సంకలనాలు
Telugu

హస్తకళలను కాపాడుకోవాల్సినంత అవసరం ఉందా ?

Lakshmi Dirisala
27th Aug 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

‘‘ నీలం చబ్బీర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సామాజిక వర్తకం మీద నా ఆసక్తి మరింత పెరిగిందంటారు జాకోబ్ మ్యాథూస్. ఆయన ‘‘ ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ ’’ సీఈవో. 1994లో గీతా రామ్, పూనమ్ బిర్ కస్తూరి అనే ఇద్దరు స్నేహితులతో కలిసి చబీర్ ఇండస్ట్రీ క్రాఫ్ట్‌ను స్థాపించారు. సమకాలీన హస్తకళ ఉత్పత్తులను అమ్మడం ఈ సంస్థ లక్ష్యం. అసంఘటిత రంగంలోని చేతివృత్తులవారు, వారి కుటుంబ సభ్యులు తయారు చేసే వస్తువుల్ని అమ్మే ఓ బ్రాండ్‌గా ఇండస్ట్రీ క్రాఫ్ట్‌ను తీర్చిదిద్దారు చబీర్, కస్తూరి కలిసి. అది ఆ తర్వాత రెండు శాఖలుగా విస్తరించింది. అందులో ఒకటి మదర్ ఎర్త్. దీనిని 2009లో స్థాపించారు. దాదాపు ప్రతి బెంగళూర్ వాసికి దీని గురించి తెలుసు. అంతగా ఈ సంస్ధ ప్రాచుర్యం పొందింది. మరొకటి ఇండస్ట్రీ క్రాఫ్ట్ పౌండేషన్, 2000వ సంవత్సరంలో ఒక స్వచ్ఛంద సంస్ధగా ఇది ఏర్పడింది.

రైతులు, చేతివృత్తులవారు, చేనేతకారులు, కళాకారులతో కలిసి పనిచేసేది ఇండస్ట్రీ ఫౌండేషన్. వారిని సొంత వ్యాపార సంస్థలకు యజమానులుగా తీర్చిదిద్దేందుకు సాయపడేది ఈ సంస్ధ. ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్, ప్రైవేట్ రంగ సంస్థ అయిన ఇండస్ట్రీ క్రాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు కూడా కలిసి పనిచేసేవి.

తాటి ఆకుల ఉత్ప్తులు మలూద్ గ్రామం, పూరీ జిల్లా, ఒరిస్సా

తాటి ఆకుల ఉత్ప్తులు మలూద్ గ్రామం, పూరీ జిల్లా, ఒరిస్సా


image


‘‘ మనం చేసిన సాధనే ఎప్పటికీ కొనసాగుతోంది’’ అంటారు జాకోబ్. ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. చేనేత పరిశ్రమ మొట్టమొదటగా ఇంటి నుంచే ప్రారంభమైనట్టు కనుగొన్నారు. ‘‘ఈ రోజు చేనేతను ఒక వ్యవస్థీకృత రంగంగా మర్చడం గురించి మనం మాట్లాడితే వ్యతిరేకత వస్తుంది’’ అని ఆయన అన్నారు. దీనికి కారణం హస్తకళల కార్మికుల ఆర్థిక పరిస్థితితో ముడిపడి ఉంటుంది. వేగంగా అంతరించిపోతున్న పరిశ్రమలో, కార్మికుల కోణంలో చూస్తే వ్యక్తిగతంగా చేసే పనికే కాస్త రక్షణ ఉంటుంది. ‘‘చాలా వరకు నేతనేసేవారు మగవాళ్లే. కానీ రంగులు వేయడం, దారాలు కత్తిరించడం ఇలాంటి పనులన్నీ చేసేది మహిళలే. కానీ ఆ పనికి వేతనం లభించదు.’’ అని చెబుతున్నారు జాకోబ్.

‘‘ ఒక వస్తువును తయారు చేసినప్పుడు, దాని కోసం పనిచేసిన వారి కష్టానికి విలువ తెలియనప్పుడు ఆ వస్తువుకు మీరు ఎలా విలువ కడతారు ? అయితే వాళ్లు ఎటువంటి ప్రతిఫలం లేకుండా ఉచితంగానే పనిచేస్తున్నారా ? ఒక వేళ మీరు దీనిని వ్యవస్థీకృతం చేస్తే, ఇందులో భాగమయ్యే అందరూ అంటే చేనేత కార్మికుల భార్యలకు కూడా వేతనం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వస్తువు ధర పెరుగుతుంది. కానీ ఉత్పత్తి విలువ పెరిగినప్పుడే అది నిజంగా జరుగుతుంది. ఇది కూడా కోడి ముందా ? గుడ్డు ముందా? అనే సమస్యలాంటిదే అంటారు మ్యాథూ.

స్వయం సహాయక బృందాలతో ఇంపాక్ట్ ఎడ్జ్ విద్యార్థలు, స్వామిక గ్రామం, హ్యరానా

స్వయం సహాయక బృందాలతో ఇంపాక్ట్ ఎడ్జ్ విద్యార్థలు, స్వామిక గ్రామం, హ్యరానా


ఈ ఏర్పాటు వల్ల లాభం పొందేది ఎవరన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోందంటారు మాథ్యూ. దళారుల ప్రమేయం అన్న వివాదాస్పద అంశం ఇక్కడే తెరపైకి వస్తుంది. ఇంటర్నెట్ కారణంగా ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు మధ్య నేరుగా సంబంధం ఏర్పడుతున్న 21వ శతాబ్దంలో దళారులంటే దెయ్యాలే. ‘‘ దళారులు కొంత వరకు అవసరమే. అసలైన ప్రశ్న ఏంటంటే... ఎంత మంది దళారులు ఉన్నారు ? వాళ్లు ఎంతెంత దోచుకుంటున్నారు ?’’ ఈ దళారుల సమస్యను లోతుగా అర్ధం చేసుకోవాలంటారు మాధ్యూ. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ దళారులంతా అప్పులిచ్చేవారు లేదా సదుపాయలు సమకూర్చేవారు. వాళ్లు డబ్బులు ఇచ్చిన క్షణం నుంచి, వారికి ఒక విధమైన నియంత్రణ అధికారం దక్కుతుంది. 

దళారుల బెడద తగ్గించడం అంటే, నిరు పేద కార్మికులకి ఆదాయ వనరుల్ని కల్పించడమే. ఈ దళారులు సప్లయ్ –డిమాండ్ చైన్ ను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిపోయారు. ‘‘ఉత్పత్తులను ఒక చోటకు చేర్చి కార్మికుల్ని, మర్కెట్ ను కలిపేది అతడే. ఈ దళారుల వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించాల్సి ఉంది. చాలా వరకు సామాజిక వ్యాపారాలను పరిశీలిస్తే అంతా దళారుల మయంగా కనిపిస్తుంది’’ అంటారు మాధ్యూ.

అరటినారకు సంబంధించిన వర్క్ షాప్

అరటినారకు సంబంధించిన వర్క్ షాప్


నిపుణులైన కార్మికులు, కళాకారులను అర్ధం చేసుకుని వారికి సహాయపడటం చాలా పెద్ద సమస్య అంటారు మాధ్యూ. భారతీయ గ్రామాలు ఒక విధమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి. స్థానికత, పేదరికం అన్న ఉచ్చులో ఇరుక్కుపోయాయి. కానీ పచ్చని గ్రామాల్లో పురుషులు, మహిళలు అంతా ప్రకృతికి దగ్గరగా ఉంటారని, పట్టణాలు అంటే ఉన్నత వర్గాల వారు మాత్రమే భరించగలరన్న భావం మన మెదడుల్లో నాటుకుపోయిందంటూ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిని ఆదర్శంగా తీసుకుని కొంత మంది వ్యాపారులు భారతదేశంలోని హస్తకళల సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. ఇంజనీరింగ్ సంబంధిత పరిష్కారాల ద్వారా ప్రజల్ని నిపుణులైన కార్మికులుగా తీర్చిదిద్దవచ్చని మేం నిర్ణయించాం.

సహజసిద్ధమైన నార నుంచి వస్తువులు తయారు చేస్తున్న నిపుణులైన కళాకారులు

సహజసిద్ధమైన నార నుంచి వస్తువులు తయారు చేస్తున్న నిపుణులైన కళాకారులు


‘‘కళలన్నీ అంతరించిపోతున్నాయని మేం భావించాం. మనం వీళ్లకు మార్కెట్‌ను ఏర్పాటు చేయగలిగితే వాళ్లు తమ వృత్తిని కొనసాగించగలరు. కానీ ఒక్కసారి మానవీయ కోణాన్ని వ్యాపారంలోకి తీసుకొస్తే, దాని వల్ల ప్రజల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఆకాంక్షలు, వ్యాపారవేత్త కోరుకున్న దాని కంటే చాలా కష్టమైనదై ఉంటుంది. కొన్ని నెలల క్రితం మాధ్యూ మినాకారీ చేతివృత్తి కళాకారుడిని కలిశారు. అతడి ఆకాంక్ష నేను 2,000 రూపాయలు సంపాదించలేనా ? నేను 10,000 ఎందుకు సంపాదించలేను.’’ ఆ పరిస్థితుల్లో బహుశా ఒక వ్యాపారవేత్త దాని గురించి అడగగలుగుతాడు. అంతరించిపోతున్న కళ విలువ.. ఒక చిన్న సముదాయం వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చగలదా ?

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags