సంకలనాలు
Telugu

ఒక యాక్సిడెంట్ వ్యాపారవేత్తను చేసింది..

Pavani Reddy
28th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


శ్రీరాం వెంకట సుబ్రమణ్యన్ తండ్రి ఒకసారి బస్సు నుంచి దిగుతుండగా పొరపాటున కాలుజారి కిందపడ్డారు. తెల్లవారుజామున ఘటన జరిగింది. ఎవరూ గుర్తించలేదు. సాయం చేయలేదు. పాపం తలకు తీవ్రమైన గాయమైంది. రక్తం బొటబొటా కారిపోయింది. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా… రక్తమోడుతుండగానే ఇంటికి వచ్చారు.

షాజిద్ హుస్సేన్ తల్లిదండ్రులు అంబూర్ లో ఉంటారు. వారి బాగోగులు చూసేవారు ఎవరూ లేరు. వారి ఆరోగ్యం గురించి షాజిద్ హుస్సేన్ కు ఎప్పుడూ దిగులే. తండ్రికి హై బీపీ ఉంది. మెడిసిన్ వాడుతున్నారు. రెగ్యులర్ గా చెకప్స్ కు వెళ్లాలి. వెళ్లడానికి ఆయనకు ఓపిక లేదు.

వెంకట సుబ్రమణ్యన్, షాజిద్ హుస్సేన్ ఇద్దరూ విప్రోలో ఉద్యోగాలు చేస్తుండేవారు. ఇద్దరి సమస్యలూ దాదాపు ఒకేలాంటివి కావడంతో… వృద్ధుల ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. టెక్నాలజీని ఉపయోగించి సమస్యను పరిష్కరించాలనుకున్నారు. వృద్ధుల వ్యక్తిగత భద్రత కోసం.. ముందుగా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనుకున్నారు. పిల్లలు తోడులేకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు… అసలు ఎక్కడ ఉన్నారో… ఏమి చేస్తున్నారో తెలుసుకుంటే… వారి సమస్య చాలా వరకు పరిష్కారమైనట్లే. ఆ ఉద్దేశంతోనే క్లోజ్ కనెక్షన్స్ అనే స్టార్టప్ ప్రారంభించారు.

క్లోజ్ కనెక్షన్స్ అసలు ఏం చేస్తుంది.

ఈ స్టార్టప్ ముఖ్యంగా డిజిటల్ హెల్త్ కేర్, పర్సనల్ సేఫ్టీ ప్రోడక్ట్స్ తయారీపై దృష్టిపెడుతుంది. ఐఓటీ కమ్యూనికేషన్, పోర్టబుల్ అండ్ వేరెబుల్ డివైసెస్, ఎనలిటిక్స్, మొబైల్ డివైసెస్ ను రూపొందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వృద్ధుల హెల్త్ కేర్ కోసం అన్ని రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. 

క్లోజ్ కనెక్షన్స్ తయారుచేసిన వేరబుల్ అండ్ పోర్టబుల్ డివైసెస్ ను దగ్గర పెట్టుకుంటే చాలు… ఆరోగ్యానికి ఢోకా లేదు. బాడీలో జరిగే మార్పులను అవి ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి… వాడాల్సిన మందుల గురించి ముందే గుర్తు చేస్తాయి… సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధీకులు లేదా డాక్టర్లకు చేరవేస్తాయి. క్లోజ్ కనెక్షన్స్ స్మార్ట్ వాచ్ లను కూడా తయారు చేసింది.

ముఖ్యంగా రెండు ప్రోడక్ట్స్ తయారు చేస్తోంది

1. డెమాకేర్ : 

మతి మరుపు (డిమెన్షియా)తో బాధపడేవారికోసం డెమాకేర్ అనే స్మార్ట్ వాచ్ తయారుచేశారు. మొబైల్ యాప్ సాయంతో… ఈ వాచ్ పెట్టుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు. కిందపడిపోవడం లాంటి ఎమర్జెన్సీ టైంలో ఎస్ఓఎస్ అలారం కూడా మోగుతుంది.

2. సేఫ్ స్టెప్స్ :

 ఇది ఒక స్మార్ట్ వాకింగ్ స్టిక్ (ఊతకర్ర). అంధులు, వృద్ధులకు ఇది బాగా ఉపయోగకరం. ఇందులో ఉండే అబ్ స్ట్రక్షన్ డివైస్ ఎదురుగా వచ్చేవాటిని గుర్తిస్తుంది. వెంటనే వారికి సిగ్నల్ ఇస్తుంది. దీనిబట్టి వారు తాము నడిచే దిశను మార్చుకోవచ్చు.

వాటి తయారీలో క్లోజ్ కనెక్షన్స్ చాలా సవాళ్లనే ఎదుర్కొంది . హెల్త్ సెన్సర్లు, బ్యాటరీ లైఫ్.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని… అన్నింటిలోనూ విజేతగా నిలిచింది. తయారీ సంస్థతో కలిసి క్లోజ్ కనెక్షన్స్ టీం నిరంతరం పనిచేసి దీనికో రూపు తెచ్చింది. ఎన్ని అపజయాలు ఎదురైనా … బడా కంపెనీల నుంచి పోటీ తీవ్రంగా ఉన్నా వెనకడుగు వేయలేదు. సొంతంగా ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్) ఫ్లాట్ ఫాంను కూడా తయారుచేసుకుంది.

అగ్నాస్టిక్ ఫ్లాట్ ఫాం రూపకల్పన

సరైన సమయానికి ఆరోగ్య సమాచారం, ఎమర్జెన్సీ నోటిఫికేషన్స్ ఇవ్వడమే కాదు… రాబోయే ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తోంది క్లోజ్ కనెక్షన్స్, ఇందుకోసం ఆగ్నాస్టిక్ ఐఓటీ ఫ్లాట్ ఫాం తయారు చేసింది. ఇందుకోసం అడ్వాన్స్ డ్ ఎనలిటిక్స్ ఉపయోగిస్తున్నామన్నారు షాజిద్.


ఆస్పత్రులు, అంబులెన్స్ లు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసులతో ఈజీగా కనెస్ట్ అయ్యేలా ఈ ఐఓటీని అభివృద్ధి చేశారు. క్లోజ్ కనెక్షన్స్ లో ముఖ్యంగా మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి. 

1. వేరబుల్ / పోర్టబుల్ డివైస్ 

2. ఐఓటీ అండ్ అనలిటిక్ క్లౌడ్ ఫ్లాట్ ఫాం 

3. మొబైల్ యాప్స్

వేరబుల్ లేదా పోర్టబుల్ డివైసెస్ వల్ల … వ్యక్తి ఎక్కడున్నారు, ఎలా ఉన్నారన్న సమాచారం తెలుస్తుంది. వీటిలో జీఎస్ఎం సిమ్ కార్డ్ వేసుకుంటే చాలు… మొబైల్ యాప్స్ తో కనెక్ట్ అవ్వొచ్చు. వీటిలోనే ఎస్ఓఎస్ బటన్స్, ఆటోమాటిక్ ఫాల్ టిడెక్షన్స్ ఉంటాయి. సమాచారాన్ని ఐఓటీ, ఎనలిటిక్స్ క్లౌడ్ ఫ్లాట్ ఫాంకు చేరుస్తాయి.

మొబైల్ యాప్స్ సహకారంతో… డాక్టర్లు, ఆస్పత్రులతో టై అప్ చేసుకోవచ్చు. పేషెంట్లతోనూ రిలేషన్ ఫిప్ పెట్టుకోవచ్చు. ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. 

మీరూ సాయం చేయొచ్చు


వైద్యరంగంపై అవగాహన కోసం సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డా.అరవింద్ కస్తూరి సలహాలు తీసుకున్నారు.ఆయనను తమ సలహామండలి సభ్యునిగా నియమించుకున్నారు.డాక్టర్ అరవింద్ తొలి మూడు నెలలపాటు క్లోజ్ కనెక్షన్స్ టీంతో పూర్తి స్థాయిలో పనిచేశారు. డొమైన్ నాలెడ్జ్ అంతా ఈయన ఇచ్చిందే. 2015 అక్టోబర్ నుంచి సలహాసేవలను అందిస్తూ… పలు హెల్త్ కేర్ ఇనిస్టిట్యూట్స్ , ఆస్పత్రులతో కలిసి పనిచేస్తున్నారు.

అత్యవసర సమయాల్లో ఇతరులకు సాయం చేయాలనుకునేవారికోసం హెల్పర్ అనే మొబైల్ యాప్ తయారుచేశాం. ఎవరైనా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే దగ్గర్లో ఉన్న ఎవరైనా వారికి సాయం చేయొచ్చు. డాక్టర్ వచ్చేలోగా సాయం చేయవచ్చు. కేర్ టేకర్లు దూరంగా ఉన్నప్పుడు ఇవి ప్రథమ చికిత్స కోసం ఉపయోగపడతాయి. వెంటనే సాయం అందితే కొంత ఉపయోగపడుతుంది- షాజిద్

ఆదాయం, భవిష్యత్ ప్రణాళికలు

ఇన్ని సేవలందిస్తున్న క్లోజ్ కనెక్షన్స్ కు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనేగా మీ ప్రశ్న. బిజినెస్ టూ బిజినెస్ ప్లాన్ కూడా వీరి దగ్గర ఉంది. ఒక్కసారి వీరి డివైస్ కొనుక్కోని… నెలనెలా ఎంతో కొంత చందా కట్టుకుంటే సరిపోతుంది. డివైస్ కొనుగోలుకు ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. క్లోజ్ కనెక్షన్స్ టీం ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమాచారం ఇచ్చేందుకు, అవగాహన కల్పించేందుకు మరిన్ని ఉత్పత్తులను తయారు చేయబోతోంది. ఐఓటీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని వేరబుల్స్ ను కనెక్ట్ చేసి హోం సెక్యూరిటీ, ఫైనాన్సియల్ పేమెంట్స్, స్మార్ట్ సిటీస్ ఇలా పలు రంగాల్లో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని షాజిద్ తెలిపారు.

ప్యాచెబుల్స్, ఆగుమెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ లాంటి సరికొత్త టెక్నాలజీల సేవలను భవిష్యత్ లో వినియోగించుకునేందుకు క్లోజ్ కనెక్షన్స్ టీం సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలోనే తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి తెచ్చింది . ఆసియా, యూరప్, ఆఫ్రికాలోనూ తమ ఉత్పత్తులను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జూన్ తర్వాత… వాటిని విదేశాల్లో విక్రయించబోతున్నారు.

ఐఓటీ యుగం

ఆరోగ్యంపై ప్రజలకు శ్రద్ధ ఎక్కువవుతోంది. ఐఓటీకి మార్కెట్ పెరుగుతోంది. ఈ రంగంలో స్టార్టప్స్ వస్తున్నాయి. ఈ రంగంలో కార్డియా, లే చాల్, జెకో, సెన్స్ గిజ్, గెట్ యాక్టివ్ లాంటి సంస్థలున్నాయి. స్టార్టప్ లే కాదు… ఐబీఎం, ఇంటెల్, గెమాల్టో, ఇన్ఫోసిస్, విప్రో, టెక్సాస్ ఇనుస్ట్రుమెంట్స్ లాంటి దిగ్గజాలు కూడా ఉన్నాయి. ఐఓటీ వేరబుల్స్ రంగంలో సత్తా చాటుతున్నాయి. 2020 నాటికి ఐఓటీ మార్కెట్ 373 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇందులో 194 బిలియన్ డాలర్లు హార్డ్ వేర్ ది కాగా… 179 బిలియన్లు సాఫ్ట్ వేర్ రంగానిది. ఇందులో భారత్ మార్కెట్ 10 నుంచి12 బిలియన్ డాలర్లు .

వేరెబుల్ సెక్టర్ బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో చాలా కొత్త ఉత్పత్తులు రాబోతున్నాయి. ఈ స్టార్టప్ లు భవిష్యత్ లో బాగా అభివృద్ధి చెందుతాయి. గూగుల్, ఫేస్ బుక్ లాంటి పెద్ద సంస్థలు సైతం ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు … ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవి రాకపోతే చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం చిక్కుతుంది - రితేష్ మాలిక్, ఇన్ రోబోటిక్స్, కార్డియా ల్యాబ్స్ లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తి. 
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags