సంకలనాలు
Telugu

చేనేత వస్త్రాల్లో ఫ్యూజన్ 'ఇండోఫాష్' స్పెషల్

వెలుగు కోల్పోతున్న చేనేత కళలకు చేయూతచేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయిలో ప్రచారంచిన్ననాటి జ్ఞాపకాలతో కలల ప్రాజెక్టుకు రూపంఇండోఫ్యాష్ పేరుతో మరుగున పడ్డ కళలకు సాయం చేస్తున్న పల్లవి

19th Jul 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

విదర్భ, మహరాష్ట్రలో ఒక ప్రాంతం. ఇక్కడే పల్లవి మొహదికర్ బాల్యమంతా గడిచింది. ఆమె తాతయ్యది నేతవృత్తి. ఆయన సన్నని దారాలనుంచి టస్సార్ సిల్క్ వస్త్రాలు తయారు చేస్తుంటే చూస్తూ ఉండిపోయేవారామె. నూలు వస్త్రాల మూటలు, దారాల గుట్టల మధ్య గడిపిన బాల్యాన్ని పల్లవి ఎప్పటికీ మరిచిపోలేరు. ఇంజినీరింగ్ పట్టభద్రురాలైన ఆమె.. ఐఐఎం, లక్నో నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఎన్నో డిగ్రీలు సంపాదించుకున్నా... ఆంట్రప్రెన్యూర్ ఆలోచన రాగానే... తన పునాదుల దగ్గరకు వచ్చేశారు. ఇండోఫాష్ పేరుతో వెంచర్ ప్రారంభించారు పల్లవి. భారతీయ నేత పనివారు, ఈ కళలో ఆరితేరినవారు తయారు చేసే దుస్తులను ఆన్‌‌లైన్ ద్వారా విక్రయించే పోర్టల్ ఇండోఫాష్. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతవాసులకు... ఈ మారుమూల ప్రాంతంలో తయారయ్యే అద్భుతమైన దుస్తులను అందుబాటలోకి తేవడం, ఆన్‌‍లైన్ విక్రయాల ద్వారా అందించడమే ఈ పోర్టల్ లక్ష్యం.

పల్లవి మొహదికర్

పల్లవి మొహదికర్


సొంత వెంచర్‌కు ముందు పల్లవి ఇలా

ఎంబీఏ చేసేందుకు రెండేళ్లకు ముందే పల్లవిలో పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచన వచ్చింది. అప్పటికి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ చేసిన ఆమె... ఒక ఐటీ సంస్థలో రెండేళ్లపాటు పని చేశారు.

“ఐఐఎం లక్నోలో చేరిన నేను.. స్థానిక మార్కెట్‍ని పరిశీలించేందుకు మా నాన్నతో కలిసి వెళ్లాను. అక్కడ చికంకారీ కళాత్మక దుస్తులను చూసి నాకు మతిపోయింది. తెల్లని దారంతో చేసిన అత్యంత నాజూకైన చేనేత వస్త్రాలు ఇవి. ఈ ప్రాంతానికే పరిమితమైన ఈ కళపై నాకు అప్పుడు మక్కువ కలిగింది. ఆ తర్వాత ఏడాది మొత్తం ఆ మార్కెట్‍‌‌ను జాగ్రత్తగా పరిశీలించాను. వందలాది కళాకారులను కలుసుకుని, సప్లై చైన్‍కు ఒక రూపం తీసుకురాగలిగాను. ఈ కళకు బ్రాండింగ్, సరైన ప్రచారం లేకపోవడంతో... వీరికి తగినంతమంది కస్టమర్లు లభించడం లేదని అర్ధమైంది. వీరికోసం ఒక బ్రాండ్ రూపొందించి.. ఈ కళను, కళారూపాలను... దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావించాను. నా సొంత వెంచర్ ఆలోచనకు రూపం వచ్చింది ఇక్కడే” అని చెప్పారు పల్లవి.

చికంకారీ కళాకారులతో చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది పల్లవికి. అయితే.. అప్పుడా కళకు విలువ తెలియదు ఆమెకు. విదర్భ చేనేతపనివారితో... తన బాల్యాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. వారికోసం ఏదైనా చేయాలని భావించారు. ఐఐఎం తర్వాత గోల్డ్‌మ్యాన్ శాక్స్‌లో చేరినా.. అందులో 9 నెలలు మాత్రమే ఉండగలిగారు.

“నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. గ్రాడ్యుయేషన్ తర్వాత... నా తల్లిదండ్రులు నాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎక్కవ జీతం వచ్చే ఉద్యోగం నుంచి బయటకు రావడానికి వారిని చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది. సొంతగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉందని చెప్పాను. ఇప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు” అంటూ ఆనందంగా చెప్పారు పల్లవి.

ఒకసారి ఈ చికంకారీ దుస్తులు సౌందర్యాన్ని చూసిన తర్వాత... ఈ పురాతన కళను లేటెస్ట్ ట్రెండ్‌కు తగినట్లుగా మార్పులు చేయాలనే ఆలోచన వచ్చింది పల్లవికి. “ఈ కళపై ఆధారపడ్డ వందలాది కళాకారులను కలుసుకున్నాను. దీనిపైనే ఆధారపడి వారి కుటుంబాల జీవనాలు ఉన్నాయని తెలుసుకున్నాను. తమ వారసత్వ సంపదగా వచ్చిన ఈ కళను కాపాడుకోవడానికి.. వారు తరతరాలుగా ఇదే వృత్తిలో ఉన్నారని, తర్వాతి తరాలకు అందిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. మా తాతగారి నుంచి నేను పొందిన ప్రేరణ కూడా ఇదే”అన్నారు పల్లవి.


కఠినమైన మధుబని పెయింటింగ్, టుస్సార్ సిల్క్ చీరపై రామాయణాన్ని వర్ణించడం, దీన్ని తయారు చేసేందుకు కనీసం నెల రోజుల సమయం అవసరం

కఠినమైన మధుబని పెయింటింగ్, టుస్సార్ సిల్క్ చీరపై రామాయణాన్ని వర్ణించడం, దీన్ని తయారు చేసేందుకు కనీసం నెల రోజుల సమయం అవసరం


చికంకారీ కళాకారుల కుటంబాలను చూశాక.. పల్లవి ఆలోచనలకు మరింత పదును పెరిగింది. భారత్ అనేక భిన్నత్వాల మధ్య ఏకత్వం ఉన్న దేశం. ఈ దేశంలో ఇంకా అనేక కళలు చాలా మూలల మరుగున పడిపోయి ఉంటాయి. వాటి గురించి బహుశా అందరికీ తెలీకపోవచ్చు. పారిశ్రామికీకరణ పెరిగిపోవడంతో... ఇలాంటి కళలు కనుమరుగువుతున్నాయి. కానీ భారతీయ సంస్కృతికి అందమైన రూపం ఉంది. ప్రతీ కళకూ తనదనై ప్రత్యేకమైన కథ ఉంటుంది. నవతరానికి వీటి గురించి తెలుసుకునే ఓపిక, తీరిక ఉండడం లేదు. భారతీయులకు తమ సొంత కళలను తిరిగి పరిచయం చేసేందుకు ప్రారంభించినదే ఇండోఫాష్ అని పల్లవి అంటున్నారు.

చేనేత కళాకారులతో ఉన్న అనుబంధమే... ఇండోఫ్యాష్‌కు అత్యంత కీలకం అంటారు పల్లవి. “వాస్తవానికి ఇవి వ్యాపార ఒప్పందాలే. కానీ ఇందులో ఎంతో వ్యక్తిగత అనుబంధం కూడా దాగి ఉంది. వారి బాకీలు అన్నీ తీర్చేయడమే కాకుండా... అత్యుత్తమ నాణ్యతతో దుస్తులు ఇచ్చేందుకు వారికి మరిన్ని సౌకర్యాలు, లాభాలు కల్పిస్తాం. వారి జీవితాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా గడపచ్చనే భరోసా ఇస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు ఈ వెంచర్ ఉపయోగపడ్డం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంద”న్నారు పల్లవి.

image


సమకాలీన ఫ్యాషన్ కోసం ప్రయోగాలు

ఆయా ప్రాంతాల్లో ఉపయోగించే వస్త్రానికి, ఇతర ప్రాంతాలకు చెందిన కళను, ఫ్యాషన్‌ను రంగరించి ప్రయోగాలు చేస్తున్నారు పల్లవి. “ రెండు రకాల కళలను కలిపి సృజనాత్మకతతో కొత్త ప్రయోగాలు చేస్తున్నాం. వీటి ద్వారా ఆయా వస్త్రాలకు మరింత వన్నె చేకూరుతుంది. ఉదాహరణకు కర్నాటక మల్బరీ సిల్క్ చీరకు... లక్నోకు చెందిన చికంకారీ ఎంబ్రాయిడరీ చేస్తాం. ఇండోఫ్యాష్ అందిస్తున్న ఇండోఫ్యూజన్ లైన్ ఇది” అని చెప్పారామె. ప్రస్తుతం ఇలాంటి ప్రయోగాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. కానీ ఇలాంటి వాటికి తగిన మార్కెట్ సామర్ధ్యం ఉందని, కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఉపయోగపడతాయని అంటారు పల్లవి. “మార్కెట్లో సంచలనాలు సృష్టించేందుకు ఇండోఫ్యూజన్ సిద్ధమవుతోంది. వెస్ట్రన్ వస్త్రాల్లో భారతీయ ఫాబ్రిక్స్, ప్రింట్స్ ఉండడం చాలా ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తోంది”అన్నారు పల్లవి.

ఈకామర్స్ శరవేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత రోజుల్లో... కస్టమర్లను ఆకట్టుకోవడం, వారిని నిలబెట్టుకోవడం సవాల్‌ అంటున్నారు పల్లవి. “కస్టమర్‌కు ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. వారికి లేటెస్ట్ ఫ్యాషన్ సంగతులు మొత్తం తెలుసు. కొత్త ట్రెండ్, స్టైల్‌‌ను అందుకోడానికి వారు ఉత్సాహం చూపుతారు. సరైన ఉత్పత్తులను వారి ముందుంచితే.. అమ్మకాలు పెరగడం అంత కష్టమేం కాదం”టారు పల్లవి.

“ప్రస్తుతం ఆన్‌లైన్ విక్రయాల పైనే దృష్టి పెట్టాం. దీని ద్వారా లభించే లాభాలలో మెజారిటీ వాటాను అటు కస్టమర్లు, ఇటు కళాకారులకే షేర్ చేస్తున్నాం. త్వరలో ఇతర పద్ధతులు, ఛానళ్ల ద్వారానూ విక్రయాలు ప్రారంభించే యోచన ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ కళను పరిచయం చేసే యోచన కూడా ఉంది. మాకు అన్నిటికంటే ప్రధాన సవాల్ నిధుల కొరతే. నిధుల సమీకరణ ద్వారా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. త్వరలో అవసరమైన ఫండ్స్ అందనున్నాయ”ని చెప్పారు పల్లవి.

తగినన్ని నిధులు లేకపోవడం సవాలే కానీ.. అడ్డంకి కాదంటారామె. “మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆన్‌లైన్ మార్కెట్ కూడా ఊపందుకుంటోంది. ఈ కామర్స్‌ను కస్టమర్లు సౌకర్యవంతమైన ఛాయిస్‌గా ఎంచుకుంటున్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందిచేందుకు ఈ రంగంలోని కంపెనీలు బాగా శ్రమిస్తున్నాయి. ఈ మార్కెట్లో పుంజుకోవడానికి తమకు తగినన్ని అవకాశాలున్నాయం”టున్నారు పల్లవి

తన సొంత నిధులతోనే ఇండోఫ్యాష్‌ను ఏర్పాటు చేశారు పల్లవి. “ఫ్యాబ్ ఇండియావంటి కంపెనీలతో పోటీ ఉన్నా... ప్రత్యేకమైన డిజైన్లు, భారతీయ వస్త్రంపై నేసిన వెస్ట్రన్ సిలౌట్‌లు, ప్రింట్స్, ఇండో ఫ్యూజన్... మమ్మల్ని మార్కెట్‌లో నిలబెడతాయనే నమ్మకం ఉంద”న్నారు పల్లవి.

ప్రయాణంలో పదనిసలు

ఇప్పటివరకూ సాగించిన ప్రయాణం సంతృప్తికరంగాను, ప్రోత్సాహకరంగాను ఉందన్నారు పల్లవి. “మార్చ్ 2015నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించాం. తగిన నైపుణ్యం ఉన్న కళాకారులతోపాటు.. వెంచర్‌కు అవసరమైన వ్యక్తులను కూడా స్కిల్ ఉన్నవారినే తీసుకోగలగడం... మేం సాధించిన మొదటి విజయం. ఆశించిన దాని కంటే ఎక్కువగా విక్రయాలు చేయగలగడంతోపాటు.. కస్టమర్ల నుంచి ఊహించని స్థాయిలో సానుకూల స్పందన లభించింది. ఇది మా ప్రయాణంలో రెండో మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వీడియో టెస్టిమోనియల్స్ పంపుతున్నారు. ఇండోఫ్యాష్ కాన్సెప్ట్‌ను ప్రజలు ఇష్టపడుతున్నారనే విషయం దీనితో స్పష్టమవుతుంది. అలాగే కస్టమర్లు, భాగస్వాముల నుంచి వస్తున్న పాజిటివ్ ఫీడ్‌బ్యాక్... ప్రోత్సాహాన్ని అందించే విజమయే కదా... ”అన్నారామె.

మైలురాళ్లను చేరుకుంటూనే.. తన ముఖ్య టీంలో ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతున్నారు పల్లవి. ప్రస్తుతం ఇండోఫ్యాష్ టీంలో ఐదుగురు ప్రధాన సభ్యులు ఉన్నారు. ఐఐఎం రాయ్‌‌పూర్ నుంచి పట్టభద్రులైన వికాస్.., గతంలోనూ చేనేత సొసైటీల్లో పనిచేశారు. ఈయనకు ప్రయాణాలంటే మహా మక్కువ. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న అరుదైన, గుర్తింపు పొందని కళలను గుర్తించే కార్యకలాపాలు చేపట్టారు. ఇండోఫ్యాష్ టీంలో మరో కీలక వ్యక్తి శశికాంత్. ఈయన విద్యాపరంగా సివిల్ ఇంజినీర్ అయినా... తన ప్యాషన్‌తో గ్రాఫిక్ డిజైనర్‌గా మారారు. యూజర్ ఇంటర్‌ఫేజ్ విభాగాన్ని ఈయన చూసుకుంటున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేసిన ప్రమీత్‌కు.. ఫైనాన్స్ విభాగంలో అనుభవం ఉంది. ఇండోఫ్యాష్‌లో ఈయన మునింజీ. ఎన్ఐఎఫ్‌టీ నుంచి వచ్చిన రిచా.. డిజైనింగ్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.


పల్లవి మొహదికర్‌తోపాటు.. ఇండోఫ్యాష్ టీం

పల్లవి మొహదికర్‌తోపాటు.. ఇండోఫ్యాష్ టీం


వీరందరూ తమ నైపుణ్యాల్లో ఒకరికి ధీటైన వారు ఒకరు. తాము చేస్తున్న పనిని అందరూ ఇష్టపడుతూ చేస్తూండడం విశేషం. ఈ వెంచర్ ప్రారంభించినప్పటి నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని చెబ్తారు పల్లవి. “వారికి,నాకు అంగీకారమైన వేతనాలతో... ప్రతీ రోల్‌కు తగిన వ్యక్తినే ఎంపిక చేయగలిగాను. ఇక్కడ నాకు చాలా స్వేచ్ఛ ఉంది. నాకు సవాళ్లు చాలా ఇష్టం. ఇండోఫ్యాష్‌లో ఇవి రోజుకొకటి చొప్పున ఎదురవుతూ ఉంటాయి. నా టీమ్‌తో కలిసి పనిచేయగలగడం చాలా ఆనందాన్నిస్తుంది. ప్రతీరోజూ ఎంతో సరదాగా గడిచిపోతున్నా.. చాలా నేర్చుకుంటున్నాం. అయితే... నా పనివేళలు అస్తవ్యస్తంగా ఉండడంతో... వర్క్, లైఫ్‌ను బ్యాలన్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది.”అన్నారు పల్లవి.

స్ఫూర్తినిచ్చిన సలహా

“నువ్వు ప్రారంభించిన వెంచర్ ‌‌గురించి వీలైనంత ఎక్కువమందితో మాట్లాడు. నువ్వు చేస్తున్నదానిపై అందరి దగ్గరి నుంచి అభిప్రాయాలు తీసుకో. ఇవి ఆలోచనలకు పదును పెడతాయి. చేస్తున్నపనిలో తప్పులను సరిదిద్దుకుని, సమర్ధంగా మారేందుకు సహకరిస్తాయి.”ఇది తాను పొందిన అత్యుత్తమ సలహా అని పల్లవి చెప్పారు.

తన టీంను పూర్తిగా విశ్వసిస్తానని, వారికి పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉందని అంటారు పల్లవి. వారి శక్తి, సామర్ధ్యాలపై ఉన్న నమ్మకమే దీనికి కారణమంటారామె. వారి కృషి, నైపుణ్యం రెండూ కలిసి.. ఇండోఫ్యా‌ష్‌ను ఉన్నత తీరాలకు చేర్చలగవని చెప్పారు.

“మీ చేతులు ఎంత మురికైతే.. అంత ఎక్కువగా నువ్వు నేర్చుకోగలవు. నేర్చుకునేందుకు ఉన్న ఏకైక మార్గం అదొక్కటే”- ఇదీ ఔత్సాహికులకు పల్లవి ఇచ్చే సలహా.

ప్రస్తుతం పసిపాపలాంటి తన వెంచర్‌ ఇండోఫ్యాష్‌ని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దగలనని నమ్మకంగా చెబ్తున్నారు పల్లవి. ఇందుకు ఇండోఫ్యూజన్ సహకరిస్తుందని, గ్లోబల్ లీడర్ స్థాయికి చేర్చడంలో... ఈ డిజైనర్ వేర్ ఉపయోగపడుతుందని నమ్మతున్నారామె. ఇండోఫ్యాష్ అంటే.. నమ్మకమైన భారతీయ వస్త్రాలకు, సమకాలీన, సౌకర్యవంతమైన డిజైన్లకు మారుపేరుగా ఎదుగుతామని చెబ్తున్నారు పల్లవి.

“వాస్తవాలుగా మారడం ఒక్కటే కలలకు లక్ష్యం కాకూడదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎందుకు వచ్చాయో కారణాలు తెలుసుకున్నాక.. అందరికీ సంతోషం పంచగలిగితేనే.... వాటికి పరమార్ధం”- కలలపై లీసా బు చేసిన వ్యాఖ్య

ఈ కొటేషన్‌కు తగినట్లుగానే... తన చిన్ననాటి జ్ఞాపకాలను, పెద్దయ్యాక ఏర్పరచుకున్న లక్ష్యాలను... రెండింటినీ తగిన విధంగా బేలన్స్ చేసుకుంటూ ఇండోఫ్యాష్‌ను నిర్వహిస్తున్నారు పల్లవి.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags