సంకలనాలు
Telugu

స్టెప్పింగ్ ఔట్ ! ఇదో డిస్కౌంట్ అడ్డా

బిజీ జీవితం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వీకెండ్‌లో డిస్కోల్లో, రెస్టారెంట్ల‌లో ఎంజాయ్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఐదురోజుల‌పాటు బిజీ బిజీగా గ‌డిపి, వీకెండ్‌ను ప‌బ్బుల్లో, డిస్కోల్లో, రెస్టారెంట్ల‌లో ఉల్లాసంగా గ‌డుపుతుంటారు. ఇలాంటి వ‌ర్గాన్ని డిస్కౌంట్‌ల‌తో ఆక‌ర్షిస్తుంది బెంగ‌ళూరుకు చెందిన స్టెప్పింగ్ఔట్‌.

GOPAL
4th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వీఐపీ క‌ల్చ‌ర్‌కు ‘ఆప్’ స‌ర్కార్ తిలోద‌కాలిచ్చింది. కానీ బెంగ‌ళూరుకు చెందిన స్టెప్పింగ్ఔట్ మాత్రం 75 రెస్టారెంట్లు, ప‌బ్బులు, డిస్కోల్లో డిస్కౌంట్‌లు ఆఫ‌ర్ చేస్తూ యువ‌త‌ను వీఐపీల్లా చూసుకుంటోంది. త‌మ సంస్థ‌లో ఫుడ్ అండ్ బేవ‌రేజ‌స్ మెంబ‌ర్‌షిప్ ప్రొగ్రామ్ తీసుకున్న‌వారికి మొబైల్ యాప్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు డిస్కౌంట్లు, ఎంట్రీలు, అప్‌గ్రేడ్‌ల స‌మాచారాన్ని అందిస్తోంది. స్టెప్పింగ్ఔట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రెస్టారెంట్లు, డిస్కోథెక్‌లు, ప‌బ్‌ల‌లో స‌భ్యుల‌కు రాయితీలు ల‌భిస్తాయి.

“న‌గ‌రంలోని యువ‌త‌కు ల‌గ్జ‌రీ లైఫ్‌ను సుల‌భ‌త‌రం చేయాల‌న్న‌దే మా ఆలోచ‌న‌. మా లక్ష్యం కూడా అదే” అని అంటారు స్టెప్పింగ్ఔట్ సీఈవో స‌ఫ్ద‌ర్ ఆదూర్‌.

ముందుగా గెస్ట్స్ జాబితాలో పేరులేకున్నా, త‌మ‌కిష్ట‌మైన డిస్కోల్లోకి ప్ర‌వేశించే అవ‌కాశాన్ని స్టెప్పింగ్ఔట్ తొలిసారిగా క‌ల్పించింది. ఈ వెంచ‌ర్ యునిక్ సెల్లింగ్ ప్రపొజిషన్ కూడా అదే. సాధారణంగా వారాంతాల్లో పబ్స్‌లోకి నేరుగా చెకిన్ అవడం దాదాపు అసాధ్యం. కానీ ఈ ల‌గ్జ‌రీని త‌మ స‌భ్యుల‌కు అందిస్తోంది స్టెప్పింగ్ఔట్. దీనితోపాటు మూడు కాక్‌ట‌యిల్స్ తీసుకుంటే మ‌రోటి ఫ్రీ, వెల‌క‌మ్ డ్రింక్‌/ డ‌ెజ‌ర్ట్‌ను ఉచితంగా ఇవ్వ‌డం వంటి ఆఫ‌ర్లు స్టెప్పింగ్ఔట్ త‌మ స‌భ్యుల‌కు ఆఫర్ చేస్తోంది.

image


పేరుకు తగ్గట్టే !

ప్ర‌తి ఒక్క‌రూ బిజీ లైఫ్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకే ప‌బ్బులు, డిస్కోలు, రెస్టారెంట్ల‌కు వెళ్తారు. అంటే ఇంటి నుంచో, ఆఫీస్ నుంచో స్టెప్ ఔట్ అవుతారు. ఇది ప్ర‌తిధ్వ‌నించేలా త‌మ సంస్థ‌కు స్టెప్పింగ్ఔట్ అని పేరు పెట్టారు వ్య‌వ‌స్థాప‌కులు.

ఆ న‌లుగురు

స్టెప్పింగ్ఔట్‌ను స‌ఫ్ద‌ర్‌, శ‌ర‌త్ రైస్‌, నీల్‌ ఉనాద్క‌ట్‌, డాన్ థామ‌స్‌లు స్థాపించారు. దేశంలోనే అత్యుత్త‌మ లైఫ్‌స్ట‌యిల్ యాప్ కావాల‌న్న‌ది స్టెప్పింగ్ఔట్ ల‌క్ష్యం. ఎంఎస్ రామ‌య్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో సివిల్ ఇంజినీరింగ్ చేసిన 23 ఏళ్ల స‌ఫ్ద‌ర్ చిన్న‌త‌నం నుంచే కొత్త‌కొత్తగా ఆలోచిస్తుండేవాడు. ప‌దేళ్ల వ‌య‌స‌ప్పుడే లిటిల్ ఈకో ఫ్రెండ్స్ పేరిట ఓ సంస్థ‌ను ప్రారంభించి బెంగ‌ళూరులో ప‌ర్యావ‌ర‌ణ శుభ్ర‌త‌కు శ్రీకారం చుట్టాడు. అలాగే యునైటెడ్ నేష‌న్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రొగ్రామ్‌కు భార‌త్ త‌ర‌పున మూడేళ్లు ప్రాతినిధ్యం వ‌హించాడు. 17 ఏళ్ల వ‌య‌సులో తొలిసారిగా డాన్ థామ‌స్‌ను క‌లిశాడు స‌ఫ్ద‌ర్‌.. ఆ త‌ర్వాత వారిద్ద‌రు శ‌ర‌త్ రైస్‌తో జ‌త క‌ట్టారు. 2011 సంవ‌త్స‌రంలో ఈ ముగ్గురు బెంగ‌ళూరులో కాన్స‌ర్ట్స్‌ను కో ప్రొడ్యూస్ చేశారు. స‌న్‌బ‌ర్న్ సంస్థ‌తో చేతులు క‌లిపి క్ల‌బ్ నైట్స్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌తి నెలా క‌నీసం ప‌ది ఈవెంట్ల‌ను వ‌ర‌కూ నిర్వ‌హించేవారు. 

ఈవెంట్ మేనేజ్‌మెంట్ స‌క్సెస్ కావ‌డంతో 2014 డిసెంబ‌ర్‌లో స్టెప్పింగ్ఔట్‌ను ప్రారంభించారు. యాప్ డెవ‌ల‌ప‌ర్స్‌కు ప్లాట్‌ఫామ్ నిర్మించి ఇచ్చే అప్పాసియేటివ్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు నీల్‌… డాన్ థామ‌స్‌ బ‌యో మెడిక‌ల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. స్టెప్పింగ్ఔట్ బ్రాండ్ పొజిష‌నింగ్‌, మార్కెటింగ్ బాధ్య‌త‌ల‌ను డాన్ థామ‌స్‌ నిర్వ‌హిస్తున్నారు. శ‌ర‌త్ తన యుక్త‌వ‌య‌సులోనే రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. త‌న కుటుంబ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నాడు శ‌ర‌త్‌. కోరమంగళలో నాలుగేళ్లుగా డెస్మండ్ రెస్టారెంట్‌ న‌డుపుతున్నారు. బెంగ‌ళూరు డెస్మండ్‌లో కూడా ఇటీవ‌లే భాగ‌స్వామ్యం తీసుకున్నారు.

యువ‌తే ల‌క్ష్యం

స్టెప్పింగ్ఔట్ లక్ష్యం యువ‌కులు, ఐటీ ప్రొఫెష‌న‌ల్సే. వారి నుంచి వార్షిక స‌భ్య‌తం కింద రూ. 1500 వ‌సూలు చేస్తున్నారు. ఐతే త‌మ బిజినెస్ పార్ట్‌న‌ర్ల నుంచి మాత్రం ఎలాంటి చార్జ్ చేయ‌డం లేదు. భ‌విష్య‌త్‌లో మాత్రం చార్జ్ చేయాల‌న్న ఉద్దేశంతో ఉన్నారు.

“మా వెబ్‌సైట్‌లో ప్ర‌తి కేట‌గిరిలో కేవ‌లం ఐదు ఔట్‌లెట్స్ మాత్ర‌మే ఎంపిక చేసుకుంటున్నాం. వ‌చ్చే ఏడాది నుంచి మా వెబ్‌సైట్‌లో ఉండే ఔట్ లెట్స్ నుంచి త‌ప్ప‌కుండా చార్జ్ చేస్తాం”.. అని స‌ఫ్ద‌ర్ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను చెప్పారు. దీనికి తోడు మెంబ‌ర్షిప్ కార్డుల‌పై యాడ్ స్పేస్ ద్వారా కూడా రెవెన్యూ రాబ‌ట్టాల‌ని కంపెనీ ప్లాన్ చేస్తున్న‌ది. తొలి నెల‌లోనే ఈ కంపెనీ వెబ్‌సైట్‌ 750 డౌన్‌లోడ్స్‌ హిట్స్‌నును సాధించిం ది. 536 కూప‌న్ల‌ను వేదిక వ‌ద్ద ఉప‌యోగించుకున్నారు. త‌మ స‌భ్యులు చేజారిపోకుండా స్టెప్పింగ్ఔట్ ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటోంది. త‌మ క‌స్ట‌మ‌ర్లకు ఇష్ట‌మైన ఆహారానికి సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించి, వారిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది.

image


బ్లూ బుక్‌తోనే పోటీ..

ప్ర‌స్తుతం ఈ రంగంలో స్టెప్పింగ్ఔట్‌కు బ్లూబుక్‌తోనే పోటీ ఉంది. ఐతే ఆ కంపెనీతో పోలిస్తే స్టెప్పింగ్ఔట్ కు కాస్త ఎడ్జ్ ఉన్న‌ది. బ్లూబుక్ కంటే ఎక్కువ సంఖ్య‌లో ఈ కంపెనీకి బెంగ‌ళూరులో క‌స్ట‌మ‌ర్లున్నారు. ఈ సంఖ్య త్వ‌ర‌లోనే రెట్టింపు అవుతుంద‌ని వ్య‌వ‌స్థాప‌కులు అంటున్నారు. వారి ఆశ‌యం నెర‌వేరాల‌ని కోరుకుందాం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags