సంకలనాలు
Telugu

ఆలోచనలు స్టార్టప్ గా అమలైతేనే ఫండింగ్ : రివర్స్ పిచింగ్ లో వీసీలు

ashok patnaik
30th Apr 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on


91 స్ప్రింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన వీసీల రివర్స్ పిచింగ్ కి అనూహ్య స్పందన వచ్చింది. వందకు పైగా స్టార్టప్ లు పాల్గొనగా ఆరుగురు వీసీలు తమ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీల గురించి వివరించారు. పెట్టుబడికి ఎలాంటి కంపెనీలను చూస్తున్నారో వివరించే ప్రయత్నం చేశారు.

రివర్స్ పిచింగ్

సాధారణ ఫండింగ్ కోసం స్టార్టప్ లు ఏంజిల్ ఇన్వెస్టర్ల దగ్గర ప్రజెంటేషన్ ఇస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే పద్దతి కొనసాగుతుంది. అయితే స్టార్టప్ లు ఏ ఏంజిల్ దగ్గరకు వెళ్లాలనే దానిపై క్లారిటీ ఉండదు. కొన్ని ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు కొన్ని రంగాల్లో ఉన్న స్టార్టప్ లకు మాత్రమే ఫండింగ్ అందిస్తుంటాయి. అలాంటప్పుడు ఆ రంగాలకు చెందని స్టార్టప్ లు అప్లై చేసినా ఫలితం ఉండదు. ఎన్నిసార్లు అప్లై చేసినా కనీసం స్పందన రాదు. దీనికి 91 స్ప్రింగ్ బోర్డ్ సొల్యూషన్ చూపించింది. వెంచర్ క్యాప్టలిస్టులే నేరుగా స్టార్టప్ ల ముందు తమ కంపెనీ ప్రొఫైల్ ని ప్రజెంట్ చేస్తారు. తమరంగంలో ఇన్వెస్ట్ మెంట్ ఆశించిన స్టార్టప్ అప్లై చేసుకోవచ్చన్న మాట. ఢిల్లీలో ఇప్పటికే పాపులర్ అయిన ఈ రివర్స్ పిచింగ్.. బెంగళూరు, హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.

కార్పొరేట్ సీడ్ ఫండింగ్

ఆస్టర్క్ వెంచర్స్ కు చెందినస హరిక్రిష్ణ తమ కంపెనీ ప్రొఫైల్ ని ప్రజెంట్ చేశారు. 12 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ మెంట్ రంగంలో ఉన్న తమ సంస్థ కార్పొరేట్ సీడ్ ఫండింగ్ చేయడానికి ముందుకొస్తుందని చెప్పారు. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్నారని చెప్పిన ఆయన.. స్టార్టప్ ఎంట్రీ బ్యారియర్ దాటినప్పుడే ఆసక్తి చూపుతామన్నారు. ఇంత మొత్తంలోనే ఇన్వెస్ట్ మెంట్ చేస్తామని తమకేం లెక్కలు లేవని అన్నారాయన. సీడ్ లెవెల్ కంపెనీలే టార్గెట్ అని ప్రకటించారు హరి.

ప్రీ సిరీస్-A లక్ష్యమన్న హైదరాబాద్ ఏంజిల్స్

హైదరాబాద్ ఏంజిల్స్ అంటే ఈ ప్రాంతంలో ఉన్న స్టార్టప్ లకు మాత్రమే ఫండింగ్ అందిస్తుందని అనుకోవద్దని అన్నారు ఆ సంస్థ డైరెక్టర్ పిఎస్ శ్రీకాంత్. కోటి రూపాయిలు గరిష్టంగా ఇన్వెస్ట్ చేస్తామన్నారు. మిలియన్, హాఫ్ ఏ మిలియన్ కూడా ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆపరేషనల్ ట్రాక్షన్ అన్నిటి కంటే ముఖ్యమైందని తెలిపారు. టీం తో పాటు ప్రాడక్టు మేనేజర్ చాలా ఇంపార్టెంట్ అని అన్నారు.

image


అంతిలి వెంచర్స్ టార్గెట్ ప్రీ సిరీస్ ఏ మాత్రమే

అంతిలి వెంచర్స్, యునైటెడ్ సీడ్ ఫండ్ నుంచి రిప్రజెంట్ చేసిన రమణ గోగుల తాము ప్రీ సిరీస్ ఏ స్టార్టప్ లను పిచ్ చేస్తామని అన్నారు. స్టార్టప్ కంపెనీ ఫండింగ్ కోసం అప్లై చేసే ముందు ఆ ఏంజిల్ కంపెనీ ప్రొఫైల్ పూర్తిగా స్టడీ చేయాలని రమణ గోగుల సలహా ఇచ్చారు. మిలియర్ డాలర్ దాకా ప్రీ సిరీస్ ఏ ఫండింగ్ అందించడానికి తమ కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. యునైటెడ్ సీడ్ ఫండ్ కు కొన్ని స్టార్టప్ లు మాత్రమే టార్గెట్ అని వివరించారు. స్ట్రాటజీ బలంగా ఉండాలని, రెవెన్యూ జనరేట్ చేస్తుంటే ప్రీ సిరీస్ రెయిజ్ చేయడానికి సిద్ధపడినట్లని తెలిపారు.

ఇండస్ట్రీలో తామే మొదటి ఫండింగ్ కంపెనీ- వెంచర్ ఈస్ట్

18 ఏళ్లుగా ఫండింగ్ అందిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి సంజీవ్ యమసాని అన్నారు. తమ సంస్థలో ఇనిస్టిట్యూషనల్ ఫండ్స్ మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగత పెట్టుబడులను ఎంకరేజ్ చేయమని అన్నారు. స్టార్టప్ సంస్థ రెవెన్యూ జనరేట్ చేయడం మొదలు పెట్టిన తర్వాతే తమ దగ్గర ఫండింగ్ ఆశించాలని చెప్పారు. ఎర్లీ సిరీస్ ఏ దశలో ఫండింగ్ అందిస్తామన్న ఆయన 3 నుంచి 8 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధమన్నారు. స్టార్టప్ నుంచి 5 నుంచి 7 ఏళ్ల కాలపరిమితిలో ఎగ్జిట్ అవుతామన్నారు.

“ప్రపంచ వ్యాప్తంగా 40శాతం ఫండింగ్ పెట్టుబడి తిరిగి రావడం లేదు,” సంజీవ్

ప్రారంభ దశ కంపెనీలే ‘50కె’ వెంచర్స్ టార్గెట్

సీడ్ ఫండింగ్ , సిరీస్ రౌండ్ కు మధ్యస్తంగా ఉన్న సంస్థలు తమ టార్గెట్ అని 50కె వెంచర్స్ మేనేజింగ్ పాట్నర్ సంజయ్ ఎనిశెట్టి అన్నారు. ప్రారంభించిన రెండేళ్లలోనే ఎక్కువ స్టార్టప్ లను పిచ్ చేయడం ద్వారా ఫండింగ్ రంగంలో తామ దూసుకు పోతున్నామన్నారు. ప్రతి నెల ఒక స్టార్టప్ చొప్పున ఫండింగ్ అందిస్తున్నామని తెలిపారు. స్టార్టప్ ఫౌండర్లతో ఎక్కువ సమయం గడిపి వారితో అన్ని విషయాలు చర్చించి ఫండింగ్ ఇస్తామని ప్రకటించారు.

హెల్త్, టెక్ కంపెనీలకు ‘ఎండియా’ ఫండింగ్ చేస్తుంది

ఎండియాకు హైదరాబాద్ తో పాటు బెంగళూరులో కార్యాలుయాలున్నాయి. హెల్త్ కేర్, టెక్ కంపెనీలకు ఫండింగ్ అందించడమే తమ టార్గెట్ అని ఎండియా వైస్ ప్రెసిడెంట్ శ్రుతి కొమరప్పగారి అన్నారు. సీడ్, ప్రీ సిరీస్ ఏ, సీరీస్ రౌండ్ లో ఎక్కడైనా తాము ఫండింగ్ అందిస్తామని చెప్పారు. అయితే స్టార్టప్ సస్టేయినబుల్ మోడల్ తో రెవెన్యూ జనరేట్ చేయాలని అన్నారు. స్టార్టప్ ముందుగా తమ కస్టమర్లు ఎవరనేది గుర్తించాలని, తర్వాత మార్కెట్ పై ఎక్కువ ఎక్సర్ సైజ్ చేయాలని అన్నారు.

“కస్టమర్ ని అర్థం చేసుకోవడం, మంచి టీం ఉంటే తాము ఫండింగ్ అందిస్తామని ఆమె ముగించారు.”

వెంచర్ క్యాప్టలిస్టులు తమ కంపెనీ ఫ్రొఫైల్ తో పాటు, ఏఏ రంగాలపై ఆసక్తిగా ఉన్నామనే దానిపై క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ నుంచి క్యూ అండ్ ఏ సెషన్ కూడా జరిగింది. చాలా రకాల ప్రశ్నలకు జవాబులు దొరికాయి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags