సంకలనాలు
Telugu

తూర్పు కనుమల రక్షణకు నడుం బిగించిన గ్రేస్

ashok patnaik
13th Apr 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(CGR). ఇది దేశంలో ఉన్న అడవులను రక్షించడానికి ఏర్పాటైన సంస్థ. ఆరేళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా ఈ సంస్థ తూర్పుకనుమలను కాపాడ్డానికి నడుం బిగించింది. ఈ క్రమంలోనే గ్రేస్ ని ఏర్పాటు చేసింది. 2011లో గ్రీన్స్ అలియన్స్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఘాట్స్(GrACE) ఆవిర్భవించింది. ఆంధ్ర,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, బెంగాల్ దాకా వ్యాపించి ఉన్న తూర్పు కనుమల ఆవశ్యకతను ప్రచారం చేయడమే ఈ సంస్థ లక్ష్యం. పశ్చిమ కనుమల్లాగానే తూర్పుకనుమలకూ జాతీయ ప్రాధాన్యం కల్పించాలని పోరాడుతోంది. తూర్పు కనుమలకు రక్షణ కరువైందని.. పశ్చిమ కనుమల్లోగానే యునెస్కో హాట్ స్పాట్ గుర్తింపు వస్తే వీటిని భవిష్యత్ తరాలకు ఇవి భద్రంగా ఉంటాయనేది- సంస్థ చెప్పే మాట. దీనికోసం ఒడిషా లోని ఉత్కల్ యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్ మెంట్ తో కలసి ఓ సదస్సు ఏర్పాటు చేసింది. ఈ నెల 16,17 తేదీల్లో ఈ సదస్సు జరగనుంది. ఇందులో ప్రధానంగా పర్యావరణం, తూర్పు కనుమల రక్షణ మీద వక్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.

“6 దక్షిణాది రాష్ట్రాల నైసర్గిక స్వరూపాన్ని పశ్చిమ కనుమలు చెబుతాయి. అయినా వాటికే రక్షణ కరువైంది,” దిలీప్ రెడ్డి

గ్రేస్ చైర్మన్ అయిన దిలీప్- తూర్పు కనుమల రక్షణ కోసమే సంస్థను ఏర్పాటు చేశామన్నారు. అంతా కలసి వస్తే మన సహజ సంపదను కాపాడుకోగలమని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ ఆధారిత దేశమైన మనకి- రుతుపవనాల మీదనే వ్యవసాయం సాగుతుంది. ఇటు తూర్పు, అటు పశ్చిమ కనుమల వల్లనే రుతుపవనాలు సాధ్యపడుతున్నాయి. వీటిని నాశనం చేయడం వల్ల భవిష్యత్ లో వాటి గమనం పూర్తిగా మందగిస్తుందని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఒడిషా, బెంగాల్, ఛత్తీస్ గఢ్ లకు వర్షాలు రావాలంటే తుర్పు కనుమలతోనే సాధ్యపడుతుందని చెప్పుకొచ్చారు.

image


దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలు

భువనేశ్వర్ లో జరగబోయే జతీయ సదస్సుకి దేశ వ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలు వస్తున్నారు. శాస్త్రవేత్తలు ఇతర పర్యావరణ రక్షక సంస్థలు పాల్గొంటున్న ఈ సదస్సుని- గ్రేస్, ఉత్కల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. యూనివర్సిటీ ప్రాంగణంలోని MKCG ఆడిటోరియంలో ఈ సదస్సు జరగనుంది. నాలుగింట ఒకశాతం తూర్పు కనుమలు ఒడిషాలోనే ఉన్నాయి. దాదాపు 1700 కిలోమీటర్లలో ఆంధ్రప్రదేశ్ లో వ్యాపించాయి. వీటి రక్షణకై ఏర్పాటైన గ్రేస్ సంస్థ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఆంధ్రా, నాగార్జున, పాలమూరు, ఎస్వీ యూనివర్శిటీలతో పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా సదస్సులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రాంతీయ కార్యక్రమాలు కాగా, ఇప్పుడు జరగబోయేది జాతీయ సదస్సు. బెంగాల్, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒడిషా నుంచి వందకు పైగా డెలిగేట్స్ వస్తారని అంచనా. విదేశాల నుంచి కూడా ఎంతోమంది వీటిపై పరిశోధన చేస్తున్నారు. వారంతా ఈ సదస్సుకి వస్తున్నారు.

100 పేపర్ ప్రజెంటేషన్స్

పర్యావరణంతో పాటు తూర్పు కనుమల రక్షణపై దాదాపు వందకు పైగా పేపర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఆంధ్రా నుంచి గతంలో చేపట్టిన కార్యక్రమాలపై కూడా క్షుణ్ణంగా చర్చిస్తారు. తూర్ప కనుమల విశేషాలపై జనంలో అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.

ఆంధ్రా ప్రాంతలో ఉన్న నల్లమల, శేషాద్రి కొండలు ఔషధ భాండాగారాలు. ప్రపంచంలో మరెక్కడా దొరకని ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఈ పర్వత పంక్తుల్లో ఉన్నాయి. వీటిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇలాంటి ఎన్నో విషయాలపై, పర్యావరణ మార్పులపై వందకు పైగా ప్రజెంటేషన్స్ ఈ సదస్సులో ఉండబోతున్నాయి. యూనివర్సిటీ కేంద్రంగా సదస్సులు జరిగితే అది తొందరగా వ్యాపించడానికి అవకాశం ఉంది- దిలీప్ రెడ్డి
image


“భువనేశ్వర్ డిక్లరేషన్ తో సదస్సు ముగుస్తుంది,” దిలీప్ రెడ్డి

గ్రేస్ సంస్థ గురించి క్లుప్తంగా

హైదరాబాద్ కేంద్రంగా ఐదేళ్ల క్రితం ఏర్పాటైన గ్రీన్స్ అలియన్స్ ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఘాట్స్.. సహజ వనరులపై జనంలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. స్థానికంగా అడవులను నాశనం చేసే వారిపై పోరాటం చేస్తోంది. ప్రారంభించిన అనతి కాలంలోనే ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టిందీ సంస్థ. స్థానిక విద్యాసంస్థలతో పనిచేయడానికి ముందకు వచ్చింది. గడచిన ఐదేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తోంది. ఇప్పుడు ఉత్కల్ యూనివర్సిటీతో కలసి జాతీయ సదస్సు ఏర్పాటు చేసింది. ఆంధ్రలో కూడా భవిష్యత్ లో ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తూర్పు కనుమలకు కేంద్రం నుంచి, అటు యునెస్కో నుంచి గుర్తింపు తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సంస్థ ఛైర్మన్ దిలీప్ రెడ్డి అంటున్నారు.

ప్రధాన సవాళ్లు

సంస్థ ఏర్పాటు చేసిన రోజు నుంచి జనంలో అవేర్నెస్ తీసుకురావడమే తమ ముందున్న సవాల్ అని దిలీప్ రెడ్డి అంటున్నారు. ఐదేళ్ల కాలం పాలన సాగించే ప్రభుత్వాలు- వీలైనంత నాశనం చేశాయే తప్ప..సహజ సంపదను కాపాడే ప్రయత్నం చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సహజ సంపదలు భవిష్యత్ తరాలకు ఎలా మేలు చేస్తాయో చెప్పేందుకు మరిన్ని కార్యక్రమాలు,సదస్సులు ఏర్పాటు చేస్తామంటున్నారు. 

భవిష్యత్ ప్రణాళికలు

1. భువనేశ్వర్ డిక్లరేషన్ ప్రకటించడం.. దీని ద్వారా కేంద్రానికి నివేదిక అందించడం.. కేంద్రం నుంచి ప్రత్యేక గుర్తింపు సాధించడం.

2. వర్షాకాల సమయంలో తూర్పు కనుమలు వ్యాపించిన ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు, ఎంపీలతో కలిసి ఢిల్లీలో మరో సదస్సు ఏర్పాటు చేయడం.

image


మన ఆర్థిక, సామాజిక జీవన శైలి సహజ వనరుల మీదనే ఆధారపడి వుంటుంది. అలాంటి సహజ సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. గ్రేస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి అంతా కలసి రావాలి- దిలీప్ రెడ్డి 
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags