సంకలనాలు
Telugu

ఇట్లు.. మీ శ్రేయోభిలాషి- సమంత

-ఆదర్శంగా నిలిచిన అందాల నటి-అవయవదానం చేసిన సమంత-ప్రత్యూష సపోర్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు-గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు

ashok patnaik
8th Nov 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది అంటే, అసలు దానమే గొప్పది కదా? అందులో ఏదానం గొప్పదని చెప్పాలి అంటారు సమంత. తెలుగు సినీ తెరపై తనదైన ముద్ర వేసుకున్న సమంత సేవ చేయడంలోనూ తనను తానే పోటీ అంటోంది. ప్రత్యూష సపోర్ట్ పేరుతో ఒక ఎన్జీఓను నడుపుతోన్న ఈ అందాల భామ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి ఇచ్చిన పిలుపుకి స్పందించి తన అవయవాలను దానం చేసింది.

“అవకాశం ఉన్నప్పుడే సాయచేయగలం. మ్యాక్స్ క్యూర్ సిబ్బంది అవయవదానంపై తీసుకున్న నిర్ణయం నాకు ముచ్చటేసింది. నేనుకూడా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది.” సమంత

సమంత ఆర్గనైజేషన్ ప్రత్యూష సపోర్ట్ ఈ కార్యక్రమంలో కీరోల్ ప్లే చేస్తోంది.

image


ప్రత్యూష సపోర్ట్

ప్రత్యూష సపోర్ట్ అనేది గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అండర్ ప్రివిలెడ్జ్ మహిళలతో పాటు చిన్నారులకు సాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆడవారి ప్రసూతి సంబంధమైన సమస్యలతో పాటు చిన్నారుల రుగ్మతలపై ఈ సంస్థ అవేర్నెస్ కల్పిస్తుంది. ఆంధ్ర , తెలంగాణాల్లోని ప్రముఖ ఆసుపత్రులైన రెయిన్ బో,ఆంధ్రా హాస్పిటల్స్, లైవ్ లైఫ్, కాంటినెంటల్, మ్యాక్స్ క్యూర్ లాంటి వాటితో కలసి పనిచేస్తుంది. స్త్రీలకు ఉచిత వైద్యం అందిస్తారు. దీంతో పాటు ప్రాణాంత వ్యాధి బారిన పడిన చిన్నారుల లాస్ట్ విష్ ను ఫుల్ ఫిల్ చేస్తారు. ఇప్పటి వరకూ వేల మంది మహిళలకు సాయం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి సరైన వైద్య సేవలు అందుకోలేని ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిందీ సంస్థ

“తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందం ఉంది.” సమంత

సాయం చేయాలనే సంకల్పమే మా ఈ సంస్థ ప్రారంభించడానికి కారణమని అంటారామె. ప్రత్యూష సపోర్ట్ పేరుతోమహిళలకు సంబంధించిన ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

image


ప్రత్యూష సపోర్ట్ ప్రధాన కార్యక్రమాల

1.మెడికల్ క్యంపులు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి కోసం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఆసుపత్రుల్లో కూడా ప్రత్యూష సపోర్ట్ క్యాంపులుంటాయి. మహిళల ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించి వారిలో ఉండే భయాలను పోగొడతారు. ఇప్పటి వరకూ వేల మంది మహిళలు ఈ క్యాంపులకు అటెంట్ అయ్యారు.

2. సమంత సినిమాల్లో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ వేలం వేయడం ద్వారా ఫండ్స్ ని రెయిజ్ చేస్తారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సమంత సుపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆమె ఉపయోగించిన బట్టలకు యమ క్రేజ్ ఉంది. వాటిని వేలం వేస్తారు.

3. విమన్, చిల్ట్రన్ పై అవేర్ నెస్ ప్రొగ్రామ్ లు చేపడతారు. గర్భిణిలు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్థకు సంబంధించిన వాలంటీర్లు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పౌష్టికారహారంపై అవగాహన లాంటివి చేపడతారు.

4. మెట్రో సిటీల్లో ఫ్యాషన్ షోలు ఏర్పాటు చేసి సంస్థ కోసం ఫండ్స్ రెయిజ్ చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పటికే ఈ షో రన్ అయింది. చెన్నైలో కూడా చేయాలని చూస్తున్నారు. సెలబ్రిటీలంతా ఇందులో పాల్గొంటారు. దీని ద్వారా వచ్చిన డబ్బులను ప్రత్యూష ఫౌండేషన్ కోసం వినియోగిస్తారు.

5. విష్ కమ్ ట్రూ పేరుతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన పిల్లలను అక్కున చేర్చుకుంటారు. వారి చిరకాల కోరికలను తీరుస్తుందీ సంస్థ. ఎవరైనా చిన్నారి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంటే , ఆవిషయాన్ని ప్రత్యూష సపోర్ట్ కు తెలియ జేస్తే ఆ చిన్నారి విష్ ని నిజం చేస్తుంది.

image


ప్రత్యూష సపోర్ట్ టీం

సమంత ప్రత్యూష సపోర్ట్ ఫౌండర్. పాపులర్ సెలబ్రిటీ అయిన సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.

“నటిని కావడం వల్ల ఎంతో మంది ప్రేమాభిమానాలు పొందే అవకాశం వచ్చింది. దానిలో కొంత భాగం వారికే తిరిగి ఇచ్చేస్తే మరింత సంతోషం కలుగుతుంది.” సమంత

జనానికి సేవచేయడానికే నన్ను దేవుడు పంపిచాడనుకుంటున్నా. ఆ పని నాతో చేయించడానికే నన్ను ఇక్కడకు తీసుకొచ్చారని భావిస్తున్నా అని చెప్పుకొచ్చారు సమంత. సమాజంలో నా వల్ల చిన్న మార్పు జరిగినా నేను ఎంతో ఆనందిస్తానని అంటారామె. డాక్టర్ మంజుల ఈ సంస్థకు కో ఫౌండర్. పద్మశ్రీ అవార్డు అందుకున్న మంజుల గురించి కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్నారుల వైద్యం కోసం దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఆమె సేవలందించారు. ప్రత్యూష సపోర్ట్ తో మరిన్ని సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు చాలా మంది వాలంటీర్లు, డాక్టర్లు , సెలబ్రిటీలు ఈ సంస్థ కోసం పనిచేస్తున్నారు.

image


అవయవ దానం చేసిన సమంత

ఈ జీవితం ఫ్యాన్స్ కి అంకితం అని మన స్టార్లు పదేపదే డైలాగులు చెబుతుంటారు. కానీ నిజజీవితంలో అందులో ఎంతమంది ఫ్యాన్స్ కోసం లేదా ఆలోచిస్తారు. స్టార్ గా వెలుగొందుతూ సేవాకార్యక్రమాలు చేసే వారి ని వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఇటీవల కాలంలో అలా చేసే వారిలో ప్రధానంగా చెప్పుకోదగిన వ్యక్తి సమంత.

“నా అవయవాలను దానం చేస్తున్నా.” సమంత

మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన అవయవదానం కార్యక్రమానిక ప్రత్యూష సపోర్ట్ మద్దతిచ్చింది. ఆ సంస్థ ఫౌండర్ సమంత తాను కూడా అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. అవకాశం ఉంటే అందరూ ఆర్గాన్ డోనర్ గా మారాలని పిలుపునిచ్చారు

image


Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags