సంకలనాలు
Telugu

గర్భిణిలకు దుస్తుల కష్టాలు తీరుస్తున్న ఇద్దరు ఫ్రెండ్స్

గర్భవతులకు సౌకర్యవంతమైన దుస్తులందిస్తున్న మామ్జాయ్-మేకిన్ ఇండియా స్పూర్తితో మెటర్నిటీ ప్రొడక్ట్స్ అందిస్తున్న కీర్తి, దివ్య- 

26th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


మాతృత్వం ఆడవారికి ఓ మధురానుభూతి. ప్రతి మహిళ పండంటి బిడ్డకు జన్మనివ్వాలను కోరుకుంటుంది. అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు శరీరంలో వచ్చే మార్పులు వారిని కొంత ఆందోళనకు గురిచేస్తాయి. పెరిగిన పొట్టతో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నా ఇబ్బందే. ఏదైనా ఫంక్షన్, పెళ్లిళ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వారి బాధ వర్ణనాతీతం. ఏ డ్రెస్ తమకు నప్పుతుందో ఏది వేసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు.

చిన్ననాటి మిత్రులైన దివ్య గుప్తా, కీర్తి భవేజాలు ఫ్రెండ్ పార్టీకి వెళ్లారు. అక్కడ తల్లి కాబోతున్న ఓ కామన్ ఫ్రెండ్ కలిసింది. ఆమె డ్రెస్సింగ్ విషయంలో పడుతున్న ఇబ్బందులు, పార్టీకి ఎలాంటి దుస్తులు వేసుకురావాలో అర్థంకాక ఎంత వేదన అనుభవించిదో చెప్పింది. ఆమె మాటలు విన్నాక ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆ ఇద్దరు మిత్రులు నిర్ణయించుకున్నారు. వారి ఆలోచనల్లోంచి కొత్త స్టార్టప్ పుట్టుకొచ్చింది.

ప్రెగ్నెంట్ మహిళల వార్డ్ రోబ్ కష్టాలు తీర్చేందుకు కీర్తి, దివ్య కలిసి గతేడాది నవంబర్ లో ఆన్ లైన్ మెటర్నిటీ బ్రాండ్ మామ్జాయ్ స్టార్ట్ చేశారు. గర్భవతులు, కొత్తగా తల్లయిన వారికి ఫ్యాషనబుల్ గా, సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్ని అందించే ఆన్ లైన్ స్టోర్ ఇది.

కీర్తి, దివ్య మామ్జాయ్ కోసం బాగానే కష్టపడ్డారు. దాదాపు వంద మంది ప్రెగ్నెంట్ మహిళల్ని, డాక్టర్లను కలిసి ఎలాంటి దస్తులు గర్భవతులకు ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉంటాయో అడిగి తెలుసుకున్నారు. మామ్జాయ్ డాట్ కాం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగాలను సైతం వదులుకున్నారు.

కీర్తి భవేజా

కీర్తి భవేజా


ఓ సర్వే ప్రకారం తల్లి కాబోయే వారు డెలివరీ తర్వాత తమ శరీరాకృతి మీద, బిడ్డకు పాలిచ్చే విషయం మీద చాలా ఆందోళన చెందుతున్నారని తేలింది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ఫ్యాషనబుల్ గా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా బిడ్డలకు పాలివ్వడంలో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి మెటర్నిటీ వేర్ తయారు చేసి ప్రెగ్నెట్ ఉమెన్స్ ప్రాబ్లెం సాల్వ్ చేయాలనుకున్నారు. అయితే మంచి ఉద్యోగాన్ని వదలి మెటర్నిటీ ఫ్యాషన్ బ్రాండ్ స్టార్టప్ ప్రారంభించాలన్న కీర్తి ఐడియాను ఆమె కుటుంబ సభ్యులు మొదట్లో అంగీకరించలేదు. కారణాలు చెప్పిన తర్వాత అర్థం చేసుకుని ఓకే చెప్పారు. 

మరోవైపు దివ్య. ఆమెకు పెళ్లైంది. సంసార బాధ్యతలు చూసుకుంటూనే స్టార్టప్ కోసం పని చేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహంతో ఇంటినీ, సార్టప్ పనుల్ని బ్యాలెన్స్ చేసుకోగలిగింది.

దివ్య గుప్తా

దివ్య గుప్తా


“ధైర్యంగా ముందడుగు వేశాం. మేమిద్దరం ఏనాడూ సవాళ్లను సమస్యలుగా భావించలేదు. కొత్త బిజినెస్ లో సవాళ్లు సాధారణమేనని మేం అందుకు మినహాయింపు కాదని త్వరలోనే అర్థం చేసుకున్నాం. ఎదురైన ప్రతి అవరోధాన్ని గమ్యం చేరుకునేందుకు మెట్టుగా మార్చుకున్నాం. లక్షల మంది తల్లుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నామన్న భావన కొండంత బలాన్నిచ్చింది.”- కీర్తి

మేకిన్ ఇండియా

మామ్జాయ్ పూర్తిగా మేకిన్ ఇండియా బ్రాండ్. స్టోర్ లో లభించే దుస్తుల ముడి సరకు నుంచి తయారీ వరకు అన్నీ భారత్ లోనే జరుగుతాయి. ఇలా పూర్తి స్వదేశీ వస్తువులతో తమ బ్రాండ్ ను మార్కెట్ లోకి తీసుకురావడం ఎంతో తృప్తినిచ్చిందంటారు దివ్య, కీర్తి.

మామ్జాయ్ లోని దుస్తులు వీలైనంత సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, డెలివరీ తర్వాత కూడా ఉపయోగపడేలా డ్రెస్ డిజైనింగ్ చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో శారీరక మార్పులకు అనుగుణంగా ఫిట్ అయ్యేలా వీటిని తయారుచేస్తున్నారు.

మామ్జాయ్ స్టార్టప్ ఇతర ఈ కామర్స్ పోర్టల్స్ లాగే డోర్ డెలివరీ, ఈజీ రిటర్న్స్, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్రీ షిప్పింగ్ సదుపాయాలు కల్పిస్తోంది. కేవలం తమ వెబ్ సైట్ ద్వారానే కాకుండా ఫస్ట్ క్రై, మైబేబీకార్ట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి లీడింగ్ సైట్ల ద్వారా కూడా మామ్జాయ్ ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెచ్చారు.

image


మార్కెట్ విస్తరణ

భారత్ లో మెటర్నిటీ ప్రొడక్ట్స్ మార్కెట్ చాలా ఆశాజనకంగా ఉంది. రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ RNCOS ప్రకారం 2017నాటికి ఈ సెక్టార్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 17శాతానికి చేరుతుందని అంచనా.

మామ్జాయ్ ప్రారంభించడానికి ముందే వందల సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయి. దీన్నిబట్టి మెటర్నిటీ ప్రొడక్ట్స్ కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మామ్జాయ్ ప్రారంభించిన మొదటి నెలలోనే దాదాపు 200లకు పైగా ఆర్డర్లు కంప్లీట్ చేశారు.

మామ్జాయ్ ప్రయాణం అనుకున్నంత ఈజీగా సాగలేదు. ఈ కామర్స్ సైట్లలో ప్రొడక్ట్స్ విక్రయించే మామ్ అండ్ మీలాంటి చాలా సంస్థల పోటీని తట్టుకుని నిలబడాల్సి వచ్చింది. కొత్త బ్రాండ్ కావడంతో జనాల నమ్మకం పొందేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది.

ప్రస్తుతం మామ్జాయ్ ను కీర్తి, దివ్య తమ సొంత డబ్బులతో నడుపుతున్నారు. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారు. మరికొన్ని నెలల్లో మార్కెట్ నుంచి నిధుల సమీకరించాలని భావిస్తున్నారు. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags