సంకలనాలు
Telugu

వీళ్లకి కనెక్ట్ అయ్యారంటే మీరొక కంపెనీకి ఓనర్ అయినట్టే..!!

6th Jun 2017
Add to
Shares
12
Comments
Share This
Add to
Shares
12
Comments
Share

అనకూడదుగానీ, మన దగ్గర ఒక చెడ్డ అలవాటుంది. ఏదైనా సమస్య వస్తే వెంటనే కంప్లయింట్ ఎవరికి చేయాలి అని ఆలోచిస్తాం. వాళ్లొచ్చి సాల్వ్ చేసేదాకా చేతులు కట్టుకుని కూచుంటాం. అంతేగానీ, దాన్ని మనవంతుగా పరిష్కరించలేమా అని ప్రయత్నించం. మనకు మొదట్నుంచీ ఉన్న ప్రాబ్లమే అది. ఇండియాలో అలాంటి ప్రాబ్లమ్ సొల్యూషన్ కల్చర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది ఐబీ హబ్స్.

image


టెక్నాలజీ ఒక్కటే సరిపోదు.. సమస్య చుట్టుముట్టగానే పరిష్కారం కోసం వెతికే మేథస్సు కూడా దేశానికి కావాలి. యూత్ ని ఆ డైరెక్షన్ లో ముందుకు తీసుకెళ్లే ప్లాట్ ఫాం క్రియేట్ చేస్తోంది ఐ హబ్స్. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే.. ఐబీ హబ్స్ లో ఎవరైనా స్టార్టప్ ఐడియాతో వస్తే ఎంటు టు ఎండ్ అసిస్టెన్స్ ఇస్తారు. ఐడియాను డెవలప్ చేస్తారు. బిజినెస్ మోడల్ క్రియేట్ చేస్తారు. మెంటారింగ్ ఇప్పిస్తారు. అవసరమైతే ఫండింగ్ ఫెసిలిటేట్ చేస్తారు. లీగల్ సపోర్ట్ ఇస్తారు. ఇలా ఒక ఆలోచనకు అన్ని కోణాల్లో అవసరమైన మద్దతు ఇస్తారు.

దీంతోపాటు స్టార్టప్ స్కూల్ పేరుతో మరో అవేర్ నెస్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే విద్యార్ధి దశలోనే స్టార్టప్ ఐడియాతో ముందుకు వచ్చిన వాళ్లకు సపోర్ట్ ఇచ్చే ప్రోగ్రాం ఇది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 500 అప్లికేషన్లు వచ్చాయి. చిన్నపిల్లల్లో కూడా ఆంట్రప్రెన్యూర్ షిప్ మీద అవగాహన తేవడానికి స్టార్టప్ కిండర్ గార్టెన్ అనే ప్రోగ్రాం చేపట్టారు.

ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే కాదు.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ పవర్-2 పేరుతో అవేర్ నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా మల్టిపుల్ యాంగిల్స్ లో వర్క్ చేస్తున్నారు. అనేక అకాడమిక్ ఇన్ స్టిట్యూషన్స్ కి వెళ్తూ వాళ్లతో కలిసి వర్క్ చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలతో కూడా కలిసి పనిచేస్తున్నారు. స్టార్టప్ ఐడియా ఒక్క ఇండియాలో మాత్రమే వర్కవుట్ అయ్యేలా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా దాన్ని స్కేలప్ చేయడానికి అవసరమైన మెంటారింగ్ ఇస్తారు.

ఫస్ట్ ఫేజ్ లో యూఎస్‌ఏ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్ లో ఏర్పాటు చేశారు. తర్వాతి దశలో మరికొన్ని దేశాలను ఎంచుకుంటారు. దేశవ్యాప్తంగా 2019కల్లా 2,500 సెంటర్లను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ 7 రాష్ట్రాల్లో 30 ఐబీ హబ్స్ ఏర్పాటు చేశారు. టీమ్ మొత్తం 1000 మంది ఉన్నారు. అందులో 200 మంది ఫుల్ టైం పనిచేస్తున్నారు. యూత్ ఎంపవర్ మెంట్ మీద గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఐబీ హబ్స్ చీఫ్ మెంటార్. మిగతా అందరూ ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, బిట్స్ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి వచ్చిన వాళ్లే. ఇండియాని ట్రాన్స్ ఫామ్ చేయాలి అన్నదే మా సిద్ధాంతం అంటారు ఐబీ హబ్స్ సీఈవో అలేఖ్య.

ప్రస్తుతానికి సైబర్ ఐ, మేక్ ద వరల్డ్ వండర్ ఫుల్, డిజిబి, ఫ్యాబ్యులిస్ట్, ఈజీగాడీ, డాల్ఫినో, క్రిషియోగ్ అనే స్టార్టప్ లకు ఐబీ హబ్ మద్దతుగా నిలిచింది. వీళ్ల మెంటార్ కమ్యూనిటీలో దేశవ్యాప్తంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, ఆర్ధిక నిపుణులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఐఐటీయన్లు, సాఫ్ట్ వేర్ నిపుణులు, ఫండ్ అడ్వయిజర్లు ఉన్నారు. కేవలం ఇండియా నుంచే కాకుండా, బెల్జియం, అమెరికా లాంటి దేశాల నుంచి మెంటారింగ్ చేయడానికి ఐబీ హబ్స్ తో ఒప్పందం చేసుకున్నారు.

తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో అన్ని జిల్లాల్లో హబ్స్ పెట్టాలనే ఆలోచనలో ఉంది ఐబీ హబ్స్. ఆంట్రప్రెన్యూర్ షిప్ అంటే ఏంటో విద్యార్ధి దశనుంచే అవేర్ నెస్ తెవాలని చూస్తున్నారు. అన్ని కాలేజీల నుంచి సుమారు 5వేల మందితో వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నారు. స్టార్టప్ అంటే ఏంటి? ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటి..? లాంటి అనేక విషయాల్లో విద్యార్ధుల్లో చైతన్యం తేవడమే వీరి ముఖ్య ఆశయం. ఎవరికైతే కనెక్ట్ అవుతారో వాళ్లను ఆ రంగంలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. అవసరమైన టెక్నాలజీ సపోర్ట్ ఇస్తారు. స్టూడెంట్స్ లో ఆంట్రప్రెన్యూరల్ మైండ్ సెట్ తీసుకురావాలన్నది తమ లక్ష్యమని.. ఓ స్టార్టప్ కి రెస్పాన్సిబిలిటీ వహిస్తున్న నీరద్ కుమార్ అంటున్నారు.

యువకులు తమంతట తామే సమస్యను పరిష్కరించుకుని ఒక సొల్యూషన్ తో బయటకి వచ్చే మైండ్ సెట్ ని కల్టివేట్ చేసే విజన్ తో ముందుకు వెళ్తున్న ఐబీ హబ్స్ తో కనెక్ట్ అయితే ఏదో కంపెనీకి ఓనర్ అవుతారనడంలో సందేహం లేదు. 

Add to
Shares
12
Comments
Share This
Add to
Shares
12
Comments
Share
Report an issue
Authors

Related Tags