సంకలనాలు
Telugu

మీ ఇల్లు,అపార్ట్‌మెంట్లోనే మురుగుశుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమంటున్న గ్రే వాటర్

మురుగు నీటి నిర్వహణ అతి పెద్ద సవాల్పట్టణాలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఇదేనీటి పునర్వినియోగంపై జనాలకే కాదు... ప్రభుత్వాలకూ లేని అవగాహనకాలుష్య నియంత్రణ మండలి అక్షింతలతో మారుతున్న వైఖరిగ్రేవాటర్ లాంటి కంపెనీలకు రాబోయే రోజుల్లో అపార అవకాశాలు

ABDUL SAMAD
28th May 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

అరుణ్ దూబే, రూర్కేలోని ఐఐటీ నుంచి పట్టభద్రులయ్యాక... జెనరిక్ డ్రగ్స్ తయారు చేసే ఫార్మా కంపెనీలో స్క్రీనింగ్ & డెవలపింగ్ విభాగంలో పని చేశారు. ఈ సమయంలోనే ఓ వినూత్న ప్రాజెక్ట్ అతని మనసులో మెదిలింది. ఆల్గే నుంచి బయో డీజిల్ ఉత్పత్తి చేసేలా టెక్నాలజీ అభివృద్ధి చేయాలనే తలంపు వచ్చింది. క్లీన్ టెక్నాలజీ గురించిన మొదటి ఆలోచన ఇదే అరుణ్ దూబేకు. ఓ స్థిరమైన ఆదాయం ఉండే వ్యాపార రంగాన్ని కూడా పరిచయం చేసింది. స్టాన్‌ఫోర్డ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశాక సోలార్ కంపెనీలకు సంబంధించిన విషయంలో మెకెన్సీ వద్ద ప్రతిభ ప్రదర్శించారు.

అరుణ్ దూబే, గ్రేవాటర్ వ్యవస్థాపకులు

అరుణ్ దూబే, గ్రేవాటర్ వ్యవస్థాపకులు


“నేను ప్యాకేజ్డ్ స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వైపు రావడానికి కారణం మెకెన్సీనే ”అంటారు దూబే.

భారత దేశంలో పట్టణప్రాంతాలకు ఇది తగిన విధానమనే అలోచన వచ్చింది. ఆలోచనలు, కలలను ఒకతాటి పైకి తెచ్చి కార్యాచరణ ప్రారంభించారు దూబే. అక్టోబర్ 2010లో నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్ సౌజన్యంతో నిర్వహిస్తున్న గ్రేవాటర్‌లో జాయిన్ అయ్యారు అరుణ్ దూబే. ప్రస్తుతం ఈ సంస్థలో స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్మెంట్, ఫైనాన్స్ విభాగాలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

పారిశుధ్యం, నీటి పునర్వినియోగానికి... తక్కువ ధరలో ఉత్పత్తులను తయారు చేస్తుంది గ్రేవాటర్. “ నేను ఈ కాన్సెప్ట్ అభివృద్ధి చేయడానికి ప్రధాన కారణం... భారత్‌లో ఎదుర్కుంటున్న పారిశుధ్య సమస్యలే. మురుగు నీటి నిర్వహణ, తిరిగి వినియోగించదగ్గ నీటిని తక్కువ ధరలకే అందించడమే లక్ష్యాలుగా డిజైనింగ్ ప్రారంభించాను. పెరిగిపోతున్న పట్టణీకరణ, మున్సిపాల్టీలకు తగిన మౌలిక వసతులు లేకపోవడం వంటివాటిని పరిశీలిస్తే... ప్రతీ రోజూ, ప్రతీ గంటా మా ఉత్పత్తులతో ప్రజలకు అవసరముంటుంది.

మురుగు వ్యర్ధాలను నేరుగా నీటిలో కలిపేయడం వంటి వాటికి పరిష్కారం చూపడమే కాదు.. దీనికోసం రెడీ టూ రీయూజ్ నీటిని పదోవంతు ధరకే అందించగలగడం మా ప్రత్యేకత” అంటారు దూబే.

గ్రేవాటర్ టీంలో ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులున్నారు. వారి దగ్గర ఎన్నో ఆలోచనలున్నా వాటికి సరైన ప్రోత్సాహం కూడా లభించక వెనకబడిపోయారంటోంది గ్రేవాటర్. ఈ సంస్థలోనే కోర్ టీం ఇదే. సునీల్ తూపే(CEO), రాజేష్ నాయర్(Director, Sales), సచిన్ పర్దేషి(Head of Operations). వీరందరికీ కలిపి... ఈ రంగంలో ఉన్న అనుభవమెంతో తెలుసా... అక్షరాలా 108 ఏళ్లు.

“మా ఉత్పత్తులు 4 ప్రాధమిక నిబంధనలపై తయారవుతాయి. ప్యాకేజ్డ్-ఫుల్లీ ఆటోమేటిక్, రెడీ టు రీ యూజ్, తక్కువ జీవిత కాలం ఉన్నా సరే తక్కువ ధరలతోపాటుగా దేశంలోని అన్ని పర్యావరణ బోర్డుల నుంచి అనుమతి పొందగలగాలి” అంటారు దూబే

“విద్యుత్, వాడకం, నిర్వహణ ఖర్చుల్లో కనీసం 50శాతం తగ్గుదల కనిపిస్తుంది. మా ఉత్పత్తులన్నీ సాధారణ కస్టమర్‌కు లాభం చేకూర్చాలనే ఆలోచనతో రూపొందించినవే. మిగతావారి దగ్గర లేని కొన్ని కొత్ ఫీచర్లను అభివృద్ధి చేశాం. మురుగునీరు రావడంలో హెచ్చుతగ్గులను GREWA-RS... ఆటోమేటిగ్గా గుర్తించి, దానికి తగినట్లుగా ఆపరేషన్స్‌లో మార్పులు చేసుకుంటుంది. ఈ తరహా విధానం దేశంలోని ఏ స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహించే వారిదగ్గరా లేదు”అని చెబ్తున్నారు దూబే.

గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్

గ్రే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్


ఇలాంటి ప్లాంట్ల విషయంలో మొదట్లో అనుమతుల కోసం చాలా సమస్యలు ఎదురైనా... ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. పర్యావరణ నిబంధనలు పెరిగిపోతుండడం, తాజా నీరు దొరకడం గగనంగా మారడం, అసలు నీరే అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలకు.. ఈ ప్లాంట్లు పరిష్కారం చూపనున్నాయి.

“కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో... టైర్-1నగరాల్లో కేవలం 32శాతం మురుగుమాత్రమే నిర్వహిస్తున్నారు. టైర్-2 సిటీల్లో ఇది 9శాతానికే పరిమితమయింది. పరిస్థితి ఇలానే ఉంటే 2018నాటికి 2,400 కోట్ల లీటర్ల నీరు రోజూ నిర్వహణ లేకుండా పోతుంది. ఇది పారిశుధ్య సమస్యలకు దారి తీస్తుంది. ఎక్కడికక్కడ మురుగునీటి నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవడమే దీనికి పరిష్కారం”- అరుణ్ దూబే

బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధిప్లాంట్ ఇది

బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ధిప్లాంట్ ఇది


CPCB ఇచ్చిన సూచనలు గ్రేవాటర్ సాంకేతికత అభివృద్ధికి తోడ్పడనున్నాయి. “ మేం తయారు చేసిన స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మోడల్... బిల్డింగుల్లో ఉండే డీజిల్ జనరేటర్ల మాదిరిగానే ఉంటుంది. ఒకే ట్యాంక్ ఉండేలా డిజైన్ చేసినా.. పెర్ఫామెన్స్, నిర్వహణ వ్యయాల విషయంలో దీనికి సాటి లేదు. దీనికోసం ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన ఆపరేటర్ అవసరం లేదు. వివిధ రకాల లోడ్లను తట్టుకునే శక్తి దీనికి ఉంది. మా సాధారణ స్థాయి ఉత్పత్తులు కూడా ఎలాంటి శబ్దం చేయవు. అలాగే ఎటువంటి దుర్వాసననూ విడుదల చేయవు. వీటిని ఇన్‌స్టాల్ చేసి కార్యకలాపాలు ప్రారంభించేందుకు 2-3 వారాలు సరిపోతుంది” అంటారు అరుణ్

ప్రస్తుతం గ్రేవాటర్‌కు తయారీ భాగస్వామిగా నేటెల్ ఇండియా జతైంది. పర్యావరణాన్ని కాపాడేందుకు తయారుచేసే ఉత్పత్తులు, సేవల విషయంలో ఈ సంస్థ మార్కెట్ లీడర్ కావడం విశేషం.

“నేటెల్‌కు దేశవ్యాప్తంగా విస్తృతమైన మార్కెటింగ్ సదుపాయాలున్నాయి. గ్రేవాటర్ విషయంలో... ఇది అత్యత్తమమైన ఉత్తత్తి. రెండింటి భాగస్వామ్యం సక్సెస్‌కు చిరునామాగా మారుతుందని ఆశిస్తున్నా”మంటారు అరుణ్

“గతంలో మురుగు నీటి నిర్వహణ పరికరాలను స్థానికంగా తయారు చేసే కంపెనీలే అందిస్తుండేవి. ప్రతీ ప్లాంట్ విషయంలో అవన్నీ విభిన్నమైనవిగా ఉండేవి. సాధారణంగా విక్రయించినవారే దాన్ని ఇన్‌స్టాల్ చేసేవారు. కానీ గ్రేవాటర్ అలా కాదు. ఓ సరైన వ్యవస్థ ఆధారంగా.. ఓ స్థిరమైన ప్రోడక్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. నేటెల్ మా ఉత్పత్తులను కస్టమర్లకు నేరుగా విక్రయిస్తుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా మేం విస్తరించడానికి అవకాశం ఏర్పడుతుంది. పరిశ్రమ ఈ విధానంపై ఇప్పటికే ఓ కన్నేసి ఉంచింది. మా ఐడియా సక్సెస్ అయితే... దీని ఆధారంగా పుట్టుకొచ్చేందుకు అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి” అంటున్నారు అరుణ్.

ప్రారంభస్థాయి నుంచే గ్రేవాటర్ విజయాలు నమోదు చేసుకుంటోంది. ఇండస్ట్రీలోని బడా కంపెనీల నుంచి ఆర్డర్లను దక్కించుకోగలగడం విశేషం. డెల్, క్లబ్ మహీంద్రా, బీపీసీఎల్, వాధ్వా బిల్డర్స్ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా గ్రేవాటర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

ప్రస్తుతం గ్రేవాటర్... కేవలం పట్టణాలపైనే దృష్టి పెట్టింది. రాబోయే కాలంలో ఎదురయ్యే సమస్యలు, నీటి నిర్వహణలో ఇబ్బందులను అనుసరించి.. పల్లెల్లోకీ విస్తరించే యోచన ఉంది. ఇప్పటి పరిస్థితుల ప్రకారం GREYWATER వంటి సంస్థలకు మార్కెట్లో అపారమైన అవకాశాలున్నాయని చెప్పాలి.

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags