సంకలనాలు
Telugu

కంపెనీ క్యాబ్ రావడం లేదా ? అయితే ‘H2O’కి డయల్ చేయండి

ashok patnaik
23rd Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ఒకప్పుడు ఎంఎన్‌సి కంపెనీలు అన్నీ తమ ఉద్యోగులకు క్యాబ్ సర్వీసులను ఉచితంగానే అందించేవి. కానీ ఈ మధ్య కాస్ట్ కటింగ్‌లో భాగంగా.. అలాంటి సేవలకు కటింగ్ వేసేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు.. క్యాబ్ సర్వీసు ఇస్తూనే.. మెయింటెనెన్స్ ఛార్జీలను ఉద్యోగులపై వేస్తున్న పరిస్థితి. ఆ ఛార్జీలు భరించలేని చిరుద్యోగులు.. ఆర్టీసీ బస్సులనో, ఇతర మార్గాలనో ఆశ్రయించడం తెలిసిన విషయమే. హైదరాబాద్‌లో లక్షల మంది ఉద్యోగులు ఈ రకంగా ప్రయాణిస్తున్నారు. ఇలాంటి వారికోసం పుట్టుకొచ్చిందే.. 'హోం టు ఆఫీస్' క్యాబ్స్ (H2Ocabs).

“ వివిధ సంస్థల్లో పని చేసే రోజుల్లో నేను ఎదుర్కొన్న సమస్య ఇంకెవరికీ రాకూడదని హెచ్ టు ఓ క్యాబ్స్ ప్రారంభించా” అంటారు ఫౌండర్ తేజశ్రీ.

క్యాబ్ సర్వీసుకు ప్రత్యామ్నాయం

సాధారణంగా ఓలా, ఉబర్ క్యాబ్ సర్వీసులు ఉంటుండగా హెచ్ టు ఓ క్యాబ్స్ పనేంటని అడిగే ప్రశ్నకు తేజశ్రీ సమాధానం చెప్పారు. క్యాబ్ భరించలేని ఉద్యోగులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. అలాంటప్పుడు ఆర్టీసి బస్సులో ఎక్కడానికి అవకాశం లేకపోలేదు. ఎమ్మెన్సీ, కార్పోరేట్ కంపెనీల్లో టైం పంక్చువాలిటీ చాలా ప్రధానం. ఆ టైంకి చేరుకోవాలంటే కచ్చితంగా క్యాబ్ తీసుకోవల్సిందే. ఆఫీస్ క్యాబ్ అంటే రెండు గంటల ముందు బయలుదేరాలి. అలాంటి తలనొప్పులు లేకుండా ఈ క్యాబ్ సేవలను వినయోగించుకోవచ్చని తేజశ్రీ సూచిస్తున్నారు.

image


“ఆఫీసు అవర్స్ తొందరగా పూర్తయినా, లేదా లేటయినా కంపెనీ క్యాబ్ అందుబాటులో ఉండదు. వారికోసం కూడా మేం ప్రత్యేకంగా ఈ మోడల్ సర్వీసు డిజైన్ చేశాం” తేజశ్రీ

దీంతో పాటు డే షిఫ్ట్ ఉద్యోగులకు క్యాబ్ సర్వీసును కంపెనీలు ప్రొవైడ్ చేయడం లేదనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. వీళ్లు కచ్చితంగా బస్‌లనే నమ్ముకోవాల్సి వస్తోంది. వీరికోసం మేం క్యాబ్ సర్వీసు అందిస్తున్నాం. మా క్యాబ్‌లో ఏసి, వైఫై లాంటి అత్యాధునికి సౌకర్యాలు కూడా అందిస్తున్నామని తేజశ్రీ చెబుతారు.

మంత్లీ సబ్‌స్క్రిప్షన్

ఏ రోజుకారోజు పేమెంట్ కోసం ఆలోచించుకోకుండా మంత్లీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ని వీళ్లు ప్రారంభించారు. కావాల్సిన టైంకి కావాల్సిన ప్రాంతంలో క్యాబ్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ క్యాబ్ కాకుండా ప్రైవేట్ వెహికల్ తీసుకోవడానికంటే హెచ్ టు ఓ సేవలు ఉపయోగించుకోవడం మేలని తేజశ్రీ అంటున్నారు. వేరు వేరు కంపెనీల్లో పనిచేసే వ్యక్తులతో ప్రయాణం చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది. క్యాబ్ షేరింగ్ తీసుకోవాలనుకునే వారికి సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ని మేం పరిచయం చేశాం. వారంలో ఐదురోజుల పాటు క్యాబ్ సర్వీసు అందుబాటులో ఉంటుందన్నారు.

ఫౌండర్ తేజశ్రీ

ఫౌండర్ తేజశ్రీ


ఆండ్రాయిడ్ యాప్ ప్రారంభం

ఇప్పటి వరకూ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్న హెచ్ టు ఓ క్యాబ్ సర్వీసు ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. వెబ్ సైట్‌తో పాటు కాల్ సెంటర్‌ను ఆపరేట్ చేసే వారు. క్యాబ్ బుకింగ్‌లను ఫోన్ ద్వారా చేసే వారు. వెబ్ సైట్ కి ప్రతి రోజూ పదిమంది యాక్టివ్ యూజర్లుండే వారు. ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఆండ్రాయిడ్ యాప్ ప్రారంభమైందని హెచ్ టు ఓ కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా క్యాబ్ షటిల్ సర్వీసు వినియోగించుకోవచ్చంటున్నారు తేజశ్రీ.

హెచ్ టు ఓ టీం

తేజశ్రీ హెచ్ టుఓ ఫౌండర్ . జెఎన్‌టియూ నుంచి బిటెక్ పూర్తి చేసిన ఆమె హైదరాబాద్ ఎమ్మెన్సీ కంపెనీలో పనిచేశారు. అనంతరం ఈ స్టార్టప్ మొదలు పెట్టారు. తేజశ్రీతో పాటు మరో నలుగురు టీంలో ఉన్నారు. ఆపరేషన్స్, టెక్నికల్ , మార్కెటింగ్ లాంటి వ్యవహారాలు ఇతర టీం మెంబర్స్ చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఫండ్స్ తీసుకొని స్టార్టప్ రన్ చేస్తున్నారు. సీడ్ ఫండింగ్ వస్తే టీంను విస్తరించాలని చూస్తున్నారు.

image


సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు

క్యాబ్ షటిల్ సర్వీసు మోడల్‌లో హైదరాబాద్‌లో ఎవరూ లేరు కానీ ముంబైలో ఆర్ బస్ పేరుతో ఓ స్టార్టప్ నడుస్తోంది. షటిల్ పేరుతో ఢిల్లీలో ఈ తరహా బిజినెస్ మోడల్ ఉంది. హైదరాబాద్‌లో ప్రస్తుతానికి ఇలాంటి తరహా లేకపోయినా.. భవిష్యత్తులో చాలా స్టార్టప్‌లు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ప్రతి రోజూ లక్షల్లో ఉద్యోగులు హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రయాణం చేస్తున్నారు. వారి అవసరాలకు మరికొన్ని సర్వీసులు వచ్చినా ఆహ్వానిస్తారు.

యాప్ ఫ్లాట్ ఫాంలో పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకు రావాలనుకుంటున్నట్లు తేజశ్రీ అంటున్నారు. ఫండింగ్ వస్తే మరిన్ని సేవలను అందించాలనుకుంటున్నారు. హైదరాబాద్ లో కొన్న ప్రాంతాలకు పరిమితం అయిన సేవలను అన్నిప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags