క్రియేటివ్ ఈవెంట్లతో జనాలను కట్టిపారేస్తున్న హైదరాబాద్ స్టార్టప్

1st Sep 2015
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

ఈవెంట్ అంటే ఇన్నోవేషన్‌కి పర్యాయపదంగా ఉండాలి. కొత్తదనాన్ని చూపించగలగాలి. క్రియేటివిటీ ఉంటేకానీ ఈవెంట్‌కు కళరాదు. పేలవంగా చేసే కార్యక్రమం వల్ల ఎవరికీ ఉపయోగం. ఏదో అయింది అనిపించడం తప్ప. మీకూ ఇది నిజమే అనిపిస్తోందా ? ఈవెంటర్ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఫౌండర్ సాయి కూడా అదే అంటారు. మనం పుట్టినప్పటి నుంచి జీవితంలో వచ్చే ప్రతి మజిలీ ఓ ఈవెంటే అంటారు. మనం చూసే దాని బట్టి మన ఆసక్తి ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా గతేడాది ప్రారంభమైన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సరికొత్త ఇన్నోవేటివ్ థాట్స్‌ని జనానికి పరిచయం చేస్తోంది.

ఈవెంట్ లోని సెట్

ఈవెంట్ లోని సెట్


“ఈ భూమిపై మనం పుట్టడమే ఓ ఈవెంట్. అదే ఒక సెలబ్రేషన్. మనదేశంలో అయితే పెళ్లి జీవతంలో వచ్చే పెద్ద ఈవెంట్” సాయి సుమన్

కిడ్నాప్ కాన్సెప్ట్

ఈవెంటర్ ఎంటర్ టైన్మెంట్స్ మొదటి ప్రాజెక్ట్ ఇది. ఈవెంట్‌లో పాల్గొనే వారిని సర్‌ప్రైజ్‌గా కిడ్నాప్ చేస్తారు. వాళ్లకు కళ్లకు గంతలు కడతారు.వారి మొబైల్ ఫోన్స్ కూడా తీసేసుకుంటారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో.. చెప్పరు. పార్టీ కాన్సెప్ట్, వెన్యూ, అక్కడి కార్యక్రమాలు ఏ వివరాలు తెలియనివ్వరు. అలా బస్సులో తిప్పుతూ ఓ వెన్యూ దగ్గరకి తీసుకెళతారు. అక్కడే అందరినీ దింపి లొకేషన్ రివీల్ చేస్తారు. ఇలా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కల్పిస్తారు. ఆ తర్వాత డీజే తోపాటు ఎన్నో రకాల ఈవెంట్స్ జరుగుతాయి. దీన్ని ప్రత్యక్షంగా అనుభవించి తీరాలి తప్పితే మాటలతో చెప్పలేమని అంటారు సాయి. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన సమయంలో ఎన్నోప్రయాసలు పడాల్సి వచ్చిందని, అయితే ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో అవన్ని మర్చిపోయానని చిరునవ్వులు చిందిస్తూ చెప్పుకొచ్చారు . ఈవెంట్‌కు ముందు ఎంత కష్టపడినప్పటికీ ఈవెంట్ సక్సస్ తర్వాత అవన్నీ మర్చి పోవడం ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌గా నా జీవితంలో మర్చిపోలేని అనుభవమని అంటారాయన.

ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్

ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్


ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్నోవేషన్

అందరూ చేసే పని చేయాలంటే నేను కూడా ఓ ఉద్యోగం వెతుక్కొని జీవితంలో సెటిల్ అయ్యేవాడిని. కానీ అలా కాలేదే. కొత్తదనం కోరుకున్నా. నాలానే అందరికీ ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ చూపించాలనే తాపత్రయం తప్పితే మరొకటి కాదంటారు సాయి. ఈవెంట్ అంటే అదో ఇన్నోవేషన్. అలా సరికొత్తగా ఆవిష్కరించకపోతే సాధారణ పార్టీకి తమకు తేడా ఏం ఉంటుందని ఎదురు ప్రశ్నిస్తారు ? ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు జనరేట్ చేస్తూ.. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే దానిపై హోం వర్క్ చేస్తుంటారు. బయట దేశాల్లోని ఈవెంట్స్‌కు పని చేసిన అనుభవం ఉంది. దాన్ని ఇక్కడ అమలు చేయాలనేదే నా ఉద్దేశం. కొత్త కాన్సప్ట్ కోసం ఎన్ని రోజులు ఆలోచించడానికైనా రెడీ. పార్టీ గోయర్స్‌కు ఓ విభిన్న అనుభూతిని మిగల్చడం తప్పితే ఓ ఈవెంట్ మేనేజర్‌గా నాకు అంతకు మించిన పెద్ద బాధ్యత ఏముంటుంది ? అందుకే ఈవెంట్ అంటే నథింగ్ బట్ ఎన్ ఇన్నోవేషన్ , ఐడియాని జనరేట్ చేయడమే కాదు దాన్ని ప్రొఫెషనల్ గా ఎగ్జిక్యూట్ చేయాలని అంటారు సాయి.

ఫౌండర్ సాయి సుమన్

ఫౌండర్ సాయి సుమన్


ఫౌండర్ అండ్ టీం

టీం గురించి చెప్పాల్సి వస్తే ముందుగా చెప్పాల్సింది ఫౌండర్ సాయు సుమన్ గురించే. హైదరాబాద్ లో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలని అనుకున్నారు. దానికోసం ముంబైలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్రెయినింగ్ తీసుకున్నారు. తర్వాత ముంబై, బెంగళూరులో కొన్ని కంపెనీల్లో పనిచేశారు. వీటిల్లో ఫెమినా మిస్ ఇండియా లాంటి పెద్ద కార్యక్రమాలూ ఉన్నాయి. అయినా ఏదో తెలియని వెలితి. ఈవెంట్స్ పై మరింత అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో యూరప్ వెళ్లిపోయారు. చదువు పూర్తి చేసుకొని జర్మనీ, ఆమ్‌స్టర్‌డాంతోపాటు ఆఫ్రికాలోనూ కొన్ని ఆర్గనైజింగ్ సంస్థల్లో పనిచేశారు. జాక్ మార్టాన్, లాజిస్టిక్స్ లాంటి కంపెనీల్లో తిరుగులేని అనుభవం సాధించారు. 

భారత్ వచ్చాక ఈవెంటర్ ఎంటర్‌టైన్మెంట్స్‌ను ప్రారంచారు. ప్రతీ ఈవెంట్‌కి ఫ్రీలాన్సర్స్‌తోపాటు ఇంటర్న్స్ ని తీసుకుంటారు. పూర్తి స్థాయి టీంని ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది.

మొదటి రోజుల్లో స్ట్రగుల్స్

ఇండియా అయితే చేరుకున్నారు కానీ , అనుకున్న సులభంగా ఆఫర్లైతే రాలేదు. యూరప్‌తో పోలిస్తే ఇక్కడ అంత బడ్జెట్‌లు ఉండవు. క్లెయింట్స్‌ని కన్విన్స్ చేయడం కూడా అంత ఈజీ కాలేదు. అంతా చేద్దాం అంటారు కానీ .. బడ్జెట్ విషయంలో వెనకడుగు వేశారు. చివరికి తానే కిడ్నాప్ పేరుతో ఓ ఈవెంట్ ప్లాన్ చేసి సక్సస్ అయ్యారు. హైదరాాద్ కిడ్నాప్ ఈవెంట్ తర్వాత బాంబే, ఢిల్లీ లాంటి చోట్ల నుంచి తనకు ఫోన్ కాల్స్ రావడం ఆరంభించాయి. కిడ్నాప్ ఈవెంట్ ఎగ్జిక్యూషన్ టైంలో పోలీసులు సైతం నో చెప్పారట. పోలీస్ పర్మిషన్ లేకుండా ఈవెంట్ చేయడం జరగని పని. దాదాపు 45రోజుల పాటు పడరాని పాట్లుపడ్డారు. కానీ ఈవెంట్ సక్సస్‌ఫుల్‌గా నడిపించగలనే కాన్ఫిడెన్స్ తనని ముందుకు తీసుకెళ్లిందటారు సాయి.

భవిష్యత్ ప్రణాళికలు

ఈవెంటర్ ఎంటర్‌టైన్మెంట్స్‌కు ఏడాదిగా సొంతంగా నిధులు సమకూర్చుకుంటోంది. ఎవరైనా ఇన్వెస్టర్ ఫండింగ్ చేస్తే ఇన్నోవేటివ్ ఈవెంట్స్‌ని జనానికి రుచి చూపిస్తానంటున్నారు సాయి. ఈవెంట్ రంగంలో ప్రొఫెషనలిజం పెంచడానికి తమ కంపెనీ పనిచేస్తుందంటారు. హైదరాబాద్ తోపాటు అన్ని మెట్రో నగరాలకు సేవలను విస్తరించాలని చూస్తున్నారు.

ఈవెంట్స్ అంటే సెలబ్రిటీలు చేసే డ్యాన్సులు కాదు. సామాన్యులు సైతం పార్టీ ని ఎంజాయ్ చేసేలా ఉండాలి. తాను ఈవెంట్స్ ప్రారంభించిన మొదటి రోజునుంచి ఆ దిశగానే అడుగులేస్తున్నానని. భవిష్యత్ లో కూడా దానికే కట్టుబడి ఉంటానని ముగించారు సాయి


Want to make your startup journey smooth? YS Education brings a comprehensive Funding and Startup Course. Learn from India's top investors and entrepreneurs. Click here to know more.

  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close

Our Partner Events

Hustle across India