సంకలనాలు
Telugu

విశాఖలో మరో వేర్ హౌస్ పెడుతున్నాం : నాస్కాం చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి

ashok patnaik
21st Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

హైదరాబాద్ టీ హబ్ లో లాగానే వైజాగ్ లో కూడా మరో వేర్ హౌస్ ప్రారంభిస్తున్నామని నాస్కాం చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి వెల్లడించారు. యువర్ స్టోరి తో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్ ఈకో సిస్టమ్ మారుతోందని అన్నారు. బివిఆర్ మోహన్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..

యువర్ స్టోరీ: నాస్కామ్ చైర్మన్ అయిన తర్వాత మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి?

బివిఆర్: నాస్కాం ఇనిషియేషన్ అనేది ఓ నిరంతర ప్రవాహం లాంటిది. ఇక్కడ చైర్మన్ ఎవరున్నారన్నది ముఖ్యం కాదు. నేను చైర్మన్ అయిన తర్వాత స్టార్టప్ లకోసం కొత్త వేర్ హౌస్ ల ఏర్పాటుపై మరింత ఎగ్రెసివ్ గా ముందుకు వెళ్తున్నాం. పదివేల స్టార్టప్ ల లక్ష్యాన్ని చేరుకోవడమే మా ముందున్న సవాల్. తర్వాత వాటిని పూర్తిస్థాయి సంస్థలుగా మార్చడానికి వ్యూహాలను తయారు చేశాం. దేశం మొత్తం నాస్కాం మరింత విస్తరించేలా చర్యలు ప్రారంభించాం.

image


యువర్ స్టోరీ: కొత్త స్టార్టప్ లను లిస్టింగ్ చేయడంలో మీ సవాళ్లేంటి?

బివిఆర్: ఇక్కడ చాలెంజ్‌ అంటూ ఏమీ లేదు. తీసుకున్న ఇనిషియేషన్ ని దేశం మొత్తం తీసుకెళ్లడమే. దేశ జనాభాకు సరిపడా ఉద్యోగాలు కల్పించాలి. దానికోసం ఉన్న సంస్థల్లో కొత్తగా ఉద్యోగాలను కల్పించడం జరగని పని. కాబట్టి కొత్త కంపెనీలను ప్రారంభించాలి. స్టార్టప్ లకు కావల్సిన మెంటార్షిప్ లాంటివి అందిస్తే అవే గొప్ప కంపెనీలుగా ఎదుగుతాయి. తద్వారా ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుంది. నాస్కాం టెన్ కే(పదివేల) స్టార్టప్ లను గుర్తించడంతోనే ఇది సాధ్యమని నేను భావిస్తన్నా.

యువర్ స్టోరీ: దేశంలో ఆంట్రప్రెన్యూర్షిప్ ఎలా ఉంది?

బివిఆర్: గతంలో కంపెనీల్లో పనిచేసి అనుభవం గడించిన తర్వాత కంపెనీ పెట్టాలని అనుకునే వారు. వారి అనుభవమే వారికి పెట్టుబడిలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. చిన్నవయసు నుంచే ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్ అవుతోంది.

“భారత దేశంలో ఆంట్రప్రెన్యూర్ సగటు వయసు 25 సంవత్సరాలే,” బివిఆర్ మోహన్ రెడ్డి

పాశ్చాత్య దేశాల్లో ఈ వయసు 21 ఏళ్లుగా ఉంది. మన దేశంలో గతంలో 40 ఏళ్లు అయితే గానీ వ్యాపారం చేయాడానికి అర్హత లేనట్లు ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చి అంతా మార్చేసింది. చిన్న వయసులోనే ఎలాంటి అనుభం లేకుండా అన్ని విషయాలను తెలుసుకొని స్టార్టప్ ప్రారంభిస్తున్నారు. ఇది గొప్ప మార్పు.

image


యువర్ స్టోరీ : ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్టప్ సవాళ్లెలా ఉన్నాయి?

బివిఆర్: మిలియన్ల కొద్దీ సవాళ్లకు మన దగ్గర బిలియన్ల పరిష్కారాలున్నాయి. స్టార్టప్ ప్రారంభించినప్పుడే సవాళ్లను గుర్తిస్తే భవిష్యత్ లో వచ్చే సమస్యలను అధిగమించొచ్చు. ప్రయత్నం ఆపకుండా పనిచేయడం మొదలు పెట్టండి. సక్సెస్ ఫుల్ స్టార్టప్ లకు ఫౌండర్లుగా మారండి. నాస్కాం తరుపు నుంచి ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి మేమున్నాం. దేశ భావితరాలకు సరికొత్త చరిత్ర రచించే అవకాశం ఇప్పుడు వచ్చింది.

యువర్ స్టోరీ: బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ లో స్టార్టప్ ఈకో సిస్టమ్ వెనకబడిందని భావిస్తున్నారా?

బివిఆర్: హైదరాబాద్ ని బెంగళూరుతో పోల్చి చూడలేం. అక్కడున్న పరిస్థితులు వేరు. ఇక్కడున్న పరిస్థితులు వేరు. అక్కడ స్టార్టప్ ఈకో సిస్టమ్ పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ జరగాల్సి ఉంది. హైదరాబాదీలంతా గతంతో బెంగళూరు వెళ్లి స్టార్టప్ లను ప్రారంభించారు. ఇప్పుడు అంతా హైదరాబాద్ వస్తున్నారు. టీ హబ్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది. ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్ మరెక్కడా లేదు. వచ్చే ఆరు నెలల్లో ఫలితాలు ఇక్కడున్న స్టార్టప్ సీన్ ని పూర్తిగా మార్చేస్తాయని భావిస్తున్నా.

image


యువర్ స్టోరీ: తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్ ఈకో సిస్టమ్ ఎలా ఉంది?

బివిఆర్: ఇంతకు ముందు చెప్పినట్లే హైదరాబాద్ భవిష్యత్ లో స్టార్టప్ క్యాపిటల్ గా మారనుంది. 800 సీట్లతో టీ హబ్ ఏర్పాటయింది. దాంట్లోనే మా వేర్ హౌస్ ఏర్పాటు చేశాం. నాస్కాం తరుపు నుంచి పూర్తి స్థాయి మద్దతుంది. సన్‌ రైజ్ స్టేట్ గా చెబుతున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా నాస్కాం వేర్ హౌస్ ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా మరిన్ని స్టార్టప్ లకు తమ సేవలను అందుబాటులోకి తీసుకు రాడానికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. దీన్ని మరింత ముందకు తీసుకెళ్లడం కోసం పనిచేస్తున్నాం.

యువర్ స్టోరీ: నాస్కాం వేర్ హౌస్ వల్ల స్టార్టప్ లకు ఎలాంటి లాభాలుంటాయి?

బివిఆర్ : నాస్కాం వేర్ హౌస్ లో స్టార్టప్ లకు మెంటార్షిప్ లభిస్తుంది. స్టార్టప్ టాక్స్, ఈవెంట్స్ చేసుకోడానికి ఓ ప్లాట్ ఫాం లభిస్తుంది. స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి మక్కువ చూపించే ఇన్వెస్టర్లు నాస్కాం వేర్ హౌస్ ద్వారా వాటిని ఐడింటిఫై చేసుకునే వెసులుబాటుంది. అటు ఇన్వెస్టర్లకు, ఇటు స్టార్టప్ లకు లాభదాయకంగా మా వేర్ హౌస్ పనిచేస్తుంది. గతంలో మా సక్సెస్ స్టోరీనే భవిష్యత్ లో కూడా కొనసాగిస్తామని ముగించారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags