సంకలనాలు
Telugu

మానసిక వికలాంగుల రోల్ మోడల్ ' రేష్మ వల్లిపన్ '

స్కిజోఫ్రేనియా నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో వివ‌రిస్తున్న రేష్మ‌మాన‌సిక రుగ్మ‌త‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి, సాధార‌ణ వ్య‌క్తిలా జీవిస్తున్న రేష్మ‌మెడిసిన్స్ తీసుకోకుండా మ‌నో వికారం నుంచి బ‌య‌ప‌డిన యువ‌తిప‌లు అంశాల్లో ఇత‌రుల‌కు సూచ‌న‌లిస్తున్న రేష్మ‌మాన‌సిక రోగుల‌ను పిచ్చివాళ్ల‌లా కాకుండా సాధార‌ణ రోగుల్లాగే ప‌రిగ‌ణించాంటున్న రేష్మ‌

GOPAL
16th Jun 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

మ‌నో వికారం.. మ‌నో వైక‌ల్యం. మాన‌సిక రుగ్మ‌త‌.. స్కిజోఫ్రేనియా.. అన్ని వ్యాధుల్లాగే ఇదీ ఒక‌ వ్యాధే. కానీ స‌మాజంలో మాత్రం మ‌నో వైక‌ల్యంతో బాధ‌ప‌డేవారిని ప్ర‌త్యేకంగా చూస్తారు. పిచ్చ‌వాళ్లుగా జ‌మ‌చేస్తారు. అలాంటి దృష్టి కార‌ణంగానే మాన‌సిక రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు తీవ్రంగా క‌ల‌త చెందుతున్నార‌ని అంటున్నారు రేష్మా వ‌ల్లీప‌న్‌.

రేష్మా వ‌ల్లిప‌న్‌లో అంద‌రికీ న‌చ్చేదేంటంటే ఆమె వ్యంగ్యం. త‌రుచుగా న‌వ్వే ఆమె... త‌న ఉప‌న్యాసాన్ని కూడా ఫ‌న్నీగా ఉండేలా చూసుకుంటారు. 2004 నుంచి రేష్మా మాన‌సిక వైక‌ల్యం, లైంగిక‌త, పౌర‌హ‌క్కులు వంటి అంశాల‌పై స‌ల‌హాలు ఇస్తున్నారు. తాను మాన‌సిక వైక‌ల్యం బారిన ప‌డిన ఘ‌ట‌న‌ల‌ను, ఆ కాలంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ఇత‌రుల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఉప‌న్యాసాల‌తోపాటు వ్యాసాలు కూడా రాస్తున్నారు. మాన‌సిక రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ బాధ‌తో చాలామందిలా కుంగిపోకుండా.. ఆర్టిస్టుగా, పెయింట‌ర్‌, రైట‌ర్‌గా ప‌లు రంగాల్లో రాణిస్తున్నారు. 

రేష్మ‌ను ఒక్క‌సారి చూస్తే ఎవ‌రూ మ‌ర్చిపోలేని ఆకారం. గులాబీ రంగు జుత్తు, మోచేతికి టాటూ, రకరకాల చెవి రింగులు.. ఇలా ప్ర‌త్యేకంగా ఉంటారు. ఆమె ప‌ర్స‌నాలిటీని చూసిన కొత్త‌వారు క్రేజీ అంటూ నిర్వ‌చిస్తారు. ఇదే విష‌యాన్ని ఆమె వ‌ద్ద ప్ర‌స్తావిస్తే తేలిగ్గా తీసుకుంటారు. అలా అనుకోవాల‌నే త‌న ప్ర‌య‌త్నం అంటూ న‌వ్వేస్తారు కూడా. మ‌నో వికారంతో బాధ‌ప‌డిన‌ప్ప‌టికీ వివిధ రంగాల్లో రాణించిన రేష్మ జీవితం పూల‌పాన్పు ఏమీ కాదు. ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించారు. ఆ క‌ష్టాలనుంచి ఎలా బ‌య‌ట‌ప‌డిందో సోష‌ల్ స్టోరీకి వివ‌రించారు రేష్మ‌.

బోళా రేష్మ‌

రేష్మ అంటే డేరింగ్ అండ్ డాషింగ్‌.. ఎలాంటి దాప‌రికం లేకుండా ఎవ‌రితోనైనా ఫ‌టాఫ‌ట్ మ‌ని మాట్లాడే అమ్మాయి. కానీ కాస్త మొండిది. అలాగే అభ్యుధ‌య భావాల‌తో స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించే అమ్మాయి. నోరు మూసుకుని చూస్తూ కూర్చోవ‌డ‌మంటే అస్స‌లు న‌చ్చ‌దు. ఎప్పుడూ ఏదో ఒక‌టి వాగుతూనే ఉంటుంది. అలాగే మిగ‌తా అంద‌రిలా కాదు.. కాస్త డిఫ‌రెంట్‌. ఆమె ప్ర‌వ‌ర్త‌న చూసి స‌న్నిహితులు, ఫ్రెండ్స్ జ‌డుసుకునేవారు. ఆమె వ్య‌క్తిత్వం, ఆమెకు ఎదురైన ప‌రిస్థితులు ప‌ట్టించుకోకుండా కొంద‌రు ఆమె పిచ్చిద‌న్న ముద్ర కూడా వేశారు. మ‌నోవైక‌ల్యం కంటే కూడా ఈ ప్ర‌జ‌ల ఆలోచ‌నే త‌న‌ను బాధించింద‌ని రేష్మ చెప్తారు.

మ‌ల్టీ టాలెంటెడ్ రేష్మ‌

మ‌ల్టీ టాలెంటెడ్ రేష్మ‌


“నేను కోలుకునే క్ర‌మంలో నాకు చాలా క‌ష్టంగా అనిపించిన విష‌యం ఏంటంటే.. ప్ర‌జ‌లు న‌న్ను సాధార‌ణ అమ్మాయిలా కాక‌, మాన‌సిక వికారంతో బాధ‌ప‌డుతున్న అమ్మాయిలా చూడటం. అంద‌రిలాగే నాకు వ్య‌క్తిత్వం ఉంద‌ని, నా ప్ర‌వ‌ర్త‌న‌పై మాన‌సిక వైక‌ల్య‌మొక్క‌టే ప్ర‌భావితం చేయ‌డం లేద‌ని నేను త‌ర‌చుగా అంద‌రికీ చెప్తుండేదాన్ని” అని రేష్మ గ‌తాన్ని గుర్తు చేసుకుంటారు. సాధార‌ణ వ్య‌క్తుల‌తో ఇష్టంలేని విష‌యాల గురించి మాట్లాడ‌టం అంటే రేష్మకు చిరాకు. అయినా కూడా ఆ విష‌యాలే మాట్లాడాల్సి వ‌చ్చేది. అందుకు కార‌ణం.. ఆ ఇష్టం లేని విష‌యాలే ఆమె జీవితంలో భాగం కావ‌డ‌మే.

“స‌మ‌స్య ఏమిటంటే.. స్కిజోఫ్రెనియా (మాన‌సిక వైక‌ల్యం) గురించి ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌డం. ఈ స‌మ‌స్య‌తో ఎవ‌రు బాధ‌ప‌డుతున్నారో కూడా చాలామందికి తెలియ‌దు. ఈ వికారంతో ఉన్నవారిని బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా ఇంట్లోనే దాచేస్తారు. ఎవ‌రికీ క‌నిపించ‌కుండా ఆశ్ర‌యం క‌ల్పిస్తారు. లేదా ఇంట్లోనే పున‌రావాసం క‌ల్పిస్తారు. కేవ‌లం వైద్యులు మాత్ర‌మే మాన‌సిక వైక‌ల్యంతో ఉన్న‌వారితో మాట్లాడుతారు” అని ఆమె వివ‌రించారు. “మాన‌సిక వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న‌వారు క్రేజీగానే ఉంటారు. కానీ తెలివిలేనివారు మాత్రం కాదు. కొన్నిసార్లు మేం వేరే ప్ర‌పంచంలో ఉంటాం నిజ‌మే. ఆ స‌మ‌యంలో ఎవ‌రూ మాట్లాడింది మాకు అర్థం కాదు. కానీ మిగ‌తా స‌మ‌యాల్లో మేం కూడా అంద‌రిలాగే స‌హ‌జంగానే ప్ర‌వ‌ర్తిస్తాం. అందులో ఎవ‌రికీ ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు” అని స్కిజోఫ్రెనియ బారిన ప‌డిన వారిగురించి రేష్మ వివ‌రించారు. 

మ్యూజిక్ ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటున్న రేష్మ‌

మ్యూజిక్ ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటున్న రేష్మ‌


 స్కిజోఫ్రెనియా అనే ప‌దం విన‌డానికే కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. వింటుంటే ఏదో భావ‌న మొదలవుతుంది. కానీ చాలామందికి స్కిజోఫ్రెనియా అంటే తెలియ‌దు. ఇలాంటి అజ్ఞాన‌మే మ‌రింత స‌మ‌స్య‌గా మారుతోంది. “ స్కిజోఫ్రెనియాకు స‌రైన నిర్వ‌చ‌న‌మే లేదు. స్కిజోఫ్రెనియా అంటే ఒక‌టి కంటే ఎక్కువ మాన‌సిక స‌మ‌స్య‌ల స‌మాహార‌మ‌ని చాలామంది వైద్యులు చెప్తుంటారు” అని రేష్మ తెలిపారు.

చిన్న‌వ‌య‌సులోనే పెద్ద స‌మ‌స్య‌

22 ఏళ్ల వ‌య‌సులో రేష్మ‌కు స్కిజోఫ్రెనియా ఉన్న‌ట్టు డాక్ట‌ర్లు గుర్తించారు. దీంతో ఆమె సైక్రియాట్రిక్ థెర‌పీని తీసుకున్నారు. కొన్నేళ్ల త‌ర్వాత డాక్ట‌ర్ రాసిన మందుల‌ను వాడ‌కూడ‌ద‌ని రేష్మ‌ నిర్ణ‌యించుకున్నారు. డాక్ట‌ర్లు, ఆమె కుటుంబస‌భ్యులు ఈ నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేక‌పోయారు. కానీ ఆమె నిర్ణ‌యాన్ని మాత్రం వ్య‌తిరేకించ‌లేదు. అంద‌రిలాగే సాధార‌ణ జీవ‌నం గ‌డిపేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాతే రేష్మ మందుల‌ను వాడ‌కూడ‌ద‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

"నాన్న‌, డాక్ట‌ర్ నాకెంతో మ‌ద్ద‌తుగా నిలిచారు. ఎందుకంటే మాన‌సిక రుగ్మ‌త‌ను కాకుండా వారు కేవ‌లం నా వ్య‌క్తిత్వాన్నే గుర్తించారు. నేను చిన్న‌ప్ప‌టి నుంచి పెరుగుతున్న తీరును నాన్న గ‌మ‌నించారు. చిన్న‌ప్పుడు నేనో రెబ‌ల్‌ని. చెట్ల‌ను ఎక్క‌డం, ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ‌ తిర‌గ‌డం, మొండిగా వ్య‌వహ‌రించ‌డం వంటి ప‌నులు చేసేదాన్ని. అందుకే నా క్రేజీని, నా మొర‌టుత‌నాన్ని ఆయ‌న అంత‌గా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే ఆయ‌న కూడా నాలా క్రేజీనే " అని రేష్మ వివ‌రించారు.

రేష్మ పుట్టింది మ‌లేసియాలో. ప్ర‌స్తుతం త‌న సోద‌రి, నాలుగు పిల్లుల‌తో క‌లిసి పూనేలో నివ‌సిస్తున్నారు. రేష్మ తల్లిదండ్రులు ఇండోనేషియాలో ఉంటున్నారు. 65 ఏళ్ల వ‌య‌సులో రేష్మ తండ్రి మ‌రో జాబ్ సంపాదించ‌డంతో వారు ఇండోనేషియా వెళ్లిపోయారు. రేష్మ‌నే కాదు.. ఆమె త‌ల్లి కూడా కొన్నాళ్ల‌ కింద‌ట అనారోగ్యం పాలైంది. 2008లో రేష్మ త‌ల్లికి క్యాన్స‌ర్ సోకింది. అలాగే రేష్మ కూడా బ్రెయిన్ ట్యూమ‌ర్‌తో బాధ‌ప‌డ్డారు.

మ‌ల్టీ టాలెంటెడ్ రేష్మ‌

మ‌ల్టీ టాలెంటెడ్ రేష్మ‌


మ‌ల్టీ టాలెంటెడ్..

రేష్మ‌ ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు. మార్షియ‌ల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. పెయింటింగ్ వేస్తుంటారు. మైమ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తుంటారు. యోగా, మెడిటేష‌న్ చేస్తారు. కాన్ఫ‌రెన్స్‌ల‌లో ఉప‌న్యాసాలు ఇస్తుంటారు. అకాడ‌మిక్ పేప‌ర్స్ రాస్తుంటారు కూడా. వీటితోపాటు ఇత‌ర అడ్వ‌క‌సీ కార్య‌క్ర‌మాల్లోనూ పాలు పంచుకుంటారు. "ప్ర‌త్యేకంగా కాకుండా అంద‌రిలాగే రొటీన్‌గా ఉండాల‌నే నాకు అనిపిస్తుంటుంది. కానీ ఒక్క ప‌నికే ప‌రిమితం కాలేను" అంటూ న‌వ్వేస్తారు రేష్మ‌. అందుకు కార‌ణం ఆమెకు చేసేందుకు ఎన్నో ప‌నులున్నాయి. ఇక రెండో అంశం.. ఆమె అంద‌రిలాంటి అమ్మాయి కాదు. ఆమె ఆలోచ‌న‌ల‌పై ఎన్నో శ‌క్తులు ప్ర‌భావితం చేస్తుంటాయి. కొన్ని గొంతులు, దృశ్యాలు ఆమెను సాధార‌ణ అమ్మాయిలా ప్ర‌వ‌ర్తించ‌నివ్వ‌వు. ఇలాంటి ప‌రిస్థితులు త‌లెత్తితే క‌నీసం రెండు, మూడు రోజుల వ‌ర‌కు మ‌రోలోకంలోకి వెళ్లిపోతారు. క‌ల‌ల్లో ఎవ‌రో అడ్డుకుంటున్న‌ట్టు.. ఏదేదో చేస్తున్న‌ట్టూ ఊహించ‌కుంటారు. ఏవేవో దృశ్యాలు క‌నిపిస్తుంటాయి.. ఎవ‌రివో గొంతులు వినిపిస్తుంటాయి. ఇలాంటి ప‌రిణామాలు జ‌రుగుతుండ‌టంతో బాహ్య ప్ర‌పంచాన్ని మ‌ర్చిపోతారు రేష్మ‌. దిక్కుతోచ‌ని స్థితిలోకి వెళ్లిపోతారు. మెదడు పూర్తిగా అల‌సిపోవ‌డంతో ఇంట్లో వారిని కూడా గుర్తించ‌లేక‌పోతారు. మ‌ళ్లీ సాధార‌ణ జీవితానికి వ‌చ్చేందుకు కొన్ని రోజులు ప‌డుతుంది.

మ‌ళ్లీ సాధార‌ణ జీవితానికి వ‌చ్చిన ఆమె ప్ర‌వ‌ర్త‌న‌ చాలా విచిత్రంగా ఉంటుంది. అద్భుత‌మైన పెయింటింగ్స్‌ను వేస్తుంటారు. మ్యూజిక్ వింటారు. పిల్లుల‌తో ఆడుకుంటారు.. ప్ర‌వ‌ర్త‌న పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. "నిద్ర స‌రిగా లేక‌పోతే అది మ‌న‌సుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అద‌నంగా ప‌నిచేసేలా చేస్తుంది. అది నా మెద‌డుపై ప‌నిచేయ‌డంతో నా దృష్టిపై కూడా ప్ర‌భావం చూపుతున్న‌ది" అని రేష్మ వివ‌రిస్తారు. అలాగే నిద్ర‌పోతున్న స‌మ‌యంలో ఎవ‌రైనా డిస్ట్ర‌బ్ చేస్తే.. ఆమెకు తెగ చిరాకొచ్చేస్తుంది. "ప‌డుకునేముందు నా ఫోన్‌ను దూరంగా పెట్టుకుంటాను. ఒక‌వేళ ఎవ‌రైనా ఆ స‌మ‌యంలో ఫోన్ చేస్తే తెగ చిరాకు వ‌చ్చేస్తుంటుంది. ఫోన్‌ను కిటికి నుంచి విసిరివేయాల‌నిపిస్తుంది" అని న‌వ్వుకుంటూ చెప్తారు రేష్మ. "నేను ఎప్పుడు ఎలా ఉంటానో తెలుసుకోవాల‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ నావ‌ర‌కైతే రాత్రి ప‌ది నుంచి ఉద‌యం ప‌దిగంట‌ల వ‌ర‌కు నేనెలా ఉంటానో తెలుసుకోవాల్సిన ఎవ‌రికీ అవ‌స‌రం లేదు" అని రేష్మ అంటారు. 

మైమ్ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్న రేష్మ వ‌ల్లీప‌న్‌

మైమ్ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్న రేష్మ వ‌ల్లీప‌న్‌


సుదీర్ఘ కాలంపాటు నిద్ర, మెడిటేష‌న్స్‌, థాయ్ చీ త‌ర‌గ‌తులు, మైమ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు, పెయింటింగ్‌లే రేష్మ‌ను మ‌ళ్లీ సాధార‌ణ జీవితంలోకి తీసుకొస్తాయి. అలాగే ఆమె మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా ఉన్న‌ప్పుడు ఆమె మాన‌సిక వైక‌ల్యంతో బాధ‌ప‌డేవారి గురించి ఉప‌న్యాసాలు ఇవ్వ‌డంతోపాటు, వ్యాసాలు కూడా రాస్తుంటారు. 

"భార‌త్‌లో రెండువేల‌కు పైగా చ‌ట్టాలున్నాయి. అందులో 200 వ‌ర‌కు మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేనివారి గురించే. మెంట‌ల్ హెల్త్ యాక్ట్ 1987లో ఈ అన్‌సౌండ్ మైండ్ గురించి త‌ర‌చుగా వ‌స్తుంది. ఈ ప‌దాన్ని నేరుగా లునాసీ అసైలం యాక్ట్ 1858 నుంచి నేరుగా తీసుకున్నారు" అని ఆమె వివ‌రించారు. భార‌త చ‌ట్టాల్లోకి అన్నిటి కంటే ఆమెకు ఇండియ‌న్ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1937లోని సెక్ష‌న్ 24ఏ, పార్ట్ 3 అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఎందుకంటే మాన‌సిక వైక‌ల్యంతో, మూర్చ‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఎవ‌రి తోడు లేకుండా ఒంట‌రిగా ప్ర‌యాణించ‌రాద‌ని ఆ చ‌ట్టం చెప్తుంది. ప్ర‌యాణికుడి మాన‌సిక ప‌రిస్థితి బాగోలేదంటూ పైలెట్ ఎవ‌రినైనా ఆపేస్తే ప‌రిస్థితి ఎలా అని ఆమె ప్ర‌శ్నిస్తుంటారు. అంతేకాదు.. చాలాకాలంగా మార్పు చెంద‌కుండా ఉన్న భార‌త చ‌ట్టాల‌పై కూడా ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చ‌ట్టాల స‌వ‌ర‌ణ‌పై ఇంకా భార‌త్ పోరాటం చేస్తూనే ఉంద‌ని ఆమె అంటారు. యునైటెడ్ నేష‌న్స్ క‌న్వెన్ష‌న్ ఫ‌ర్ రైట్స్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ డిసెబిలిటీస్ (యూఎన్ సీఆర్పీడీ) 2006 ప్ర‌కారం పాత‌వైపోయిన చ‌ట్టాల‌ను విధిగా మార్చాల్సిందేన‌ని ఆమె కోరుతారు. మాన‌సిక వైక‌ల్యంతో బాధ‌ప‌డుతున్న వారి జీవితాల్లో ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు కీల‌క ప్ర‌భావం చూపుతాయ‌న్న‌ది ఆమె అభిప్రాయం. 

image


ఈ స్కిజోఫ్రేనియా వ్యాధిగ్ర‌స్తుల‌కు స‌మాజంలో స‌రైన గుర్తింపు లేద‌ని ఆవేద‌న చెందుతారు. ఓ పుస్త‌కావిష్క‌ర‌ణ స‌మావేశంలో త‌న‌కు ఎదురైన సంఘ‌ట‌న గురించి రేష్మ వివ‌రించారు. "పుస్త‌క ఆవిష్క‌ర‌ణ స‌మ‌యంలో మాన‌సిక వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌కుడు మ‌ధ్య‌లో జోక్యం చేస‌కున్నాడు. ఏదో చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప‌బ్లిష‌ర్ స‌హా అంతా నావైపే చూస్తున్నారు. ఎందుకంటే ఎవ‌రికీ స‌మ‌యం లేదు. తొంద‌ర‌గా కార్య‌క్ర‌మాన్ని ముగించాల‌ని అంతా అనుకుంటున్నారు. ఆ కుర్రాడు చెప్పే మాట‌ల‌ను వినేందుకు ఎవ‌రికీ స‌మ‌యం లేదు. ఆ కుర్రాడు కూడా సంబంధం లేని విష‌యం చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు" అని రేష్మ వివ‌రించారు. 

సంచ‌ల‌నం సృష్టించిన డాక్యూమెంట‌రీ..

ఈ రేష్మ వ‌ల్లీప‌న్ గురించి ద‌ర్శ‌కురాలు అప‌ర్ణా స‌న్యాల్ "ఏ డ్రాప్ ఆఫ్ సైన్‌షైన్‌" డాక్యూమెంట‌రీ తీశారు. ఇది రేష్మా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చింది. అలాగే పెను సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. మందులు తీసుకోకుండానే మాన‌సిక రుగ్మ‌త‌ల నుంచి బ‌య‌ప‌డాల‌ని రేష్మ తీసుకున్న నిర్ణ‌యం వైద్య రంగంలో చ‌ర్చ‌కు దారితీసింది. ఆ డాక్యూమెంట‌రిని ఎన్జీవో కార్య‌క్ర‌మాల్లోనే కాదు, ప‌లు కార్య‌క్ర‌మాల్లో కూడా ప్ర‌ద‌ర్శించారు. "ఆ కార్య‌క్ర‌మాల్లో నేను మాట్లాడ‌ాను. మేము మా మ‌న‌సును విప్పుకునే ప్ర‌పంచం చాలా చిన్న‌ది. ఆ డాక్యూమెంట‌రీ నా జీవితం గురించి ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. దీంతో కొత్త కొత్త సంబంధాలు ఏర్ప‌డ్డాయి" అని రేష్మ వివ‌రించారు.


మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించి స‌రైన‌న్ని చ‌ర్చ‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య అని రేష్మ అంటారు. ఈ విష‌యాన్ని చాలామంది ఒప్పుకున్నార‌ని కూడా చెప్తారు. "స‌మ‌స్య మాన‌సిక స్థితికి సంబంధించిన‌ది కాదు. దానికంటే పెద్ద‌ది. ప్ర‌జ‌లు చాలామంది సంతోషంగా ఉండ‌రు. అలా అని దాన్ని ఒప్పుకోవ‌డానికి కూడా ముందుకు రారు. అదే నాకు ఆశ్చ‌ర్య‌మ‌నిపిస్తుంటుంది. మాన‌సిక‌, శారీర‌క‌, ఆధ్యాత్మిక ఈ ఆరోగ్య‌మైనా కానివ్వండి.. దాన్ని కాపాడుకోవ‌డం మ‌న బాధ్య‌త‌. కానీ తాము ప‌నిచేస్తేనే జీవితం సాగుతుంద‌ని కొంద‌రు అనుకుంటారు. అది స‌రైన‌ది కాదు. మాన‌సిక ఆరోగ్యం గురించి మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న‌ది నా భావ‌న‌. ఎందుకంటే అలాంటి మాట‌ల‌తో మ‌నం కూడా అలాంటి భావ‌న‌లోకే వెళ్లిపోతాం. డిప్రెష‌న్‌కు లోన‌వుతాం. కుతూహ‌లం పెరిగినట్ట‌వుతుంది. ఆత్మ‌హ‌త్య ఆలోచ‌న‌లు వ‌స్తాయి. మాన‌సిక ఆరోగ్యం అన్న‌ది చిన్న‌గా క‌నిపిస్తుంది కానీ.. ఏదైనా స‌మ‌స్య త‌లెత్తితే వెంట‌నే డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాలి" అని ఆమె వివ‌రించారు.

త‌న స్టోరీని ముగించేముందు స్కిజోఫ్రేనియా గురించి రేష్మ ఇలా నిర్వ‌చించారు. మ‌నో వికారం (స్కిజోఫ్రేనియా) అనేది వ్య‌క్తి బ‌య‌టి ప్ర‌పంచంలో జ‌రిగే చ‌ర్య‌లు. వ్య‌క్తిలో జ‌రిగేవి కావు. వాటిని మనిషి కేవలం అనుకరించాడు. అందుకే ఈ ప్రపంచం మనిషి సొంతమయ్యింది. అనుభవం పెరుగుతున్న కొద్దీ ... అది మన సొంతమవుతుంది. మనం మనలాకాకుండా ... వేరేలా ఉండాలనుకుంటే అస్థిత్వానికే ప్రమాదం ఏర్పడుతుంది.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags