సంకలనాలు
Telugu

మీ జ్ఞాపకాలన్నింటినీ ‘మెమైలాగ్’లో దాచుకోండి

22nd Aug 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


జీవిత భాగస్వామి బర్త్‌డే సడెన్‌గా ఒక్కోసారి గుర్తురాదు. బాబు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే.. స్టైక్ కాదు. కంపెనీ ఎప్పుడు మొదలుపెట్టారో.. డేట్ గుర్తుందా.. అంటే.. మైండ్ బ్లాంక్ అవుతుంది. అంతే కాదు.. ఫలనా ఫ్రెండ్‌ను ఎప్పుడు కలిశామో.. ఏదైనా ఆలోచనా ఉందా..అంటే.. అది కూడా గుర్తుండదు. ఈ ఫాస్ట్ యుగంలో అన్ని విషయాలనూ మైండ్ గుర్తుపెట్టుకునే పరిస్థితిలో లేదు. అయితే ఇదేదో షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ మాత్రం కాదు. జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకెండ్‌కి తట్టదంతే.. ! ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారంతో పాటు.. మన జీవితంలో జరిగే ముఖ్యఘట్టాలను భద్రపరుచుకునే వెసులుబాటును కల్పిస్తోంది 'మెమైలాగ్ '. ఎలా అంటారా.. అయితే ఫాలో అవండి.

మెమైలాగ్ అనేది ఓ ప్రైవసీ బ్లాగింగ్ యాప్. మన జ్ఞాపకాలను భద్రంగా దాచిపెట్టుకోడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణ యాప్‌లన్నీ దాదాపు సోషల్ మీడియా యాప్‌లే. కానీ ఇదొక్కటే ప్రైవేట్ మెసేజింగ్ యాప్. హైదరాబాద్ కేంద్రంగా గతేడాది ప్రారంభమైన మెమైలాగ్ ఇప్పటి వరకూ 8వేల ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్స్‌తో దూసుకు పోతోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిన ఎన్నో విషయాలను ఇందులో మనం రాసుకోడానికి వాటిని పదికాలాల పాటు జాగ్రత్తగా ఉంచుకోడానికి ఉపయోగపడుతుందని అంటారు ఫౌండర్ సాయికిరణ్ గుండ.

“మెమొరీస్ ని రాసుకోవడం అంటే డెయిరీ రాయడం లాంటిది. డెయిరీ కూడా ఎవరైనా చదువుతారమో కానీ మా మెమిలాగ్‌లో రాసిన విషయం ఎవరికీ తెలీదు. సరైన సమయం వచ్చినప్పుడు మీరే బయటపెట్టొచ్చు” సాయికిరణ్. 

మెమొరీస్ అంటే రాయడమొక్కటే కాదు. ఫోటోలు, వీడియోలు, బుక్ రీడింగ్, మ్యూజిక్ వినడం లాంటివన్నీ వస్తాయనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. మొబైల్ యాప్‌లన్నీ సోషల్ సెక్టార్ చుట్టూ తిరుగుతున్నవే. కానీ బ్లాగ్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. బ్లాగ్ రాసే వారి సంఖ్య గతంతో పోలిస్తే బాగా పెరిగింది. అంటే ప్రైవసీ మార్కెట్(నాన్ సోషియో) ఎక్కువగానే ఉందన్న మాట. ఇదే మా మెమైలాగ్ వ్యాపార రహస్యమంటారు సాయికిరణ్.

మెమైలాగ్  ఫౌండర్ సాయికిరణ్

మెమైలాగ్ ఫౌండర్ సాయికిరణ్


మెమైలాగ్ అంటే ?

సాయికిరణ్‌కు చిన్నప్పటి నుంచి డెయిరీ రాసే అలవాటుంది. కొన్ని సార్లు ఆ డెయిరీని వాళ్ల అమ్మ చూసేది. స్కూల్లో తాను చేసే అల్లరంతా తెలిసిపోయేది. కొన్నాళ్లకు కంప్యూటర్‌లో డెయిరీ రాసేవాడు. మెమెరీస్ అన్నింటినీ భద్రంగా, ప్రైవసీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాలేజీ రోజుల నుంచే యాప్‌లను డెవలప్ చేయడం,కాన్సెప్ట్‌లను చర్చించడం లాంటివి చేసేవాడు. తర్వాత స్టార్టప్ మొదలు పెట్టే రోజు రానే వచ్చింది.

" ఏ కాన్సప్ట్ ను డెవలప్ చేయాలనే ఆలోచలో పడ్డా. నాలాగే డెయిరీ రాసే వారి కోసం ఏదైనా చేద్దామనిపించి. మెమొరీస్ భద్రంగా దాచుకొనే ఓ స్టార్టప్ ప్రారంభిస్తే బాగుండు అని నిర్ణయించుకున్నా" సాయికిరణ్. 

అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది. మరి టైటిల్ ఏం పెట్టాలి. మెమొరీ ఉండాలి కానీ సాధారణంగా అయితే ఉండకూడదని తర్జన భర్జన పడ్డారు. మనుషులు పేర్లు పెట్టడం చాలా సింపుల్ . ఎందుకంటే ఒకే పేరున్న వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. కానీ సంస్థకు పేరు పెట్టాలంటే అంత ఈజీ అయితే కాదు. దాదాపు నెలరోజులపాటు పాటు టైటిల్ వేటలో పడ్డారు. చివరకి మెమెరీలో మెమ్‌కి ఐ అంటే నేను యాడ్ చేసి లాగ్ అంటే రాయడాన్ని కలిపాను. మొత్తానికి టైటిల్ మెమ్- ఐ- లాగ్ .. దటీజ్ మెమైలాగ్ పుట్టింది.

స్టార్టింగ్ ట్రబుల్స్

స్టార్టప్ అయితే ప్రారంభించారు కానీ దాన్ని జనంలోకి ఎలా తీసుకెళ్లాలనేదానిపై వాళ్లకు పెద్దగా అవగాహన లేదు. అసలేం చేస్తే జనం సైట్ చూస్తారో అనే దానిపై జీరో నాలెడ్జ్. ప్రారంభించిన నెలరోజులపాటు వాళ్లకున్న సర్కిల్ నుంచి ట్రాఫిక్ బాగానే ఉండేది. తర్వాత సడెన్ గా ట్రాఫిక్ జీరో అయిపోయింది. అప్పుడు తెలుసొచ్చింది అసలు సంగతి. వెబ్ సైట్ లాంచ్ చేస్తే సరిపోదు. దానికి సరైన క్యాంపైన్ చేయాలి అని. స్టార్టప్‌ను వ్యవస్థీకరించాలి. అప్పటి గానీ సక్సస్ కాలేము. దీంతో పబ్లిక్ క్యాంపైన్ మొదలు పెట్టాలనుకున్నారు. కానీ ఏం చేయాలనే దానిపై క్లారిటీ లేదు. హార్డ్‌కోర్ మార్కెటింగ్ పర్సన్ అయి ఉంటే బహుశా నాకు తెలిసుండేదేమో. అవధుల్లేకుండా ఆలోచించినా కనీస పరిష్కారం దొరకలేదు. ఫ్రెండ్స్‌తో కలసి డిస్కషన్ పెట్టారు. అంతా ఏవేవో చెప్పారు కానీ. సాంప్రదాయ బద్దంగా క్యాంపైన్ చేయడానికి సాయికిరణ్ ఎందుకో అంగీకరించలేదు. 

"ఏదైనా ప్రత్యేకంగా చేద్దామనుకున్నా. అప్పుడు మొదలు పెట్టిందే స్ట్రీట్ క్యాంపైన్. నాతో పాటు సంతోష్‌ను ఫోటో గ్రాఫర్ అవతారం ఎత్తించి రోడ్లపై పడ్డాం. అందరినీ వారి మెమెరీస్ అడిగి.. వారి ఫోటో తీసి దాన్ని సైట్‌లో పోస్ట్ చేశాం. కొందరు సంతోషంగా, మరికొందరు దుఃఖంగా, ఇంకొందరు మరోరకంగా స్పందించారు. వారి కధలు విన్నప్పుడు జీవితంలో తెలియని చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. ఆ తర్వాత మరో రెండు క్యాంపైన్స్ చేపట్టాం. అలా మా స్టార్టింగ్ ట్రబుల్స్‌ని అధిగమించామని'' సాయికిరణ్ గుర్తుచేసుకున్నారు.

image


ఫౌండర్ అండ్ టీం

సాయికిరణ్ మెమైలాగ్ కు ఫౌండర్. జెఎన్‌టియూ, ఐటి బ్రాంచ్ నుంచి 2012లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. స్కూల్ రోజుల నుంచే కంప్యూటర్ అంటే ఎంతో ఇష్టం. కాలేజి చదివే రోజుల్లోనే యాప్స్ డెవలప్ చేయడం లాంటి యాక్టివిటీ చేసేవారు. చిన్నప్పటి నుంచి డెయిరీ రాయడం అలవాటున్న సాయికిరణ్ దాన్నే తన స్టార్టప్ ఆలోచనగా మొదలుపెట్టారు. ప్రారంభించి ఏడాదిన్నర కావొస్తున్నా మెమిలాగ్ పూర్తిగా బూట్ స్ట్రాప్డ్ కంపెనీ. కంపెనీ కోర్ టీంలో సంతోష్, సత్య, ముఖేష్, సమంతలు ఉన్నారు. వీరితో పాటు దాదాపు 40మంది ఇంటర్న్స్ ఉన్నారు.

మెమైలాగ్ టీం

మెమైలాగ్ టీం


రెవెన్యూ మోడల్

పర్సనలైజ్డ్ మాడ్యూల్సే మా ప్రధాన ఆధాయ ఒనరులని సాయికిరణ్ వివరించారు. మెమొరీస్ రాసే వారు ఉదాహరణకి వారి మెమొరీస్ ని ఫిట్‌నెస్, ట్రావెల్ లాంటి వాటిని ప్రత్యేకంగా కోరుకుంటే వాటిని అందిస్తాం. అలా పర్సనలైజ్డ్ చేసినప్పుడు ఒక డాలర్‌ని వసూలు చేస్తాం. దీంతో పాటు సబ్ స్క్రిప్షన్ మరో ఆదాయవనరు. ఇక యాడ్స్ అనేవి తెలిసినదే.

భవిష్యత్ ప్రణాళికలు

ఇప్పటి వరకూ మెమైలాగ్ ఆండ్రాయిడ్ యాప్ 1700 డౌన్ లోడ్స్ కు చేరుకుంది. వెబ్ సైట్‌ 8700మంది రిజిస్ట్రర్ చేసుకున్నారు. దాదాపు 72 దేశాల్లో కస్టమర్లు ఉన్నారు. యూజర్ల సంఖ్యను రెట్టింపు అంటే దాదాపు 15వేలకు చేర్చడంతో పాటు నెలకు యాక్టివ్ యూజర్లను 2వేలకు పెంచాలని టీం భావిస్తోంది. విండోస్ యాప్ ని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్న బృందం... ఐఓఎస్‌పై కూడా కసరత్తు చేస్తోంది. పూర్తిగా బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయిన తమకు మొదటి రౌండ్ ఫండ్ వచ్చిందంటే పూర్తి స్థాయిలో యూజర్ల సరికొత్త ఫీచర్లను అందిస్తామని ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags