సంకలనాలు
Telugu

స్పెషల్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకమైన గిఫ్ట్స్

వికలాంగుల కోసం ప్రత్యేక గిఫ్ట్‌లు తయారు చేస్తున్న సంస్థక్యాలెండర్లు, గ్రీటింగ్ కార్డులు, చెస్ బోర్డులు... అన్నీ ప్రత్యేకమేవారి జీవితాల్లో వెలుగు నింపే ఆశాజ్యోతి... గిఫ్ట్ ఏబుల్డ్

team ys telugu
9th May 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

వికలాంగులను చూస్తే అయ్యో అనిపిస్తుంది. వారికేదైనా సాయం చేస్తే బాగుంటుందనిపిస్తుంది. తోచిన సాయం చేస్తుంటాం. మనం చేసే ఆ సాయం వారికెంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ... గిఫ్ట్ ఏబుల్డ్ అనే సంస్థ చేస్తున్న సాయం మాత్రం మర్చిపోలేనిది. మరవకూడనిది. వికలాంగులను మన కళ్లతో చూసి సాయం చెయ్యడం కాదు... వారి కళ్లతో ప్రపంచాన్ని చూసి, వారి అవసరాలేంటో తెలుసుకొని, కావాల్సిన సాయం చెయ్యడమే ఈ సంస్థ గొప్పదనం. వినడానికి సింపుల్ గా అనిపించినా అలా ఆలోచించడం మాత్రం చాలా గొప్ప విషయమని ఆ సంస్థ నడుస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఆ సంస్థ చేస్తున్న కార్యకలాపాలేంటో తెలుసుకుందామా...

వికలాంగులకు మీరేదైనా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారా? ఏమిస్తే బాగుంటుందని బుర్ర బద్దలు గొట్టేసుకుంటున్నారా? ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావట్లేదా? ఇలాంటి వాటికి సమాధానమే గిఫ్ట్ ఏబుల్డ్ సంస్థ. ప్రార్థనా కౌల్, ప్రతీక్ కౌల్ ఈ ఎన్జీఓ నిర్వాహకులు. వీరిద్దరూ ఓసారి వికలాంగులకు సంబంధించిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. వారికేదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనిపించింది. కానీ అంధులకు ఏ గిఫ్ట్ అని ఇస్తాం. ఆ గిఫ్ట్‌ను వాళ్లెలా చూడగలరు. దాని గురించి ఎలా తెలుసుకోగలరు. కనీసం ఓ గ్రీటింగ్ కార్డు ఇచ్చినా వారికి అందులో ఏముందో అర్థం కాదుకదా అని తెగ బాధపడిపోయారు. అసలు ఇలాంటి డిఫరెంట్ ఏబుల్డ్ వ్యక్తులకు బహుమతులే లేవా అని వెతికితే ఏమీ కనిపించలేదు. అప్పుడే వీరికి ఈ ఆలోచన వచ్చింది. 

వికలాంగుల అవసరాలకు తగ్గట్టుగా గిఫ్ట్స్ తయారుచేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి గిఫ్ట్ ఏబుల్డ్ పేరుతో ఈ సంస్థను ప్రారంభించారు. వికలాంగులకు వారి అవసరాలను తీర్చే గిఫ్ట్ ఏదైనా సరే వీరిదగ్గర ఉంటుంది. ముఖ్యంగా అంధుల కోసమే వీరు ఎక్కువగా కృషి చేస్తున్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపితో రూపొందించిన గ్రీటింగ్ కార్డులు వీరిదగ్గరుంటాయి. వీటిని చూస్తే అసలు ఇలాంటి ఐడియా మనకెందుకు రాలేదబ్బా అనుకుంటారు. ఇవే కాదు... బ్రెయిలీ లిపితో రూపొందించిన స్లేట్స్, వర్డ్ బ్లాక్స్, డ్రాయింగ్ బోర్డ్స్ లాంటివి కూడా ఉంటాయి. విజ్ఞానాన్ని పెంచే చెస్ బోర్డ్, అబాకస్, డార్ట్ బోర్డ్ లాంటి ఆట వస్తువులు కూడా రూపొందిస్తున్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపితో క్యాలెండర్లు రూపొందించడం చూస్తే అద్భుతం అనిపిస్తుంది.

విలువిద్య పరికరాన్ని పరీక్షించి చూస్తున్న ఓ దృష్టిలోపం ఉన్న విద్యార్థి

విలువిద్య పరికరాన్ని పరీక్షించి చూస్తున్న ఓ దృష్టిలోపం ఉన్న విద్యార్థి


ఇలా గిఫ్ట్ లు తయారు చెయ్యడమే కాదు. ఈ సంస్థ చాలా కార్యకలాపాలు చేస్తోంది. సాధారణ వ్యక్తుల కంటే ఇలాంటి శారీరక లోపం ఉన్న వారికి అవసరాలు ఎక్కువ. వారి అవసరాలను సరిగ్గా గుర్తించి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమే. వికలాంగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి వాళ్లను కూడా సాధారణ వ్యక్తుల స్థాయికి తీసుకొచ్చేందుకు చేయాల్సినవన్నీ ఈ సంస్థ చేస్తోంది. ముఖ్యంగా అంధులు, మూగ, చెవిటి వాళ్ల విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తమలో లోపం ఉందని బాధపడకుండా వారిలో స్ఫూర్తిని రగిలించే వర్క్ షాప్ లను ఏర్పాటు చేస్తోందీ సంస్థ. వారికి విద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ప్రత్యేక అంశాల్లో వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటారు. వికలాంగులంతా ఈ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వీరంతా ఒకేచోట కలిసి ఇంటరాక్ట్ అవుతుంటారు. నేర్చుకుంటారు. వారిలోని నైపుణ్యాలను పెంచుకుంటారు. అవగాహన సదస్సులు, పర్సనాలిటీ డెవలప్ మెంట్ లాంటి కార్యక్రమాలు వారికి మనోధైర్యాన్నిస్తాయి. అంధుల కోసం బ్రెయిలీ, మూగ, చెవిటి వాళ్ల కోసం సంజ్ఞల భాష నేర్పిస్తారిక్కడ.

సంజ్ఞల ద్వారా  పిల్లలకు వివరిస్తున్న వలంటీర్

సంజ్ఞల ద్వారా పిల్లలకు వివరిస్తున్న వలంటీర్


ఇక ఉద్యోగాల విషయానికొస్తే నేరుగా కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి ఉద్యోగవకాశాల కోసం చర్చిస్తోంది ఈ సంస్థ. అంతేకాదు... వికలాంగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వచ్చిన సంస్థ యజమానులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. సాధారణ వ్యక్తుల్లా కాకుండా వికలాంగులను ఉద్యోగాల్లోకి తీసుకునేప్పుడు పాటించాల్సిన విధానాలపై వర్క్ షాప్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. వికలాంగులకు సరిపడేలా, తాము కూడా సాధారణ వ్యక్తుల్లాంటి వారిమేనని ధైర్యం కలిగేలా ఆఫీసు వాతావరణాన్ని ఎలా తీర్చిదిద్దాలో సూచిస్తుంటారు. లో కాస్ట్ డిసేబుల్డ్ ఫ్రెండ్లీ ఆఫీస్ వాతావరణాన్ని తయారు చేయడం ద్వారా వికలాంగులకు ఉద్యోగవకాశాలను పెంపొందించడమే ఈ సంస్థ లక్ష్యం. దీంతో పాటు వికలాంగుల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలోనూ ఈ సంస్థ అందిస్తున్న చేయూత అభినందనీయం. 'వాల్ ఆఫ్ హోప్' పేరుతో ఈ కార్యక్రమం నడుస్తోంది. వికలాంగుల కోరికలేంటో తెలుసుకొని మరికొందరి సాయంతో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తోంది.

image


ఆటల్లో, కళల్లోనూ తామేమీ తక్కువ కాదని ఈ సంస్థ ద్వారా నిరూపిస్తున్నారు వికలాంగులు. ఇటీవల అంధుల కోసం విలు విద్య కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అద్భుతమే. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున గిఫ్ట్ ఏబుల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్ ఏబుల్డ్ పేరుతో ఐదు రోజుల కార్యక్రమం జరిగింది. పెయింటింగ్స్, మ్యూజిక్, డ్యాన్స్, కళాఖండాల తయారీ లాంటి విభాగాల్లో వికలాంగులు తమ సత్తా చాటారు. వీటిని ఆర్ట్ ఏబుల్డ్ కార్యక్రమంలో ప్రదర్శించి సందర్శకులను అబ్బురపరిచారు. అంతేనా... వీళ్లు తయారుచేసిన వస్తువులతో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఈవెంట్ నిర్వహించిందీ సంస్థ. పెయింటింగ్స్, ఇయర్ రింగ్స్, పౌచెస్, బ్యాగ్స్ లాంటివాటిని అమ్మకానికి పెడితే ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఆర్ట్ ఏబుల్డ్ లో ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించిందీ సంస్థ. దీంతో వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించింది. ఈవెంట్ చివరి రోజున అంధుల కోసం విజన్ క్లబ్, చెవిటివాళ్ల కోసం డెఫ్ క్లబ్ నిర్వహించారు. అంతేకాదు... వీరితో స్టోరీ టెల్లింగ్, థియేటర్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి తామూ ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించేలా చేశారు.

దృష్టిలోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రెయిలీ ప్యాడ్

దృష్టిలోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రెయిలీ ప్యాడ్


గిఫ్ట్ ఏబుల్డ్ సంస్థ నిర్వాహకులు వికలాంగుల తలరాతలను మార్చడంలో చేస్తున్న కృషి అద్భుతం, అభినందనీయం.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags