సంకలనాలు
Telugu

ఆన్‌లైన్‌లో 'టీ' ఆర్డర్ తీసుకునే చాయ్ వాలా

పాన్.. చాయ్.. మరే బిజినెస్ అయినా .. జెపో ఉంటే ఆన్ లైన్ వ్యాపారం తెరవడం ఈజీఆన్ లైన్ లోనే ఛాయ్‌కి ఆర్డర్ ఇవ్వండి

CLN RAJU
17th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

2011లో నితిన్ పర్స్వాని స్థాపించిన జెపో... ఆన్ లైన్ బిజినెస్‌కి మంచి వేదిక కల్పిస్తోంది. ఈ చిన్న పెట్టుబడిదారుల కంపెనీ కొన్నాళ్లుగా స్థిరంగా వృద్ధిచెందుతోంది. జెపోలో ప్రస్తుతం 1200 కంటే ఎక్కువ సంస్థలు ఈ కామర్స్ చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బిల్డ్ బజార్, మార్ట్ జాక్‌లతో పోటీ పడుతోంది జెపో. ఎప్పటికప్పుడు కొత్త హంగులద్దుకుంటూ ...నిత్యనూతనంగా తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకుంది జెపో. వినూత్న ప్రచారంతోనే కాదు, వినియోగదారులకు అత్యంత పసందైనన వస్తు ఉత్పత్తిదారులను చేర్చుకుంటూ తనకు తానే సాటి అని చాటుతోంది జెపో. మొన్నీమధ్యనే జెపోతో జతకట్టింది చోటు చాయ్ వాలా.

ఆన్ లైన్ ఛాయ్ రెడీ

ఆన్ లైన్ ఛాయ్ రెడీ


ముంబైలో ప్రసిద్ధి చెందిన చాయ్ వాలాలను ఆన్ లైన్ వ్యవస్థలోకి తెచ్చే ప్రయత్నమే 'చోటు చాయ్ వాలా.కామ్'. 1.2 కోట్ల మంది ముంబైకర్లు రోజు చాయ్‌ని ఆస్వాదిస్తుంటారు. టీతోపాటు వడాపావ్‌ని ఎంజాయ్ చేస్తుంటారు. చాయ్ వాలాలకు వ్యవస్థీకృత విధానం ఉండాలని మేం ఎంతగానో తపనపడేవాళ్లమని నితిన్ అన్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ వాళ్లు వందల మందికి చాయ్ అందిస్తుంటారు. టీ సప్లై విషయంలో పక్కా టైమ్ టేబుల్‌ని పాటిస్తారు. కార్యాలయాలైనా ఇళ్లకైనా నిర్ణీత సమయానికి తేనీరు చేరిపోతుంది. ఆ సమయపాలనే చోటుచాయ్‌వాలా.కామ్ ఏర్పాటుకి ప్రేరణ అయ్యిందని నితిన్ ఈ ఐడియా గురించి తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ఆ స్ఫూర్తి చూసే జెపో బృందం వాళ్లతో పనిచేయాలని సంకల్పించింది. టీవ్యాపారస్థులతో మాట్లాడి ముందస్తు రుసుము చెల్లించిన వారికి ఆన్ లైన్‌లో చాయ్ విక్రయేంచేలా చేసింది. 

‘ఆన్‌లైన్ చాయ్ బిజినెస్ కోసం మొదటగా ముంబైలో బాంద్రాని మేం మజిలీగా ఎంచుకున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం ముంబైలోనే అతిపెద్ద బిజినెస్ ఏరియా’ అని నితిన్ అన్నారు. జెపో కృషి ఫలితంగా చాలా స్వల్ప వ్యవధిలోనే నలుగురు టీ విక్రేతలు వారితో చేయి కలిపేందుకు సిద్ధమయ్యారు. వాళ్లకి ఆన్‌లైన్ స్టోర్ తెరిచెందుకు జెపో అన్నివిధాల సాయపడింది . స్పాట్‌లో చాయ్ వాలాల ఫోటోలు క్లిక్ మనిపించారు. ఆ వెంటనే ధరల పట్టిక సిద్ధం చేశారు. అంతే ఒక్కరోజులోనే ఆన్‌లైన్ స్టోర్ రెడీ అయిపోయింది. దీంతోపాటు కొత్త స్టోర్ ప్రచారం కోసం ప్రత్యేకంగా టీషర్టులు, పేపర్ కప్పులు కూడా తయారుచేసి ఇచ్చామన్నారు నితిన్ .

చోటు చాయ్ వాలా.కామ్ ఎంట్రీ ఇచ్చిన నెల రోజులకే 100 వరకూ ఆర్డర్లు వచ్చాయి. ఇక అప్పటి నుంచి వాళ్లకు మెల్లిగా వృద్ధి కనిపిస్తూనే ఉంది. వారానికి రూ. 70 చెల్లిస్తే చాలు ఐదు రోజులు క్రమం తప్పకుండా పొగలుగక్కే వేడి వేడి టీ మీ ఇంటి దగ్గరికే చేరుతుంది. రెండు,మూడు వారాల చందాతో పాటు నెలవారీ చందా తీసుకునే సౌలభ్యంకూడా ఉంది. ప్రస్తుతం ముంబైలోని బాంద్రాలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు మున్ముందు మరింత విస్తరించనున్నాయి. ‘మొదట బాంద్రా ప్రజలకు చేరువైన తర్వాత ముంబైలో మిగతా ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నాం. రానున్న కొన్ని వారాల్లో దక్షిణ, ఉత్తర ముంబైలో ఉన్న తేనీటి విక్రేతలను మా గ్రూప్‌లో చేర్చుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని నితిన్ అన్నారు.

సోషల్ మీడియా ద్వారా దీని గురించి బాగా ప్రచారం జరిగింది. ఇది జెపో వేసిన గొప్ప ముందడుగు. చోటుచాయవాలా.కామ్ సైట్ తెరవడం ద్వారా కొత్త కస్టమర్‌ని సంపాదించడమే కాదు ఇలాంటి వినూత్న ఐడియాతో అందరిదృష్టినీ ఆకర్షిస్తోంది జెపో. బెంగళూరు మరియు ముంబైలో 30 ఆఫీసులున్న ఈ సంస్థ జెట్ స్పీడ్ లో విస్తరించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags