సంకలనాలు
Telugu

లోగో డిజైన్ చేస్తున్నారా? అయితే ఈ 5 తప్పులు చేయొద్దు!

ఎలాంటి వ్యాపారానికైనా ఓ బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. అప్పుడే దానికి ప్రజల ఆదరణ లభిస్తుంది. మరి అలాంటి బ్రాండ్ ఇమేజ్ రావాలంటే ఏం చేయాలి.. ప్రజలను ఆకట్టుకునే లోగో ఉండాలి. మరి అలాంటి లోగో ఎలా డిజైన్ చేసుకోవాలి..? అసలు లోగో అవసరమేంటి..? లోగో డిజైనింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి..? లాంటి అంశాలను వివరిస్తున్నారు క్రౌడ్ స్టూడియో (CrowdStudio) సహ వ్యవస్థాపకుడు వివేక్ రాఘవన్.

CLN RAJU
1st May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వ్యాపారం ఒక కళ. దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే దానికొక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి. అందుకు తగ్గట్లు మార్కెట్ చేసుకోవాలి. ఇది వ్యాపారం మొదలుపెడుతున్నవారికి కూడా వర్తిస్తుంది. వ్యాపారం మొదలుపెట్టేవారికైనా, పెట్టుబడి పెట్టేవారికైనా ఓ గుర్తింపు ఉండాలి. అందుకొక మంచి లోగో ఉండాలి. అప్పుడే ప్రజలు గుర్తిస్తారు.

వ్యాపారం మొదలుపెట్టేవారికి లోగో డిజైన్ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. లోగో డిజైన్ చేసే ముందు కొన్ని ప్రాథమిక సూత్రాలను గుర్తుంచుకోవాలి. అవగాహన లేకుండా లోగో డిజైన్ చేయించి, తర్వాత మార్పులు చేర్పులు చేస్తూ డబ్బులు పోగోట్టుకున్నవాళ్లను నేను చాలా మందిని చూశా !

తొక్కపై కాలేయొద్దు... లోగో డిజైనింగ్ పై సరైన అవగాహన పెంచుకోండి

తొక్కపై కాలేయొద్దు... లోగో డిజైనింగ్ పై సరైన అవగాహన పెంచుకోండి


ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్‌గా, క్రియేటివ్ స్టూడియో సహ వ్యవస్థాపకుడిగా నాకు లోగో డిజైన్‌లో అద్భుతమైన అనుభవం వచ్చింది. అందుకే వ్యాపారంలో అడుగుపెడుతున్నవారితో నా అనుభవాలు పంచుకోవాలనుకున్నా...

1. మీ మామ కొడుకుతో మీ లోగో డిజైన్ చేయించకండి..

లోగో డిజైన్ చాలా సులభం అని మీరు అనుకోవచ్చు. నన్ను నమ్మండి.. అది నిజం కాదు. లోగో అనేది కేవలం రంగులు, ఆకారాలు, అక్షరాల సమూహం కాదు. లోగో మీ వ్యాపారానికి ఓ బ్రాండ్. పరిశోధన, ప్రణాళిక, సృజనాత్మకతల నుంచి ఓ మంచి లోగో పుడుతుంది. కాబట్టి లోగోను సింపుల్‌గా తీసిపారేయకండి. లోగోకు తగిన గౌరవం ఇవ్వండి. డబ్బు ఆదా అవుతుందని ఫోటోషాప్ తెలిసి కంప్యూటర్ ఉన్న మీ మామ కొడుకును లోగో డిజైన్ చేయమని అడగకండి.


2. రెడీమేడ్ లోగోను ఉపయోగించకండి.

లోగోలు చాలా చోట్ల లభిస్తాయి. 300 రూపాయలకు కూడా మీకు ఒక లోగో దొరుకుతుంది. ప్రస్తుతం లోగోను జెనరేట్ చేసే సాఫ్ట్‌వేర్లు, వెబ్‌సైట్లు చాలానే ఉన్నాయి. కానీ ఓ విషయం గుర్తుంచుకోండి.. ఆ లోగోలను మీ లాగే వందలాదిమంది ఉపయోగిస్తూ ఉండొచ్చు. కేవలం సమయం, డబ్బు ఆదా కోసం మీరు మీ ప్రత్యేకతను కోల్పోతున్నారు. అంతేకాక దాన్ని కాపీరైట్, ట్రేడ్ మార్క్ లేదా రిజిస్టర్ చేయడం చాలా కష్టం.


3. మీ సొంతంగా మీరు లోగో డిజైన్ చేసుకోకండి..

ఇప్పుడే వ్యాపారం ప్రారంభిస్తున్నవారికి అన్ని పనులూ తామే చేసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. మీకు గ్రాఫిక్ డిజైనింగ్‌లో అనుభవం లేకపోయినా.. లోగో ఎలా డిజైనా చేయాలో తెలియకపోయినా ఆ లోగోకు అర్థమే ఉండదు. అలాంటి లోగో అపరిపక్వంగా ఉండడమే కాకుండా.. కొన్ని సందర్భాల్లో వాడుకునేందుకు వీలుగా ఉండదు.

లోగో అనేది అనేక అప్లికేషన్లలో, మాధ్యమాల్లో వాడుకునేందుకు వీలుగా ఉండాలి. బిజినెస్ కార్డుపై కానీ, వెబ్ సైట్లో కానీ, మొబైల్ అప్లికేషన్లో కానీ, గ్లాస్ డోర్ పై కానీ, వాటర్ మార్క్ గా కానీ లేదా వీడియోలలో కానీ లోగోను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ డిజైన్ చేసిన లోగో ఇలా అన్ని చోట్ల ఉపయోగించుకునేలా ఉంటుంది. అంతేకాక.. ఎలా ఉపయోగించుకోవాలో కూడా సంబంధిత డిజైనర్ సూచించడం జరుగుతుంది.


4. ట్రెండ్ ఫాలో అవకండి

ట్రెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ మంచి లోగో శాశ్వతంగా ఉంటుంది. రెండేళ్లక్రితం మెరిసిపోతున్న రంగులు వాడేవారు.. కానీ ఇప్పుడు సాధారణ డిజైన్లు కనిపిస్తున్నాయి. మీ పట్టణంలో లేటెస్ట్ అనిపించుకున్నదాన్ని మీరు వెబ్ సైట్ లోనో, మొబైల్ అప్లికేషన్ లోనో వాడుకోవచ్చు. కానీ లోగో అనేది కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి సందర్భానికైనా అది సరిపడేలా ఉండాలి. అన్నిటికీ మించి ప్రజలంతా మీ బ్రాండ్‌ను గుర్తుంచుకునేలా ఉండాలి.

ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకుని మీరు లోగో డిజైన్ చేస్తే.. ట్రెండ్ మారిన ప్రతిసారీ మీ లోగోను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతిసారీ లోగోను మార్చుకుంటూ వెళితే ప్రజలు మీ బ్రాండ్ పై కాస్త తికమక పడే అవకాశం ఉంటుంది. ట్రెండ్‌కు తగ్గట్లు మీరు లోగో మార్చకపోయినా వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది.


5. కాపీ కొట్టకండి!

లోగో డిజైన్‌లో ఇది చాలా ముఖ్యమైన విషయం. పైవన్నీ పట్టించుకోకపోయినా దీన్ని మాత్రం తప్పకుండా పాటించాల్సిందే. అందుకే ఈ నియమాన్ని చివర్లో పొందుపరిచాను. వేరొకరి లోగోను కాపీ కొట్టడం అన్యాయమే కాకుండా నేరం కూడా.! లోగోలు మేధోసంపత్తి హక్కుల కిందకు వస్తాయి. కాపీ కొట్టడం ద్వారా కాపీరైట్, ట్రేడ్ మార్క్ చట్టాలను అతిక్రమించినట్టు అవుతుంది.

చాలా మందికి ఈ విషయం తెలుసు. అయినా వాళ్లు కాపీ కొడుతుంటారు ఎందుకంటే అలాంటి కొత్త డిజైన్లు దొరకవనుకుంటారు. అదే మీ ఆలోచన అయితే ముందు దాని నుంచి బయటకు రండి. ప్రస్తుత సాంకేతికవిప్లవంలో గూగుల్‌లో ఇమేజ్‌ను రివర్స్ సెర్చ్ చేయడం, కాపీరైట్ డిజైన్‌ను కనుక్కోవడం చాలా సులభం.!

కాబట్టి.. మీరు కానీ, మీ లోగో డిజైనర్ కానీ ఎక్కడినుంచో లోగో కాపీకొట్టలేదని నిర్ధారించుకోండి. కాపీ కొట్టిన లోగోను పెట్టుకోవడం కంటే.. లోగో లేకుండా ఉండడమే మంచిది..

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags