సంకలనాలు
Telugu

ఇక ముందంతా చాట్ బాట్స్ కాలమే..!!

ఫేస్ బుక్ మెసెంజర్ చాట్ బాట్స్ లోకి ఎంటరైన మేజిక్ ఎక్స్ కంపెనీ

RAKESH
19th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


చాట్ బాట్స్! సోష‌ల్ మీడియాలో ఇదొక న‌యా ట్రెండ్! ఇప్ప‌టికే ఒక‌టీ అరా చాట్ బాట్ అప్లికేష‌న్లు వాడుక‌లో ఉన్నాయి! కాక‌పోతే వాటి గురించి యూజ‌ర్ల‌కు పెద్ద‌గా ఐడియా లేదు. ఈమ‌ధ్యే ఫేస్ బుక్ కూడా త‌న మెసెంజ‌ర్ యాప్ లో చాట్ బాట్స్ ఆప్ష‌న్ తీసుకురావ‌డంతో దీనిపై చ‌ర్చ మొద‌లైంది. ఆ చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే ఒక ఇండియ‌న్ చాట్ బాట్ యాప్ ఫేస్ బుక్ మెసెంజ‌ర్ లోకి ఎంట‌రైంది! అదే మేజిక్ ఎక్స్!

ఏంటీ చాట్ బాట్..?

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ‌స్తువు కొనాలంటే ఏం చేస్తారు? అమెజానో, ఫ్లిప్ కార్ట్ యాపో ఓపెన్ చేసి షాపింగ్ చేస్తారు. అదే రీఛార్జ్ చేసుకోవాలంటే పే టీఎం, ఈజీ రీచార్జ్ వ‌గైరా యాప్స్ మీద ఆధార‌ప‌డ‌తారు. అయితే అంత‌క‌న్నా ముందు మొబైల్ లో ఈ-కామ‌ర్స్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుంటారు. కానీ చాట్ బాట్స్ కంప్లీట్ గా డిఫ‌రెంట్! ఆన్ లైన్ షాపింగ్ కోసం ప్ర‌త్యేకంగా యాప్స్ ఏమీ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎలా అంటే..? ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ బుక్ మెసెంజ‌ర్ లో - రీఛార్జ్ మై మొబైల్ - అని టైప్ చేస్తే, అవ‌తలి నుంచి మీది ఏ నెట్ వ‌ర్క్ అన్న ప్రశ్న డిస్ ప్లే అవుతుంది. అలా ఒక్కో క్వొశ్చ‌న్స్ కు ఆన్స‌ర్ ఇస్తూ వెళ్లిపోవ‌డమే! చివ‌ర‌గా పేమెంట్ లింక్ మీద క్లిక్ చేస్తే రీఛార్జ్ అయిపోతుంది. షాపింగ్ చేయాల‌న్నా ఇదే ప్రాసెస్! అంటే ఒక్క‌ మెసెంజ‌ర్ యాప్ నుంచే బాట్స్ సాయంతో షాపింగ్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌! ఇదంతా ఒక ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తున్న‌ట్టే ఉంటుంది!

మెసెంజ‌ర్ లో మేజిక్..!!

ఫేస్ బుక్ సంస్థ చాట్ బాట్స్ రిలీజ్ చేసిన‌ రెండు రోజులకే ఇండియన్ కంపెనీ మేజిక్ ఎక్స్ మెసెంజ‌ర్ లో బాట్ విడుదల చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫేస్ బుక్ మెసెంజర్ లో లాంఛైన తొలి బాట్స్ లో తమ యాప్ కూడా ఒకటని కంపెనీ సీఈవో ప్రత్యూష్‌ ప్రసన్న తెలిపారు. యూజర్లు త‌మ రోజువారీ కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించుకునేలా ఫేస్ బుక్ మెసెంజ‌ర్ లో తమ చాట్ బాట్ ను లాంఛ్ చేశామంటున్నారాయన.

image


ఏమేం చేసుకోవ‌చ్చు..

మొబైల్ రీఛార్జ్ , పోస్ట్ పెయిడ్ బిల్స్, యుటిలిటీ బిల్స్, ఫ్లైట్ బుకింగ్స్, ఫుడ్, మెడిసిన్ ఆర్డర్ లాంటి సేవల‌ను చాట్ బాట్స్ ద్వారా వినియోగించుకోవచ్చు. ఈ మెసెంజర్ చాట్ బాట్స్ రెండు రకాలు! అందులో కొన్ని సమాచారం అందించేవి. అంటే న్యూస్, ఆర్టికల్స్ లాంటివ‌న్న‌మాట‌. ఇక రెండో ర‌కం- షాపింగ్ కు సంబంధించినవి. వెండర్లు తమ ప్రోడక్ట్స్ విక్రయానికి పెట్టాలంటే, ముందుగా మెసెంజర్ బాట్స్ తో టై అప్ కావాల్సి ఉంటుంది.

కస్టమర్ల ఫీడ్ బ్యాక్, రేటింగ్ ఆధారంగా వెండర్ల వైపు నుంచి క్వాలిటీ ప్రోడ‌క్ట్స్ అందిస్తాం. యూజర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా షాపింగ్ చేసుకునేలా మా చాట్ బాట్ ను అభివృద్ధి చేస్తాం- ప్రత్యూష్‌

ఇండియాలో డే టు డే ట్రాన్జాక్ష‌న్స్ కు సంబంధించి మేజిక్ ఎక్స్ యాప్ యూజ‌ర్ల‌కు ఒక డెస్టినేష‌న్ గా ఉండాలంటారు ప్ర‌త్యూష్. వినియోగ‌దారులు మ‌రింత స్మార్ట్ గా, మ‌రింత వేగంగా త‌మ రోజువారీ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించుకోవాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు.

యువ‌ర్ స్టోరీ అభిప్రాయం

సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్ల‌న్నీ ఇప్పుడు చాట్ బాట్స్ బాట ప‌డుతున్నాయి! ముందంతా చాట్ బాట్స్ కాల‌మే అనిపిస్తోంది. అయితే ఇక్క‌డ ఒక విష‌యం! చాట్ బాట్స్ తో ఉపయోగాల సంగతి పక్కన పెడితే, యూజర్లకు ఇవి ఎంత‌వ‌ర‌కూ రీచ్ అవుతాయో చూడాలి. ఇందులో వినియోగ‌దారుల‌కు ఇరిటేషన్ తెప్పించే అంశాలు కూడా లేక‌పోలేదు. బాట్స్ లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా వ్యాపార ప్రకటనలు, మితిమీరిన బ్రాండ్ కంటెంట్ డిస్ ప్లే అయితే.. వినియోగదారులు చిరాకుప‌డే అవ‌కాశ‌ముంది. కొంతమంది త‌మ రివ్యూల్లో కూడా ఇదే ర‌క‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు.

అయినా, చాట్ బాట్స్ పనితీరుపై ఇప్పుడే ఒక అభిప్రాయానికి వచ్చేయడం తొందరపాటే అవుతుందేమో! ఎందుకంటే, ఫేస్ బుక్ దీన్నొక‌ పైలట్ ప్రాజెక్ట్ గా మాత్రమే లాంఛ్ చేసింది. యూజ‌ర్ల‌ ఫీడ్ బ్యాక్ ను బ‌ట్టి చాట్ బాట్స్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి ఫేస్ బుక్ ప్రయత్నాలు చేస్తోంది.

మేజిక్ ఎక్స్ యాప్

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags