సంకలనాలు
Telugu

మహిళలపై వేధింపును గొంతెత్తి ప్రశ్నించే 'బ్లాంక్ నాయిస్'

అనంతమైన ద్వారాలు.. ఎవరు వచ్చినా వెళ్ళినా అవి రెట్టింపవుతుంటాయి. అదే బ్లాంక్ నాయిస్. 2003లో జాస్మీన్ పతేజా ప్రారంభించిన ఆర్ట్ కలెక్టివ్ ఇది. కళల మాధ్యమంగా లైంగిక వేధింపులపై పోరాడాలన్నదే ఈ బ్లాంక్ నాయిస్ ఉద్దేశం.

bharathi paluri
22nd May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వాస్తవం ఎలా వుండాలో చెప్పడానికి మనమెవరం ? వాస్తవం ఎలా వుందో తెలుసుకోవడమే మన పని అని బ్లాంక్ నాయిస్ నమ్మకం. ఇదో నిరంతర చర్చా స్రవంతి. ఇందులో పాల్గొన్న వారందరూ ఎవరికి వారే కొత్త ఆలోచనలను పంచుకుంటారు. ‘‘ఈ ప్రక్రియ స్థిరంగా వుండదు. మా లక్ష్యాలు కూడా మారుతూ వుంటాయి. ఎందుకంటే ఇది అనేక అనుభవాల సమాహారం. వీధుల్లో అమ్మాయిలను వేధించడం దగ్గర నుంచి అత్యాచారాల వరకు అనేక కేసులు చూస్తుంటాం. వాటిపై లోతుగా చర్చిస్తాం. ఆ చర్చల్లో మా అవగాహన పరిణితి చెందుతూ వుంటుంది. రోజు రోజుకూ మారుతూ వుంటుంది. బలపడుతూ వుంటుంది. రగులుతూ వుంటుంది. దీని వ్యక్తీకరణకు ఒక భాషగా మేం ఆర్ట్‌ను స్వీకరించాం’’ అని జాస్మిన్ వివరించారు.

జాస్మిన్ పతేజా, బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు

జాస్మిన్ పతేజా, బ్లాంక్ నాయిస్ వ్యవస్థాపకురాలు


ఏంటీ బ్లాంక్ నాయిస్ ?

''ఒక ఆర్ట్ స్టూడెంట్‌గా నాకు ఫెమినిజం అంటే ఆసక్తి ఎక్కువే. సామాజిక మార్పులో ఆర్టిస్ట్ పాత్ర చాలా వుంటుందని నా నమ్మకం. దీనికి తోడు ఒక మహిళగా నేను ఎదుర్కొన్న వేధింపులు కూడా తక్కువేం కాదు. దీని వల్ల నాలో కలిగిన బాధ, వేదనకు ఒక వ్యక్తీకరణ కూడా కావాలని అనిపించేది. నిజానికి ఈ వేధింపులను బయటికి చెప్పుకునే అవకాశం తక్కువ. ఒక వేళ అవకాశం వున్నా.. దాని వల్ల ముప్పే ఎక్కువ'' అంటారు జాస్మీన్..

అందుకే చాలా వరకు బాధితులు తమకేం కాలేదని చెప్పడానికో.. లేదా మౌనంగా వుండిపోవడానికో ప్రయత్నిస్తారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికే బ్లాంక్ నాయిస్ మొదలైంది.

నేను స్కూల్ నుంచి బయటికొచ్చే టైమ్‌కి ఈ బ్లాంక్ నాయిస్‌ను ప్రారంభించాం. వర్క్ షాప్స్‌తో మొదలైన ఈ బ్లాంక్ నాయిస్‌లో స్త్రీలపై జరుగుతున్న వేధింపుల గురించి మాట్లాడుకునే స్పేస్‌ను కల్పించాం. 2004లో నా బ్లాగ్ మొదలైన తర్వాత ఈ కమ్యూనిటీ మరింత విస్తృతమైంది.

బ్లాంక్ నాయిస్.. యాక్షన్ హీరో

ప్రస్తుతం డొనేషన్లపై ఆధారపడి నడుస్తున్న ఈ బ్లాంక్ నాయిస్‌లో వాలంటీర్లను యాక్షన్ హీరోలు అంటారు. లైంగిక వేధింపుల గురించి రకరకాల కాన్సెప్ట్‌ల ద్వారా జనాల్లో అవగాహన పెంచడమే ఈ యాక్షన్ హీరోల పని. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాలంటీర్లు ఈ పనిలో నిమగ్నమై వుంటారు.

క్యాంపెయిన్స్..

వీధుల్లో వేధింపులను ఎలా చూడాలి..? ఎలా నిర్వచించాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అన్న అంశాలపై బ్లాంక్ నాయిస్ ప్రధానంగా పనిచేస్తుంది. నేను మొదలు పెట్టినప్పుడు ఇది చర్చకు అవకాశమిచ్చే వేదికగా మాత్రమే వుండేది. వీధుల్లో మహిళలపై జరిగే హింసకు కేవలం ప్రేక్షకులగా మిగిలిపోకుండా.. ఎంతో కొంత గొంతెత్తడానికి ఈ వేదిక ఉపయోగపడేది. అంతకు మించి దీన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే ఐడియా అప్పట్లో లేదు. అయితే, తొలి అడుగు అంటూ వేస్తే.. దారి అదే ఏర్పడుతుందని మా విశ్వాసం. ఆ విశ్వాసమే ఇప్పుడు ప్రతిరోజూ ఓ కొత్త సంభాషణగా, సరికొత్త అవగాహనగా మారుతోంది.’’ అంటారు జాస్మిన్.

బ్లాంక్ వాయస్ తాజాగా.. టాక్ టు మి.. అనే ప్రాజెక్టు చేసింది. ఇందులోప్రధానంగా పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు అనేక విషయాలు మాట్లాడుకుంటారు. లైంగిక హింసకు తావులేని సంభాషణ ఇది. ఓ కొత్త వ్యక్తితో మాట్లాడి, వారి మనోభావాలను అర్థం చేసుకోవడమే ఇందులో ప్రధాన ఉద్దేశం. ఎదుటి వ్యక్తిలో వుండే భయాలు, స్వార్థాలు తెలుసుకోవడం, ఒక వ్యక్తి దేన్ని చూసి భయపడుతున్నారు... ఎందుకు భయపడుతున్నారో అర్థం చేసుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఇక వచ్చే రెండేళ్లలో ఈ బృందం చేపట్టే మరో ప్రాజెక్టు పేరు ‘ఐ నెవర్ ఆస్క్ డ్ ఫర్ ఇట్’ (నేనెప్పుడూ దాన్ని అడగలేదు). బాధితుల మీదే నేరం మోపే ధోరణని అర్థం చేసుకోవడానికీ, ఎదుర్కోవడానికీ ఈ ప్రాజెక్టును చేపట్టాం. నిజానికి ఈ ధోరణే చివరికి లైంగిక హింసకు దారి తీస్తుంది. భార్యను హింసించే భర్త, ‘‘కొట్టేదాకా తెచ్చుకోకు అని’’ అని భార్యను బెదిరిస్తాడు. అలాగే సెక్స్ వర్కర్‌ను హింసించేవాళ్ళు.. ‘‘నీకు ఇది తగిన శాస్తి’’ అనడం కూడా ఈ కోవలోకే వస్తుంది..’’అని వివరించారు జాస్మీన్.

యాక్షన్ హీరోలు రోడ్లపై గీసిన  కొన్ని చిత్రాలు. బెంగళూరులోని యలహంకలోని ఓ రోడ్ ఇది. ఇక్కడ వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో యాక్షన్ హీరోస్ తమ వాయిస్‌ను ఇలా వినిపిస్తున్నారు

యాక్షన్ హీరోలు రోడ్లపై గీసిన కొన్ని చిత్రాలు. బెంగళూరులోని యలహంకలోని ఓ రోడ్ ఇది. ఇక్కడ వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో యాక్షన్ హీరోస్ తమ వాయిస్‌ను ఇలా వినిపిస్తున్నారు


జనం లోకి చర్చ..

ఆన్ లైన్ లో బ్లాంక్ నాయిస్ కు మంచి ఆదరణే వుంది. అయితే, బయట జనంలో, ప్రత్యేకించి ఇంగ్లీష్ రాని జనాల్లోకి ఈ వేదిక ఇంకా అంతగా పోలేదనే చెప్పాలి. వర్క్ షాప్‌లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, వీడియోలు, పాంప్లెట్లు, పోస్టర్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లోకి విస్తరించాలని ఈ బృందం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఐ నెవర్ ఆస్క్ డ్ ఫర్ ఇట్.. ప్రాజెక్టును వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించబోతున్నారు. ‘‘లైంగిక హింస గురించి నిశ్శబ్దాన్ని బద్దలు చేయాలి. చర్చజరగాలి.. ఇందులో ఎంత మంది పాల్గొంటే అంతగా మా ఉద్దేశం నెరవేరినట్టు’’ అన్నారు.. జాస్మిన్.

ఎంత అనుకున్నా.. మారు మూల ప్రాంతాల్లోకి వెళ్ళ లేకపోయిందనే విమర్శ బ్లాంక్ నాయిస్ పైన వుంది. అయితే , ఈ విమర్శను జాస్మిన్ స్వాగతిస్తారు. ఇప్పటికి ఇంతే చేయగలిగాం. చాలా చేసేసాం అని నేను కూడా చెప్పట్లేదు. అయితే, ఎవరిదగ్గరైనా గొప్ప ఐడియాలుంటే, వాటిని స్వీకరించడానికి మేం సిద్ధంగానే వున్నాం. బ్లాంక్ నాయిస్ ఓ పిచ్చి పని అని విమర్శించిన ఒకామెతో కూడా నేనీ మాటే చెప్పాను. ఆ తర్వాత ఆమె మాటల్లో మార్పొచ్చింది.’’ అని గుర్తు చేసుకున్నారు జాస్మిన్.

టిబెటెన్ యాక్షన్ హీరోలు

టిబెటెన్ యాక్షన్ హీరోలు


ఆర్టిస్టంటేనే యాక్టివిస్ట్.

జాస్మిన్ దృష్టిలో ఆర్టిస్ట్ అంటేనే యాక్టివిస్ట్. అయితే మిగిలిన వారితో పోలిస్తే, ఆర్ట్ వల్ల ఒక ప్రయోజనం వుంది. ఇది ఒక అడుగు వెనక్కేసి మొత్తం సమస్యను అర్థం చేసుకునే అవకాశాన్నిస్తుందంటారు జాస్మిన్.

ప్రపంచం మొత్తం మీద లైంగిక వేధింపులు జరగడంలో కొన్ని పద్ధతులను పాటిస్తున్నారా.. అనే అంశాన్ని భవిష్యత్తులో పరిశోధించాలనుకుంటున్నారు.. జాస్మిన్. ‘‘ఈ మధ్య నేను అర్జెంటీనా నుంచి వచ్చిన ఒకరితో మాట్లాడాను. తను కూడా వీధుల్లో వేధింపులపై అధ్యయనం చేస్తోంది. మా ఇద్దరి అనుభవాలు పంచుకున్నప్పుడు ఇక్కడా, అక్కడా ఒకే పద్ధతిలో జరుగుతున్నట్టు అనిపించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ వేధింపుల జాడ్యం మళ్ళీ విస్తరిస్తోంది. ఎందుకిలా? మళ్ళీ మళ్ళీ తలెత్తే అంశాలు ఏవో వుండుంటాయని అనిపించింది నాకు’’ అని తన పరిశీలనకు వచ్చిన అంశాలను వివరించారు జాస్మిన్.

సేఫ్ సిటీ ప్లెడ్జ్

సేఫ్ సిటీ ప్లెడ్జ్


ఫెమినిజమ్

స్త్రీవాదం అంటే, కొంతమంది ఆడవాళ్ళు తమ కోపాన్ని వెళ్ళగక్కి ప్రతీకారం తీర్చుకునే మాధ్యమం కాదని బ్లాంక్ నాయిస్ నమ్ముతుంది. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ఈ వేదిక అంటారు జాస్మిన్.

కోపం, ఉద్రేకాల వల్ల ఉపయోగం లేదు. మనమేంటో ప్రపంచానికి చెప్పాలి. అదే బ్లాంక్ నాయిస్ లక్ష్యం అంటారు జాస్మిన్. 2005లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన ఒక ప్రదర్శన ద్వారా ఇంటిబయట స్త్రీలకు వుండాల్సిన స్వేచ్ఛను తిరిగిపొందడానికి ప్రయత్నించిన ఉదంతాన్ని జాస్మిన్ గుర్తు చేసుకున్నారు. అపరిచితుల కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూడమని మేం స్త్రీలకు చెప్పాం. పబ్లిక్ లోకి స్త్రీలు రావాలి. తమకు తోచిన విధంగా గడపాలి. దీనికి అడ్డుచెప్పిన ఒక మగాడికి మా యాక్షన్ హీరో ( వాలంటీర్ ) ఒకరు గట్టి సమాధానం చెప్పారు. అయితే, నిజానికి అలా ఆవేశపడడం మా ఉద్దేశం కాదు. మహిళల కళ్లలో కళ్ళు పెట్టి చూడడానికి మగాళ్ళు ఇబ్బంది పడితే, అది వారి సమస్య.. మనం మాత్రం ప్రశాంతంగా మన పని చేసుకుపోదాం’’ అంటారు జాస్మిన్.

ఏదో వివాదస్పదంగా చెయ్యాలని కాదు.. మన నమ్మకాలకు అనుగుణంగా మనం బతకాలి. తప్పు చేయనప్పుడు భయపడకపోవడం, మన కోరికలు వ్యక్తం చేయడానికి సంకోచించకపోవడం, మనపై జరిగే లైంగిక వేధింపులకు మనలోనే లోపాలు వెతుక్కోకుండా వుండడమే యాక్షన్ హీరో లక్షణాలు.’’ అని ముగించారు జాస్మిన్.

image


పంచుకోవాలి

మొత్తం మీద గడచిన కొన్ని దశాబ్దాలుగా స్త్రీలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చర్చలో కొంత మర్పొచ్చిందని జాస్మిన్ అంగీకరిస్తున్నారు. అయితే, ఇప్పటికీ తమపై జరిగిన వేధింపులను పది మందితో పంచుకోవడానికి మహిళలు సంకోచిస్తూనే వున్నారని ఆమె అంటున్నారు. ఈ పరిస్థితిలో కూడా మార్పు రావాలి. మనం ఎప్పుడనుకుంటే అప్పుడు.. అనుభవాలను మనం చెప్పుకోగలగాలి.. మాట్లాడాలి.. పంచుకోవాలి..’’

ఈ చర్చలో మీరూ పాల్గొనాలంటే, blanknoise వెబ్ సైట్ కి వెళ్లండి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags