సంకలనాలు
Telugu

ఇంటి వంట రుచి చూపిస్తున్న మిస్టర్ హాట్ ఫుడ్స్

3rd Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఇంటి భోజనం ముందు ఏ రుచి అయినా బలాదూర్. నిజమే అమ్మచేతి వంట అమృతంలా ఉంటుంది. కానీ ఉద్యోగాల కోసం, చదువు నిమిత్తం పట్టణాలకు పరుగులు తీస్తున్న నేటి యూత్ అమ్మ చేతి వంటను మిస్ అవుతున్నారు. కోరుకున్నని వెరైటీలున్నా హోటల్ ఫుడ్డు హోటల్ ఫుడ్డే! ఇంటికి దూరంగా ఉంటూ హాస్టల్ లేదా హోటల్ తిండి తినలేక అవస్థలు పడుతున్న వారెందరో. ఐఐటీ ఖరగ్ పూర్ లో చదువుతున్న రోజుల్లో ఇలాంటి కష్టాలనే అనుభవించారు అచల్ బన్సల్, పంకజ్ శర్మ. వాళ్లు పడ్డ ఫుడ్డు కష్టాల్లోంచి పుట్టు కొచ్చిన స్టార్టప్ మిస్టర్ హాట్ ఫుడ్స్. రాజస్థాన్ కోటాలో ఏర్పాటైన ఈ స్టార్టప్ ఇంటి వంట రుచుల్ని తలపించే ఫుడ్ వెరైటీలు అందించడమే కాకుండా మంత్లీ బడ్జెట్ కు తగ్గట్లుగా కస్టమర్లకు సేవలందిస్తోంది

“రెగ్యులర్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికి వీక్లీ మెనూ ప్లానర్ అందిస్తాం. కస్టమర్లు వారి డైట్, టేస్ట్, బడ్జెట్ కు తగ్గట్లుగా మేం అందించే 15-16 ఐటెంల నుంచి కోరుకున్నది ఎంచుకోవచ్చు.” -పంకజ్

కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెనూ ప్లానర్ ను డిజైన్ చేశారు అచల్, పంకజ్. మల్టిపుల్ డెలివరీ అడ్రస్ లు, డెలివరీ టైం స్లాట్, బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఫెసిలిటీ, మీల్ ప్లాన్ ఆల్టరేషన్ తదితర ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చారు.

“కస్టమర్లకు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ లాంటి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే వాటిల్లో దొరికే ఆహారం రోజూ తినలేం. ఇలాంటి ఫుడ్ ను వారానికి రెండు మూడుసార్లు మాత్రమే తినగలం, మిగతా సమయాల్లో ఆరోగ్యకరమైన ఇంటి వంటకే ప్రాధాన్యమిస్తాం. తక్కువ ధరకే ఇలాంటి ఆహారాన్ని అందించే హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. కానీ అవి తయారీలో శుభ్రతను పాటించవు. ఆరోగ్యానికి మంచివి కాదు.” -పంకజ్
image


ఎన్నో ఎదురుదెబ్బలు

వండటం నుంచి మీల్స్ డెలివరీ చేసే వరకు మిస్టర్ హాట్ ఫుడ్స్ లో ప్రతి అంశాన్ని నిర్వాహకులు దగ్గరుండి చూసుకుంటారు. ఇలా చేయడం వల్లే నాణ్యమైన సేవల్ని తక్కువ ధరకే అందించగలుగుతున్నారు. కస్టమర్లు ఇన్ స్టంట్ ఆర్డర్ గానీ, రెగ్యులర్ సర్వీస్ కు గానీ సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫుడ్ ఇండస్ట్రీలో పని చేసిన అనుభవం లేకపోవడంతో కిచెన్ ఏర్పాటు నుంచి, ధరల నిర్ణయం, సరైన పనివాళ్లను ఎంచుకోవడం, రోజువారీ కార్యకలాపాలు చూసుకోవడంతో మిస్టర్ హాట్ ఫుడ్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే కాలక్రమంలో వాటిని అధిగమించింది.

“ఇప్పటికే ఈ రంగంలో ఉన్న పెద్ద పెద్ద ఫుడ్ జాయింట్ల తరహాలో ప్రొఫెషనల్ షెఫ్, ప్రొడక్షన్ మేనేజర్ ను నియమించుకోవడం వల్ల ధర నిర్ణయం, బడ్జెట్, లాభం తదితర అంశాలపై అవగాహన వచ్చింది.”-పంకజ్

మిస్టర్ హాట్ ప్రారంభించి నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా రోజుకు 400 మీల్స్ ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆదాయం మాత్రమే సమకూరేది. నిధులు, మౌలిక సదుపాయాల కొరత మిస్టర్ హాట్ కు ప్రధాన సమస్యగా మారింది. మార్కెటింగ్, పబ్లిసిటీకి తక్కువ బడ్జెట్ కేటాయించడంతో పాటు ఉద్యోగులు పనిచేసేందుకు సరైన వసతులు కల్పించలేక చాలా ఇబ్బందులు పడ్డామంటారు పంకజ్. ఫుడ్ బిజినెస్ లో ఉన్న మిగతా సంస్థలు మంత్లీ, వీక్లీ సేల్స్, ప్రాఫిట్ ను లెక్కగట్టుకుంటే మిస్టర్ హాట్ ఫుడ్స్ మాత్రం రోజువారీ ఖర్చులు, ఆదాయం లెక్కగట్టి ఆ రోజు వ్యాపారం ఎంత లాభసాటిగా సాగిందన్న విషయాన్ని చూసుకునేది.

విస్తరణ బాటలో

ప్రస్తుతం మిస్టర్ హాట్ రోజుకు 1500 మీల్స్ డెలివర్ చేస్తోంది. దాదాపు 9000 మంది రెగ్యులర్ సబ్ స్క్రైబర్లున్నారు. కోటా, జైపూర్ లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 3,50,000 మీల్స్ డెలివర్ చేశారు. కస్టమర్లు ఆన్ లైన్ ఫుడ్ వాలెట్ లో మనీ రీఛార్జ్ చేసుకోవడం, ఇన్ స్టెంట్ ఆర్డర్స్ ద్వారా మిస్టర్ హాట్ ఫుడ్స్ కు ఆదాయం సమకూరుతోంది. కార్పొరేట్ ఆఫీసులు, ఇన్ స్టిట్యూషన్లకు డిస్కౌంట్ రేట్లపై మీల్స్ అందించేలా ఒప్పందాలు చేసుకున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం నిధుల సమీకరణపై దృష్టి పెట్టిన సంస్థ 3-4 కోట్ల రూపాయల పెట్టుబడి లభిస్తే.. దేశంలోనే వివిధ ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. త్వరలోనే ఢిల్లీ - NCRలో సర్వీసులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

యువర్ స్టోరీ టేక్

టైర్ 2, టైర్ 3 సిటీలలో స్టార్టప్ లు ప్రారంభించడమే కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నద్ధం కావడం సంతోషించదగ్గ పరిణామం. మిస్టర్ హాట్ ఫుడ్స్ ఇప్పటికే కోటా నుంచి జైపూర్, ఇండోర్ వరకు విస్తరించింది. ప్రస్తుతం ఢిల్లీపైనా కన్నేసింది. ఇది వారికి కొత్త ఉత్సాహం ఇవ్వడంతో పాటు మార్కెట్ నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది.

వాస్తవానికి ఢిల్లీ ఎన్సీఆర్ మిస్టర్ హాట్ కు ఓ విభిన్నమైన సవాల్. సిటీలో ఇప్పటికే చాలా ఫుడ్ స్టార్టప్ లతో పాటు ఫ్రెష్ మెను, ఇన్నర్ షెఫ్, స్విగ్గీ, జొమాటో లాంటి బడా కంపెనీలు ఉన్నాయి. IAMAI రిపోర్టు ప్రకారం 2026 నాటికి టైర్ 2 - 3 సిటీల మార్కెట్ సైజ్ ప్రస్తుతం ఉన్న 5.7 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అయితే మెట్రోలతో పోలిస్తే ఈ నగరాలపై ఇన్వెస్టర్ల దృష్టి తక్కువ. కానీ భారీ స్థాయిలో బిజినెస్ జరగాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు కావాలి.

“ప్రస్తుతం చాలా మంది ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటల్ సంస్థలు చిన్న నగరాలపైనే దృష్టి పెట్టాయి. అక్కడ ఏర్పాటు చేసే స్టార్టప్ లకు అండగా నిలుస్తున్నాయి. పెద్ద నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాలలోనే బిజినెస్ సక్సెస్ అయ్యే ఛాన్సులు ఎక్కువ. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఏర్పాటయ్యే స్టార్టప్ లు మెట్రో సిటీల్లోని బడా బడా కంపెనీలతో పోటీ పడాలని ఆశిద్దాం.”-ఆశిష్ తనేజా, గ్రోఎక్స్ వెంచర్స్
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags