ఏ బ్యాంకులు ఎలాంటి రుణాలు అందిస్తున్నాయో, వాటి వడ్డీల వివరాలు కూడా ఆన్‌లైన్ తేడాలు చూపించేవారు. ఈ కంపెనీ TiE Mumbai వారి అవార్డులు కూడా అందుకుంది. విజయ్ ప్రారంభించిన రెండో కంపెనీ నేమ్‌మై వరల్డ్.

స్టీవ్‌జాబ్స్ ఫిలాసఫీ అంటే విజయ్‌కి ఎంతో ఇష్టం. యాపిల్ సంస్థ డిజైన్లంటే బాగా ఇష్టపడేవాడు. స్టార్టప్‌లు ప్రారంభించి ముందుకెళ్లాలని భావించాడు ముంబైలో ది క్రేజీ వన్స్ పేరుతో ఓ స్టార్టప్‌ని కూడా ప్రారంభించాడు విజయ్. 2008 లో ఇంటర్నెట్ సర్ఫ్ చేస్తున్నప్పుడు న్యూమరాలజీ మీద ఆసక్తి పెరిగింది. మంచి మంచి బుక్స్ చదవడం హాబీగా పెట్టుకున్నాడు. నాలుగేళ్ళపాటు సైన్స్, వివిధ అంశాలపై బాగా అధ్యయనం చేశాడు విజయ్.

ఇదిలా ఉండగా 2011 లో విజయ్ మిత్రుడి భార్య ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయికి వివిధ ఇబ్బందులు రావడంతో అన్నిటినీ దగ్గరుండి పరిష్కరించాడు. అసలు సమస్య ఆ తర్వాత వచ్చింది. పాపకు ఏం పేరు పెట్టాలో అని తెగ ఆలోచించారు. ఏదో సాదాసీదాగా కాకుండా, కొత్త ట్రెండ్‌కి తగ్గట్టుగా అమ్మాయి పేరు ఉండాలని నిర్ణయించారు.

న్యూమరాలజీ, పుట్టిన దినం ఆధారంగా విజయ్ చాలా పేర్లు సూచించాడు. ఫలానా పేరు పెడితే ఎలా ఉంటుంది ఏం చేయాలనేదానిపై మిత్రుడికి సలహా ఇచ్చాడు విజయ్. విజయ్ చెప్పిన పేర్లలో కొన్నింటిని సెలక్ట్ చేసుకుని ఫైనల్ చేశారు. ఈ అనుభవం విజయ్ ఆలోచనలకు పదును పెట్టింది. పుట్టిన తమ పిల్లలకు మంచి పేర్లు పెట్టుకోలేకపోతున్న లక్షలాదిమంది తల్లిదండ్రులకోసం ఏదో చేయాలని సంకల్పించారు విజయ్.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తల్లిదండ్రులకు ఉపయోగపడే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించాడు విజయ్. తల్లిదండ్రులందరికీ ఈజీగా అర్థం అయ్యేలా ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఆలోచనలు కొత్త యాప్‌కి నాందిగా మారాయి.

కొన్నాళ్లపాటు కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడాడు విజయ్. 2012 లో ఐఫోన్ యాప్, 16 సెప్టెంబర్ 2013 లో ఐ ట్యూన్ప్ ఆప్‌స్టోర్ తయారుచేశాడు విజయ్. ఇటీవల 9 జూలై, 2014 లో గూగుల్ ప్లే స్టోర్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు.

NameMyWorld యాప్‌ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. నేమ్ ఇంటర్ ప్రిటేషన్, కంపాటబులిటీ చెక్, నెంబర్ చెకర్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పిల్లల వివరాలతో ప్రొఫైల్‌ని తయారుచేయగానే యాప్ నుంచి అంతులేని పేర్ల జాబితా మనముందుకి వస్తుంది. డేటాబేస్ నుంచి కొన్ని పేర్లను తల్లిదండ్రులకు సూచిస్తుంది. వాటిలో తల్లిదండ్రులు తమకు నచ్చిన వాటి జాబితా తయారుచేసుకోవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 0.37 మిలియన్ల మంది పిల్లలు పుడుతున్నారు. ఈ యాప్‌ని 20 శాతం మంది తమ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. రోజూ 74 వేలమంది కొత్త కష్టమర్లు తమ పిల్లల వివరాలతో రిజిస్టర్ అవుతున్నారు.

‘‘మా సేవలకు ఒక్కో కస్టమర్ నుంచి సుమారు 6 డాలర్లు వసూలు చేస్తున్నాం. మార్కెట్‌లో మేం 162 మిలియన్ డాలర్లకు చేరుకున్నాం’’ అని చెబుతున్నారు విజయ్.

image


సాధారణంగా ఈ యాప్‌లో 5 స్టెప్‌లు ఉంటాయి.

స్టెప్ 1

బేబీ ప్రొఫైల్

ముందుగా బేబీ పుట్టిన సమయం. పుట్టిన ఊరు, ఎలాంటి పేరు ఉండాలనుకుంటున్నారు, తల్లి దండ్రుల వివరాలు ఎంటర్ చేయాలి.

స్టెప్ 2

బేబీ ప్రొఫైల్ పూర్తిచేయగానే వెంటనే పిల్లల పేర్లతో ఉన్న జాబితా మన కళ్ళముందు కనిపిస్తుంది.

స్టెప్ 3

మీ పాపాయికి తగిన పేరు సూచించుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎలా ఉండాలి అనే దానిపై మీరు ఒక నిర్ణయానికి వస్తే దాని ప్రకారం మీరు పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని పేర్ల కున్న ప్రాధాన్యతను బట్టి పర్సంటేజ్ కూడా యాప్ సూచిస్తుంది. న్యూమరాలజీ ప్రకారం ఏ పేర్ల పెట్టాలో కూడా చెబుతుంది.

స్టెప్ 4

ఈ యాప్ కొన్ని పేర్లను మీ దృష్టికి తెస్తుంది. సుమారు యాప్‌లో 50 వేల పేర్లు, 108 ప్రాంతాలకు చెందిన వివరాలు అందులో ఉంటాయి. వాటిలో కొన్నిటిని యాప్ మీకు సూచిస్తుంది.

స్టెప్ 5

మనకు అందుబాటులో ఉన్న పేర్లను కొన్నిటిని షార్ట్‌లిస్ట్ చేసుకోవచ్చు. ఆయా పేర్లను యాప్‌కి సూచిస్తే వాటి కి ఉన్న స్కోర్లను, వాటి ర్యాంకులను మనకు ఓ క్రమపద్ధతిలో తెలియచేస్తుంది. అలా వచ్చిన జాబితా నుంచి కొన్నిటిని ఫైనల్ చేసుకోవచ్చు.

ఇవేకాకుండా ఈ యాప్‌లో ఎన్నో అదనపు ఫీచర్లు ఉన్నాయి.

అనుకూలమయిన పేరు

యాప్ మీకు అనుకూలమయిన పేరుని తెలియచేస్తుంది. ఈ పేరుని పాపాయి తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్ సలహాల ఆధారంగా ఫైనలైజ్ చేసుకోవచ్చు.

వివరణలు

యాప్‌లో మీరు సెలెక్ట్ చేసుకుని ఫైనలైజ్ చేసుకున్న వివిధ పేర్లకు ఉన్న ప్రత్యేకతలు, అర్థాలు..వాటికి సంబంధించిన వివరణలు ఇస్తారు.

గేలరీ

ఈ యాప్‌లో వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల గేలరీ ఉంటుంది. దేశ విదేశాలకు చెందిన వారి వివరాలు ఇందులో ఉంటాయి. వాటిని మనం పరిశీలించుకోవచ్చు. మనకున్న అనుకూలతలను బేరీజు వేసుకోవచ్చు.

భవిష్యత్తు ఆలోచనలు

NameMyWorld యాప్‌లో సరికొత్త మార్పులు చేయాలని భావిస్తున్నారు విజయ్.దీనిపై ఓ టీం కసరత్తు చేస్తోంది. కొన్ని పదాలకున్న అర్ధాలను దృష్టిలో పెట్టుకుని వాటిని సూచించడం ద్వారా ఆ అర్థాలు ఇచ్చే పదాలను యాప్ మీకు తెలియచేస్తుంది. పేరు, న్యూమరాలజీ వివరాలు, ఏ పేరు పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అనే విషయాలను కూడా ఇందులో చేర్చాలని భావిస్తున్నారు.ఆ టైంలో పుట్టిన పిల్లలకు ఆ పేరు బాగుంటుందా, అనుకూలంగా ఉంటుందా అనే విషయాలను కూడా యాప్ సూచిస్తుంది. ఆ పేరు పెట్టుకున్న పిల్లల పెళ్లిళ్ళు, ఇతర జీవన శైలిని కూడా వివరిస్తుంది.

ఈ యాప్‌పై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసే అవకాశం కల్పించారు. పిల్లల పేర్లు సూచించాక వాటిని ఇతరులకు షేర్ చేసి వారి నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు.

ఈ యాప్‌ని iOS, Android ఫోన్లకు అందుబాటులో ఉంచారు. ఇలా రెండు అప్లికేషన్లు ఉన్న ఫోన్లలో వాడేలా యాప్ తయారుచేయడం వల్ల యాప్‌ని వాడే వారి సంఖ్య పెరుగుతోందంటున్నారు విజయ్.

ఐవోఎస్ ఫోన్లలో నేమ్‌మై వరల్డ్ యాప్‌కి 55.7 ఎంబీ స్పేస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు 29ఎంబీ స్పేస్ పడుతోంది. లక్షలాది పేర్లు, వాటి వివరణలతో ఉన్న యాప్ ఇంత తక్కువ స్పేస్‌లో అందించడం సమంజసమే అంటున్నారు విజయ్.

లైఫ్‌స్టయిల్ యాప్స్‌లో ఐవోఎస్ కేటగిరీలో 2013 లో టాప్‌వన్ లో ఉంది నేమ్‌మై వరల్డ్ యాప్. ఇక ఆండ్రాయిడ్ ఆప్‌లో టాప్ 50 లో చోటు సంపాదించుకుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచికూడా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తమ యాప్‌తో తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి పేర్లు పెట్టుకోవచ్చంటున్నారు నేమ్ మై వరల్డ్ వ్యవస్థాపకుడు విజయ్ ఖుబ్‌చందానీ.

India’s most prolific entrepreneurship conference TechSparks is back! With it comes an opportunity for early-stage startups to scale and succeed. Apply for Tech30 and get a chance to get funding of up to Rs 50 lakh and pitch to top investors live online.