సంకలనాలు
Telugu

డబ్బులను డబుల్ చేసి చూపిస్తున్న మిత్రద్వయం

ఆర్థిక సేవల స్టార్టప్ లో కొత్త సంచలనం 5nance.com

11th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share


పదేళ్లకు ఇల్లు కొనాలి..! దాని కోసం ఇప్పట్నుంచే సేవ్ చేయాలి..!

మంత్లీ ఎంత సేవ్ చేస్తే అప్పటికి రూ.50 లక్షలవుతాయి..! 

వడ్డీ పథకాలు మంచివేనా..?

అమ్మాయి పెళ్లి కోసం పొదుపు చేయాలి..!

అబ్బాయి చదువు కోసం కూడబెట్టాలి..!

కానీ ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ పెడితే ఎక్కువ లాభం..? రిస్క్ లేని పెట్టుబడి ఏది..?

ఈ సందేహాలు దాదాపుగా ప్రతి మధ్యతరగతి జీవికి వస్తాయి. న్యూస్ పేపర్లో ఎన్ని బిజినెస్ పేజీలు తిరగేసినా.. ఎన్ని సందేహాలు-సమాధానాలు ఫీచర్లు చదివినా..ఈ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ అనేది సగటు జీవికి ఎప్పుడూ అర్థం కాని విషయమే. కష్టపడి సంపాదించిన సొమ్ము బిడ్డల భవిష్యత్ కు బాటలు వేసేలా పొదుపు చేయాలంటే ఏం చేయాలనేది సగటు జీవికి ఆన్సర్ దొరకని ప్రశ్నగానే మారుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉన్నా.. ఈ మీమాంస మాత్రం ఎప్పుడూ ఉంటుంది.

కచ్చితంగా ప్రజల్లో ఆర్థిక వ్యవహారాలపై ఉన్న ఇలాంటి గ్యాప్ నే వ్యాపార అవకాశంగా మలుచుకున్నారు దినేష్ రోహిరా, అజయ్ అర్జిత్ సింగ్. 5నాన్స్.కామ్ పేరుతో స్టార్టప్ ప్రారంభించి మధ్య తరగతి జీవుల సందేహాలను నివృత్తి చేస్తూ దాన్నే వ్యాపారవకాశంగా చేసుకున్నారు.

ఇద్దరు మిత్రుల ఫైనాన్స్ జర్నీ

దినేష్ రోహిరా, అజయ్ అర్జిత్ సింగ్ పదిహేనేళ్లుగా మంచి మిత్రులు. ఇద్దరూ హ్యూలెట్ ప్యాకార్డ్ సంస్థలో మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ వారి దృష్టిలో ఉద్యోగం అంటే ఎప్పటికీ ఉద్యోగమే. అందుకే వారు అంట్రప్రెన్యూర్లుగా మారేదిశగానే తరచూ ఆలోచనలు పంచుకుంటూ ఉండేవారు. 

ఓసారి రిలయన్స్ మనీ కోసం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆర్థిక రంగంలో ఉన్న పెద్ద గ్యాప్ ను దినేష్ గుర్తించాడు. అలాగే ఆర్థికసేవల విషయంలో పరిశ్రమ ఎంత అసంఘటితంగా... నిర్లక్ష్యంగా... ఇతరులతో కమ్యూనికేషన్ లేకుండా.. ఎలా గాలివాటును వెళ్లిపోతుందో గమనించాడు. ఈ విషయాన్ని దినేష్ తన మిత్రుడైన అజయ్ తో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి ఈ రంగంలోనే స్టార్టప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలకు రిజైన్ చేసి ముందుగా దేశవ్యాప్తంగా పలునగరాల్లో సర్వేలు చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో వినియోగదారుల ప్రవర్తన ఎలా ఉంటుందో అంచనాకు వచ్చారు. మారుతున్న ప్రజల ఆలోచనలు... వారి ఆర్థిక స్థితిగతులు అంచనా వేసిన తర్వాత, ఆన్ లైన్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ వైపు మొగ్గుచూపారు. దాని ఫలితమే 5nance.com ఆవిష్కరణ.

" ఆర్థిక విషయాల్లో ఏం చేయాలో ఇప్పటి యువతరానికి పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఇది ఓ రకంగా ఆర్థిక వ్యవస్థలో పెద్ద గ్యాప్. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు టెక్నాలజీతో దీన్ని ఫిల్ చేయాలని చూస్తున్నప్పటికీ ఆ గ్యాప్ అలాగే ఉండిపోతోంది"- అజయ్ సింగ్, 5నాన్స్ ఫౌండర్

ప్రారంభంలోనే మెరుపులు

5నాన్స్.కామ్ గత ఏడాది నవంబర్ లోనే అందుబాటులోకి వచ్చింది. కంప్లీట్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ ఫ్లాట్ ఫామ్ ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఆరు నెలల వ్యవధిలోనే ఎనిమిది వేల మంది ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకున్నారు. సామాన్యుడికి కావాల్సిన అన్ని ఫైనాన్షియల్ సేవలు అందించేలా దీన్ని ఫౌండర్లు తీర్చిదిద్దారు. డాటా డ్రివెన్ మోడల్ లో దీన్ని నడుపుతున్నారు. వివిధ ఆర్థిక సంస్థల ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మొత్తం ఈ ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే వివిధ అంశాలపై నిపుణుల సలహాలు కూడా ఇస్తారు. ఈ సర్వీసంతా ఉచితంగానే చేస్తారు. ఈ ఫ్లాట్ ఫామ్ ను వినియోగదారులు అతి సులువుగా వినియోగించుకునేలా చేయడమే పెద్దసవాల్ అని అజయ్ అంగీకరిస్తారు. కానీ దాన్ని సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.

5nance.com ఫౌండర్స్

5nance.com ఫౌండర్స్


ఈ సైట్లో కస్టమర్ తమ పేరును రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా తమ ఖాతా రెడీ అవుతుంది. మొబైల్ కి వచ్చే పాస్ వర్డ్ తో మన ఖాతా మనం నిర్వహించుకోవచ్చు. మొదటిసారి కస్టమర్ లాగిన్ అయినప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అలాగే ఆర్థిక పరమైన లక్ష్యాలు, ఆదాయ అంచనాలు, ఇతర ఖర్చులు ఆర్థికపరరమైన వ్యవహారాలన్నింటినీ నమోదు చేసుకోవచ్చు. అలా చేసుకుంటే తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎలాచేస్తే బాగుంటుందో 5nance.com సూచనలు, సలహాలు ఉచితంగా అందిస్తుంది. వారి ఆర్థిక వ్యవహారాలకు తగ్గట్లుగా వివిధ బ్యాంకులు, ఆర్థికసంస్థల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతుంది.

కస్టమర్ తన అకౌంట్ లోకి లాగిన్ అయిన ప్రతీసారి ఆర్థిక సేవల ఆఫర్లు, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కు సరిపడా ఉత్పత్తులు సజెస్ట్ చేస్తుంది. మ్యూచువల్ ఫండ్లు, కార్పొరేట్ ఫిక్స్ డ్ డిపాజిట్స్, డిబెంచర్లతో పాటు లోన్ ఆఫర్లు కూడా 5నాన్స్ అందిస్తుంది.

సులువుగా, అర్థమయ్యేలాసేవలు

కస్టమర్ ఆర్థిక వ్యవహారాలన్ని ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఏదైనా ఆర్థిక సేవల ఉత్పత్తి కొనుగోలు చేసినప్పుడు కేవైసీ ఆటోమేటిక్ గా చెక్ చేస్తారు. ఒక వేళ రిజిస్టర్డ్ కస్టమర్ కాకపోతే ఈ ఫ్లాట్ ఫామ్ కేవైసీ నిబంధనలను ఇంటి దగ్గరే కంప్లీట్ చేసే అవకాశం కల్పిస్తుంది. 5nance.com నుంచి కొనుగోలు చేసే ఉత్పత్తికి సంబంధించిన ఎమౌంట్ నేరుగా అమ్మకందారు ఖాతాలోనే జమ అవుతుంది. అంటే అటు ఉత్పత్తి సంస్థకు.. ఇటు వినియోగదారునికి మధ్య నేరుగా ఒప్పందం జరుగుతుంది. 5nance.com ఓ ఫ్లాట్ ఫామ్ లాగానే ఉపయోగపడుతుంది.

5nance.com నుంచి ఓ ఉత్పత్తి కొనుగోలు చేస్తే ఆటోమేటిక్ గా ప్రొఫైల్ లో కూడా అప్ డేట్ చేస్తుంది. మొత్తం యూజర్ మెట్రిక్స్ ని రీఎసెస్ చేసి అప్డేట్ చేస్తుంది. తర్వాత కొత్తగా ఎలాంటి లావాదేవీ జరిపినా ఈ సైట్ లో ప్రొఫైల్ కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది.

ఆసక్తి ఉన్న కస్టమర్లతో వ్యక్తిగతంగానూ మాట్లాడి సలహాలు అందించే సర్వీస్ కూడా అందిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయంటున్నారు. దీని కోసం సదరు కస్టమర్ తమ బ్యాంకు స్టేట్మెంట్లను చూసే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఒక వేళ అలా కుదరకపోతే.. తామే పంపినా ఇబ్బంది ఉండదు. తమ రిపోర్టులను ఎప్పటికప్పుడు తమ ప్రొఫైల్ కి అప్ డేట్ చేస్తూ ఉంటే మరింత మెరుగైన సేవలు అందించగలమని ఈ మిత్రద్వయం చెబుతున్నారు.

కస్టమర్లకు ఎప్పడు కావాలంటే అప్పుడు తమ పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని ఫౌండర్లు చెబుతున్నారు. పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలో.. ఏది సరైన సమయమో కూడా ఫైనాన్స్ డాట్ కామ్ చెబుతుందంటున్నారు. పెట్టుబడి పెట్టగానే లాభం వచ్చేయదనేది వీరు అందరికీ చెప్పేమాట. 5nance.comకు నెలకు దాదాపుగా ఇరవై వేల మంది యూజర్లు కొత్తగా యాడ్ అవుతున్నారు. ఈ ఫ్లాట్ ఫాం మీద ఏడాదికి నలభై వేల నుంచి రెండులక్షల రూపాయల వరకు పెట్టుబడిగా ఆర్థిక సంస్థల్లో పెట్టవచ్చు. విజిటర్స్ సంఖ్య నెలకు యాబై శాతం చొప్పున పెరుగుతోందని మిత్రబృందం సంతోషంగా చెబుతోంది. 62శాతం ఫైనాన్స్ కస్టమర్లురిపీట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు.

image


భవిష్యత్ ఆర్థిక సేవలదే..!

జూలై రెండు వేల పదిహేనులో 5nance.com తొలి రౌండ్ ఫండింగ్ పొందింది. గ్లోబల్ వెంచర్స్, ఎస్పైర్ ఎమర్జింగ్ ఫండ్ లాంటిసంస్థలు మూడు మిలియన్ డాలర్ల పెట్టుబడిని అందించాయి. ఈ సంస్థ వినియోగదారుల కోసం సొంతంగా కాల్ సెంటర్ కూడా నిర్వహిస్తోంది. కానీ వారి ఎగ్జిక్యూటివ్స్ ఎప్పుడూ పెట్టుబడుల గురించి వినియోగదారులను కాంటాక్ట్ చేయరు. అది వారి పాలసీ.

5nance.comకు ఇప్పుడు ఆదాయం కమిషన్ ద్వారా వస్తోంది. కస్టమర్లు 5nance.com ద్వారా వివిధ ఆర్థిక సంస్థల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు అందులో కొంతకమిషన్ వస్తోంది. అయితే ఇది సంస్థను బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఎంత ఆదాయం వస్తుందో బహిరంగంగా చెప్పకపోయినా.. వచ్చే రెండేళ్లలో బ్రేక్ ఈవెన్ సాధిస్తామని నమ్మకంతో ఉన్నారు.

సామాన్యూడికి అత్యంత సులువుగా సేవలు అందించే సేవల స్టార్టప్స్ కు మంచి భవిష్యత్ ఉందనే అంచనాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి. దానికి కావాల్సింది కొంచెం ఆర్థికపరమైన చాణక్యమే. అది 5nance.com ఫౌండర్ల వద్ద బోలెడంత ఉంది. ఈ ఒక్క లక్షణం చాలు.. దినేష్ రోహిరా, అజయ్ అర్జిత్ సింగ్ సంచలన అంట్రపెన్యూర్లుగాఎదురుతారని అంచనా వేసుకోవడానికి...!

వెబ్ సైట్ 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags