సంకలనాలు
Telugu

ఇలా చేస్తే కోరుకున్న జాబ్ మీ సొంతం!!

GOPAL
4th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ప్రపంచం వేగంగా మారిపోతున్నది. జనాభా కూడా పెరిగిపోతున్నది. ఒకప్పుడు పది ఉద్యోగాలుంటే, చేసేవారు ఒకరో, ఇద్దరో ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి వేలల్లో పోటీ ఉంది. ఉద్యోగం దొరకడమే గగనమైపోయింది. ఇక అందునా మంచి సంస్థలో, మంచి ఉద్యోగం అంటే కష్టపడాల్సిందే. ఎప్పటిలాగే మూస పద్ధతిలో వెళ్తే మంచి సంస్థ దొరకదు.. మంచి ఉద్యోగమూ తగలదు. అలా కావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ఆ కిటుకులను యువర్ స్టోరీ మీకందిస్తోంది.

ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సిన రోజులు పోయాయి. కంపెనీలకు రెజ్యూమె పంపి, ఇంటర్వ్యూ కాల్ కోసం ఎదురు చూటడం ఒకప్పటి ముచ్చట. ఇప్పుడంతా క్రియేటివ్ స్టయిల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. ఉన్న టాలెంట్‌ను కంపెనీలు గుర్తించే విధంగా వైన్ వీడియో రూపంలో తమ రెజ్యూమెలను పంపుతున్నారు. ఇలాంటి ప్రయత్నాల కోసం ఎన్నోరకాల మార్గాలున్నాయి. అయితే ఇది అందరికీ ఉపయోగపడదు. మీడియా, అడ్వర్టయిజింగ్ సెక్టార్ల వారికి మాత్రమే ఎక్కువ యూజ్ అవుతుంది. కొద్దిగా ప్రిపేర్ అయితే చాలు కోరుకున్న జాబ్ మీ సొంతం.

image


పరిచయాల ద్వారా..

ఉద్యోగ సమాచారం రెండు రకాలుగా అందుతుంది. ఒకటి నోటిఫికేషన్స్. రెండోది తెలిసిన వారి ద్వారా. చాలావరకు ఉద్యోగాలు రిఫరెన్స్‌ల ద్వారానే దొరుకుతాయి. అందువల్ల మనకు తెలిసినవారితో నిరంతరం సంబంధాలు కొనసాగించాలి. అవసరం లేకపోయినా, తరచుగా కాంటాక్ట్‌లో ఉన్నవారందరితో సంభాషిస్తుండాలి. నెట్‌వర్క్‌ను పెంచుకుంటుండాలి. ఇలాంటి పరిచయాల ద్వారానే అవసరమైనప్పుడు రిఫరెన్స్‌లు లభిస్తాయి. కొద్దిగా కష్టపడితే ఈ పరిచయాల జాబితా పెంచుకోవచ్చు. సంబంధాలు కూడా చక్కగా ఉంటాయి. అవసరానికి ఉపయోగపడుతాయి.

ఈ స్టోరీ కూడా చదవండి

సంస్థ గురించి తెలుసుకోవడం..

ఏదైనా సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసేముందు.. ఆ సంస్థకు సంబంధించిన వివరాలు కోసం కొంత రీసెర్చ్ చేయాలి. జాబ్ ఎలాంటిది, కంపెనీ ప్రాడక్ట్ ఏంటి? జాబ్ వస్తే మనం ఎలాంటి పని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే.. కంపెనీలు ఆఫర్ చేస్తున్న జాబ్ మనకు సరిపోతుందా లేదా.. అన్న వివరాలు చెక్ చూసుకోవాలి. ‘‘సాధారణంగా చాలా సంస్థలు గతంలో పనిచేసిన బ్యాక్ గ్రౌండ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఉదాహరణకు ఒకరు ప్రొడక్ట్ కంపెనీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తే, అతని పని చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అలాంటి వారు సర్వీస్ కంపెనీకి అంతగా ఉపయోగపడరు’’ అని ఓ హెచ్‌ఆర్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్ మనీశ్ భాటియా అంటున్నారు. మిడిల్ లెవల్, సీనియర్ లెవల్ క్యాండిడేట్స్ విషయంలో కన్సల్టెన్సీలే ఉద్యోగార్థుల సాఫ్ట్ స్కిల్స్ ఆధారంగా ఫిల్టర్ చేస్తున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఉద్యోగులను నియమించుకోవడం సంస్థలకు తలకుమించిన భారం. అందువల్ల తమకు ఉపయోగపడే, ఎక్కువ కాలం పనిచేసేవారి కోసం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

రెజ్యూమెనే కీలకం..

మంచి ఉద్యోగం పొందడానికి తొలి మెట్టు రెజ్యూమే. మన పనితీరు, అనుభవాలకు అది ప్రతీక. రెజ్యూమే షార్ట్ గా, క్రిస్పిగా, అన్ని వివరాలతో ఉండాలి. అనుభవం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సాధించిన ఘనతల గురించి మొదటి పేజీలోనే వివరించాలి. రెజ్యూమెను కస్టమైజ్ చేయాలి. మనం దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సరిపడ స్కిల్స్‌ను మాత్రమే పొందుపర్చాలి. ఆ ఉద్యోగానికి ఉపయోగపడని అనుభవాలను, స్కిల్స్‌ మెన్షన్ చేయనక్కర్లేదు. అప్పుడు రెజ్యూమె చిన్నగా ఉంటుంది. రిక్రూటర్ తక్కువ సమయంలో చదివేందుకు వీలుపడుతుంది. మన గురించి కొద్ది సమయంలోనే ఓ అవగాహన వచ్చే అవకాశం ఏర్పడుతుంది.

ఇంటర్వ్యూవర్ గురించి ముందే తెలుసుకోవాలి..

ఇంటర్వ్యూ షెడ్యూల్ ఫిక్సయిన తర్వాత, ఇంటర్వ్యూ బోర్డులో ఉండేవారి వివరాలు చెక్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ నెట్‌వర్క్స్ లింక్డిన్ వంటి వాటిలో బోర్డులో ఉండేవారి ప్రొఫైల్స్ చెక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో కొద్దిగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇంటర్వూ చేసేవారికి మీ బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించి నాలెడ్జ్ ఉంటే కౌంటర్ నాలెడ్జ్‌ను పెంచుకోవాలి.

చాలా కంపెనీలు ‘వైఖరిని బట్టి ఎంపిక, ఆప్టిట్యూడ్ కోసం శిక్షణ’ అన్న నినాదంతో హైరింగ్ చేసుకుంటున్నాయి. ఇంటర్వ్యూలో అభ్యర్థుల వైఖరే ముఖ్యమంటారు ఓ ప్రముఖ ఐటీ కంపెనీ సీనియర్ రిక్రూట్‌మెంట్ లీడర్ తనూల్ జైన్. ‘అనుభవం, నాలెడ్జ్ లాగే అభ్యర్థుల వైఖరి, ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. చాలామంది ఇంటర్వ్యూలకు సరైన దుస్తులు ధరించకుండా వస్తుంటారు. అలాగే ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నలకు కేర్‌లెస్‌గా జవాబిస్తుంటారు. ఇలాంటి పొరపాట్లే ఉద్యోగం రాకుండా అడ్డుపడతాయి. ఇంటర్వ్యూలో ప్రవర్తన కూడా చాలా ముఖ్యం’’ అని ఆయన అంటున్నారు. అలాగే వర్కింగ్ మదర్స్‌కు కంపెనీలు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నాయని తనూల్ చెప్పారు.

లేట్ నైట్ వరకు పనిచేయడం, వీకెండ్స్‌లో పని గురించి- మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని ఇంటర్వ్యూ సమయాల్లోనే చెప్పయడం మంచిది. అలా చేయడం వల్ల ఇరువురికి ఉపయోగం.

సోషల్ మీడియాతో జాగ్రత్త..

ఇప్పడు యువత అంతా సోషల్ మీడియాలోనే గడుపుతున్నది. ఒత్తిడి నుంచి బయటపడి, మనసును తేలికపర్చుకునేందుకు మంచి సాధనం సోషల్ మీడియా. దాంతో లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో ఏవైనా పోస్టులు చేసేముందు కేర్‌ఫుల్‌గా ఉండాలి. చాలామంది ఎంప్లాయర్స్ సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఓ క్యాండిడేట్‌ను ఎంపికచేసేముందు అతని బ్యాక్‌గ్రౌండ్ చూడటంతోపాటు క్రెడిట్ చెక్స్ కూడా జరపుతున్నారని మనీష్ వివరించారు.

సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్..

సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఎప్పుడూ చేసుకుంటుండాలి. ఇలా చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు, ఉద్యోగం కోసం ముందే సిద్ధమై ఉండొచ్చు. టెక్నికల్ స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నించాలి. అలాగే ప్రాపంచిక విషయాలు కూడా తెలుసుకోవాలి. సమకాలీన రాజకీయాల మీద అవగాహన ఉండాలి. అన్నిటి కంటే ముఖ్యం కమ్యూనికేషన్ స్కిల్స్. దాన్ని పాలిష్ చేసుకుంటే ఎలాంటి పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కొవచ్చు. ఈ మెయిల్స్ పంపేటప్పుడు, రెజ్యుమే ప్రిపేర్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవాలి. ఫోన్ కాల్స్‌కు, ఈ-మెయిల్స్‌కు వెంటనే స్పందించాలి.

ఆసక్తే అన్నిటికంటే ముఖ్యం..

ఉద్యోగం గురించి ఆసక్తి, ఆ రంగంపట్ల చూపే ఇష్టతే, హైరింగ్ చేసుకునేవారిని ఆకట్టుకుంటుంది. ‘ఒకవేళ ఉద్యోగార్థికి, ఉద్యోగానికి మంచి మ్యాచ్ కుదిరితే, పెద్ద సంస్థలు, స్టార్టప్స్ అదనపు సౌకర్యాలు కూడా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి’’ అని తనూల్ చెప్పారు.

వందలో ఒకరు కావొద్దు..

ఇంటర్వ్యూకు వెళ్లేముందు, ఆ సంస్థ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. కేవలం పని గురించే కాకుండా, సంస్థ ఎలాంటి ప్రొడక్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది, కస్టమర్లకు ఎలాంటి సర్వీస్ అందిస్తున్నది అన్న వివరాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఎంట్రీ లెవల్ ఉద్యోగం చేస్తున్నా, సంస్థ గురించి పూర్తిగా తెలుసుకుని, ఇతర విభాగాల్లో కూడా పనిచేసేందుకు ఆసక్తి చూపితే తప్పకుండా యాజమాన్యం అభినందిస్తుంది.

ఎంప్లాయర్, ఎంప్లాయి సంబంధం ఇద్దరికీ లబ్ధి చేకూరేలా ఉండాలి. హైరింగ్ విధానం మొత్తం సాఫీగా సాగితే, భవిష్యత్‌లో కూడా ఇరువర్గాల మధ్య మంచి సహకారం ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఉద్యోగి, సంస్థకు అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

ఈ స్టోరీ చదవండి

ఈ స్టోరీ చదవండి

ఈ స్టోరీ చదవండి

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags