సంకలనాలు
Telugu

113 మంది వద్దన్నా...రతన్ టాటా ఎందుకు పెట్టుబడి పెట్టారు ?

ఆంట్రప్రెన్యూర్‌షిప్‌లో ఇదే మజాఎంత పోరాటమో.. అదే స్థాయిలో ఫలితంచివరకు టాటాను మెప్పించి ఒప్పించిన నిధి అగర్వాల్వెస్ట్రన్ వేర్‌లో లీడింగ్ బ్రాండ్‌గా ఎదగాలనే ఆలోచనభారతీయ మహిళల శరీరాకృతికి తగ్గట్టు వెస్ట్రన్ వేర్యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్ శ్రద్ధా శర్మకు ప్రత్యేక ఇంటర్వ్యూ

team ys telugu
10th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

పది కాదు.. ఇరవై కాదు.. వంద కాదు.. ఏకంగా 113 అభ్యర్థనలు. వ్యక్తిగతంగా కలిసి కొన్ని, ఈమెయిళ్ల ద్వారా మరికొన్ని, ఫోన్‌లో ఇంకొన్ని సార్లు. ఇదీ తన సంస్థ కార్యా ఏర్పాటుకు అవసరమైన నిధులను సమీకరించేందుకు నిధి అగర్వాల్ చేసిన ప్రయత్నం. 365 రోజుల పాటు ఆమె తన ఆత్మస్ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరకు ఆ కృషికి ఫలితం రానే వచ్చింది. తన సంస్థకు అవసరమైన మొదటి రౌండ్ ఫండింగ్ సమకూరింది. అది కూడా సామాన్యమైన వ్యక్తులో, సంస్థల నుంచో కాదు.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా నుంచి. ఆయనతో పాటు మరో అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా ఆమె ఆలోచనకు ఓకె చెప్పి పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఆయనే అధికారికంగా తన ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను వెల్లడించబోతున్నారు.

ఇలాంటి కథలే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతమిస్తాయి. ఆంట్రప్రెన్యూర్‌షిప్‌లో ఉన్న మజా ఏంటో అర్థమయ్యేలా చేస్తాయి.

కార్యా ఓ నాన్ క్యాజువల్ వెస్ట్రన్ వేర్ బ్రాండ్. ప్రత్యేకించి భారతీయ మహిళల శరీరాకృతిని దృష్టిలో ఉంచుకుని ఔట్‌ఫిట్స్ తయారు చేసే సంస్థ. వెస్ట్రన్ ఫార్మల్స్‌కు.. ఇండియన్ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు 18 ప్రత్యేక సైజులను అందుబాటులోకి తెస్తుంది కార్యా.

నిధి అగర్వాల్, కార్యా వ్యవస్థాపకురాలు

నిధి అగర్వాల్, కార్యా వ్యవస్థాపకురాలు


ఎలా వచ్చిందీ ఆలోచన -

"2010లో ఒకసారి నేను క్లయింట్ మీటింగ్‌కు వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్ పయనమయ్యాను. (అప్పుడు నేను బెయిన్ కన్సల్టింగ్‌లో స్ట్రాటజీ కన్సల్టెంట్‌ను. ఆ తర్వాత హనీవెల్, కెపిఎంజిలో కూడా పనిచేశాను) అనుకోకుండా నేను తాగుతున్న కాఫీ నా షర్ట్‌పై ఒలికింది. దీంతో చేసేది లేక ఓ కొత్త షర్ట్ కొనేందుకు దగ్గర్లో ఉన్న ఒక మాల్‌కు వెళ్లాను. ఆశ్చర్యకరంగా పాపులర్ బ్రాండ్స్‌లో కూడా సరైన ఫిటింగ్స్ లేవు. వాటిల్లో అధిక శాతం నడుము దగ్గర పెద్దగానో, ఛాతి భాగంలో సన్నగా ఉన్నాయి. నాకు ఆశ్చర్యమేసింది. ఈ సమస్య నా ఒక్కదానికేనా..లేక అందరు మహిళలూ ఇదే ఇబ్బందికి గురవుతున్నారా అనే ఆలోచన వచ్చింది. 250 మందితో ఈ విషయాన్ని పంచుకుంటే... వారిలో 80 శాతం మంది ఫిటింగ్స్‌ విషయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు".

అనుభవం లేకుండా వ్యాపారం సాధ్యమా ?

అనుభవం కోసం గ్రేటర్ నోయిడాలోని ఓ ఎక్స్‌పోర్ట్‌ హౌజ్‌లో పనిచేశాను. వ్యాపారంలో ఉన్న మెళకువలను అర్థం చేసుకున్నాను. అప్పటికే సేవా రంగంలో పనిచేసిన అనుభవం ఉండడం వల్ల త్వరగా నేర్చుకునే తత్వం, వివిధ షిఫ్టుల్లో అధిక గంటలు పనిచేయడం అలవాటైంది. సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించడం నేను నేర్చుకున్నాను.

కార్యా ప్రత్యేకత ఏంటి ?

కార్యా మూడు విభాగాల్లో విభిన్నమైంది. మా దగ్గర 18 ప్రత్యేక సైజలు ఉన్నాయి. సాధారణంగా ఉంటే ఆరు ఫిటింగ్స్‌తో పోలిస్తే మా దగ్గర భారతీయ మహిళల శరీరాకృతికి నప్పే కొలతలతో సైజులు ఉంటాయి. అన్నింటికంటే కంఫర్ట్ మాకు ముఖ్యం. షర్టుల్లో బటన్‌ల దగ్గర గ్యాప్ లాంటి చిన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. ప్రతీ నెలా 150 కొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నాం. మా దగ్గర ఐటి ఆధారిత వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యపడ్తోంది.

వెస్ట్రన్ ఫార్మల్ వేర్ విభాగంలో ఓ అతిపెద్ద బ్రాండ్‌గా ఎదగాలనేది నిధి లక్ష్యం. ఇందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా అవసరముంటుంది. అందుకే ఫ్లిప్‌కార్ట్ SBG(ఇది ఫ్లిప్ కార్ట్ బ్రాండ్ కన్సల్టింగ్ సంస్థ)తో బ్రాండ్ స్ట్రాటజీ కన్సల్టింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు.

image


లక్ష్యాలను ఎదుర్కోవడంలో ఆనందమే వేరు

"ఛాలెంజ్‌లా తీసుకుని నేను మొదట కార్యా ప్రారంభించా, ఆ తర్వాత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనే నా ఆలోచన. మా సంస్థకు ఎదురయ్యే కఠినమైన, అధిక రిస్క్‌గల నిర్ణయాలన్నింటినీ నేను తీసుకోవాల్సిన అవసరముంటుంది. సవాళ్ల విషయానికి వస్తే.. వాటిని ప్రతీ రోజూ ఎదుర్కోక తప్పదు. అన్నింటికంటే కష్టమైన ఇబ్బంది నిధుల సేకరణే. 365 రోజుల పాటు ఫోన్లు, ఈమెయిల్, వ్యక్తిగతంగా కలుసుకుని 113 ప్రజెంటేషన్లు ఇచ్చాను. చివరగా ఆ 365వ రోజు నా డీల్ క్లోజైంది". 

ప్రతీసారీ నవ్వుతూ అలా ముందుకు సాగిపోవడం, మళ్లీ అదే ఉత్సాహంతో సాగడం ఆమె దినచర్యలో భాగమైంది. వాస్తవంగా ఇది అంత సామాన్యమైన విషయం కాదని మనం గ్రహించాలి.

"మనం వ్యాపారం నిర్వహించే సమయంలో చిన్న చిన్న విషయాలు కూడా ఇబ్బందిపెడ్తాయి. మహిళలు వ్యాపారం చేస్తున్నప్పటికీ వారికే సర్వాధికారాలు ఉంటాయని ఎవరూ భావించారు. వాళ్ల వెనుక ఎవరో మగవాళ్లు ఉంటారని, వాళ్లే నిర్ణయాధికారులను ఊహించుకుంటూ ఉంటారు. ఒకసారి గుర్గావ్ ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు ఫ్రిజ్ డెలివర్ చేసేందుకు ఒక కొరియర్ బాయ్ వచ్చాడు. దాన్ని నాకు ఇచ్చేందుకు ససేమిరా అన్నాడు. బాస్‌ని పిలవండి, బాస్‌తోనే మాట్లాడతాను అంటూ పదే పదే చెబ్తున్నాడు. చివరకు వాచ్‌మెన్‌ వచ్చి నేనే ఓనర్‌ని అని చెప్పేంతవరకూ ఆ కొరియర్ బాయ్‌ మొండిగానే వాదిస్తూ వచ్చాడు".

కెలాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ నుంచి ఎంబిఏతో పాటు డీన్స్ సర్వీస్ అవార్డ్ సత్కారాన్నీ నిధి పొందారు. విద్యాపరంగా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన తను విపరీతమైన ఓపికను అలవర్చుకున్నారు. అదే పనులను చేయిస్తుందని తర్వాత తెలుసుకున్నారు.

"నేను నా జీవితంలో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా కష్టపడుతూనే వచ్చాను. సేవా రంగంలో ఉన్నందు వల్ల రెట్టింపు సమయాన్ని వెచ్చించాల్సి వచ్చేది. ఆంట్రప్రెన్యూర్‌షిప్ నాకు చాలానే నేర్పింది. డబ్బు విషయంలో సర్దుకుపోవడం మొదలు కష్టకాలంలో ఎలా నెట్టుకురావాలో కూడా తెలుసుకున్నాను. ఆ అవగాహనతోనే నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఆ పాఠాలే నన్ను ఓ మనిషిలా మార్చాయి".

website

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags