సంకలనాలు
Telugu

ఫ్రీగా పిఏ కావాలంటే 'ఈజిలీ డూ' యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరి !

ఈమెయిల్స్, కేలండర్, సోషల్ నెట్వర్క్స్...ప్రతీ పనికీ ఒక్కో యాప్ అంటే టైం వేస్ట్ !పర్సనల్ అసిస్టెంట్‌గా ఉపయోగపడే స్మార్ట్ అసిస్టెంట్ ఈజీలీ డూఈజిలీడూ ఫోన్‌లో ఉంటే.. టాస్క్‌లన్నీ వెరీ ఈజీప్రతీ స్మార్ట్ ఫోన్‌లో మా యాప్ ఉండాలంటున్న హెటల్ పాండ్యా

Krishnamohan Tangirala
9th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
“ పని ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అనుకునేవాడిని. అంతటి పని రాక్షసుడిని నేను. నాకు కూతురు పుట్టాక నా ఆలోచనలో మార్పు వచ్చింది. మరింత సమర్ధంగా, స్మార్ట్‌గా పని పూర్తి చేయడం ఎలా అని అలోచించేవాడిని. లాప్‌టాప్ కంటే... కూతురుతో గడిపేందుకు ఎక్కువ సమయం వెచ్చించాలని కోరుకున్నాను”

ఈజిలీడూ ప్రారంభానికి ప్రేరణ ఇదే. శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో... అత్యంత ప్రాచుర్యం పొందిన కన్జూమర్ టెక్ స్టార్టప్స్‌లో ఒకటి ఇది.

image


కూతురు పుట్టాక మారిన ఆలోచన

బేఏరియాకు మారిన తర్వాత హెటల్ పాండ్యా.. కూతురికి జన్మనిచ్చారు. చిన్నారితో గడిపేందుకు తహతహలాడేవారామె. “ ఏ విషయంలో అయినా సరే పని సమయాన్ని తగ్గించుకునేందుకు చూసేదాన్ని. బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించడం ప్రారంభించాను. షిప్పింగ్ చేసిన వస్తువులను ఆన్‌లైన్‌లో ట్రాక్ చేశాను. ఫోన్ కాంటాక్ట్స్‌లోని వ్యక్తుల సమాచారం కోసం... ఈమెయిల్స్‌లోనే వెతుక్కున్నాను. ఇదంతా తక్కువ సమయంలో పని పూర్తవడానికే” అన్నారు హెటల్.

హెటల్ పాండ్యా, మైకేల్ బెర్నర్

హెటల్ పాండ్యా, మైకేల్ బెర్నర్


మొదట్లో ఒక అసిస్టెంట్‌ని ఏర్పాటు చేసుకుందామని అనుకున్న హెటల్... ఇది అంతగా సౌకర్యవంతమైన ఆలోచన కాదని భావించారు. బర్త్‌డేలకు విష్ చేయడం వంటి సోషల్ యాక్టివిటీస్ వంటివి మళ్లీ తానే చేయాల్సి ఉంటుందనే విషయం అర్ధమైంది. ఈ సమయంలోనే ఆమెకు ఓ ఆలోచన వచ్చింది.

ఒక చోటకే అన్ని టాస్క్‌లు

మైకేల్ బెర్నర్‌ సహ వ్యవస్థాపకునిగా... ఒక స్మార్ట్ అసిస్టెంట్ వంటి యాప్‌ని రూపొందించాలని భావించారు. ఫేస్‌బుక్, కేలెండర్, ఈమెయిల్ వంటి అన్ని యాప్స్‌తో కనెక్ట్ చేస్తే చాలు... ప్రధాన ఈవెంట్లు, టికెట్స్, ట్రావెల్ ప్లాన్స్ విషయాలన్నిటినీ ఒక చోటకు చేర్చి, మనను అలర్ట్ చేస్తుంది ఇది. ఏ అంశాన్నీ మర్చిపోకుండా... మన వెనుక ఉండే పీఏ ఈ యాప్. అదే ఈజిలీ డూ. టాస్క్ కంప్లీట్ చేయడంలో మనకు సహాయపడే పర్సనల్ స్మార్ట్ అసిస్టెంట్.

శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన విమెన్ 2.0 కాన్ఫరెన్స్‌లో... ఈజిలీడూ సహ వ్యవస్థాపకురారులు హెటల్ పాండ్యా ఒకరు. ప్యానల్ 'తర్వాత తరం బిలియన్ ప్రజలకు వాస్తవాలను తెలియచేడం ఎలా? అనే అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్‌లో ఆమె కూడా ఉన్నారు. ఔత్సాహిక వెంచర్లుగా మొదలై... ఉన్నత స్థాయికి పరుగులు పెడుతన్న కంపెనీలకు చెందిన ఆంట్రప్రెన్యూర్స్ పాల్గొన్నారు.

ముంబైలో పుట్టి పెరిగిన హెటల్... బాంబే యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. ఆమె పేరెంట్స్ ఇద్దరికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న స్టార్టప్స్ ఉన్నాయి. విద్యాభ్యాసం, ప్రొఫెషనల్ స్థాయికి ఎదగడంలో... వీరు కీలక పాత్ర పోషించారు.

“ప్రతీ రోజు వారిని చూడ్డంతో నేను చాలా నేర్చుకున్నా. స్టార్టప్‌ల కోసం చాలా త్యాగాలు చేయాలి. కమిట్‌మెంట్స్ పూర్తి చేయాలి. ఏళ్ల తరబడి ఎలాంటి వెకేషన్స్ లేకుండా గడపాల్సి రావచ్చు. బంధువుల వేడుకలను కూడా మిస్ అయ్యే పరిస్థితి వచ్చినా రావచ్చు. ప్రేమించేవారితో మనసారా గడిపే సమయం కూడా చిక్కకపోవచ్చు. అయినా సరే స్టార్టప్ ఒకటే జీవితాన్ని నడిపించేయగలదు. ప్రతీ అంశాన్ని పర్ఫెక్ట్‌గా పూర్తి చేయడం అలవడుతుంది”అంటున్నారు హెటల్.

ఈజీకి ముందు హెటల్ ఇలా...

ఈజిలీ డూ ప్రారంభానికి ముందు.. నార్టెల్, మైక్రోసాఫ్ట్‌లలో తగినంత కాలం పని చేశారు హెటల్. తర్వాత కాలిఫోర్నియా, సన్నీవేల్‌లోని నువాన్స్ కమ్యూనికేషన్స్‌లో జాయిన్ అయ్యారు. ఇక్కడ నాలుగేళ్లపాటు పని చేశాక... ఈజిలీడూ నిర్మాణం, అభివృద్ధి వైపు మళ్లారు హెటల్.

“ఏదైనా స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి, కొత్తగా వెంచర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినపుడు.. దిగులుగాను, భయంగానూ ఉంటుంది. అది కూడా కేవలం ఒకరిద్దరితో మొదలైనపుడు అనుమానాలు కూడా ఎక్కువగానే ఉంటాయి” అన్నారు హెటల్. ఇక్కడ ఆమెకు కలిసొచ్చిన విషయం సీరియల్ ఆంట్రప్రెన్యూర్ మైకేల్ బెర్నర్... ఈ ప్రాజెక్టుకు సహ వ్యవస్థాపకునిగా జత కావడం. మరోవైపు భర్త దుష్యంత్ నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందాయంటారు హెటల్.

ఇదే ఈజిలీ డూ

2011 జనవరిలో కాలిఫోర్నియా, మెన్‌లోపార్క్, శాండ్‌హిల్ రోడ్‌లోని వెంచర్ కేపటలిస్ట్ ఫర్మ్‌లో... ఈజిలీడూ ప్రారంభమైంది. నలుగుగురు ఉద్యోగులతో మొదలైన ఈ వెంచర్.... తొలిసారి నిధుల సమీకరణ చేసిన తర్వాత... మౌంటెన్ వ్యూ ప్రాంతంలోని సొంత కార్యాలయానికి మారింది. అదే సమయంలో ఏషియాలోనూ ఒక టీం ఏర్పాటైంది.

“ప్రస్తుతం 25మందికి పైగా టీం ఉన్నాం. మేమంతా ఒకరితో ఒకరు కలిసి పని చేసేందుకు ఇష్టపడతాం. కొత్త విషయాలను సృష్టించాలనే తపన ఉండి, ఎంతసేపైనా ఆఫీస్‌లో గడిపేందుకు ఇష్టపడే వ్యక్తులతో కలిసి పని చేయడం చాలా థ్రిల్లింగ్‍‌గా ఉంటుంది. నాకు ఈజిలీడూ అలాంటిదే. స్ఫూర్తి నింపగలిగితే... తన సభ్యులతో టీం లీడర్స్ అద్భుతాలు సృష్టించగలరు” అన్నారు హెటల్.

స్మార్ట్‌ఫోన్లు గల వారంతా ఈమెయిల్స్, కేలండర్స్, కాంటాక్ట్స్, సోషల్ నెట్వర్క్‌లతో అవసరానికి మించి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడిది హైపర్ కనెక్టివిటీ స్థాయికి చేరిపోవడంతో... తమ ఫోన్లలో యాప్స్‌ను నియంత్రించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు చాలా మంది. రోజూ తాము చూసే సైట్స్ సంఖ్యను కూడా అదుపులో పెట్టాలని అనుకుంటున్నారు.

“ఒక ప్లేన్‌లో ప్రయాణించాలంటే... ఆ ఫ్లైట్ అలర్ట్స్ పొందడానికి అదే కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోనవరం లేదు. మేం రూపొందించిన ఈజిలీడూ చేసేది కూడా ఇదే.”

ఐఫోన్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంది ఈజిలీడూ. అంతేకాదు జీమెయిల్ కోసం కూడా ప్రత్యేకమైన సర్వీస్ రూపొందించారు. కేలండర్, ఈమెయిల్, సోషల్ నెట్వర్క్‌ల ద్వారా.. తగిన సమాచారం సేకరించి అందిస్తుంది. వీటిన్నిటినీ ఒక చోటకు తెచ్చి, సింపుల్‌గా వాటిని కంప్లీట్ చేసే అవకాశం కల్పిస్తుంది. దీంతో అనేక యాప్‌లపై, సైట్లపై ఎక్కువ టైం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. ఒకసారి కనెక్ట్ అయ్యాక... తాము ఉపయోగించే ఇతర యాప్స్‌ను కూడా లింక్ చేసేందుకు కస్టమర్లు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లింకేజ్ ఎక్కువగా పెరుగుతోంది. అన్ని ప్లాట్‌ఫాంలలోని మొబైల్ యాప్ స్టోర్స్ నుంచి ఈజిలీడూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

image


“మేం ఈ యాప్‌ను మొదట లాంఛ్ చేసినపుడు... స్మార్ట్ అసిస్టెంట్ అనే కాన్సెప్ట్ చాలా మందికి అర్ధం కాలేదు. అయితే కొన్ని నెలల్లోనే యూజర్ల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. అక్కడే మా సక్సెస్ ప్రారంభమైంది”అన్నారు హెటల్ పాండ్యా. 

లాంఛ్ అయిన దగ్గరనుంచి చాలాకాలంపాటు అనేక దేశాల్లో టాప్ కేటగిరీలో ఉంది ఈ యాప్. తమ కస్టమర్ల సంఖ్యను ఖచ్చితంగా ప్రకటించలేదు ఈజిలీడూ. అయితే ఐదుకోట్లపై టాస్క్‌లను పూర్తి చేశామని, 50ఏళ్లకు పైగా యూజర్ల సమయాన్ని ఆదా చేశామని తెలిపింది.

“ప్రతీ స్మార్ట్‌ఫోన్‌‍లోనూ ఉండాల్సిన యాప్ ఈజిలీడూ. రోజువారీ కార్యకలాపాల్లో ప్రతీరోజూ ఉపయోగపడే స్మార్ట్ అసిస్టెంట్. ఈ విభాగంలో లీడర్ మా యాప్” అంటున్నారు హెటల్.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags