సంకలనాలు
Telugu

మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం పండంటి పది సూత్రాలు

GOPAL
18th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

దేశంలో స్టార్టప్ కంపెనీలకు ఇప్పుడిప్పుడే ఊతం లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తామని ప్రకటించింది. అయితే చిన్నతరహా/మధ్య తరహా బొటిక్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్ వంటి స్టార్టప్ కంపెనీలు కేంద్ర సాయాన్ని పొందలేవు. మహిళలు నడుపుతున్న యంగ్ బ్రాండ్స్‌లలో 90 శాతం స్టార్టప్స్‌కు రెడ్ పోల్కా ఫండింగ్ అందజేస్తున్నది. ప్రతి ఒక్కదానికి తమదైన ప్రత్యేకమైన స్టోరీ ఉన్నది. అలాగే అభివృద్ధి చెందేందుకు కూడా ఎంతో ఆస్కారముంది. స్టార్టప్స్‌గా పేరొందినప్పటికీ కొందరు చిన్నతరహా వ్యాపారులుగా సంతృప్తితో ఉన్నారు. అయితే వారికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. అలాంటి సంస్థలకు రెడ్ పోల్కా వ్యవస్థాపకురాలు కొన్ని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. విజయం సొంతం చేసుకోవాలంటే స్టార్టప్స్‌, చిన్న తరహా కంపెనీల తీసుకోవాల్సిన పది సూచనలు ఆమె మాటల్లోనే..

ఆకాశమే హద్దు..

సొంత వ్యాపారం ప్రారంభించేటప్పుడు కుటుంబ బాధ్యతల నేపథ్యంలో మహిళలు తమకు తాము లక్ష్మణ రేఖ గీసుకుంటారు. సంస్థను ప్రారంభించకముందే, ఎక్కడికి వెళ్లాలన్న అంశంపై కట్టుబాట్లు పెట్టుకుంటారు. అందుకు కారణం వారికి సామర్థ్యం లేక కాదు. సమయం లేని కారణంగా అలాంటి నిర్ణయాలు తీసేసుకుంటారు. అలాంటి దృక్పథాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అన్ని పనులు చేసుకునేందుకు ప్రపంచంలోని ప్రజలందరికీ కేవలం 24 గంటల సమయమే ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందువల్ల సమయం లేదన్న కారణంగా సాధించాల్సిన లక్ష్యాలను కుదించుకోవద్దు. ఎలాంటి ఆంక్షలు విధించుకోవద్దు. పెద్ద స్థాయిలో కలలు కనాలి. ఆకాశమే హద్దుగా ఆలోచించాలి. మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవద్దు.

టీమ్ సహకారం..

ఏ వ్యాపారం కూడా సరైన టీమ్ లేకుండా ముందుకు సాగలేదు. స్పెషలిస్ట్ సర్జన్‌కు కూడా ఓ టీమ్ కావాల్సిందే. ఒకవేళ మీ సృజనాత్మకతతో ఆర్ట్ స్టూడియో రన్ చేస్తున్నా, మీకు మరికొంతమంది సాయం అవసరం. ఇంటి నుంచే ఆహార ఉత్పత్తులు సరఫరా చేసే ఓ మహిళ గురించి విన్నాను. ఆమె తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్‌ను ఆమె డ్రైవర్ డెలివరీ చేస్తున్నారు. అలాగే పేమెంట్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆమె బిజినెస్ ఎంతో లాభదాయకంగా పనిచేస్తున్నది. ఇతరులను నమ్మలేని ఏ వ్యాపారం కూడా మనుగడ సాధించదు. సంస్థలో ఓనర్‌తోపాటు మరికొంతమంది టీమ్ ఉంటే సంస్థ అభివృద్ధిచెందడంతో పాటు కొత్త మార్గాలు లభిస్తాయి.

క్రియేట్ ప్రాసెస్..

సంస్థ అభివృద్ధి చెందుతున్నకొద్దీ, ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ముందుగానే ఓ విధానాన్ని రూపొందించుకోవాలి. మీతోపాటు మీ టీమ్ ఎలాంటి పనులు చేయాలన్న అంశాన్ని నిర్ధారించుకోవాలి. ప్రొడక్షన్, ఆర్డర్ మేనేజ్‌మెంట్, అనుభవం ఇవన్నీ ప్రాసెస్‌లో భాగమే. ప్రతి అంశం వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

టెక్నాలజీపై భారం..

వ్యాపారాభివృద్ధికి టెక్నాలజీ ఎంతో అవసరం. ప్రచారం కోసం సోషల్ మీడియా నెట్‌వర్క్‌పై ఆధారపడం ఒక్కటే కాదు, వివిధ రకాల ప్లాట్‌ఫామ్‌లను కూడా వాడుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ ఎండ్ ప్రొగ్రామ్ మేనేజింగ్, అప్పటివరకు ఉపయోగించని ఫ్రంట్ ఎండ్‌ను ప్రారంభించాలి, కమ్యూనికేషన్, ప్రాసెస్ పూర్తి చేయాలి. వీటన్నింటికి టెక్నాలజీ ఎంతో అవసరం.

నిధుల సమీకరణ..

చిన్న సంస్థలు అభివృద్ధి చెందాలంటే పెట్టుబడుల ప్రవాహం అవసరం. సరైన సమయానికి కావాల్సినంత పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సంస్థ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. కానీ చాలా చిన్న తరహా సంస్థలు పెట్టుబడుల గురించి కానీ, అభివృద్ధి కానీ ఆలోచించవు. తమ ఆకాంక్షలను, వనరులను చిన్నస్థాయిలోనే నిర్దేశించుకుంటారు.

క్రియేటివిటీని రక్షించుకోవాలి..

ఫ్యాషన్ రంగంలో చీరల బిజినెస్ చాలా తొందరగా వృద్ధి చెందుతుంది. అది అందరికీ శుభవార్తే. కానీ ఒకేసారి ఎక్కువ ఆర్డర్లు వచ్చినప్పుడు ఆంట్రప్రెన్యూర్లు అసహనానికి లోనవుతారు. క్రియేటివ్ వ్యాపారంలోని మహిళలు కాస్త ఆగి, వెళ్లడం నేర్చుకోవాలి. సమయాన్ని బట్టి తమ క్రియేటివిటీకి పదును పెట్టాలి. ఇలా చేయడం వల్ల కొద్దిమంది కస్టమర్లు మారుతుండొచ్చు కానీ, వ్యాపారం చేసే మహిళలకు మాత్రం దీర్ఘకాలికంగా ఉపయోగాలుంటాయి.

బ్రాండ్‌గా ఎదగాలి..

ఇది నాకెంతో ఇష్టమైన సబ్జెక్ట్. నా వరకైతే బ్రాండ్ నేమ్ లేకుండా నేను ఏ ఒక్క వ్యాపారాన్ని కూడా ప్రారంభించలేదు. తయారీపై అవగాహన బ్రాండ్‌పై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. అయితే చివరకొచ్చేసరికి ప్రాడక్ట్‌పై లోగో ఉంటుంది. సోషల్ మీడియాలో బ్రాండ్ లోగో చక్కర్లు కొడుతుంది. మీ బ్రాండ్‌ పట్ల పూర్తి జాగ్రత్తగా ఉండటం అత్యవసరం. దాన్ని పూర్తిస్థాయిలో నిర్మించేందుకు ప్రయత్నించాలి. బ్రాండ్‌ను నిర్మించడానికి అందరు స్టేక్ హోల్డర్ల చేయూత అవసరం.

కలిసి నేర్చుకోవాలి..

చాలామంది నెట్‌వర్కింగ్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. దానికి బదులుగా కో లెర్నింగ్ పదాన్ని నేను సూచిస్తాను. మీ నెట్‌వర్క్ పరిధిలో మీరు మీ పని కొసం వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులను కలుస్తూ ఉంటారు. ఇందుకోసం ముందుగానే మీరు కొంత సిద్ధమవ్వాలి. అలాగే సెషన్ ముగిసిన తర్వాత కూడా ఓ నోట్ రోడీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇతరులతో కలిసి నేర్చుకోవడం అలవాటవుతుంది. అప్పుడు ఇతరుల అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములవుతారు.

ఆసక్తికర అంశాలు..

ఆసక్తికర అంశాలపై ఇతరులతో కలిసి పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. ఒకరి అభివృద్దిలో మరొకరు భాగస్వాములవుతారు.

#ASKTOGROW: 

ఎలా అభివృద్ధి చెందాలో అడగండి. సాయం కోసం అడగండి. మీకు ఏదైనా కావాల్సి వస్తే అడగండి. మీ ప్రాడక్ట్‌, మీ సేవలను ఒకసారి ఉపయోగించమని అడగండి. మీ పనిలో మీకు అత్యంత నచ్చిన అంశమేంటో మిమ్మల్ని మీరు అడగండి. మీ సహ భాగస్వాములను మీ ప్రాడక్ట్ గురించి సమీక్షించమని అడగండి. ఇతరులను అడిగితే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీకు తెలుసా.. సోషల్ మీడియాలో ‘ప్లీజ్ రీ ట్వీట్’ అంటే ఎంతోమంది తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు.

రచయిత గురించి:

 విశాఖ సింగ్.. రెడ్ పొల్కా వ్యవస్థాపకురాలు. వివిధ డిజైనర్ల విజయగాథలను వివరించేందుకు రెడ్ పోల్కా స్థాపించారు. ఆమె గతంలో టైమ్స్ నౌ, కిషోర్ బియానీ వెంచర్ ఫ్యూచర్ మీడియా, షాపర్ మార్కెటింగ్ బోటిక్ ఆరోరా కోమ్స్‌లో బ్రాండ్ అండ్ స్ట్రేటజీ విభాగంలో పనిచేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టయిజింగ్ అసోసియేషన్‌లో కూడా సేవలందించారు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే మహిళలకు ఆమె ఎంతో ప్రోత్సాహం అందిస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఉత్సాహాన్ని అందిస్తారు. అలాగే చిన్నపిల్లలను దత్తత తీసుకునేవారిని సైతం ఆమె ప్రోత్సహిస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags