సంకలనాలు
Telugu

మీ టేస్ట్‌కి తగిన ఆర్టిస్ట్ డిజైన్స్ కోసం పెయింట్ కాలర్‌ సిద్ధం

ఒకే వేదికపైకి విభిన్న ఆర్టిస్టులువాళ్లు డిజైన్ చేసిన ఆర్ట్ అమ్మకంఈ డిజైన్‌తో పోస్టర్స్,టీ షర్ట్స్, ల్యాప్‌టాప్ కవర్స్ ఆర్టిస్టులకు డబ్బుతో పాటు గుర్తింపుకొనుగోలుదార్లకు కొత్త తరహా డిజైన్లుఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనే పెయింట్ కాలర్

team ys telugu
24th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఔత్సాహిక చిత్రకారులకోసం ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు తామరతంపరగా పుట్టుకొచ్చి కస్టమర్లను గందరగోళపరుస్తున్నాయి. ఆత్మ, సౌందర్యం లేని నకళ్లతో మీ ఇంటిని వర్ణమయం చేస్తామని వాగ్దానాలు గుప్పిస్తుంటాయి. కానీ, కళాకారుల అత్మావిష్కరణ, సృజనాత్మకత ఎక్కడుంది ? ఆ లోటు తీర్చే ప్రయత్నంలోనే పెయింట్‌కాలర్‌ ఆవిర్భవించింది. అయిదుగురు ఔత్సాహిక ఇంజినీర్లు ఆరంభించిన ఈ సంస్థ ఆర్టిస్టుల స్వావలంబనకు దోహదపడుతోంది. అలాగే, సాధారణ వ్యక్తి సైతం తన స్తోమతకు తగ్గట్టుగా అసలైన అందమైన ఆర్ట్‌ని సొంతం చేసుకోగలుగుతాడు.

image


బట్టలు, మర్కండైజ్‌ (నేరుగా రిటైల్‌ షాపుల్లో ప్రమోట్‌ చేసుకునే సరుకులు/వస్తువులు)కోసం దుకాణాల చుట్టూ తిరిగే అలవాటును మార్పించి, అన్‌లైన్‌ ద్వారా తమ అభిరుచికి సరితూగేవి కొనిపించడం కూడా వీరి ఉద్దేశం. యూజర్లకు కావలసిన బట్టలు లేదా మర్కండైజ్‌ మీద, వారు ఎంచుకునే ఆర్ట్‌ను అనుసృజన చేసి తగు లాభానికి అందజేస్తారు. ఇందుకుగాను, ఆర్టిస్టులకు కొంత మొత్తం అందుతుంది. పెయింట్‌కాలర్‌ వారు పోస్టర్‌ ప్రింట్స్‌, కాన్వాస్‌ ప్రింట్స్‌, లాప్‌టాప్‌ స్కిన్స్‌, టి-షర్టులతో ఆరంభమైంది. మొబైల్‌ కేసులవంటివికూడా తమ ఆన్‌లైన్‌ స్టోరులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

పెయింట్‌కాలర్‌ ఎలా పనిచేస్తుంది ?

image


ఆర్టిస్టులు తమ ఆర్ట్‌ వర్కుతో మర్కండైజ్‌ను రూపొందిస్తారు. దీనికోసం ఒక ప్రత్యేక డిజైన్‌ టూల్‌ తయారు చేశారు. ఆ తర్వాత మా ప్రొడక్ట్‌ టెంప్లేట్లలో ఆ డిజైన్‌ని అప్‌ లోడ్‌ చేస్తారు. తమ అంచనానుబట్టి డిజైన్‌ రేటును ఆర్టిస్టులే నిర్ణయించుకుంటారు. మేము కస్టమర్లకు అమ్మేటప్పుడు దాని అసలు రేటుకు డిజైనర్‌ మార్జిన్‌కూడా జోడిస్తాం. అసలు రేటులో మా అన్ని సర్వీసు చార్జిలు ఇమిడి ఉంటాయి. ప్రతి నెలా ఆర్టిస్టులకు లెక్కచూసి వారి అకౌంటులో జమ చేస్తాం. ఏదైనా ఆర్ట్‌ అమ్ముడుపోయినప్పుడు దాని సృష్టికర్తయిన ఆర్టిస్టుకి ఈమెయిల్‌ పంపుతాం. దీనివల్ల ఆర్టిస్టులు తమ అమ్మకాల జాబితానుకూడా చూసుకోవచ్చు.

ఈ ఆలోచనకు బీజం ఎక్కడ పడిందంటే...?

ఏదైనా విభిన్నంగా చేయాలన్న అయిదుగురు ఇంజినీర్ల బుర్రలో మెదిలిన ఆలోచన ఇది. మొదట్లో ఒక ఈ-కామర్స్‌ మర్కండైజ్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాలనుకున్నాం కానీ, అప్పటికే బోలెడంతమంది ఈ రంగంలో ఉన్నారని తెలిసింది. దాంతో దేశవ్యాప్తంగాగల ఆర్టిస్టుల నుంచి డిజైన్లు సేకరించాలనుకున్నాం. ఆర్టిస్టులు తమ కళను నేరుగా మర్కండైజ్‌ (తామే ప్రమోట్‌ చేసుకోవడంద్వారా) జనానికి అమ్ముకోవచ్చని గుర్తించాం. ఇప్పుడున్న కంపెనీలు వేటికీ బలమైన ఉత్పాదక సామర్థ్యం లేదు. చాలా తర్జనభర్జనల దరిమిలా ఆర్టిస్టులు తమ సృజనాత్మకతను జనంలో పంచుకోవడానికి, అమ్ముకోవడానికి, లాభపడడానికి అనువైన విభిన్న తరహా ఈ-కామర్స్‌ స్థాపించాలని తీర్మానించుకున్నాం.

ఇట్స్‌ హేండ్‌ మేడ్‌, ఎట్సి వంటి భారతీయ కంపెనీలున్నాయి కదా ?

ఎట్సి, ఇట్స్‌ హేండ్‌ మేడ్‌ వంటివి యూజర్లు అడిగిన హస్తకళాకృత ఉత్పాదనలు అమ్ముతాయి తప్ప, వాటికంటూ సొంత తయారీ లేదు. దీనివల్ల ఆర్టిస్టులు, డిజైనర్లు సొంతంగా టి-షర్టులు, పోస్టర్లు తయారు చేసుకునే అవకాశం లేదు. ఇదంతా మేము మార్కెట్‌ రీసెర్చ్‌ చేసినప్పుడు గ్రహించాం. మున్ముందు అందించబోయే ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా యూజర్లు ఒకరికొకరు తమ అభిరుచి పంచుకుంటారు. తమ అభిమాన ఆర్టిస్టు కొత్త డిజైన్లను పరిచయం చేసుకుంటారు. అలాగే, విశ్లేషణలను కూడా సైట్‌లో పొందుపరుస్తాం. దీనివల్ల ఆర్టిస్టులు కూడా తమ పనిని మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.

image


కళాకారులకు, కళాప్రియులకు నడుమ ఉన్నారు. దీని గురించి చెప్పండి ?

పెయింట్‌కాలర్‌ అనేది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆర్టిస్టులు తమ కళను ప్రదర్శించడానికి మార్కెట్లు చేసుకోవడానికి అనువైన వేదికగా మలిచాం. అన్ని ఇతర వెబ్‌సైట్లు ఆర్టిస్టుల చిత్రాలను తీసుకుని స్వల్ప మొత్తాన్ని ఒకేసారి చెల్లించేస్తాయి. వాటిపై ఆర్టిస్టుకి కాపీరైట్‌కూడా మిగలదు. పెయింట్‌కాలర్‌ దీనికి భిన్నమైంది. పైగా, ఆర్టిస్టులకు ఉచితంగా సేవలు అందుతున్నాయి. పెయింట్‌కాలర్‌ ద్వారా అమ్మిన ప్రొడక్టులకు సంబంధించి ఆర్టిస్టుల నుంచి పైసా తీసుకోము. మరో గొప్ప విషయమేమిటంటే, దీనిలో చేరిన ఆర్టిస్టులు కొత్త కొత్త డిజైన్లు చేర్చుకుని కస్టమర్ల ఎంపికకు అవకాశాన్ని పెంచవచ్చు. మా కేటలాగు రోజురోజుకీ పెరుగుతోంది!

కొన్ని కొన్ని సార్లు ఇదికూడా అన్ని వెబ్‌సైట్లలాంటిదేనని ఆర్టిస్టులు భావించడం పరిపాటి. అయితే, ఇతర వెబ్‌సైట్లతో మా సైట్‌ని పోల్చుకున్నాక, ఆర్టిస్టులు మావైపే మొగ్గుచూపుతున్నారు. ఇది సంశయాన్ని సంభ్రమాశ్చర్యాల్లోకి మళ్లించడమే!

image


మీ టీమ్‌ గురించి చెప్పండి ?

పెయింట్‌ కాలర్‌ అయిదుగురం స్థాపించినది. మేమందరం 2013 ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లమే. మాలో ముగ్గురు ఎన్‌ఐటి తిరుచ్చి నుంచి, ఇద్దరు విఎన్‌ఐటి నాగపూర్‌నుంచి వచ్చాం. ఈ అయిదుగురిలో నలుగురు ముంబైలో ఒక కంపెనీలో పనిచేసినవాళ్లు. కార్పొరేట్‌ సంస్థల్లో గొడ్డు చాకిరీ చేశాక, మనమే ఎందుకు ఓ సంస్థ పెట్టుకోకూడదనిపించింది. మా ఆలోచనను మరో మిత్రుడితో పంచుకున్నాం. ఆ విధంగా మేము అయిదుగురం కలిసి పెయింట్‌కాలర్‌ స్థాపించాం.

ఒక క్రియేటివ్‌ హెడ్‌, ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజినీర్‌, సహాయకులతో కలిసి టీమ్‌ ఏర్పడ్డాం.

మార్కెట్టులో ఈ-కామర్స్‌ ఒక ఆటలా మారింది. ఈ పరిస్థితుల్లో మీరు ఇందులో ప్రవేశించడం వెనుకున్న ఆలోచనలేమిటి? పెయింట్‌కాలర్‌ అనేది నైరూప్య భావన. మరి, ఈ ఊహాత్మక కాన్సెప్ట్‌ ఇప్పటికే పాతుకుపోయిన వాళ్లతో పోటీ పడగలదనుకున్నారా? కష్టమనుకోలేదా?

మార్కెట్టుకి ఒక కొత్తదనాన్ని అందించగలిగాం. ఆర్టిస్టులు తమ సృజనాత్మకతకు ఒక వేదికగా పెయింట్‌కాలర్‌ని ఎంచుకుంటున్నారు. అందుకు తగ్గ ప్రోత్సాహకాలు కల్పించాం. వాళ్ల కల్పనకు పెద్దమొత్తంలో కుర్రకారు గుర్తింపు దొరుకుతోంది. ఆర్టిస్టులు ఆశించిన ధర దక్కుతోంది. తమ పనికి కాపీరైట్‌ కూడా పొందగలుగుతున్నారు.

మర్కండైజ్‌ మార్కెట్టులో మేము ప్రత్యేక స్థానంలో నిలుస్తామన్న నమ్మకం మాకుంది. కుప్పలు తెప్పలుగా మార్కెట్టులోకి డిజైన్లు వచ్చిపడుతున్న తరుణంలో... పెయింట్‌కాలర్‌ సరైన చిత్రకళను చూపిస్తోంది. అసంఖ్యాక డిజైన్లు, అలాగే ప్రత్యేక రకాల్లో సింగిల్‌ డిజైన్‌ దొరుకుతుంది. కస్టమర్లకు ఇంతకంటే మంచి అవకాశం ఏదైనా ఉందా ? అన్నిటికీ మించి, ఆర్టిస్టులు తమ రకాలను తాము ప్రమోట్‌ చేసుకుంటారు. ప్రతి అమ్మకంపైనా వారికి చెల్లింపులుంటాయి. దీంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి.

ముంబైకి చెందిన రెండు దిగ్గజాల్లాంటి మెటల్‌ బ్యాండ్లు తమ సరుకును పెయింట్‌కాలర్‌లోనే విడుదల చేశాయి. ఇది ఇండియన్‌ మెటల్‌ మ్యూజిక్‌ రంగంలోనే పెద్ద సంచలనం. దేశవ్యాప్తంగాగల మెటల్‌ మ్యూజిక్‌ అభిమానులు తమ ఫేవరైట్‌ బ్యాండ్లు గుమ్మంలోనే అందేసరికి ఉబ్బితబ్బిబు అవుతున్నారు. ఈ రంగంలోనే మేము మరింత లోతుగా చొచ్చుకుపోవాలనుకుంటున్నాం. దేశంలో చాలా బ్యాండ్లు మంచి సంగీతాన్ని అందిస్తున్నాయి. అభిమానులు వారి సరుకులను కొనడంద్వారా వాళ్లకు మద్దతునివ్వడానికి రెడీగా ఉన్నారు. సంగీతంకూడా ఒక ఆర్టే కదా?

పెయింట్‌కాలర్‌ ఏర్పాటు, నిర్వహణలో ఎదురైన సవాళ్లేమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు ?

మార్కెట్టు పరిశీలన, ఉత్పత్తుల మెరుగుదల... ఇవే మాకు పెను సవాళ్లు. ప్రస్తుత ఆన్‌లైన్‌ మర్కండైజ్‌ మార్కెట్టుని అధ్యయనం చేయడంలోనే నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత మేము గుర్తించిన సమస్యలను తట్టుకుంటూ మేలిమి ఉత్పత్తులను సాధించడం మరో సవాలు. ఇక, మా వెబ్‌సైట్‌ని ఏదో ఆషామాషీ ఈ-కామర్స్‌ సైట్‌లా కాకుండా అత్యుత్తమంగా రూపొందించాం. ఇతర మర్కండైజ్‌ వెబ్‌సైట్లతో పోలిస్తే మా సైట్‌ యూజర్‌తో చక్కటి సమన్వయంగలదని గర్వంగా చెప్పగలం. మరో పెద్ద సవాల్‌ ఏమిటంటే, కస్టమర్‌ కోరినట్టుగా ప్రింట్ చేసి ఇవ్వడం. పెయింట్‌కాలర్‌ సైట్‌లో వందలాది ఆర్టిస్టులు డిజైన్లను రూపొందిస్తుంటారు. నిత్యం కొత్త కొత్త డిజైన్లు చేరుతుంటాయి. ప్రతి ఒక్కదానికి జాబితా ఉంచుకోలేం. అయినప్పటికీ, మాకు ఆర్డర్‌ రాగానే, చకచకా తయారు చేసి, కస్టమర్‌కి అందజేస్తాం.

మేము ఇంజినీరింగ్‌ పట్టభద్రులం కావడంవల్ల, మాకు వ్యాపార తెలివితేటలు ఏమీ లేవు. ఊహించినదానికంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. అయితేనేం, మా తప్పుల నుంచి మేము అద్భుత అనుభవాన్ని గడించాం.

మీ పురోగతి ఎలా ఉంది? మీరనుకున్న ప్రాథమిక లక్ష్యాలేమైనా సాధించగలిగారా?

మార్కెట్టులోకి వచ్చిన నెల రోజుల్లోనే 300కి పైగా డిజైన్లను అమ్మగలిగాం. ఇది మున్ముందు కొత్త ఆడియన్స్‌ని చేరడానికి బ్రహ్మాండంగా కనిపించింది. తగినంత ఆదాయాన్నికూడా పొందగలిగాం. రాక్‌, మెటల్‌ బ్యాండ్లు అంటే మేము బాగా ఇష్టపడతాం. ఆ జానర్‌లో చాలా డిమాండ్‌ ఉంది. మేము వాటినే అమ్మాలనుకుంటున్నాం. ముంబైకి చెందిన రెండు ఐకానిక్ బ్యాండ్స్‌ తమ టి-షర్టులను మా ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఇంకా కొంతమందితో సంప్రదింపులు జరుపుతున్నాం.

మార్కెటింగ్‌ నుంచి టెక్నాలజీ వరకు ప్రతి ఒక్క రంగంలోనూ చాలా పాఠాలు నేర్చుకున్నాం. మీ ఉత్పత్తి ఎంత గొప్పదైనా కావచ్చుగాక, అది ఆకర్షణీయంగా లేకపోయినా, వేసుకోవడానికి అనువుగా లేకున్నా జనం ఇష్టపడరు. మేము ఒక టెక్‌ కంపెనీ మాదిరిగా మర్కండైజింగ్‌ కంపెనీని నిర్వహిస్తున్నాం. యూజర్‌ ఫ్రెండ్లీ టెక్నాలజీని వాడాలన్నది మా పెయింట్‌కాలర్‌ సిద్ధాంతం. చూడగానే ఆకట్టుకుని, వేసుకునేలా ఉండడమే మా యుఎస్‌పి.

image


పెయింట్‌కాలర్‌ నిధుల సేకరణ

పెయింట్‌కాలర్‌ ఇంతవరకూ పూర్తిగా ఎదుగుదల సాధించిన స్టార్టప్‌. వేగంగా పురోగతి సాధించడానికి తగిన వనరుల వెదుకులాట, పెద్ద టీమ్‌ కోసం చూస్తున్నాం. సిరీస్‌ ఏ ఫండింగ్‌ నిమిత్తం సమగ్ర బిజినెస్‌ ప్రణాళిక సిద్ధంగా ఉంది.

పెయింట్‌ కాలర్‌ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

చాలా ఉద్వేగభరితంగా ఉండబోతోంది. సిరీస్‌ ఏ ఫండింగ్‌ కోసం చూస్తున్నాం. ఇండియన్‌ మార్కెట్టులో ప్రధాన వాణిజ్య సంస్థగా పెయింట్‌కాలర్‌ని తీర్చిదిద్దడానికి ఈ ఫండింగ్‌ సాయపడుతుంది. పెయింట్‌కాలర్‌ని ఒక బ్రాండ్‌గా నిలబెట్టి, కస్టమర్లు స్వయంగా వచ్చి కొనుగోలు చేసేలా రిటైల్‌ మార్కెట్టులోకి ప్రవేశించాలనుకుంటున్నాం. ఇంకా మా వెబ్‌సైట్‌లో మరిన్ని మార్పులు చేర్పులు చేస్తాం. ఆర్టిస్టులకు అనువుగా చాలా ఉత్పాదనలను ప్రవేశపెడతాం. వెబ్‌ సైట్‌ వినియోగదారులకోసం నోటిఫికేషన్లు, వార్తా సమాచారం, విశ్లేషణలు అందజేయాలనుకుంటున్నాం. దీనివల్ల తమ కళాఖండాల అమ్మకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతుంది. అలాగే, తమ మార్కెటింగ్‌ వ్యూహాలను మెరుగుపరచుకోవడానికి వీలుపడుతుంది. ఇప్పటికైతే, మేము భారీగా మార్కెటింగ్‌ కాంపెయిన్‌ చేస్తున్నాం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags