సంకలనాలు
Telugu

సంక్షోభాలను అధిగమించి గెలుపు రుచి చూస్తున్న "కుకరో"

పరిస్థితులకు అనుగుణంగా బిజినెస్ స్టైల్ మార్చుకున్న ఫుడ్ స్టార్టప్

SOWJANYA RAJ
3rd May 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


ఆకలవుతుందంటే.. దగ్గర్లో ఉన్న మంచి హోటల్ ని వెతుక్కుంటూ వెళ్లిపోవడం ఓల్డ్ స్టైల్.. !

కడుపులో ఆకలి గంట మోగిన వెంటనే స్మార్ట్ ఫోన్ తీసుకుని... ఇష్టమైన మెనూని ఆర్డర్ పెట్టేయడం లెటెస్ట్ స్టైల్.

మెట్రో నగరాల్లో మారుతున్న జీవన శైలి.. అంతకంతకూ లైఫ్ లో పెరుగుతున్న బిజీ... ఉద్యోగ విధుల బాధ్యతల ఒత్తిళ్లతో లైఫ్ స్టైల్ అనూహ్యంగా మారిపోతోంది. దీంతో తినే తిండి మీద ధ్యాస పెట్టాల్సిన సమయం కూడా తగ్గిపోతోంది. ఇంటి వంట అనేది వారాంతాలకో... మాసాంతాలకో పరిమితమైపోతోంది. ఇలాంటి పరిస్థితులను ఆన్ లైన్ ఫుడ్ స్టార్టప్స్ మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. చాలా స్టార్టప్స్ అప్పటికప్పుడు ఇన్ స్టంట్ గా ఆకలి తీర్చేందుకు రెడీగా ఉంటున్నాయి. రుచి, శుభ్రత విషయంలోనూ ఇవి ప్రమాణాలు పాటిస్తూండటంతో వాటికి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ మార్కెట్ లో తమదైన ముద్ర వేయాలని వస్తున్న కొత్త స్టార్టప్ లు ఆకలి తీర్చే మార్గంలో సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నాయి. అలాంటి స్టార్టప్ నే "కుకరో"

వంటింటి నుంచి నేరుగా కస్టమర్ కు..!

బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఫుడ్ స్టార్టప్ కుకరో. ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఉన్నచోటికే ఫుడ్ తెచ్చిచ్చే బేసిక్ మార్కెట్ వ్యూహమే ఈ స్టార్టప్ ది కూడా. కానీ ఈ రంగంలో తనదైన ప్రత్యేకత చూపుతోంది. మిగతా చాలా స్టార్టప్ లో ఎక్కడికక్కడ రెస్టారెంట్లతో ఒప్పందాలు చేసుకుని.. ఆర్డర్స్ వచ్చిన వెంటనే... రెడీగా ఉన్న వాటిని తమ బ్రాండ్ తో ప్యాక్ చేసి... డెలివరీ చేసేస్తాయి. ఇప్పుడు నడుస్తున్నఫుడ్ స్టార్టప్ లలో ఎక్కువ ఇలాగే చేస్తున్నాయి. కానీ కుకరో మాత్రం ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి సొంత చెఫ్ లతో స్వయంగా తయారుచేసి సొంత రుచులతో ఉండేలా జాగ్రత్తపడి వినియోగదారు వద్దకు చేరుస్తుంది. ఇది కొద్దిగా ఎక్కవ సమయం తీసుకునే ప్రాసెస్ అయినా అందుకు తగ్గ వ్యూహాలతో ముందుకెళ్తోంది.

ప్రస్తుతానికి బెంగళూరులోనే సేవలు అందిస్తున్న కుకరో వినియోగదారులకు అత్యంత రుచికరంగా, వేగంగా ఫుడ్ అందించేందుకు సొంత కిచెన్ల కాన్సెప్ట్ ను అనుసరిస్తోంది. అయితే ఓ స్టార్టప్ కంపెనీకి ప్రత్యేకంగా కిచెన్లను, చెఫ్ లను ఏర్పాటు చేసుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే కుకరో కొంత భిన్నంగా ఆలోచించింది. రెడీగా ఉన్న ఫుడ్ డెలివరీకి ఒప్పందం చేసుకునే బదులు హోటల్, రెస్టారెంట్ లో కిచెన్ ను వాడుకునేలా వాటితో ఒప్పందం చేసుకున్నారు.

మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు తమ డిమాండ్ కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా వంటలు రెడీ చేసేలా కిచెన్ ను సిద్ధం చేసుకుంటారు. వారాంతాలు, పండుగ రోజుల్లో అనూహ్యంగా వచ్చి పడే డిమాండ్ ను తట్టుకునేందుకు వారిలా చేసుకుంటారు. మిగిలిన రోజుల్లో వారికి ఉన్న కిచెన్ సామర్థ్యంలో కేవలం ఇరవై శాతం వరకే వినియోగించుకుంటారు. ఇదే పాయింట్ ను పట్టుకున్న కుకరో ఫౌండర్లు అలాంటి బెస్ట్ కిచెన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, కేటరర్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు. అలా వీరు మొట్టమొదటగా నృపతుంగ రోడ్ లోని ఓ హోటల్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ హోటల్ లో ఒకేసారి ఐదు వేల మందికి మీల్స్ రెడీ చేసే సౌకర్యం ఉంది. కానీ ఉపయోగించేది మాత్రం ఇరవై శాతమే. ఈ కాన్సెప్ట్ పై హోటల్ యజమాని కొంత సందేహం వ్యక్తం చేసినా వాటిని తీర్చేసింది కుకరో టీం

" రోజువారీ వ్యాపారం కోసం భారీ మొత్తంలో ఫుడ్ తయారు చేసి అత్యాధునిక కిచెన్లను చాలా హోటల్స్ రెడీ చేసుకుంటాయి. డిమాండ్ లేనప్పుడు అవి నిరుపయోగంగా ఉంటాయి. వీక్ డే డిమాండ్ తో పోలిస్తే వారి కిచెన్ పెట్టుబడి పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. దీనికి మా కాన్సెప్ట్ పరిష్కారం చూపిస్తుంది"- దర్శన్ సుభాష్, కుకరో సీఈవో ఫౌండర్

నాలుగున్నర కిలోమీటర్ల పరిధిలో కుకరోకి వచ్చే ఆర్డర్లన్నింటినీ అదే హోటల్లో అక్కడి సిబ్బందిని ఉపయోగించుకుని రెడీ చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. దాంతో వినియోగదారులకు తమ సేవల్లో డిఫరెన్స్ చూపించేందుకు హోటల్ కిచెన్ నుంచి అదనపు ఆదాయాన్ని పొందేందుకు యజమానికి అవకాశం దక్కినట్లయింది.

విత్ ఐడియా ఫ్రమ్ ఐఐఎమ్ ఇన్ డోర్ ...

కుకరో ఫౌండర్లు దర్శన్ సుభాష్, ఎరాజ్ హసన్, నిఖిల్ కరాంజకర్ ఐఐఎమ్, ఇండోర్ లో కలసి చదువుకున్నారు. ముగ్గురూ మంచి మిత్రులు, అందరూ క్యాంపస్ సెలక్షన్స్ లో కార్పొరేట్ ఉద్యోగాల గురించి చర్చించుకుంటూంటే వీరు మాత్రం సొంత వ్యాపారం గురించి గంటల తరబడి అభిప్రాయాలు కలబోసుకునేవాళ్లు. ప్రపంచంలో దేనికైనా రెసిషన్ రావొచ్చేమో కానీ.. ఫుడ్ బిజినెస్ కు వచ్చే ఛాన్సే లేదని అంచనాకు వచ్చిన వీరు.. తమ అంట్రపెన్యూర్ షిప్ ను ఫుడ్ స్టార్టప్ తోనే ప్రారంభించాలనుకున్నారు. కొత్తతరం ఆలోచనలు, ఆహారపుటలవాట్లును క్యాచ్ చేయగలిగితే విజయం సులభమేననుకుని రంగంలోకి దిగారు. అలా కుకరోని ప్రారంభించారు.

అయితే వ్యాపారంలో కానీ.. ఫుడ్ స్టార్టప్స్ ల విషయంలో కానీ అనుభవం లేకపోవడంతో వీరు మొదట్లో గడ్డు పరిస్థితులను చూడాల్సి వచ్చింది. కుకరో మొదటి రెండు నెలలు హోమ్ చెఫ్ అగ్రిగ్రేషన్ మోడల్ ను ఫాలో అయ్యారు. అయితే ఈ విభాగంతో అత్యున్నతంగా మెయిన్ టెయిన్ చేయడం, రుచి, క్వాలిటీ కంట్రోల్ లో ఉంచడం ఎంత కష్టమో అతి త్వరలోనే వారికి అర్థం అయింది. అందుకే ఆ తర్వాత ఇంటర్నెట్ ఫస్ట్ రెస్టారెంట్ మోడల్ లోకి షిప్ట్ అయ్యారు. అయితే వీరు అందించాలనుకున్న ఆహారం ఫాస్ట్ ఫుడ్ కాదు. ఈ మోడల్ లో బెంగళూరు వ్యాప్తంగా సేవలు అందించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహహారమని త్వరగానే అర్ధమయింది. బెంగళూరు నగరవ్యాప్తంగా యూనిట్లు పెట్టాలంటే కిచెన్ స్పేస్, ఎక్విప్ మెంట్, లైసెన్స్ లు ఇలా ప్రతీ విషయంలోనూ భారీ ఖర్చు అవసరమని గుర్తించారు. దాంతో దానిని మార్చేశారు.

ఆ తర్వాత ఫుడ్ డెలివరీ మోడల్ లోకి ఎంటరయ్యారు. కమర్షియల్ కిచెన్, క్యాటరర్స్ తో ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ మోడల్ అన్నింటికన్నా బెస్ట్ గా అనిపించడంతో కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇందులోనూ వారు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. రెస్టారెంట్, క్యాటరర్స్ యజమానుల విశ్వాసం పొందడంతో పాటు లాజిస్టిక్స్ మోడల్ ను బిల్డ్ చేసుకోవడం వారికి కొంచెం క్లిష్టమైన వ్యవహారంగా మారింది. అందుకే లాజిస్టిక్ రిసోర్స్ షేరింగ్ కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నారు. ప్రతి డెలివరీ బాయ్ రూట్ లో ఉండే ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

image


బెంగళూరు వ్యాప్తంగా విస్తరణ

మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. పరిస్థితులకు అనుగుణంగా బిజినెస్ మోడల్ మార్చడంతో కుకరో సర్దుకుంది. ఇప్పుడు బెంగళూరు చుట్టుపక్కల రోజుకు రెండు వందల ఆర్డర్లను డెలివరి చేస్తోంది. పదిహేను చోట్ల కిచెన్లు, క్యాటరర్లతో టై అప్ అయింది. ప్రస్తుతం ఆర్డర్ మీద మార్జిన్ 21.5శాతం వరకూ లభిస్తోంది. బెంగళూరు మొత్తం మీద సేవలు అందించే లక్ష్యంతో వీరు పనిచేస్తున్నారు. గత నెలలోనే హాయ్ ల్యాండ్ హాస్పిటాలిటిస్, ప్రెస్ ప్లే ఈవెంట్స్ అనే సంస్థ నుంచి ఏంజెల్ ఫండింగ్ ను పొందారు. మరో నెలలో బెంగళూరులోని ఐటీ కారిడార్ల మొత్తం అందుబాటులోకి రావాలని ఏర్పాట్లు చేసుకున్నారు. వీలైనంత త్వరలో హైదరాబాద్ లోనూ అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కఠినమైన పోటీ

ఈ రంగంలో ఇప్పటికే డెలివరీ మీద ఫోకస్ పెట్టిన స్విగ్గీ మార్కెట్ ప్లేయర్లలో ఒకటిగా ఉంది. జొమాటో, ప్రెష్ మెను,ఇన్నర్ చెఫ్, యూమిస్ట్ లాంటివి ఈ రంగంలో వినియోగదారులకు ప్రత్యేకమైన రుచిని అందించేందుకు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి. వీటితో పోలిస్తే కుకరోది కొంచెం భిన్నమైన కాన్సెప్టే అయినా అంతిమంగా వినియోగదారుడు ఆకలిని తీర్చే విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుకోవాల్సి ఉంది. దేశంలో ప్రధాన నగరాలకు వేగంగా విస్తరించిన స్విగ్గీ, రెస్టరెంట్లు, హోటల్స్ తో విస్త్రతమైన ఒప్పందాలు కలిగి ఉన్న జొమాటోలతో కుకరో పోటీ పడాల్సి ఉంటుంది. కొన్ని ఇతర ఫుడ్ స్టార్టప్ లు వేగంగా ఫండింగ్ పొందుతూ అంతకంటే వేగంగా విస్తరించే ఆలోచనలో ఉన్నాయి.

పోటీ ఎలా ఉన్నప్పటికీ ఎన్నికొత్త స్టార్టప్స్ వచ్చినప్పటికీ ఫుడ్ బిజినెస్ లో ఎంతో కొంత స్పేస్ మిగిలే ఉంటుందన్నది మార్కెట్ వర్గాల అంచనా. కొత్త వ్యూహాలతో యువతరం ఆలోచనలను తగ్గట్లుగా బిజినెస్ స్టైల్ మార్చుకుంటే విజయం దారిలో ఎవరూ అడ్డురాకపోవచ్చుననేది కుకరో బృందం విశ్వాసం. ఆ దిశగానే వీరు ముందుకెళ్తున్నారు..!

వెబ్ సైట్ 

 

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags