సంకలనాలు
Telugu

ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామంటున్న టింగ్ టింగ్ యాప్

ashok patnaik
24th May 2016
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share


సమస్య ఉన్న వారికే దాని పెయిన్ ఏంటో తెలుస్తుంది. మనం సాయం చేస్తే వేరొకరు మనకి సాయం అందిస్తారు. సాధారణంగా స్టార్టప్, ఇతర వ్యాపార రంగంలో సక్సెస్ ఫార్ములా ఇదే. అయితే ఇదే ఫార్ములాని డెయిలీ నీడ్స్ కు అప్లై చేసింది హైదరాబాదీ స్టార్టప్ టింగ్ టింగ్.

ఏమిటీ టింగ్ టింగ్

పాతరోజుల్లో ఏదైనా విషయం చెప్పాలంటే డప్పు వేసి చెప్పేవారు. దండోరా వేయిస్తే ఆ విషయం అందరికీ తెలిసినట్లు. ఆ తర్వాత ప్రసార మాధ్యమాలు ఆ స్థానంలో వచ్చి చేరాయి. దేవాలయంలో దర్శానికి ముందు గంటలను మోగించడం ఆనవాయితీ. చర్చ్ లో కూడా దేవుడికి సమస్యలను మొర పెట్టుకోడానికి చర్చ్ బెల్స్ కొడతాం. అలాంటి చిన్న బెల్స్ సౌండ్ ని టింగ్ టింగ్ ను తీసుకుని ఈ పేరు పెట్టామని ఫౌండర్ సందీప్ చెప్పుకొచ్చారు.

చిన్న అడ్రస్ దగ్గరి నుంచి పెట్రోల్ బంక్ మొదలుకొని, సిటీలోకి వచ్చాక గైడ్ సాయంలాంటి అన్నింటినీ ఒకే ప్లాట్ ఫాంలోకి తెచ్చారు. దేశ విదేశాల్లో ఉన్న అందరినీ ఒక చోటికి చేర్చే మైక్రో సోషల్ యాప్ ఇది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో్న స్నేహితులే కావక్కర్లేదు. గతంలో మనతో పరిచయం కానక్కర్లేదు. అపరిచితులైనా యాప్ యూజర్లైతే వారి దగ్గరి నుంచి సాయం పొందొచ్చు. కొత్త స్నేహాలు చేయడానికి మీరు టింగ్ టింగ్ అంటే చాలని సందీప్ అంటున్నారు.

image


మూడు ఫిల్టర్లతో ఫుల్ సెక్యూరిటీ

యాప్ లో మహిళల సెక్యూరిటీ కోసం ప్రధానంగా మూడు ఫిల్టర్లను ఏర్పాటు చేశామని సందీప్ వివరించారు. అన్ని రాకాల సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకోవడం తమ ప్రత్యేకతగా ఆయన తెలిపారు.

1. మేల్ ఫిమేల్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ ద్వారా మీ సమస్యను మహిళలకు మాత్రమే చెప్పాలనుకుంటే.. ఆన్ లైన్లో ఉన్న అమ్మాయిలకు మాత్రమే నోటిఫికేషన్ చేరుతుంది. ఈ ఫిల్టర్ వల్ల సమాచారం లిమిటెడ్ చేయడానికి వీలవుతుంది.

2. విస్తీర్ణం. రేడియస్ అనేది మరో ఫిల్టర్. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మనకు సాయం కావాలంటే అంత వరకే నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు. 50 కిలోమీటర్ల రేడియస్ దాకా మన సమస్యను షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది.

3. సమయ పరిమితి. టైం బాండ్ అనే ఫిల్టర్ ద్వారా కొంతవరకే అని పెట్టుకోవచ్చు. మూవీకి వెళ్లాలనుకున్నప్పుడు అడిషినల్ టికెట్ ఉంటే యాప్ లో పోస్ట్చేస్తే సరిపోతుంది. సినిమా టైం దాటాక ఆ నోటిఫికేషన్ ఫలితం ఉండదు. ఇలా కొన్ని లిమిటేషన్స్ తో ఈ ఫిల్టర్లను రూపొందించామని సందీప్ అంటున్నారు.

ఏది ఎలా ఉన్నప్పటికీ 48 గంటలకు దాటాక ఆ నీడ్ లేదా నోటిఫికేషన్ ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది. లిమిటెడ్ టైంలో నీడ్స్ ఇవ్వడానికి ఇది సాయపడుతుందని అన్నారాయన. ఇకపోతే ఇందులో చాటింగ్ కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా అటువైపు వ్యక్తికి రిక్వెస్ట్ పంపాలి. వారి యాక్సెప్టెన్సీ పైనే మీ చాట్ ఆధారపడి ఉంటుందని అన్నారు. అలా ప్రైవేట్ చాట్ చేయడానికి వీలవుతుందని అన్నారు సందీప్.

టింగ్ టింగ్ టీం

సందీప్ గండ్ర ఈ స్టార్టప్ ఫౌండర్ కమ్ సీఈఓ. జెఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ నుంచి డిగ్రీ పొందిన సందీప్- ఎడ్వర్టయిజింగ్, బ్రాండింగ్ రంగాల్లో పనిచేశారు. అందరి నీడ్స్ కు సొల్యూషన్ చూపించాలనుకుని.. దాన్ని మొబైల్ లో మాత్రమే పరిష్కారం చూపుతానని ఈ ఐడియాని ఇంప్లుమెంట్ చేశారు. అలా టింగ్ టింగ్ ఐడియా నుంచి స్టార్టప్ గా రూపాంతరం చెందింది. ప్రశాంత్, ఆరాధ్య్ ఆలమూరు ఈ సంస్థకు కో ఫౌండర్లుగా వ్యవహరిస్తున్నారు. సేల్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రశాంత్ సీబీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బిటెక్ క్వాలిఫికేషన్ ఉన్న ఆరాధ్య్ కంపెనీ సీటీఓగా ఉన్నారు.

ప్రధాన సవాళ్లు

1. ఐడియాని పూర్తి స్థాయి స్టార్టప్ గా మార్చే క్రమంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నానని సందీప్ చెప్పారు. భవిష్యత్ లో వచ్చే మరిన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

image


2. ఇప్పుడున్న క్షణంలో దీని నుంచి రెవెన్యూ రాబట్టడం పెద్ద సవాలని సందీప్ అంటున్నారు. పూర్తిస్థాయిలో జనంలోకి వెళ్లిన తర్వాత యూజర్ బేస్ పెంచుకొని దీన్ని అధిగమిస్తామన్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం ఎవరైనా సాయం చేస్తే వాపస్ వర్చువల్ హగ్స్ ఇస్తున్నారు. విద్యార్థుల్లో సాయిం చేసే గుణం ఎక్కువగా ఉందని అందరినీ టింగ్ టింగ్ కమ్యూనిటీ లోకి తీసుకు రావడమే టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఐదేళ్లలో ఒక బిలియన్ వర్చువల్ హగ్ లను చూడాలని, అంటే ఒక బిలియన్ మంది నీడ్స్ కి పరిష్కారం చూపాలనేది లక్ష్యమని ముగించారు సందీప్.

App link

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags