సంకలనాలు
Telugu

ఆన్‌లైన్ టిఫిన్ సర్వీస్‌లో కొత్త ట్రెండ్ ‘టేక్ యువర్ పిక్’

డబ్బావాలా లాంటి సిస్టమ్ ఉన్న ముంబయిలో సాహసం చేస్తున్న ‘టేక్ యువర్ పిక్’ఆన్ లైన్ ఫుడ్ మార్కెట్ దిగ్గజాలతో పోటీ పడాలనే లక్ష్యం...ఉన్న టిఫిన్ సర్విసెస్ నే ఎంచుకున్న ఇద్దరు మిత్రులు...

ABDUL SAMAD
28th Apr 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

ఆన్ లైన్ ఫుడ్ డెలివరి చేస్తున్న కంపెనీల సంఖ్య రోజు రోజుకు పెరగుతూనే ఉంది, ఇలాంటి కొత్త ఐడియాలతో వ్యాపారాలు చేస్తున్న వారు లాభాలు కూడా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. ‘ఫుడ్ పాండా’, ‘జోమాటో’ లాంటి కంపెనీల తరవాత బెంగుళూరుకు చెందిన ‘స్విగ్గి’, ‘సైఫ్ పార్ట్‌నర్స్’ నుండి సుమారు 2 మిలియన్ డాలర్ల ఫండ్స్ రాబట్టగలిగారు. ‘టాప్ కిబో’ ను ఫ్రీచార్జ్ సీఈఓ ఆలోక్ గోయల్ సపోర్ట్ చేయగా, ముంబయి కి చెందిన ‘టైనీ ఓల్’ కంపెనీ 19 మిలియన్ డాలర్ల ఫండ్స్‌తో 400లకు పైగా టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారంలో టెక్నాలజీని వాడుతున్న వీరందరు, వివిధ రెస్టారెంట్లతో పొత్తు పెట్టుకోవడం లేదా సొంత కిచెన్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు.

ఇంత పెద్ద ఆన్ లైన్ ఫుడ్ మార్కెట్లో దశాబ్దాల కాలం నుండి నడుస్తున్న టిఫిన్ సెంటర్ల పరిస్దితి ఏంటని ఆలోచించిన ‘టేక్ యువర్ పిక్’, టిఫిన్ సెంటర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాలని అనుకుంది. డబ్బావాలా లాంటి సిస్టమ్ ఉన్న ముంబయిలో సాహసం చేసారు ఇద్దరు మిత్రులు.

మెకానికల్ ఇంజినీరింగ్ చేసి పదేళ్లపాటు ప్రాడక్ట్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న సునీల్ కుమార్‌తో పాటు హెచ్.ఆర్.లో అనుభవం ఉన్న మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్ రానెట్ రాడ్రిక్స్ కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందులో సునీల్ తల్లి ఓ టిఫిన్ సెంటర్‌ని నడుపుతున్నారు.

image


“ఓ మంచి టిఫిన్ కోసం ఓఎల్‌ఎక్స్, క్వికర్, జస్ట్ డయల్ వరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ డైలమా నుండి బయటపడటానికి ఓ రోజు ఉదయం సునీల్‌ని ఫోన్ చేసి టిఫిన్ సర్వీసెస్ ‘జోమాటో’గా ఎదగాలనుకుంటున్నాను అన్నారు రోనెట్”.

ఈ ఐడియా పై ఆలోచించిన ఇద్దరు మిత్రులు వివిధ టిఫిన్ సెంటర్ల విక్రేతలను ఒకే దగ్గరికి తేవాలని అనుకున్నారు.

ఇద్దరు కలిసి ముంబయి అంతటా టిఫిన్ విక్రేతల దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి తమ ప్లాన్ గురించి వివరించారు, వెబ్‌సైట్ ప్రారంభించి ఆర్డర్లు తీసుకునే ముందు ఈ రంగంలో మార్కెటింగ్ చేయాలని భావించిన వీరు, క్వికర్, ఓఎల్‌ఎక్స్, జస్ట్ డయల్ , ఫేస్‌బుక్‌లపై ప్రచారం చేసుకున్నారు. వాటికి రెస్పాన్స్ కూడా బానే వచ్చింది. ముందు 50 ఆర్డర్లతో ప్రారంభమైనా.. ఇప్పుడు ఓ చిన్న టీమ్ సహాయంతో వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్లను తీసుకుంటున్నారు.

టేక్ యువర్ పిక్ ఇస్తున్న ఆఫర్స్

image


‘రుచిర టిఫిన్స్’, ‘ముంబై కిచెన్’, ‘మాజీ ఆయి’ వంటి విక్రేతల ద్వారా వెజ్ మరియు నాన్ వెజ్ ఆర్డర్లు సప్లై చేస్తున్నారు. కాంటినెంటల్, డైట్, డయాబెటిక్ ఫుడ్ కూడా ఆర్డర్‌పై ఇవ్వగలుగుతోంది ‘టేక్ యువర్ పిక్’.

image


కేవలం ఆర్డర్లు తీసుకోవడం కాకుండా మీల్స్ అందుకున్నారా లేదా, ఆ ఫుడ్‌పై వారి అభిప్రాయం, ఇంకేమైనా సూచనలు ఇవ్వలనుకుంటున్నారా వంటి అంశాలు కూడా తెలుసుకుంటామంటున్నారు రోనెట్. ఇక ఆర్డర్ ఇవ్వడానికి యాప్ లేకపోయినా , ప్రస్తుతానికి కస్టమర్లు ఫోన్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ ఇవ్వొచ్చని అంటున్నారు.

ప్రస్తుతం రోజుకు 10 ఆర్డర్లు సప్లై చేస్తున్న ‘టేక్ యువర్ పిక్’, ఇంకా ప్రారంభ దశలో ఉందని, రాబోయే మూడు నెలల్లో కనీసం నెలకు 1000 ఆర్డర్లు తీసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఇద్దరు మిత్రులు. వీరు అనుకున్నట్టుగా రోబోయే ముడు నెలల్లో టార్గెట్ రీచ్ అయితే మాత్రం, ఆన్ లైన్ ఫుడ్ మార్కెట్లో మరో పెద్ద కంపెనీగా ఎదిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags