క్లైంట్లను, రైటర్లను కలిపే కంటెంట్ మార్ట్

By Sri
0 CLAPS
0

మీరు మంచి రైటరా? ఎలాంటి కంటెంట్ అయినా రాయగల సత్తా ఉందా? అయితే ఈ వెబ్ సైట్ మీకోసమే.

మీరు ఎవరైనా రైటర్ కోసం వెతుకుతున్నారా? మీ సంస్థ కోసం కంటెంట్ రాసే మంచి రైటర్ కావాలా? అయితే ఈ వెబ్ సైట్ మీకు కూడా ఉపయోగపడుతోంది.

contentmart.com. గుర్గావ్ కు చెందిన ఆన్ లైన్ కంటెంట్ ప్లాట్ ఫామ్ ఇది. ప్రారంభించిన ఏడాదిలోనే 16 వేల మంది రైటర్లు, 20 వేల మంది క్లైంట్లతో సత్తా చాటుతోందీ కంపెనీ. ఈ స్టార్టప్ ని లీడ్ చేస్తోంది ఇండియన్ కాదు. పేరు ఆంటోన్ రుబులెవ్ స్కీ. ఉక్రెయిన్ దేశస్తుడు. పదహారేళ్ల వయస్సులోనే ఆంట్రప్రెన్యూర్ జర్నీ మొదలుపెట్టాడు. ఉక్రెయిన్ లో మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ కు సంబంధించిన రెండు కంపెనీలు ప్రారంభించాడు. అవి సక్సెస్ అవగానే అమ్మేశాడు. ఆ తర్వాత ఆటోమొబైల్ రంగంలో ఓ వెబ్ సైట్ ప్రారంభించాడు. ఇప్పటికీ నడుస్తోంది. అయితే ఉక్రెయిన్ లో ఈ రంగంలో వృద్ధి కనిపించకపోవడం అతడిని నిరాశపర్చింది. ఇండియాలో అయితే ఆటోమొబైల్ మార్కెట్ వృద్ధి ఎక్కువ. దీంతో 2013లో ఆంటోన్ ఇండియాలో ల్యాండయ్యాడు. autoportal.com, bikeportal.in ప్రారంభించాడు. ఇండియాలో ఆంట్రప్రెన్యూరల్ యాక్టివిటీస్ ఓ రేంజ్ లో సాగుతుండటం చూసి మరో స్టార్టప్ కు రిబ్బన్ కట్ చేశాడు. అదే కంటెంట్ మార్ట్. ఆగస్టు 2015లో 29 ఏళ్ల వయస్సులో ఆంటోన్ ఈ స్టార్టప్ ని ప్రారంభించాడు. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపీరైటర్స్ ని, క్లైంట్లను ఏకతాటిపైకి తెచ్చే ప్లాట్ ఫామ్ ఇది.


ఆంటోన్ రుబులెవ్ స్కీ, కంటెంట్ మార్ట్ ఫౌండర్, సీఈఓ

ఈ స్టార్టప్ ఆలోచన రావడానికి తను ఎదుర్కొన్న ఇబ్బందులే కారణం. ఉక్రెయిన్ లో పలు స్టార్టప్స్ తో మాయాజాలం చూపిన ఆంటోన్... ఔట్ సోర్స్ కంటెంట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడే బుర్రలో ఈ ఐడియా వచ్చింది. కంటెంట్ సర్వీసులు పొందాలనుకునే వారిని, అందించేవారిని ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. డిమాండ్ కు తగ్గట్టుగా నాణ్యమైన కంటెంట్ అందించే ప్లాట్ ఫామ్ తయారు చేయాలన్న ఆలోచనతో అడుగులు వేశాడు. ఫిబ్రవరి 2016లో ఆంటోన్ కు వికాస్ త్రివేది జత కలిశాడు. ఆయనే ప్రస్తుతం కంటెంట్ మార్ట్ బిజినెస్ హెడ్. కంటెంట్ మార్ట్ కు ముందు వికాస్ Autoportal.com, Bikeportal.in లో మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేశారు. డిజిటల్ మార్కెటింగ్ లో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. గ్వాలియర్ లోని జివాజీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పొందిన వికాస్... భోపాల్ లోని రాజీవ్ గాంధీ టెక్నికల్ యూనివర్సిటీలో ఎంసీఏ చేశారు.


కంటెంట్ మార్ట్ టీమ్

ఫ్రీలాన్సర్ రైటర్ కోసం చూస్తున్నారా?

ఎవరైనా కంటెంట్ కోసం చూస్తున్నారా? అయితే కంటెంట్ మార్ట్ లో క్లైంట్ గా రిజిస్టర్ చేసుకోవాలి. వారి ఆర్డర్ ను పోస్ట్ చేయాలి. తర్వాత బిడ్స్ రిసీవ్ చేసుకుంటారు. వ్యాలెట్ రీచార్జ్ చేసిన తర్వాత నచ్చిన రైటర్ కు ఆర్డర్ ఇవ్వొచ్చు. రైటర్ కు క్లైంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత... ఆ ఆర్డర్ కు సంబంధించిన డబ్బులు క్లైంట్ వ్యాలెట్ లో బ్లాక్ చేస్తారు. నాణ్యమైన కంటెంట్ పొందామని క్లైంట్ ధృవీకరించిన తర్వాత పేమెంట్ రచయిత అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేస్తారు. క్లైంట్లకు నాణ్యమైన కంటెంట్ అందించడమే కాదు, కంటెంట్ కొనడంలో ఇబ్బందులు లేకుండా చూడటం, రైటర్స్ డబ్బులు సంపాదించేలా సాయం చేయడం కంటెంట్ మార్ట్ లక్ష్యం. ఇక కాపీరైటర్ల విషయానికొస్తే... ప్రతీ రైటర్ ఇంగ్లీష్ టెస్ట్ పాస్ కావడం తప్పనిసరి. ఇంగ్లీష్ తో పాటు 15 ప్రాంతీయ భాషల్లో ఒకదాంట్లో టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు కంటెంట్ అందిస్తున్న కంటెంట్ మార్ట్... PHP, MySQL, Nginx, Symfony framework లాంటి సంస్థలకు సేవలందిస్తోంది. ఇప్పటివరకు కంటెంట్ మార్ట్ ఐదు వేలకు పైగా ఆర్డర్లు పూర్తి చేసింది. 16 వేల మంది రిజిస్టర్డ్ రైటర్స్ ఉన్నారు. 20 వేల మందికి పైగా క్లైంట్ల సబ్ స్క్రిప్షన్స్ ఉన్నాయి.

"ప్రస్తుతం మేము మా ప్లాట్ ఫామ్ ఉపయోగించుకుంటున్న క్లైంట్ల నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు, కమిషన్ తీసుకోవట్లేదు. కానీ Contentmart.com ద్వారా ఆర్డర్లు పొందుతున్నందుకు రైటర్స్ నుంచి 10 శాతం కమిషన్ తీసుకుంటున్నాం"- వికాస్.

పలు భాషల్లో కంటెంట్

కంటెంట్ మార్ట్ ప్రస్తుతం భారతీయ రైటర్లపైనే దృష్టిపెట్టింది. ముఖ్యంగా మహిళా రచయితలు (గృహిణులు) ఎక్కువగా రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ ప్లాట్ ఫామ్ త్వరలో అంతర్జాతీయ రైటర్లు, ఎడిటర్లను ఆహ్వానించనుంది. ప్రస్తుతం ఈ స్టార్టప్ కోసం గుర్గావ్, ఉక్రెయిన్ లో 40 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ రైటర్స్ కు మాత్రమే పరిమితమైనా... కంటెంట్ బయ్యర్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంటోంది. కొన్ని నెలల్లో కంటెంట్ మార్ట్... హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, మళయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో సేవలందించనుంది. ఇన్ఫోగ్రాఫిక్స్, ట్రాన్స్ లేషన్ సర్వీసెస్ అందిస్తున్న కంటెంట్ మార్ట్... క్లైంట్ల అవసరాలకు తగ్గట్టుగా ఎంపిక చేసిన రైటర్లకు మాత్రమే అవకాశమిస్తోంది. పరిశోధన చేసి, నాణ్యమైన, టెక్నికల్ కంటెంట్ రాసేవారిని ఎంపిక చేస్తోంది.


undefined

ఫ్రీలాన్సింగ్ మార్కెట్

ద పయోనీర్ రిపోర్ట్ ప్రకారం... భారతదేశంలోని ఫ్రీలాన్సర్లు సగటున గంటకు 19 డాలర్లు ఛార్జ్ చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రీలాన్సర్ల సగటుకు రెండు డాలర్లు తక్కువ. భారతదేశంలో ఫ్రీలాన్సర్ మార్కెట్ లో ప్రధానంగా పురుషాధిక్యత కనిపిస్తోంది. 78 శాతం మంది పురుషులు ఉంటే... మహిళలు కేవలం 22 శాతం మంది మాత్రమే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాస్తూ, అనువదిస్తున్న ఫ్రీలాన్సర్ల ఆదాయ సంతృప్తిస్థాయి 46 శాతం ఉంది. 46 శాతం మంది ఆన్ లైన్ సంస్థల ద్వారా ఉద్యోగాలు పొందినవాళ్లే. మొత్తం ఫ్రీలాన్సర్స్ లో 20-30 ఏళ్ల వాళ్లు 85 శాతం మంది ఉండటం విశేషం. Lexiconn, Writerbay, Indian freelance writers, WorknHire, Lekhaka లాంటి ఫ్రీలాన్సింగ్ సంస్థలు ఇలాంటి సేవలే అందిస్తూ... మార్కెట్ లో భారీ వృద్ధికి కారణమవుతున్నాయి. డబ్బు సంపాదించేందుకు నమ్మకమైన సంస్థలు లేక ఇబ్బందులు పడుతున్న ఫ్రీలాన్స్ ప్రొఫెషనల్స్ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తున్నాయి ఈ ప్లాట్ ఫామ్స్.

Latest

Updates from around the world