సంకలనాలు
Telugu

షాపింగ్‌ను సులువు చేసిన నలుగురు ఇన్ఫీ ఇంజనీర్లు

team ys telugu
4th Nov 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

రోజురోజుకు పెరుగుతున్న ఈ-స్టోర్స్, యాప్స్ సౌలభ్యంగా ఉన్నా... మరోరకంగా అసౌకర్యాన్ని కూడా కలిగిస్తున్నాయి. వివిధ రకాల యాప్స్, వెబ్ సైట్స్ కోసం ఎన్నో టాబ్స్‌ను ఓపెన్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఒక రకంగా కన్స్యూమర్‌ను అసహనానికి గురిచేస్తుంది. ప్రోడక్ట్స్‌ను కొనుక్కోవాలన్నా వివిధ రకాల ఆప్స్ ఎక్కడెక్కడో ఉంటాయి. చాలా మంది డిజిటల్ షాపర్స్ .. ఫేస్ చేసే సమస్యే ఇది. ఈ సమస్యకు విరుగుడుగా షాపలిస్ట్‌తో ముందుకు వచ్చారు నలుగురు ఇన్ఫోసిస్ మాజీ ఎగ్జిక్యూటివ్స్.

image


'ఇలాంటి సమస్యలన్నింటి కోసం ఒకే పరిష్కారం అప్పటి దాకా లేదు. డిజిటల్ షాపింగ్‌ను అత్యంత సరళతరం చేయాలన్న ఆలోచన వచ్చింది" అంటారు షాపలిస్ట్‌ను రూపొందించిన వ్యవస్థాపకుల్లో ఒకరైన గిరీష్ రామచంద్ర. 2014 లో ఏర్పాటైన షాపలిస్ట్ అనే సంస్థ.. షార్ట్‌లిస్ట్ అనే ప్లాట్‌ఫాంను డెవలప్ చేసింది. ఇక్కడ పబ్లిషర్లు, డెవలపర్లు ఇన్-యాప్ బై బటన్స్‌ను యాడ్ చేయొచ్చు. ఇమేజెస్, వీడియోస్, పోస్ట్స్, చాట్స్, లిస్ట్స్, న్యూస్, సోషల్ షేర్స్...ఇలా దేనికోసమైనా దీనిని ఉపయోగించుకోవచ్చు.

షాపింగ్ సులువు !

దీంతో కన్స్యూమర్లు సులభంగా కొనుక్కోవడమే కాదు.. రిటైలర్లకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఏ పాపులర్ యాప్స్ దగ్గరైతే కస్టమర్లు ఎక్కువగా ఉంటారో, అక్కడ తమ ప్రొడక్ట్స్ అమ్ముకునే అవకాశం ఇది రిటైలర్లకు కలిగిస్తుంది. "అన్నీ ఆన్ లైన్ షాపింగ్ సైట్స్‌లో పనిచేసే విధంగా ఉండడంతో, ఈ యూనివర్సల్ షాపింగ్ కార్ట్‌ను కన్స్యూమర్లు ఎంజాయ్ చేస్తున్నారు" అంటున్నారు గిరీష్.

ఇన్ఫోసిస్‌లో పనిచేసేటపుడు ఈ నలుగురు వ్యవస్థాపకులకు ఒకే రకమైన ఆలోచనలు వచ్చేవి. "నాకంటూ నేనొక స్టార్టప్ రూపొందించుకునే ముందు, ఇన్ఫోసిస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా కన్స్యూమర్ రిటైల్.. ఇండస్ట్రీ కోసం ఎన్నో విజయవంతమైన బిజినెస్ ప్రోడక్ట్స్ అందించాను. నా కో-ఫౌండర్స్ అదే సంస్థలో టెక్నాలజి, డాటా సైన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ల్లో కీలక భూమిక పోషించారు" అంటారు గిరీష్.

ప్రపంచంలోనే బెస్ట్ ఈ-కామర్స్ సైట్లయిన నార్డ్‌స్ట్రం, టార్గెట్, సియర్స్, అడిడాస్, వెయిట్ రోస్ లాంటి వాటికి తమ పనితనం.. మరింత బలాన్ని చేకూర్చిందని అంటారు గిరీష్. ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందడమే కాదు, తమ ఇన్నోవేషన్స్ గార్ట్నర్, ఫార్స్టర్, టెక్ రివ్యూ, బిజినెస్ వీక్, ఫాస్ట్ కంపెనీ లాంటి వాటిల్లో కూడా ప్రస్తావించారంటారు గిరీష్.

షాపలిస్ట్ కోసం షార్ప్ టీం

తమ టీం ఈ మధ్యే బీటా ప్రోగ్రాంను స్టార్ట్ చేస్తే, మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చిదంటారు వ్యవస్థాపకులు. భారత్‌లోని 20 టాప్ ఈ-కామర్స్ సైట్లతో అనుసంధానంగా పనిచేస్తూ, ఏ ఆప్ మీదైనా షాపింగ్ చేయగలిగేలా 10 మిలియన్ SKU లు తమ కేటలాగ్‌లో ఉన్నాయని గిరీష్ అంటున్నారు. "మా ప్లాట్‌ఫాంను ఉపయోగించుకున్న ఎర్లీ అడాప్టర్స్‌లో న్యూస్ సైట్స్, చాట్, ఎంటర్‌టైన్మెంట్, లైఫ్ స్టైల్ ఆప్స్, బ్రాండ్ మీడియాం బ్లాగ్స్, ఫ్యా షన్ యాప్స్ ఉన్నాయి" అంటారు గిరీష్.

ఎవరైనా కన్స్యూమర్ ఫ్యాషన్ ట్రెండ్‌కు సంబంధించిన సమాచారాన్ని చదివి ఆ ప్రొడక్టును కొనాలనుకుంటే, అదే పేజ్ మీద ఉన్న బై బటన్ ఆప్షన్‌ను నొక్కాలి. దాంతో అ వస్తువుకు సంబంధించిన రిటైలర్ నుంచి షాపలిస్ట్ ప్రొడక్ట్స్‌ను అందిస్తుంది.

ఈ ప్లాట్ ఫాం ప్రొడక్ట్స్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అన్ని ఈ-కామర్స్ సైట్స్ నుంచి అందివ్వడంతో, కన్స్యూమర్ ఏ యాప్ లేదా డివైజ్ నుంచైనా సులభంగా దాన్ని కొనుక్కోవచ్చు. ప్రొడక్టుకు సంబంధించి డేటా ఎక్కువగా ఉంటే, దానికి సమాంతరంగా ప్రాసెస్ చేసిన డేటాను అందిస్తారు. "మా యూనివర్సల్ షాపింగ్ API అన్ని ఈ-కామర్స్ సర్వీసెస్ నుంచి ఎలాంటి ఆలస్యం లేకుండా,ప్లాట్ ఫాం మీద ఉన్న మల్టిపుల్ లెవల్స్ ద్వారా సౌకర్యవంతమైన ఆక్సెస్ ఉంటుంది" అంటారు గిరీష్.

పెట్టుబడులు, విస్తరణ

తమ కేటలాగ్‌లో మరిన్ని క్యాటగిరీలను, ఈ-కామర్స్ సైట్స్‌ను అందించడంతో పాటుగా, పార్ట్‌నర్ నెట్వర్క్‌లో మరికొంత మంది డెవలపర్స్, పబ్లిషర్స్‌ను యాడ్ చేస్తోంది. టెక్ కంపెనీ కావడంతో, టీం నైపుణ్యానికే ప్రాధాన్యతనిస్తుంది. టెక్ ఏరియాస్‌లో నైపుణ్యం ఉన్న వారికోసమే చూస్తున్న టీం, అనలిటికల్/ప్రోగ్రామింగ్ చాలెంజెస్‌ను బేస్ చేసుకునే వారిని ఉద్యోగంలోకి తీసుకుంటుంది. తమ ప్రాజెక్టుపై విశ్వాసం ఉంచి, టీంకు కొత్త శక్తిని తీసుకొచ్చే వారికే ఉద్యోగాలివ్వాలని గిరీష్ భావిస్తున్నారు.

కలారి కాపిటల్ నుంచి ఈ మధ్యే రెండు మిలియన్ అమెరికన్ డాలర్ల ఫండ్స్ రైస్ చేసింది షాపలిస్ట్. ప్రపంచవ్యాప్తంగా తమ బిజినెస్‌ను వ్యాపింప చేయాలని భావిస్తున్న టీం, తమ క్లైంట్ బేస్‌ను కూడా పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతానికి ఫ్యాషన్, బ్యూటీ సెగ్మెంట్స్ మీదే దృష్టి పెట్టిన షాపలిస్ట్, ఇతర అన్ని రంగాల్లోనూ అడుగులు వేయాలని భావిస్తోంది.

యువర్ స్టోరీ అభిప్రాయం

దేశంలో డిస్కవరీ కామర్స్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. InMobi ఈ మధ్యే Miip ని లాంచ్ చేసింది. ఇది d-కామర్స్ ప్లాట్ ఫాం. పే టైం, అమెజాన్‌తో అది పనిచేస్తుంది.

2020 కల్లా, 6.5 కోట్ల మంది ప్రజలు ప్రజలు ఆన్ లైన్లో ఉంటారు. ప్రాధమికంగా వారంతా మొబైల్ ఫోన్స్ ద్వారా నే ఆన్ లైన్ ఉపయోగిస్తారు. ప్రపంచంలో భారత్ దేశమే ఇలా మొబైల్స్ వినియోగం ఎక్కువ. 60% కి పైగా మొబైల్ ఫోన్‌లోని గూగుల్ ద్వారానే సెర్చ్ క్వైరీస్ జరుగుతుంటాయి. ఫ్లిప్ కార్ట్‌లో 70% కు పైగా ట్రాన్సాక్షన్స్ మొబైల్ ద్వారానే జరుగుతాయి.

ఏసియా పసిఫిక్ రిపోర్ట్ అధారంగా, ఏసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో రాబోయే అయిదేళ్లలో 80% స్మార్ట్ ఫోన్ సబ్ స్క్రైబర్లు ఉంటారు. 3.5 బిలియన్లకు స్మార్ట్ ఫోన్లు చేరుతాయి. అలాగే 2020 నాటికి 2897 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఎకో సిస్టంకు రీచ్ అవుతుంది. ఈ ట్రెండ్స్ ఉపయుక్తంగా కూడా ఉంటాయి.

దీంతోపాటే, యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్, పింటెరెస్ట్, ఫేస్ బుక్ కూడా ఇన్-ఆప్ పర్చేస్ బటన్స్ మీద తమ దృష్టి సారిస్తాయి.

Disclaimer: Kalaari Capital is an investor in YourStory.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags