సంకలనాలు
Telugu

ఒకప్పుడు సాధారణ హోంమేకర్.. ఇప్పుడు మెడిటేషన్ కార్పొరేట్ ట్రెయినర్!!

జీవన పోరాటంలో మనీషా గెలిచి నిలిచిన తీరు అద్భుతం..

8th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మనీషా. ఒకప్పుడు సాధారణ హోం మేకర్. అందరు గృహిణిల్లాంటిదే ఆమె జీవితం. అయితే, అనుకోని ఓ సంఘటన ఆమె జీవితాన్నే మర్చేసింది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరాటంలో ఆమె గెలిచి నిలిచిన తీరు అద్భుతం. ఇటు కార్పొరేట్ ట్రైనర్ గా, అటు పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటార్ గా స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసిన మనీషా- ఇప్పటివరకు ఎన్నో జీవితాలను నిలబెట్టారు.

గుజరాతీ అయిన మనీషా పెళ్లయిన ఎనిమిదేళ్లకు తీవ్రమైన అనారోగ్యం. మూడు నెలలు మంచానికే అంకితం కావల్సివచ్చింది. ఆరు నెలల్లో మూడు సర్జరీలు జరిగాయి. మానసికంగా బాగా డిప్రెస్ అయ్యారు. తెలియని ఆందోళన వెంటాడింది. ఆరు నెలలు ఎవరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు.

ఈ స్టోరీ కూడా చదవండి

image


భయం వెన్నులో మిన్నాగులా దూరింది. జీవితం ఇంతేనా అనే నిస్పృహ ఆవహించింది. అప్పుడు ఎడారిలో ఒయాసిస్‌ లా యోగా గుర్తొచ్చింది. ప్రాణాయామం ఒక్కటే బతకిస్తుందని గట్టిగా నమ్మారు. ఒక్క ప్రాణాయామమే కాదు.. యోగాలో అనేక ప్రక్రియలు భీతిల్లిన గుండెనిండా కాన్ఫిడెన్స్ నింపింది. ఏ యోగా అయితే భయాన్ని పోగొట్టిందో, ఏ ప్రాణాయామమైతే ప్రాణాన్ని నిలబెట్టిందో- అదే ప్రక్రియలో పాపులర్ అయిపోయారు. ఏకంగా కార్పొరేట్ మెడిటేషన్ ట్రెయినర్ అయ్యారు. తనలా నిస్సహాయులైన వారెందరి జీవితాల్లో వెలుగు నింపారు. కేవలం మాటలతోనే జీవిత పరమార్ధం చెప్పి ఎందరినో విజయతీరాలను చేర్చారు.

సమస్యలను ఎదుర్కొనే శక్తి మనకున్నప్పుడు వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేయాలనేది మనీషా వాదన. నిజమే. ఎవరి సమస్యలు వారికుంటాయి. అవి వారివారి పాయింట్ ఆఫ్ వ్యూలో పరిష్కరించేలేనివే కావొచ్చు. ఒక్కోసారి ఎదుటి వారి జీవితాలతో పోల్చుకోలేకపోవచ్చు. అలాంటి వారెందరినో మనీషా మార్చగలిగారు. మళ్లీ వారికి జీవితం మీద ఆశలు చిగురించేలా చయగలిగారు. ఆత్మహత్య తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనుకున్న వాళ్లంతా మనీషా మాటల తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. మొదలుపెట్టిన రోజు అనుకోలేదు. తన మాటల్లో అంతశక్తి ఉందని.

image


మిరాజ్ టూ ఒయాసిస్- మెడిటేషన్ కెరియర్!

మానసిక సంఘర్షణే మనీషా నేర్చుకున్న జీవిత పాఠం. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే యోగా దాన్ని దూరం చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీతోపాటు మెడిటేషన్ చేస్తే ఎంత డిప్రెషన్ ఉన్నా సాధారణ స్థితికి రాగలుగుతారు. ఇలా తాను నేర్చుకున్న ట్రిక్స్ ని తనలాంటి వాళ్లకు చెప్పాలని అనుకున్నారు. రిలేటివ్స్ లో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి చెప్పడం ప్రారంభించారు. అలా మౌత్ పబ్లిసిటీతో పాపులర్ అయ్యారు. హైదరాబాద్, బాంబేల్లో క్లాసులు చెప్పడం ప్రారంభించారు. స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ కావడంతో కొంత ఫీజు నిర్ణయించారు. కొన్నాళ్లకు దానికోసమనే ప్రత్యేక కోర్స్ డిజైన్ చేశారు. అలా మనీషా ఏర్పాటు చేసిన ఓ వేదిక వ్యవస్థగా మారిపోయింది. మెడిటేషన్ కు ఆమె కేరాఫ్ అయ్యారు. కమర్షియల్ మెడిటేషన్ సెంటర్ తో పోలిస్తే ఇది చాలా భిన్నమైనది.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఇప్పటికే వెబ్ సైట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న మనీషా మరిన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు ప్రత్యేకమైన క్లాసులు తీసుకోడానికి ప్రత్యేక కోర్స్ రూపొందించే పనిలో ఉన్నారు. దాన్ని తొందరలోనే విడుదల చేయాలని చూస్తున్నారు. స్టార్టప్ కంపెనీ ప్రారంభించి ఫెయిల్ అయిన వాళ్లకు మళ్లీ సక్సెస్ రావాలంటే ఒక్కసారి విజిల్ చేయండని సలహా ఇస్తున్నారు. పూర్తి స్థాయి కార్పొరేట్ మెడిటేషన్ ప్రక్రియల్ని చేపట్టాలని ఆమె చూస్తున్నారు. ఫండింగ్ వస్తే హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటు చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

స్కూల్ పిల్లలు ఆత్మన్యూనతాభావంతో మార్కులు సాధించలేకపోతున్నారు. వారికోసం మరో ప్రత్యేక మాడ్యూల్ తయారుచేస్తున్నా- మనీషా.

ఎడారిలో కాంతి పరావర్తనం వల్ల నీళ్లు ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ ఓయాసిస్ లో మాత్రమే నీరుంటుంది. దీన్ని గుర్తించినప్పుడే కఠిన ప్రయాణం ముందుకు సాగుతుంది. మిరాజ్ టూ ఓయాసిస్ చెప్పేది కూడా అదే అని ముగించారు మనీషా.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags