సంకలనాలు
Telugu

కొత్తగా ఆలోచించండి..! చరిత్ర తిరగరాయండి..! స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోడీ పిలుపు !!

స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని స్ఫూర్తిదాయక ప్రసంగం-

team ys telugu
16th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

నీటిని చూసి భయపడితే ఈత ఎప్పటికీ రాదు. ఒకటికి రెండుసార్లు నీళ్లలో దూకితేనే ఈత అంతేంటో చూస్తాం. స్టార్టప్ ఇండియా ప్రారంభ కార్యక్రమంలోఇలాంటి స్ఫూర్తినిచ్చే గొప్ప మాటలెన్నో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. విజయం సాధిచాలంటే ఏ రంగంలో అయినా రిస్క్ తప్పదన్నారు. వైఫల్యాలు చూసి భయపడొద్దని యువతకు సందేశమిచ్చారు. నెగెటివ్ మైండ్సెట్ మార్చుకోవాలని సూచించారు. నిరాశ, నిస్పృహలను ఇసుమంత కూడా మనసులో ఉండొద్దన్నారు. ఆశావాహంగా జీవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

image


డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్లు కొత్త మార్గాలను చూడలేరు. సాహసం చేయాలనుకునేవారికి డబ్బు బైప్రొడక్ట్ మాత్రమే - ప్రధాని మోడీ

స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన ప్రధాని మోడీ- యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించేదుకు ఎన్నో వరాలు ప్రకటించారు. ప్రభుత్వం ఏమేం చేయబోతోందో యాక్షన్ ప్లాన్ వివరించారు. స్టార్టప్స్ కోసం ప్రభుత్వం 10వేల కోట్లు కేటాయిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్ ఫీజును 80 శాతం తగ్గిస్తామన్నారు. నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే స్టార్టప్ ఇండియా లక్ష్యమని తెలిపారు. యువత అంటే కేవలం ఉద్యోగం చేసేవాళ్లే కాదు ఉద్యోగాలు సృష్టికర్తలుగా మారాలని పిలుపునిచ్చారు. స్వయం ఉపాధి, స్వావలంభన ప్రోత్సాహం దిశగా కేంద్రం అడుగు వేసిందని.. 35 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశామని వెల్లడించారు.

కొలంబస్ బయల్దేరినప్పుడు ఒక్కడే. కానీ నేడు అతను ప్రపంచానికే దారిని ఇచ్చాడు- నరేంద్ర మోడీ

యువత ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. వారికి ఎన్నో కలలు కంటున్నారు. కానీ అవి సాకారమయ్యే మార్గం లేదని మోడీ అన్నారు. అందుకే కొత్త ఆలోచనలు చేసి ఉద్యోగాలు సృష్టించే యువత కోసమే స్టార్టప్ ఇండియా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. స్టార్టప్ అంటే డబ్బున్న శ్రీమంతులు చేసే పని కాదన్న మోడీ.. పిడికెడు మందికి ఉపాధి కల్పించేది కూడా స్టార్టపేనని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా అంటే భారత్లో తయారీ మాత్రమే కాదు.. భారత్ కోసం ఉత్పత్తి చేసే మేక్ ఫర్ ఇండియా అని కూడా అన్నారు. ప్రపంచంలోని పేద దేశాలకు అతి తక్కువ ధరతో వ్యాక్సిన్లు ఇచ్చే ఏకైక దేశం ఇండియానే అని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కొత్తగా ఆలోచించేవాళ్లను ప్రజలు పిచ్చవాళ్లంటారు.. కానీ అలాంటివాళ్లే చరిత్ర తిరగరాస్తారు- నరేంద్రమోడీ

ఏటా రూ. 2,500 కోట్లు ఖర్చు చేసే విధంగా రూ.10 వేల కోట్లతో స్టార్టప్ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని మోదీ తెలిపారు. స్టార్టప్లకు పన్ను రాయితీలు, మూలధన లాభ పన్నులో రాయితీతో పాటు మరెన్నో సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందన్నారు ప్రధాని మోడీ. వచ్చే బడ్జెట్ లో స్టార్టప్ ఇండియాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.

మనకు రెండు రకాల ఆస్తులున్నాయి. ఒకటి మేథోసంపత్తి. రెండు యువశక్తి - ప్రధాని మోడీ

విజ్ఞాన్భవన్లో ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి.. కానీ ఈ సభలో ఏదో తెలియని శక్తి ఉందన్నారు మోడీ. స్టార్టప్ ఇండియా అన్నప్పుడు స్టాండప్ ఇండియా అనే పదాన్ని కూడా కలపాలన్నారు. రెండింటినీ విడివిడిగా చూడలేమని అభిప్రాయపడ్డారు. దేశంలో టాలెంట్ కు కొదవేం లేదన్నారు. 800 మిలియన్ టాలెంటెడ్ పీపుల్ అంతా 35 ఏళ్లలోపు వారేనని మోడీ గుర్తు చేశారు. భారత దేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు కూడా ధనవంతులు అభ్యసిస్తున్న విద్య అందాలని అభిప్రాయ పడ్డారు. టెక్నాలజీ డెవలప్ అయితే మారుమూల విద్యార్థికి అత్యున్నత విద్య అందుతుందని అన్నారు. విద్యే కాదు.. వైద్యం కూడా సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే అందుతుందన్నారు. ఐటీలో విజ్ఞానంలో మనం గొప్ప ప్రగతి సాధించాం కానీ ఇంకా ఉద్యోగాలే చేస్తున్నాం అన్నారు. ఈ ప్రపంచానికి సైబర్ సెక్యూరిటీ ఇచ్చే దేశం మనమే ఎందుకు కాకూడదు ప్రధాని మోడీ ప్రశ్నించారు. స్టార్టప్ కోసం 2016 ఏప్రిల్లో మొబైల్ యాప్, పోర్టల్ తెస్తామని ప్రధాని మోడీ తెలిపారు. 90 రోజుల్లో అన్ని అనుమతులు వచ్చేలా ప్రత్యేక విధానం ఏర్పాటు చేస్తామని అన్నారు. దాని ద్వారా రకరకాల క్లియరెన్సులు, అనుమతులు పొందవచ్చన్నారు.

గెలిచిన వారికంటే ఓడిపోయిన వారంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే వారిలో కసి పట్టుదల మరింత పెరుగుతాయి. అలాంటి విజయాల్లో చెప్పలేని సంతృప్తి ఉంటుంది.

ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ఓనో రుహి ఓపెనింగ్ సెరిమనీలో పాల్గొన్నారు. తర్వాత సాఫ్ట్ బ్యాంక్ సీఈవో, ఫౌండర్ మసయోషి సన్ తో ఇంటరాక్షన్ సెషన్ జరిగింది. యువర్ స్టోరీ తో పాటు దేశంలోని దాదాపు 1500 టాప్ స్టార్టప్స్ ఫౌండర్లు, సీఈఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈవెంట్ ముగింపులో మోడీ స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. దేశంలో స్టార్టప్ ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేయనున్నపథకాల గురించి అందులో ప్రస్తావించారు.

రోజంతా ఏం జరిగిందంటే..

image


ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిపార్ట్ మెంట్... స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్న ఐ స్పిరిట్, యువర్ స్టోరీ, నాస్ కాం, షీ ది పీపుల్ డాట్ టీవీ, కైరోస్ సొసైటీ, ఫిక్కీ, సీఐఐ యూత్ వింగ్ తో కలిసి ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేశాయి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags