సంకలనాలు
Telugu

ఈ యాప్ తో ఎక్కడో ఉన్న మీ ఫ్రెండ్ ఫోన్ ని మీరే ఆపరేట్ చేయండి..!

హాట్ కేక్ గా మారిన మొబైల్ షేరింగ్ యాప్

SOWJANYA RAJ
19th Mar 2016
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share


ఓసారి చరణ్ బైక్ మీద అర్జంట్ పనిమీద వెళ్తున్నాడు. అలాంటి టైమ్ లోనే ఎప్పుడూ లేని స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతాయి. అతనికీ అదే జరిగింది. ఎన్నడూ ఆపని ట్రాఫిక్ పోలీసులు అప్పుడే ఠపీమని ఆపారు. లైసెన్స్ చూపించమన్నారు. అయితే చరణ్ కి ఫోన్ తప్ప మరేమీ దగ్గర పెట్టుకోవడం అలవాటు లేదు. ఓ వైపు అర్జంట్ పని ...మరో వైపు లైసెన్స్ చూపిస్తేగానీ వదలనంటున్న ట్రాఫిక్ పోలీస్...

ఏం చేయాలి.. బతిమాలగా బతిమాలగా కనీసం ఫోన్ లో అయినా లైసెన్స్ కాపీని చూపించమని ట్రాఫిక్ పోలీస్ ఆప్షన్ ఇచ్చాడు. ఈ మాటతోనే చరణ్ కి ప్రాణం లేచివచ్చినట్లయింది. వెంటనే తన ఫోన్ నుంచి ఫ్రెండ్ రామ్ ఫోన్ లోని తన ఫోల్డర్ ని ఓపెన్ చేశాడు. అందులో స్కాన్ చేసి ఉన్న లైసెన్స్ కాపీని చూపించాడు. పోలీస్ ఠీక్ హై అన్నాడు . థాంక్యూ రీచ్ అనుకుంటూ చరణ్ బండి గేర్ మార్చాడు.

ఇద్దరు మిత్రులు...వారివారి అర్జంట్ పనుల్ని పక్కన పెడితే... ఇందులో రెండు పాయింట్లున్నాయి...

1. తన ఫోన్ నుంచి ఫ్రెండ్ ఫోన్ లోని ఫోల్డర్ ని ఓపెన్ చేయగలగడం.

2. అందులో ఉన్న ఐటమ్స్ ని యూజ్, షేర్ చేసుకోగలగడం.

ఇదంతా చదువుతుంటే మీకు టీమ్ వ్యూయర్ గుర్తుకొస్తోంది కదా.. అదేమో కంప్యూటర్ బాపతు. మరి మొబైల్ లో కూడా అదే ఫెసిలిటీ ఉందా..? మీకీపాటికి ఇవే అనుమానాలు వచ్చుంటాయి. నిజమే.. నిన్నామొన్నటి వరకు అలాంటిదేదీ లేదు. అంత సీన్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మార్చేశారు గుర్గావ్ కి చెందిన నలుగురు మిత్రులు. ది రీచ్ అనే యాప్ తో మిత్రులందరి ఫోన్లలోని సమాచారానికి అందరూ పంచుకునే ఏర్పాటు చేశారు.

ఆలోచన మార్చిన పెన్ డ్రైవ్

అక్షయ్ ప్రుతి, అభయ్ ప్రుతి, ఆశిష్ కుమార్, ఆయుష్ వర్మ. కాలేజీలో మంచి స్నేహితులు. అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉన్నా.... సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం...పాటలు, వీడియోలు, ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే పెన్ డ్రైవ్ ఉందా...? USB కేబుల్ ఉందా..? అని వెదుక్కునేవారు. మొదట్లో దీని గురించేం ఆలోచించలేదు. చదువు చివరికొచ్చేసరికి ఈ తిప్పలేమిటి గురూ..? దీనికి మనమేం పరిష్కారం కనుగోనలేమా బాసూ...? అని ఆలోచించారు. వారి ఆలోచనల ప్రతిరూపమే "ది రీచ్" ఆప్లికేషన్.

అక్షయ్, అభయ్ సోదరులు కూడా. నలుగురూ కలిసి మొదట పీర్ టు పీర్ ఇంజిన్ ని ఇంట్లోనే డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేయింబవళ్లు కష్టపడిన తర్వాత 2015 మార్చి 23 ది రీచ్ యాప్ బీటా వెర్షన్ ను విడుదల చేశారు. అప్పట్నుంచి యూజర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుని కొత్త ప్రయోగాలు చేసి ఈ ఏడాది మొదట్లోనే వెర్షన్ 1.0ని లాంఛ్ చేశారు. Reach v1.0 యాప్ ద్వారా మిత్రుడి ఫోన్ లోని యాప్స్, ఆడియో ఫైల్స్, గేమ్స్, అదర్ మీడియా ఫైల్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు.

<br>ప్రైవసీకి నోటెన్షన్

ఎంత ప్రాణస్నేహితులైనా అన్నీ షేర్ చేసుకోలేం. తన స్మార్ట్ ఫోన్ మొత్తాన్ని అతనికి అప్పగించేయలేం. అందుకే ది రీచ్ లోనూ ప్రైవసీకి భంగం కలగనన్నీ సేఫ్టీ ఫీచర్స్ పెట్టారు. ది రీచ్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మిత్రునికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాలి. మిత్రుడు కూడా యాప్ డౌన్ లోడ్ చేసుకుని.. రిజిస్టర్ అయిన తర్వాత రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు ఇద్దరి మధ్య రీచ్ పెరుగుతుంది. అలాగని ఇద్దరి ఫోన్లలో ఉన్నది ఒకరికి ఒకరు చూసేయవచ్చని కాదు... ఏది చూడాలన్నా మిత్రుని అంగీకారం తీసుకోవాలి. ఫలానా ఫైలు చూస్తానని రీచ్ ఆప్లికేషన్ లో రిక్వెస్ట్ పంపాలి. దాన్ని అవతలి వారు యాక్సెప్ట్ చేయాలి. అయితే కొన్నింటికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ అడగాల్సిన పనిలేదు. డైరెక్టుగా చూసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. పర్సనల్ ఫైల్స్ ని చూసే అవకాశం ది రీచ్ ఇవ్వదు. ది రీచ్ యాప్ లో ఇన్ బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంటుంది. దీని ద్వారా తమ స్మార్ట్ ఫోన్ లోని పాటలే కాదు.. తమ రీచ్ నెట్ వర్క్ లో ఉన్న మిత్రుల ఫోన్లలో ఉన్న పాటలనూ వినవచ్చు. కావాల్సిన ఫైళ్లనూ షేర్ చేసుకోవచ్చు.

ది రీచ్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి...

" ది రీచ్ అప్లికేషన్ ద్వారా పంపే ఫైల్స్ ఏవీ మా సర్వర్ ద్వారా అప్ లోడ్ కావు. వారు షేర్ చేసుకునేవన్నీ డైరక్టర్ పీ2పీ టెక్నాలజీ ద్వారా మొబైల్ టు మొబైల్ ట్రాన్స్ ఫర్ అవుతాయి. ట్రాన్స్ ఫర్ చేసుకోవడానికి లొకేషన్ పరిమితులు కూడా ఏమీ ఉండవు. ఎక్కడ ఉన్న ఎక్కడి నుంచైనా చూడొచ్చు.. ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు." అక్షయ్

వైరల్ గా రీచ్

నలుగురు మిత్రులు డెవలప్ చేసిన ఈ యాప్ రెండో వెర్షన్ విడుదలై రెండు నెలలు కూడా దాటలేదు. కానీ రెస్పాన్స్ మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పటికే యాభై వేల మందికిపైగా యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పదహారు మిలియన్ల ఫైల్స్ ను రిజిస్టర్ యూజర్లు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. నలుగురు మిత్రులు నాలుగు విభాగాల్లో పని విభజన చేసుకుని స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

జపాన్ కంపెనీ పెట్టుబడి

ది రీచ్ యాప్ లో ఇటీవల జపాన్ వెంచర్ క్యాపిటల్ కంపెనీ రైట్ బ్రైట్ పార్టనర్స్ రూ.5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టింది. రీచ్ తరహా యాప్ లకు అద్భుతమైన ఫ్యూచర్ ఉందని ఈ వెంచర్ క్యాపిటల్ కంపెనీ అంచనా వేస్తోంది. రీచ్ సృష్టికర్తలు కూడా భవిష్యత్ గ్లోబల్ వైజ్ గా ఆదరణ చూరగొంటామని ధీమాగా ఉన్నారు. ఇటీవల తాము కలిసిన అమెరికన్ టెక్నోక్రాట్, బిలియనీర్ మార్క్ క్యూబన్ తమ ప్రయత్నాను మెచ్చుకున్నారని ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారని అక్షయ్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. స్థిరమైన యూజర్ బేస్ సాధించిన తర్వాత బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీలోకి వెళ్లాలని "ది రీచ్" టీం భావిస్తోంది. దీని కోసం సేవలను విస్త్రత పరిచే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రతిస్మార్ట్ ఫోన్ లోనూ రీచ్ యాప్ ఉండేలా చేసే ఫీచర్స్ అన్నింటినీ తేవాలనే పట్టుదలతో ఉన్నారు.

షేరింగ్ దే ఫ్యూచర్

మంచి ఆలోచనతో సింపుల్ గా ఉపయోగించుకునేలా రూపొందిన యాప్ ది రీచ్. యాప్ డిస్కవరీ, ఇన్ బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ దీనికి అదనపు ఆకర్షణలు. యూజర్ల మొబైల్ లైఫ్ స్టైల్ ని ఇట్టే మార్చేయగలశక్తి ఈ యాప్ ఉందని టెక్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది మున్ముందు సంచలనాలు సృష్టించడం ఖాయమని నిపుణలు అంటున్నారు.  

ది రీచ్ యాప్ సృష్టించిన బృందం

ది రీచ్ యాప్ సృష్టించిన బృందం


ఈ లింక్ ద్వారా ది రీచ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి...

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags