సంకలనాలు
Telugu

చిన్న నగరాల్లోనే పెద్ద వ్యాపారం - ట్రూజెట్ ఎయిర్‌వేస్ సింపుల్ ప్లాన్

విమానయాన రంగంలోకి ప్రవేశించిన చరణ్గోదావరి పుష్కరాల సందర్భంగా 2విమానాలకు అనుమతులుదక్షిణాది మార్కెట్ పై అంచానాలతో అడుగులుప్రయాణికులకు భారీ ఆఫర్లతో అట్టాహాసంగా ప్రారంభం

11th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

విమానాలు, కార్లపై ఉన్న మక్కువ ఓ యాక్టర్‌ని ఆంట్రప్రెన్యూర్‌గా మార్చి ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. వ్యాపారంపై తనకెలాంటి అవగాహన లేకపోయినప్పటికీ తనకోసం తాను పెట్టుబడి పెట్టాలనుకున్నారు. అదే ఇప్పుడీ ట్రూజెట్ విమానాల రంగంలోకి ప్రవేశించడానికి కారణమైందంటారు రామ్ చరణ్. గోదావరి పుష్కరాల సందర్భంగా రెండు విమానాలు నడపడానికి ట్రూజెట్ కేంద్రం నుంచి అనుమతులు పొందింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మట్లాడుతూ విమాన ప్రయాణికులు కోసం ఆఫర్లు ప్రకటించారు.


ఇటీవల ఎయిర్ లైన్ లైసెన్స్ పొందిన నాలుగు కంపెనీల్లో టర్బో మెగా కూడా ఒకటి. 20మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో కంపెనీ ప్రారంభమైంది. దాదాపు 127 కోట్లన్న మాట. ప్రస్తుతానికి రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డిజిసిఏ అనుమతుల కోసం ఎదురు చూస్తోన్న సంస్థ మరింత మొత్తం ఇన్వస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.

ట్రూజెట్ గురించి

విమాన యాన రంగంలో బుడి బుడి అడులేస్తూ వచ్చిన ట్రూ జెట్ రెండు విమానాలతో ఎగరడానికి సిద్ధమైంది. ఈ నెలాఖరికి మరిన్ని ఎయిర్ క్రాఫ్ట్‌లతో ఆకాశ అంచులను తాకనుంది. సర్వీసు, సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అత్యంత తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని సామాన్యులకు చేరవేస్తామని సంస్థ చెబుతోంది. ట్రూజెట్ డాట్ కామ్‌లో టికెట్ సెల్లింగ్ మొదలు పెట్టిన కంపెనీ ప్రస్తుతానికి దక్షిణాది మార్కెట్‌పైనే దృష్టి సారించింది. 2013 మార్చి 14న టర్బో మెగా ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రామ్ చరణ్ సంస్థను ప్రారంభించారు. 'ట్రూజెట్' బ్రాండ్ నేమ్ కింద దీని ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. దక్షిణ భారత దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనే తమ సేవలను చేపడుతున్నట్లు రామ్ చరణ్ అన్నారు. విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి,కడప, హుబ్లి, కొయంబత్తూరు, టుటికొరిన్, సేలం మొదటి ప్రయార్టీగా ఉన్నాయి. జాతీయ పక్షి అయిన నెమలిని సింబల్ గా చేసుకున్న ట్రూజెట్ ప్రామినెంట్ బ్రాండ్ ప్రమోషన్ గా ఉపయోగపడగలదని భావిస్తోంది.

టర్బో మెగా ఎయిర్ వేస్ ఎండి వంకాయల ఉమేష్, డైరెక్టర్లు చరణ్, ప్రేమ్

టర్బో మెగా ఎయిర్ వేస్ ఎండి వంకాయల ఉమేష్, డైరెక్టర్లు చరణ్, ప్రేమ్


గడిచిన పదేళ్లుగా విమానయాన రంగం భారతీయ జిడిపి కంటే దాదాపు రెట్టింపు వృద్ధితో దూసుకుపోయింది. భవిష్యత్‌లో కూడా ఈ రంగం మరిన్ని లాభాలను ఆర్జిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు టర్బో మెగా వేస్ డైరెక్టర్లలో ఒకరైన ప్రేమ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైతే తాము పాట్నర్స్ కోసం చూడటం లేదని.. తాము ఒంటరిగానే నడపాలని అనుకుంటున్నామన్నారు. మొత్తంగా 500 కోట్ల పెట్టుబడితో సిద్ధంగా ఉన్నామని, భవిష్యత్‌లో దీన్ని పెంచే యోచనలో ఉన్నాం. ఇదంతా మూడు నుంచి నాలుగు విడతల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు.

ప్రారంభ ధర 1499 రూపాయిలుగా నిర్ణయించారు. తక్కువ ధరలతో నాణ్యమైన సేవలు అందించడమే తమ ఎయిర్ వేస్ లక్ష్యం అని మరో డైరెక్టర్ రామ్ చరణ్ అన్నారు. ఇప్పటి వరకూ ఈ ఇండస్ట్రీలో ఇవ్వని ఎన్నో విలువైన ఆఫర్లను తాము అందిస్తామని వివరించారు. ఎయిర్ పోర్టులో ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి డెస్టినేషన్‌కు క్యాబ్ ఫెసిటిలీ కల్పిస్తున్నారు. తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి నెల్లూరు టౌన్, చిత్తూరు వెళ్లే సౌలభ్యం ఇస్తున్నామన్నారు. అలాగే షిర్డీ వెళ్లే ప్యాసింజర్లకు ఔరంగాబాద్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో క్యాబ్ సౌకర్యాన్ని ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

‘నాకు విమాన రంగం గురించి అంతగా తెలియదు. నాకు విమానాలంటే ఇష్టం. నాలాగే విమానయానం చేయాలనుకునే వారికి ఆ సౌకర్యాన్ని తక్కువ ధరలో కల్పించాలని అనుకున్నా. దీంతో ఈ రంగంలోకి వచ్చాను. స్వతహాగా నటుడిని అయిన నేను వ్యాపార వేత్తగా లాభాలు వస్తాయా లేదా అనే విషయం గురించి ఆలోచించడం లేదు. విమానాలపై ఉన్న మక్కువ నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది’ - రామ్ చరణ్
image


ఫ్లై యువర్ డ్రీమ్ అనేది ట్రూ జెట్ ట్యాగ్ లైన్. ఆకాశాన్ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఎయిర్ లైన్స్ నుంచి మీరేం కోరుకుంటున్నారు. వాటన్నింటిని మేం సమకూరుస్తామంటోంది ట్రూ జెట్. రెండు విమానాలతో ప్రారంభమైన ప్రస్థానం సాధారణ ప్రజలకు విమానయానాన్ని చేరువ చేసే దిశగా సాగుతుందని ప్రకటించుకుంది. తక్కువ ధరలో టికెట్లను ఇవ్వడమే కాదు, కాంప్లిమెంటరీ ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండబోదని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. చిన్న చిన్న విమానాలతో పెద్ద బెంచ్ మార్క్‌ను దాటడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

విమానయానంలో మెగా పవర్ స్టార్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా అడుగు పెట్టిన రామ్ చరణ్ విమానయానంలోకి అడుగు పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. నటుడిగా తానేంటో నిరూపించుకున్న చరణ్ వ్యాపార వేత్తగా కూడా రాణిస్తారనే ఆశిద్దాం. టూటైర్ సిటీలను టార్గెట్‌గా 72సీటర్ విమానాలను జనం ముందుకు తెచ్చిన అతని కంపెనీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలదొక్కుకుంటుందనే చెప్పాలి. ఆన్ లైన్లో బుకింగులు ప్రారంభించిన గంటలోనే 34 టికెట్లు బుక్ అయ్యాయట. ప్రస్తుతానికి 2 విమానాలతో జర్నీ ప్రారంభమైంది. రాబోయే 12 నెలల్లో పూర్తి స్థాయి విమానాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

“విమానాల్లో ఫ్యాన్సీ అయిన బోయింగ్ లాంటి జెట్ లను తాము నడపడం లేదు. సాధారణ ప్రయాణికుడికి అందుబాటులో ఉన్న విమనాలను తీసుకొచ్చాం. పెద్ద టార్గెట్లు కూడా మాకు లేవు. పెద్ద అంచనాలు లేవు. మేం ఎన్నుకున్న విమానాలు గతంలో ఆర్థికంగా ఫెయిల్ అయిన దాఖలాల్లేవ్. దీంతో తాము సహజసిద్ధంగా ఎదుగుతామని ఆశిస్తున్నా”- రామ్ చరణ్

భవిష్యత్ సవాళ్లు

భారత దేశంలో విమాన రంగం పెరుగుదల ఉన్నప్పటికీ .. విమానయాన రంగ సంస్థలు మాత్రం నష్టాల్లోనే ఉన్నాయి. ప్రయాణికులకు సరైన వసతులు ఇవ్వడంలో చాలా సంస్థలు ఫెయిల్ అయ్యాయి. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే సంస్థల సంఖ్య మాత్రం పెరుగుతునే ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం టూటైర్ నగరాలకు విమానయాన రంగాన్ని విస్తరించాలనే చూస్తోంది. దీంతో అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇక్కడున్న ఇతర ప్లేయర్స్ తో కాంపిటీషన్ తప్పదు. ధరలను తగ్గిస్తే కాదు.. సరైన వసతులు కల్పించడం ముఖ్యం. టార్గెట్ ప్యాసింజర్ మార్కెట్ మిస్ కాకుండా చూసుకోవాలి. వీటన్నింటిని అధిగమించి ట్రూ జెట్ ఆకాశంలోకి దూసుకుపోతుందనే భావిద్దాం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags